
భారీ వడగళ్ల వాన దాటికి ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
బీజింగ్ : భారీ వడగళ్ల వాన దాటికి చైనాలో ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టియాన్‌జిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్‌జిన్ నుంచి హైనాన్‌కు గురువారం బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే భారీగా వడగాళ్ల వర్షం కురిసింది. దీంతో విమానం ముందు భాగం, అద్దాలు పాక్షికంగా పాడయ్యాయి.
పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, సమీపంలోని సెంట్రల్ చైనాలోని వుహాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.