గుమ్మడికాయ సైజులో భారీ వడగండ్లు
చిక్కబళ్లాపుర: మామూలుగా వడగండ్లు నిమ్మకాయంత పడితే గొప్ప అంటుంటాం. ఆ వడగండ్లను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అనంతపురం– కర్ణాటక సరిహద్దుల్లోని చిక్కబళ్లాపుర వద్ద మాత్రం గుమ్మడికాయ సైజులో వడగండ్లు పడ్డాయి. మంగళవారం సాయంత్రం పట్టణంలో ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. ఈ సమయంలో గుమ్మడికాయ పరిమాణంలో వడగండ్లు పడ్డా ఎవరికీ గాయాలు కాలేదు. అయితే పొలాలు, పాలిహౌస్‌లు మాత్రం దెబ్బతిన్నాయని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.