తుంగభద్ర డ్యాం
సాక్షి, కర్నూల్ : ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర నదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులుగా ఉండగా, సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు వరద నీరు వచ్చే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఆ శాఖ కమీషనర్ సూచించారు. మరోవైపు గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా కమీషనర్ అధికారులను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment