hailstorm
-
వడగళ్లవానతో భారీ నష్టం
సాక్షి, కామారెడ్డి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో 15 మండలాల్లోని 130 గ్రామాల్లో 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 14,553 మంది రైతులు నష్టపోయారని నివేదికలో పేర్కొన్నారు. వరి 16,298 ఎకరాల్లో, మక్క 2,784.16 ఎకరాల్లో, జొన్న 705.2 ఎకరాల్లో, గోధుమ ఐదు ఎకరాల్లో, ఉల్లిగడ్డ 12 ఎకరాలు, బొప్పాయి పది ఎకరాలు, పొగాకు 20 ఎకరాలు, మామిడి 192 ఎకరాలు, కూరగాయలు 45 ఎకరాల్లో దెబ్బతిన్నాయని పేర్కొ న్నారు. తాడ్వాయి మండలంలోని బ్రహా్మజీవాడి గ్రామంలో గాలిదుమారానికి రేకుల షెడ్డు కూలిపోవడంతో అందులో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరోనాలుగు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 6,058 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పది మండలాల్లోని 44 గ్రామాల్లో వడగళ్లు బీభత్సం సృష్టించాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 3,076 మంది రైతులు నష్టపోయారన్నారు. అత్యధికంగా 5,661 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. 292 ఎకరాల్లో మక్క, 93 ఎకరాల్లో జొన్న, 12 ఎకరాల్లో నువ్వుల పంట దెబ్బతిన్నదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
వడగండ్ల వాన, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్ రైలు
-
ఏపీలో తీవ్ర వడగాల్పులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
సాక్షి, అమరావతి: నేడు రాష్ట్రంలో 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. బుధవారం 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. నేడు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(127) : ⇒ అల్లూరి జిల్లా -2 ⇒ అనకాపల్లి -8 ⇒ బాపట్ల -9 ⇒ తూర్పుగోదావరి -17 ⇒ ఏలూరు -3 ⇒ గుంటూరు -13 ⇒ కాకినాడ -18 ⇒ కోనసీమ -15 ⇒ కృష్ణా -18 ⇒ ఎన్టీఆర్ -8 ⇒ పల్నాడు -2 ⇒ మన్యం -1 ⇒ విశాఖ -3 ⇒ పశ్చిమగోదావరి జిల్లాలోని 13 మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 173 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ⇒ నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ⇒ కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాలు, మిగిలిన చోట్ల మొత్తం 34 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో 44.8°C, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో 44.7°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. -డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ. చదవండి: బంగ్లా తీరాన్ని తాకిన మోకా -
Viral Video: భయపెట్టిన వడగండ్ల వాన.. రండి బాబు రండి.. రూ. 100 కిలో!
-
ఏపీ: పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం
సాక్షి, అమరావతి: రాష్ట వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుముల మెరుపులతో కూడిన వడగండ్ల వానతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. కృష్ణా జిల్లా కురవటంతో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలు చిగురుటాకులా వణికాయి. దీంతో మామిడి ,కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. కృత్తివెన్ను పల్లెపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. నిడమరు పంచాయతీలో మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతవటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం: పర్చూరు ప్రాంతంలో చిరుజల్లులు కురవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిర్చి రైతులు, మిర్చిని పరదాలతో కాపాడుకోటానికి పాట్లు పడ్డారు. పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున ఉరుములతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నెలరాలాయి. మొక్కజొన్న, వరి పంటలు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గుంటూరు: జిల్లాలో పలు చోట్ల చెదరుమదరుగా వర్షం కురిసింది. పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేటలో మోస్తరు వర్షం పడింది. పొన్నూరు మండలం కొండముదిలో పిడుగుపడి రెండున్నర ఎకరాల వరికుప్ప దగ్ధం అయింది. తూర్పు గోదావరి: జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న, ధాన్యాన్నివర్షం నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అకాల వర్షాలు.. 28 మంది మృతి
లక్నో: గురువారం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వంటి కారణాల వల్ల వీరంతా మృతి చెందినట్లు తెలిపారు. పిలిబిత్, సీతాపూర్, చాందౌలీ, ముజాఫర్‌నగర్, భాగ్‌పట్, బిజ్నోర్, ఔన్‌పూర్ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. పంట, పశువుల నష్టాన్ని అంచనా వేయాలని.. బాధితులకు తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించారు. వర్షాలకు తోడు గాలిదుమ్ముల కారణంగా గోధుమలు, ఆవాలు పంటలు బాగా దెబ్బతిన్నాయి. బంగాళా దుంపల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. (చదవండి: కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు) -
తప్పిన ప్రమాదం, విమానంలో మంత్రి
సాక్షి, కోల్‌కతా: కోల్‌కతా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిస్వాస్‌తో సహా 171 మంది ప్రయాణికులతో బాగ్డోగ్రాకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు సహా, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన వెంటనే వడగండ్ల వర్షం కురవడంతో పైలట్ అప్రమత్తమై తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని విమానయాన సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విండ్‌షీల్డ్‌కు నష్టం వాటిల్లిందనే అనుమానంతో పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యమని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ విమానయాన సంస్థ ముఖ్య భద్రతా అధికారి క్షమాపణలు చెప్పారు. -
బిడ్డను కాపాడుకునేందుకు..
