భెల్, న్యూస్‌లైన్: భెల్ టౌన్‌షిప్‌లో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈదురుగాలులతో కూడినగాలివానకు సుమారు 20 చెట్లు నెలకొరిగాయి. దీంతోపాటు పలువిద్యుత్ స్తంభాలు కూలిపోయి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విరిగిన చెట్లు రోడ్లకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు యుధ్దప్రాతిపదికపై చర్యలు చేపట్టి కూలిన చెట్లను తొలగించారు. రెండు విద్యుత్ స్తంభాలు క్వార్టర్సుపై ప్రజలు భాయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రివరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు.
వడగళ్ల వాన
పటాన్‌చెరు రూరల్: మండల పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షానికి కాలువలు పొంగిపొర్లాయి. రోడ్లు జలమయమయ్యాయి. అమీన్‌పూర్ పంచాయతీ పరిధిలోని సాయిభగవాన్ కాలనీలో రోడ్డుపై నీరు చేరడంతో బా టసారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రక్కన ఉన్న మ్యాన్‌హోల్ గుంతలు తెలియక ఇక్కట్లు పడ్డారు. ఈదు రు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురువడంతో మం డల పరిధిలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
ఆర్సీపురంలో..
రామచంద్రాపురం: రామచంద్రాపురం పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సుమారు గంటసేపుపైగా భారీ వర్షం కురిసింది. దాంతో జాతీయ రహదారిపైకి వర్షం నీరు చేరి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే చిన్న వర్షం పడినా నీరు వచ్చి జాతీయ రహదారిపై చేరుతోంది. ఈ సమస్య గత కొన్నేళ్లుగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
ఈదురు గాలులకు పంట నేలపాలు
నంగునూరు: ఈదురుగాలులకు రైతుల కష్టం నేలపాలయ్యింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. మండలం పరిధిలోని ఖానాపూర్‌లో ఆదివారం రాత్రి ఈదురు గాలులు వీచాయి. దీంతో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. అదేవిధంగా కోత దశకు వచ్చిన వరి చేన్లకు సైతం నష్టం వాటిల్లింది. గింజలు రాలిపోయాయి. గ్రామానికి చెందిన మెగుళ్ల నర్సింహానెడ్డి, వంటేరు లింగారెడ్డి, కేశిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, భాగ్యలక్ష్మీ, మధుసూదన్‌రెడ్డితోపాటు మరి కొందరు రైతలకు చెందిన మామిడితోటలు దెబ్బతిన్నాయి.
అదేవిధంగా బాల్ధ కనుకయ్య, మెగుళ్ల నర్సింహారెడ్డి, చెరువు చంద్రయ్య, కాయిత కనుకయ్యకు చెందిన వరిచేనులో వరి గింజలు రాలి నేలపాలయ్యాయి. మామిడి తోటలకు డ్రిప్పు బిగించి నీరందించడంతో మంచి కాత వచ్చిందని సంతోషించామని, ఈదురు గాలులకు తమ ఆనందం ఆవిరైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నేలపాలై తమకు తీరని నష్టం వాటిల్లిందని వాపోయారు. అధికారులు స్పందించి తమను తమకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
వర్ష బీభత్సం
Published Mon, Apr 14 2014 11:59 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement