
127 మంది ప్రాణాలు కాపాడిన రియల్ హీరో..
ఇస్తాంబుల్: ఒక్కరి ప్రాణాలు కాపాడితేనే దేవుడు అంటారు. అలాంటిది ఏకంగా 127మంది ప్రాణాలు కాపాడాడు ఓ పైలట్. 121 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మందితో టర్కీలోని ఇస్తాంబల్ నుంచి ఎయిర్‌బస్ ఏ320 విమానం ఉక్రెయిన్ బయలుదేరింది. అయితే విమానం బయలుదేరిన 25 నిమిశాలకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కోడిగుడ్ల పరిమాణంలో వడగండ్లు కురవడం మొదలైంది. దీంతో విమానానికి ముందున్న రక్షణ కవచం దెబ్బతింది. అంతేకాకుండా కాక్‌పిట్ ముందున్న అద్దాలు సైతం ముక్కలు ముక్కలు గా పగిలిపోయాయి.
దీంతో పరిస్థతిని చేజారిపోయందని గ్రహించిన పైలట్ అలెగ్జాండర్ అకోపోవ్ పరిస్థితి వివరించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. అయితే అప్పటికే వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌పోర్టు మూతపడింది. అయినా పైలెట్ విన్నపం మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు విమానం ల్యాండింగ్‌కు ప్రత్యేక పరిమితినిచ్చారు. ఏవియేషన్ హెరాల్డ్ వివరాల ప్రకారం అలెగ్జాండర్ విమానం కిటికీల సహాయంతో సురక్షితంగా ల్యాండిగ్ చేశాడు. ఈసందర్భంగా పైలట్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నానని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అది తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. అయితే ఫ్లైట్ ల్యాండిగ్‌ను అక్కడ పనిచేస్తున్న ఒలెగ్ లుంగల్ అనే ఇంజనీర్ వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సుమారు 72వేల మంది ఈ వీడియోని షేర్ చేశారు. 1.5లక్షల మంది రియాక్షన్‌ను ఇచ్చారు.