-
బిడ్డను కాపాడుకునేందుకు..
ఏ తల్లికైనా సరే తన ప్రాణాల కంటే కూడా బిడ్డ ప్రాణాలే ముఖ్యం. బిడ్డకు ఆపద వస్తుందని తెలిస్తే తానే కవచంగా మారి కాపాడుకుంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫియోనా సింప్సన్ కూడా ఆ కోవకు చెందిన వారే. వడగండ్ల నుంచి తన పసికందును కాపాడుకునేందుకు ఆమె చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాలు... ఆస్ట్రేలియాలో టోర్నడో, వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇటీవలే ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వాటిని నిజం చేస్తూ వడగండ్ల వాన క్వీన్ల్యాండ్స్పై విరుచుకు పడింది. అయితే వాన మొదలయ్యే కంటే కొంచెం ముందుగా ఆస్పత్రి నుంచి తన బామ్మ, బిడ్డతో ఫియోనా సింప్సన్ అనే మహిళ కారులో ఇంటికి బయల్దేరింది. సరిగ్గా అదే సమయంలో పెనుగాలులతో కూడిన వడగండ్ల వాన మొదలైంది. టెన్నిస్ బాల్స్ సైజులో ఉన్న రాళ్ల దాటికి ఫియోనా కారు అద్దాలు కూడా పగిలిపోయాయి. దీంతో తన చిన్నారిని కాపాడేందుకు ఆమె కవచంలా మారింది. రాళ్ల దెబ్బలు భరిస్తూ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కానీ తన బిడ్డను ప్రాణాపాయం నుంచి తప్పించి తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఉండదని నిరూపించింది. ఫియోనాకు సంబంధించిన కథనం ఆస్ట్రేలియా స్థానిక మీడియాలో ప్రచారం కావడంతో ప్రస్తుతం ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 'Pretty fierce!' Video sent in by Peta Long Doggett of hail and destructive wind at Booie yesterday. https://t.co/vOVoJxXkHk #qldstorm #qldtornado #7News pic.twitter.com/JMqFqqUQsF — 7 News Brisbane (@7NewsBrisbane) October 11, 2018 -
వడగళ్ల వాన.. అత్యవసరంగా దిగిన విమానం
బీజింగ్ : భారీ వడగళ్ల వాన దాటికి చైనాలో ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టియాన్జిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్జిన్ నుంచి హైనాన్‌కు గురువారం బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే భారీగా వడగాళ్ల వర్షం కురిసింది. దీంతో విమానం ముందు భాగం, అద్దాలు పాక్షికంగా పాడయ్యాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, సమీపంలోని సెంట్రల్ చైనాలోని వుహాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. -
127 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో..
-
127 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో..
ఇస్తాంబుల్: ఒక్కరి ప్రాణాలు కాపాడితేనే దేవుడు అంటారు. అలాంటిది ఏకంగా 127మంది ప్రాణాలు కాపాడాడు ఓ పైలట్. 121 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మందితో టర్కీలోని ఇస్తాంబల్ నుంచి ఎయిర్‌బస్ ఏ320 విమానం ఉక్రెయిన్ బయలుదేరింది. అయితే విమానం బయలుదేరిన 25 నిమిశాలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కోడిగుడ్ల పరిమాణంలో వడగండ్లు కురవడం మొదలైంది. దీంతో విమానానికి ముందున్న రక్షణ కవచం దెబ్బతింది. అంతేకాకుండా కాక్‌పిట్ ముందున్న అద్దాలు సైతం ముక్కలు ముక్కలు గా పగిలిపోయాయి. దీంతో పరిస్థతిని చేజారిపోయందని గ్రహించిన పైలట్ అలెగ్జాండర్ అకోపోవ్ పరిస్థితి వివరించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. అయితే అప్పటికే వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌పోర్టు మూతపడింది. అయినా పైలెట్ విన్నపం మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు విమానం ల్యాండింగ్‌కు ప్రత్యేక పరిమితినిచ్చారు. ఏవియేషన్ హెరాల్డ్ వివరాల ప్రకారం అలెగ్జాండర్ విమానం కిటికీల సహాయంతో సురక్షితంగా ల్యాండిగ్ చేశాడు. ఈసందర్భంగా పైలట్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నానని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అది తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. అయితే ఫ్లైట్ ల్యాండిగ్‌ను అక్కడ పనిచేస్తున్న ఒలెగ్ లుంగల్ అనే ఇంజనీర్ వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సుమారు 72వేల మంది ఈ వీడియోని షేర్ చేశారు. 1.5లక్షల మంది రియాక్షన్‌ను ఇచ్చారు. -
గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు
చిక్కబళ్లాపుర: మామూలుగా వడగండ్లు నిమ్మకాయంత పడితే గొప్ప అంటుంటాం. ఆ వడగండ్లను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అనంతపురం– కర్ణాటక సరిహద్దుల్లోని చిక్కబళ్లాపుర వద్ద మాత్రం గుమ్మడికాయ సైజులో వడగండ్లు పడ్డాయి. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. ఈ సమయంలో గుమ్మడికాయ పరిమాణంలో వడగండ్లు పడ్డా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే పొలాలు, పాలిహౌస్‌లు మాత్రం దెబ్బతిన్నాయని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆదుకుంటుందనే నమ్మకంలేదు
♦ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ అకాల వర్షాలతో నిలువునా నష్టపోయిన అరటి రైతులు ♦ పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటన ♦ అరటి రైతుల దుస్థితి చూసి చలించిపోయిన జననేత సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి. పంట ఏపుగా ఉంది. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఫలసాయం దక్కుతుందని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వడగండ్ల వాన రావడం, గంటలో అరటి తోటలు నేలపాలు కావడం జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో మానవత్వంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం రైతులకు లేదు. పంటనష్ట పరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, తుదకు పంటల బీమా సొమ్ము సైతం ఇవ్వకపోవడమే’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కళింగర పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. నేలమట్టమైన అరటితోటల రైతన్నల ఆవేదనను చూసిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. నల్లపురెడ్డిపల్లెలో పంటలు పరిశీలిస్తున్న తరుణంలో ఆదినారాయణ అనే రైతు బోరున విలపిస్తూ తన ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చే పరిహారం తోటలు చదును చేసుకునేందుకు కూడా సరిపోదని తెలిపారు. అకాల వర్షాలు వల్ల అరటి రైతులకు పంట నష్టం సంభవిస్తే కనీసం రూ.50వేలకు పైబడి పరిహారం అందేలా విధివిధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నిలువునా నష్టపోయిన రైతులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని జగన్ కోరారు. అధికారులు అంచనాలు రూపొందించడం మినహా పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతోనే రైతులకు విపత్తుల పరిహారం అందలేదని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్, ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రైతుల పక్షాన ధర్నా సైతం నిర్వహిస్తానని జగన్ చెప్పారు. పర్యటనలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్బాష, కడప మేయర్ కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు యూనిట్ గా పంటల బీమా
♦ వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు వర్తింపు: పోచారం ♦ మూడు వ్యవసాయ సంస్థల వెబ్సైట్లు ప్రారంభించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు రైతు యూనిట్‌గా బీమా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో భాగంగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, తెలంగాణ విత్తన సంస్థ, ఆయిల్‌ఫెడ్ వేర్వేరుగా రూపొందించిన వెబ్సైట్లను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. వెంటనే రూ.49.52 లక్షల సొమ్మును ఆన్లైన్లో 200 మంది రైతులకు విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సబ్సిడీపై ఇస్తున్న విత్తనానికి ఉన్న సీలింగ్‌ను ఎత్తేయడం వల్ల అదనంగా మరో రూ.130 కోట్ల మేరకు ఖర్చవుతుందని, దీనికి సీఎం అంగీకరించారని చెప్పారు. నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఒక్కో విత్తన కంపెనీ విత్తన ఉత్పత్తి రైతులకు సాయం చేసేందుకు, దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. వరి విత్తన రైతుకు కూడా బ్రీడర్ సీడ్‌పై సబ్సిడీ ఇస్తామన్నారు. విత్తన రైతులకు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులుంటాయన్నారు. గ్రీన్హౌస్, సబ్సిడీపై ట్రాక్టర్లు, సూక్ష్మసేద్యం తదితర వాటిల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపోను రైతు చెల్లించాల్సిన సొమ్ముకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని పోచారం వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 906 సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఎరువులు, విత్తనాలను మండల వ్యవసాయాధికారి, సహకార సంఘానికి చెందిన ప్రతినిధి కలసి రైతులకు సబ్సిడీపై అందజేస్తారన్నారు. ప్రస్తుతం ఎరువులు 2.76 లక్షల టన్నుల బఫర్ స్టాకు ఉందన్నారు. ఈ సహకార సం ఘాల ద్వారానే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఆ ప్రకారం వ్యవసాయ, సహకార శాఖలను అనుసంధానం చేస్తామన్నారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటలు వేయాలని రైతులకు మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, ఉన్నతాధికారులు ప్రియదర్శిని, ఎ.మురళి, కేశవులు, కోడూరు రవీందర్రావు, మురళీధర్, విత్తన కంపెనీల అధిపతులు భాస్కర్‌రావు, ఏఎస్ఎన్ రెడ్డి, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల నిలదీత... వెబ్సైట్ల ప్రారంభ కార్యక్రమంలో కొందరు రైతులు మంత్రి పోచారాన్ని నిలదీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు తనకు నేషనల్ సీడ్స్ నుంచి 6 నెలలుగా డబ్బులు రావడంలేదని పేర్కొన్నారు. మరో రైతు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో రైతులకు బోనస్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పుట్టడమే తాము చేసుకున్న దురదృష్టమా అని మంత్రిని నిలదీశారు. కంది విత్తనానికి సరైన ధర లేదని మరో రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
వడగళ్ల వానకు భారీగా పంట నష్టం
- 600 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు దెబ్బ - పర్యటించిన ప్రజాప్రతినిధులు నంగునూరు: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం వడగళ్ల వాన కురవడంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. సిద్దన్నపేట, బద్దిపడగ, నంగునూరు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో మామిడి కాయలు రాలాయి. చాలాచోట్ల తోటల్లో మామిడి చెట్లు నేలకొరిగాయి. వరి చేనులో వడ్లు రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. బద్దిపడగలో రోడ్డు చెట్టు కూలడంతో పక్కన నిలిపిన టీవీఎస్ ఎక్సల్ వాహనం దెబ్బతింది. రాకపోకలకు అంతరాయం కల్గింది. మూడు గ్రామాల్లో సుమారుగా 400 ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఆర్డీఓ, ఎంపీపీ సందర్శన.. మూడు గ్రామాల్లో జరిగిన పంట నష్టం విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు బద్దిపడగ, సిద్దన్నపేట గ్రామాలను సందర్శించారు. మామిడి తోటలు, పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గురువారం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల నష్టం వివరాలను సేకరిస్తారని చెప్పారు. వారి వెంట సర్పంచ్ బెదురు గిరిజ, మద్దికుంట మంజూల, నాయకులు దువ్వల మల్లయ్య, వెంకట్‌రెడ్డి, పురేందర్, వెంకట్రాంజం, జయపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన
విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందువల్ల నెల్లూరు జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన పడింది. కర్నూలు జిల్లా ఆస్పరి, గోనెగండ్ల మండలాలలో ఆదివారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన పడింది. బైలుప్పల, వి.అగ్రహారం, గంజిపల్లి గ్రామాల్లో రేగిపండు సైజులో వడగండ్లు పడ్డాయి. దీంతో పొలాల్లో కూలీ పనులు చేసుకుంటున్న మహిళలకు దెబ్బలు తగిలాయి. మహిళలు పనులు వదిలేసి సమీప గుడిసెల్లోకి పరుగులు తీశారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం, అబ్దీపురం, శ్రీనగరం, గాజులపల్లె, మహానంది, కృష్ణనంది గ్రామ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ గాలులతో కూడిన వర్షాల పడ్దాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి చెట్లు నేలమట్టం అయ్యాయి. -
పరిహారం కొన్ని పంటలకే
జహీరాబాద్, న్యూస్‌లైన్: ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. నిండా అప్పుల్లో మునిగి పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన అధిక వర్గాలు, పైలిన్ తుపాను కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడులు పడిపోయాయి. ఇది మరచిపోకముందే మార్చినెల మొదటి వారంలో కురిసిన భారీ వడగళ్ల వర్ష బీభత్సానికి పంటలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దెబ్బతీసిన వడగళ్ల వాన జహీరాబాద్, కోహీర్ మండలాల్లో వడగళ్ల బీభత్సానికి అరటి, కంది, మొక్కజొన్న, జొన్న, గోధుమ, శనగ పంటలు దెబ్బతిన్నాయి. జరిగిన పంట నష్టాన్ని అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. అయినా ఇంతవరకూ పంట నష్టం పరిహారం మంజూరుకాక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు మాత్రమే పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పత్తి పంటకు మాత్రం పరిహారం చెల్లించే అవకాశం లేదని వారు వెల్లడిస్తున్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు మాత్రం త్వరలోనే పరిహారం మంజూరు కానుందని వారంటున్నారు. దీంతో వడగళ్లవాన బాధిత రైతులంతా పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వడగళ్ల వర్షానికి జహీరాబాద్, కోహీర్ మండలాల్లో అరటి పంట సుమారు వేయి ఎకరాలకు పైగానే దెబ్బతింది. సుమారు 400 ఎకరాల్లో కంది పంట, 800 ఎకరాల్లో శనగ, 270 ఎకరాల్లో మొక్కజొన్న, 1,200 ఎకరాల్లో జొన్న, 200 ఎకరాల్లో గోదుమ పంటలు దెబ్బతిన్నాయి. అరటి రైతులు సైతం భారీగా నష్టాలను చవి చూశారు. భారీ పెట్టుబడులతో అరటిసాగు చేపట్టిన రైతులు వడగళ్ల వానతో ఎకరాకు రూ.50 వేల మేర నష్టపోయారు. ఆ సమయంలో నివేదికలు తయారు చేసి ఆదుకుంటామన్న అధికారులు ఇంతవరకూ పరిహారం మంజూరు చేయకపోవడంతో రైతులంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ’పైలిన్’తో పత్తికి తీవ్రనష్టం గత సంవత్సరం కురిసిన అధిక వర్షాలతో పాటు అక్టోబర్ మాసంలో వచ్చిన పైలిన్ తుపాన్ కారణంగా పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. కొంత మేర ఆశాజనకంగా కనిపించిన పత్తి పంటపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పైలిన్ తుపాన్ వారి ఆశలపై నీళ్లు పోసింది. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేయగా, పైలిన్ తుపాను ప్రభావంతో ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ఇక లోతట్టు ప్రాంతాల్లో పత్తిసాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా పత్తిరైతు ఆదుకోవడంలో మెలిక పెట్టింది. చేతికి అందివచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ అప్పట్లో నిబంధన విధించడంతో పత్తి రైతులు దిగ్భ్రాంతికి చెందారు. అక ఇప్పుడేమో పత్తి రైతులెవరికీ పరిహారం ఇవ్వమంటూ తేల్చిచెబుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడుతున్న సర్కార్ తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
ధాన్యం పుష్కలం.. కేంద్రాలు నిష్ఫలం
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: ప్రకృతి ప్రకోపానికి ప్రతిసారీ బలవుతున్న రైతన్న ఈ రబీలో గట్టెక్కాడు. అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడి ఇంటికి చేర్చాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు పెరగడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే ఈ కర్షకుడిని దైవం కరుణించినా...యంత్రాగం మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. కొనుగోలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయడంతో వరికి మద్దతు ధర ప్రశ్నార్థకంగా మారింది. అదే అదునుగా దళారులు తమ దందా ప్రారంభించడంతో రైతన్న నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారిచ్చింది పుచ్చుకుని...అపురూపంగా పండించిన పంటను అప్పగించి వెళ్లిపోతున్నాడు. కలలన్నీ కల్లలుగా మారడంతో కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆశలు రేపిన రబీ రబీ సీజన్ సిద్దిపేట ప్రాంత రైతుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అకాల వర్షాలు, వడగళ్ల వానలను తట్టుకుని ఇంటికి చేరనున్న వరి ధాన్యాన్ని చూసి అన్నదాతలు తమ కష్టాన్ని మరచిపోతున్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, తొగుట, కొండపాక మండలాల్లో సగటున మండలానికి 10 వేల ఎకరాల్లో వరి సాగైంది. సకాలంలో నాటు వేయడం, అవసరమైనంత నీరు అందించడంతో వరి దిగుబడి కూడా ఈసారి పెరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రైతన్నలు కోతలు ప్రారంభించారు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా ఇప్పటికే 40 శాతం పంటను కోశారు. మిగిలిన పంటను మరో వారంరోజుల్లో ఇంటికి చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన పలువురు రైతులు వరిధాన్యాన్ని సిద్దిపేట మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. జాడలేని ఐకేపీ కేంద్రాలు పెరిగిన దిగుబడి చూసి ఆనందపడిన రైతులు...ఇక తమ కష్టాలన్నీ తీరాయనుకున్నారు. అయితే అన్నదాతలపై కరుణ చూపని సర్కారు కోతల సీజన్ ప్రారంభమై పక్షంరోజులు దాటినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతన్నలు విధిలేని పరిస్థితుల్లో సిద్దిపేటలోని మార్కెట్‌కు ధాన్యాన్ని తరలిస్తున్నారు. అక్కడ దళారులంతా ఏకం కావడంతో వరికి మద్దతు ధర దక్కడం లేదు. ఇంకొన్నిరోజులు ఆగే ఆర్థికబలం లేక కొందరు, వివాహాలు, చదువులు, ఇతర అత్యవసరాల కోసం మరికొందరు రైతులు దళారులు నిర్ణయించిన అడ్డగోలు ధరకే వరిని అమ్మేసుకుంటున్నాడు. వెల్లువలా ధాన్యం... సంసిద్ధం కాని యంత్రాగం ఇప్పటికే 40 శాతం వరికోతలు పూర్తికాగా, మిగిలిన పంట మరో వారం రోజుల్లో ఇంటికిచేరే అవకాశం ఉంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పంట అంతా సిద్దిపేట మార్కెట్‌కు తరలివస్తోంది. మరో వారం రోజులు తర్వాత సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు వరి ధాన్యం వెల్లువలా రానుంది. సిద్దిపేట ప్రాంతంలోని ఐదు మండలాల్లోనే సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతో పాటు సిద్దిపేట సమీపంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ధాన్యం భారీగా రానుంది. అయికే వచ్చినధాన్యాన్ని వచ్చినట్లు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం... ఇక్కడి వ్యాపారులు అంత ధాన్యాన్ని కొనుగోలు చేసే స్థితిలో లేకపోవడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ఆరుగాలం శ్రమించిపండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. -
వడగళ్ల బీభత్సం
దమ్మన్నపేట్, గోవింద్‌పల్లి(ధర్పల్లి), న్యూస్‌లైన్: ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ పరిధిలోని మరియా, బేల్యాతండాల్లో, గోవింద్‌పల్లి గ్రామ పరిధిలోని గుడితండాల్లో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వడగళ్ల వానకు వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వడ్లు పూర్తిగా రాలిపోయాయి. తొంభై శాతం వరకు వడ్లు నేల రాలాయి. ఆదివారం ఉదయమే రైతులు పంట పొలాలకు వెళ్లి చూడగా నేల రాలిన వడ్లను చూసి గుండెలు బాదుకున్నారు. సుమారు ఏడు వందల ఎకరాల్లో వరి పంట పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. వడ్లు రాలిపోయి గడ్డి మాత్రమే మిగలడంతో రైతులు లబోదిబోమమంటూ రోదించారు. గిరిజన రైతులను ఆదుకోవాలని కోరారు. పంట నష్టంతో తిందామంటే లేకుండా పోయిందని మహిళ రైతులు రాలిన వరిగడ్డితో రోదిస్తూ నేలను బా దుకున్నారు. భారీ ఈదురు గాలులకు మామిడికాయ లు పూర్తి స్థాయిలో నేలరాలాయి. కోత దశకు వచ్చిన మామిడి పంట దెబ్బతినటంతో రైతులు బోరున విలపించారు. టమాట, నువ్వు, మిర్చిపంటలూ దెబ్బ తిన్నాయి. అలాగే దుబ్బాక, మైలారం, చల్లగరిగె, రామడుగు, కేశారం, ఎల్లారెడ్డిపల్లి, లోలం గ్రామాల్లో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి వరిపైరు నేల కొరిగింది. మామిడికాయలు నేల రాలాయి. మరియా, బేల్యా, గుడితండాల్లోని దెబ్బతిన్న పంటలను ఏఈఓ న ర్సయ్య, వీఆర్వోలు పోశెట్టి, సాయిలు, ప్రభాకర్ ప రిశీలించి పంట నష్టాన్ని అంచనా వేశారు. పంట నష్ట పరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీపీ గడ్డం సుమనరెడ్డి డిమాండ్ చేశారు. పంటలను ఆమె పరిశీలించారు. -
వర్ష బీభత్సం
భెల్, న్యూస్‌లైన్: భెల్ టౌన్షిప్లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలులతో కూడినగాలివానకు సుమారు 20 చెట్లు నెలకొరిగాయి. దీంతోపాటు పలువిద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విరిగిన చెట్లు రోడ్లకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు యుధ్దప్రాతిపదికపై చర్యలు చేపట్టి కూలిన చెట్లను తొలగించారు. రెండు విద్యుత్ స్తంభాలు క్వార్టర్సుపై ప్రజలు భాయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రివరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. వడగళ్ల వాన పటాన్చెరు రూరల్: మండల పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షానికి కాలువలు పొంగిపొర్లాయి. రోడ్లు జలమయమయ్యాయి. అమీన్పూర్ పంచాయతీ పరిధిలోని సాయిభగవాన్ కాలనీలో రోడ్డుపై నీరు చేరడంతో బా టసారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రక్కన ఉన్న మ్యాన్‌హోల్ గుంతలు తెలియక ఇక్కట్లు పడ్డారు. ఈదు రు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురువడంతో మం డల పరిధిలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. ఆర్సీపురంలో.. రామచంద్రాపురం: రామచంద్రాపురం పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సుమారు గంటసేపుపైగా భారీ వర్షం కురిసింది. దాంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చిన్న వర్షం పడినా నీరు వచ్చి జాతీయ రహదారిపై చేరుతోంది. ఈ సమస్య గత కొన్నేళ్లుగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈదురు గాలులకు పంట నేలపాలు నంగునూరు: ఈదురుగాలులకు రైతుల కష్టం నేలపాలయ్యింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. మండలం పరిధిలోని ఖానాపూర్‌లో ఆదివారం రాత్రి ఈదురు గాలులు వీచాయి. దీంతో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. అదేవిధంగా కోత దశకు వచ్చిన వరి చేన్లకు సైతం నష్టం వాటిల్లింది. గింజలు రాలిపోయాయి. గ్రామానికి చెందిన మెగుళ్ల నర్సింహానెడ్డి, వంటేరు లింగారెడ్డి, కేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భాగ్యలక్ష్మీ, మధుసూదన్‌రెడ్డితోపాటు మరి కొందరు రైతలకు చెందిన మామిడితోటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా బాల్ధ కనుకయ్య, మెగుళ్ల నర్సింహారెడ్డి, చెరువు చంద్రయ్య, కాయిత కనుకయ్యకు చెందిన వరిచేనులో వరి గింజలు రాలి నేలపాలయ్యాయి. మామిడి తోటలకు డ్రిప్పు బిగించి నీరందించడంతో మంచి కాత వచ్చిందని సంతోషించామని, ఈదురు గాలులకు తమ ఆనందం ఆవిరైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నేలపాలై తమకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు. అధికారులు స్పందించి తమను తమకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
బారామతి రైతు భగ్గు
పింప్రి, న్యూస్‌లైన్: వడగండ్ల వానల వల్ల నష్టపోయిన తమను ఏ పార్టీ లేదా ప్రభుత్వమూ పట్టించుకోకపోవడంపై బారామతి రైతులు మండిపడుతున్నారు. ఇటువంటి నాయకులవల్ల ఒరిగేదేమీ లేదని భావించిన వీరంతా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని యోచిస్తున్నారు. కాగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన బారామతి పార్లమెంటు నియోజక వర్గంలో 1967వ సంవత్సరం నుంచి శరద్ పవార్‌కు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. బారామతి నియోజకవర్గం ఓటర్లు 1967 నుంచి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలేలకు పట్టం కడుతూ వస్తున్నారు. నియోజక వర్గంలోని ఇతర తాలూకాలతో పోల్చితే బారామతి తాలూకా బాగా అభివృద్ధి చెందింది. ఈ తాలూకాలో టెక్స్టైల్, ఆటోమొబైల్ రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బైపాస్ మార్గాలు... ఇలా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఈ నేపథ ్యంలో ఓటర్లు ఇక్కడినుంచి బరిలోకి దిగిన శరద్‌పవార్ లేదా ఇతర కుటుంబసభ్యులను ఆదరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో కొంతమార్పు గోచరిస్తోంది. ఇటీవల వడగండ్ల వానలు పడడంతో రైతాంగం భారీగా నష్టపోయింది. అయినప్పటికీ వారికి ఇప్పటిదాకా పరిహారం అందనేలేదు. దీంతో ఈసారి ఈ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన సుప్రియాసూలే గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తాగు నీటి సమస్య కూడా తీవ్రస్థాయిలో ఉంది. దీంతో ఇక్కడి ప్రజలు ఈ విషయమై రాజకీయ నాయకులను నిలదీస్తున్నారు. తాలూకాలోని 22 గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీటి కోసం నిరాహారదీక్షలు, ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వంగానీ ఈ సమస్యకు తగు పరిష్కార మార్గం చూపడంలో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఈ ఎన్నికలపై అంత ఆసక్తి చూపడం లేదు. ఇదిలా వుండగా తాలూకాలో అనేక సహకార సంస్థలున్నాయి. అయితే చెరకు పండించే రైతుకు గిట్టుబాటు ధర కలగానే మిగిలిపోయింది. దీంతో గిట్టుబాటు ధరకోసం పలు రైతు సంఘాలు భారీ ఆందోళనలకు దిగాయి. అయినప్పటికీ ఎటువంటి ఫలితమూ దక్కలేదు. దీంతో స్థానిక చెరకు రైతులు... ఎన్నికలు, రాజకీయ నాయకులంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఓటెయ్యకూడదనే యోచనలో ఉన్నారు. ఇంకా పెరిగిన ధరలు, అవినీతి తదితరాలు కూడా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులకు భారీగా స్వాగతం పలుకుతుండగా ఇప్పుడు పట్టించుకునేవారే కరువవుతున్నారు. -
రెక్కల కష్టం నీటిపాలు
సాక్షి, సంగారెడ్డి: అకాల వర్షాలు అన్నదాతల వెన్నువిరిచాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా జిల్లాలో 3,292 హెక్టార్లలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు రూ.10.57 కోట్ల నష్టం వాటిల్లింది. గత నెల 27 నుంచి ఈనెల 5 వరకు జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వరి, గోధుమ, జొన్న, మినుము పం టలతోపాటు పండ్లు, కూరగాయల తోటలు నీట ముంచాయి. ఈ వర్షాల వల్ల 1,941 హెక్టార్లలో వ్యవసాయ పంటలతోపాటు 1,350 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖలు తేల్చాయి. కాగా 44,573 క్వింటాళ్ల దిగుడులకు నష్టం వాటిల్లింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక నివేదికను పంపించాయి. వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న గృహాల సంఖ్య 369కు పెరిగింది. అందులో 10 పూర్తిగా, ఐదు తీవ్రంగా, 354 పాక్షికంగా దెబ్బతిన్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వ్యవసాయం, పశు సంపదకు జరిగిన నష్టంపై కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. కూరగాయల రైతు విలవిల అకాల వర్షాల వల్ల 1,350 హెక్టార్లలో కూరగాయల తోటలతోపాటు మామిడి, అరటి, బొప్పాయి, బత్తా యి, ద్రాక్ష తోటలకు నష్టం వాటిల్లింది. పం టలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి రూ.4.60కోట్ల పెట్టుబడి రాయితీ కోసం ఉద్యాన శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 965.20 హెక్టార్లలో కూరగాయల తోటలు ధ్వంసం కావడంతో రైతులకు రూ.1.91 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పం పారు. వంద హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.24లక్షలు, 20 హెక్టార్లలో బొప్పాయి తోటలకు గాను రూ.2 లక్షలు, 20 హెక్టార్లలో ద్రాక్ష తోటలకు గాను రూ.1.8 లక్షలు, 4హెక్టార్లలో బత్తాయి తోటలకు గాను రూ.60 వేల ఇన్పుట్ సబ్సిడీ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా వడగళ్ల వాన వల్ల జిల్లాలో 32 మేకలు, 22 గొర్రెలు, ఓ గేదె మృత్యువాత పడ్డాయి. దీంతో పెంపకందారులకు రూ.1.40 లక్షల నష్టం వాటిల్లిందని పశు సంవర్థక శాఖ తేల్చింది. సగటు వర్షపాతం 11.5 మి.మీటర్లు జిల్లాలో మంగళవారం 11.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా నర్సాపూర్‌లో గరిష్టంగా 42.2 మిల్లీమీటర్లు, దౌల్తాదాలో 38 మి.మీటర్లు, కోహీర్‌లో 35మి.మీ., చిన్నశంకరంపేటలో 33మి.మీ., కొండపాకలో 30 మి.మీటర్ల వర్షం కురిసింది. -
వడగళ్ల వర్షానికి నలుగురు మృతి
వరంగల్ : వరంగల్ జిల్లాలో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. రాళ్లదెబ్బకు నలుగురు మృతి చెందగా, 200మందికి పైగా గాయపడ్డారు. వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల పంట నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి చేతికి వస్తుందనుకున్న పంట కళ్లముందే నాశనం కావటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పలు మండలాల్లో పంటపొలాల్లో వడగండ్లు పేరుకుపోయాయి. కాగా మంగళవారం రాళ్లదెబ్బలకు ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు తండాకు చెందిన భూక్యా సత్తి వడగండ్ల వర్షం నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. గూడూరు మండలం మచ్చర్లకు చెందిన పశవుల కాపరి ఆవుల పద్మ, ఊట్ల గ్రామానికి చెందిన లింగాల కొమ్మమ్మ వ్యవసాయ బావుల వద్ద వడగండ్ల దెబ్బకు మృతిచెందారు. మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు విడిచాడు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల పరిధిలోని చంద్రుగొండ, దీక్షకుంట, సూరిపెల్లి, లింగగిరి తదితర ప్రాంతాల్లో గొర్రెల మందలు, బర్రెలు పెద్దసంఖ్యలో మృత్యువాత పడ్డాయి. వడగండ్లవానతో పదుల సంఖ్యలో గాయపడినవారు స్థానికంగా చికిత్స పొందుతున్నారు.పదిమందిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. కాగా పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడితోటలు దెబ్బతిన్నాయి. -
అకాల వర్షం,అపార నష్టం