సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ట్వీట్ చేశారు
తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు.
విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు…— Revanth Reddy (@revanth_anumula) June 10, 2024
కాగా మోదీ కేబినెట్లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.
కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌లకు కేబినెట్ పదవులు దక్కగా.. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment