ఆస్ట్రేలియాలో టోర్నడో, వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇటీవలే ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. వాటిని నిజం చేస్తూ వడగండ్ల వాన క్వీన్‌ల్యాండ్స్‌పై విరుచుకు పడింది. అయితే వాన మొదలయ్యే కంటే కొంచెం ముందుగా ఆస్పత్రి నుంచి తన బామ్మ, బిడ్డతో ఫియోనా సింప్సన్ అనే మహిళ కారులో ఇంటికి బయల్దేరింది. సరిగ్గా అదే సమయంలో పెనుగాలులతో కూడిన వడగండ్ల వాన మొదలైంది.