AP Weather Report: IMD Issues Heatwave Warning For 127 Mandals In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక

Published Mon, May 15 2023 7:49 AM | Last Updated on Mon, May 15 2023 2:27 PM

Ap Disaster Management Warns Severe Hailstorm In 127 Mandals - Sakshi

సాక్షి, అమరావతి: నేడు రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(127) :
అల్లూరి జిల్లా -2
అనకాపల్లి -8
బాపట్ల -9
తూర్పుగోదావరి -17
ఏలూరు -3
గుంటూరు -13
కాకినాడ -18
కోనసీమ -15
కృష్ణా -18
ఎన్టీఆర్ -8
పల్నాడు -2
మన్యం -1
విశాఖ -3
పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది 

కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.
-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.

చదవండి: బంగ్లా తీరాన్ని తాకిన మోకా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement