disaster management commissioner
-
ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కోనసాగుతున్నందున ఈశాన్య బంగాళఖాతంతో రాగల రెండు రోజుల్లో అల్ఫపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కృష్ణానది వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముంద్రంలో వేటకు వెళ్లరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. ఈ ప్రాంతాలకు కమిషనర్ పిడుగు హెచ్చరిక.. అదే విధంగా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు పిడుగు కూడా పిడుగు హెచ్చరిక చేశారు. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యాపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు, మైలవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గోర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. వర్షం పడుతున్న సమయంలో సురక్షితమైన భవనాలల్లో ఆశ్రయం పోదాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. రాగల 3 రోజుల పాటు వాతావరణ వివరాలు: సెప్టెంబర్ 19న: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. సెప్టెంబర్ 20: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు.మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. సెప్టెంబర్ 21: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం. -
తుంగభద్రకు వరద; హెచ్చరించిన కమీషనర్
సాక్షి, కర్నూల్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉండగా, సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు వరద నీరు వచ్చే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఆ శాఖ కమీషనర్ సూచించారు. మరోవైపు గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా కమీషనర్ అధికారులను అప్రమత్తం చేశారు. -
‘హుద్‌హుద్’ బాధిత రైతులకు రూ.140.36 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కోసం ప్రభుత్వం రూ. 140.36 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ ఏఆర్ సుకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెట్టుబడి రాయితీని 50 శాతం పైగా పంట నష్టపోయిన సన్న, చిన్నకారు రైతుల అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేయాలని ఆదేశించింది. -
'పైలిన్'ను ఎదుర్కొనేందుకు సిద్ధం: రాధా
హైదరాబాద్ : పై-లిన్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని విపత్తు నివారణ శాఖ కమిషనర్ రాధా తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. ప్రతీ తీర ప్రాంతంలో రెవెన్యూ బృందం అప్రమత్తంగా ఉందని, తుపాను తీరం దాటేటప్పుడు గాలులు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. మరబోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్ల జాడ కనుక్కోవటం కష్టంగా ఉందని రాధా చెప్పారు. కాగా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం బర్రెపేటలో ముగ్గురు, పిప్పల వలసలో ఒకరు సముద్రంలో చిక్కుకున్నారు. తుపాను ప్రభావిత తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల కోసం 250మంది ఆర్మీ సైన్యం జిల్లాకు చేరుకుంది. కాకినాడలో తుపాను నేపధ్యంలో కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్డును పోలీసులు మూసివేసి, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విశాఖ చేరుకున్న రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించారు. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477