హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో వడగళ్ల వాన | Hailstorm in Hydarabad and Warangal District | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో వడగళ్ల వాన

Published Tue, Mar 4 2014 4:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో వడగళ్ల వాన - Sakshi

హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో వడగళ్ల వాన

హైదరాబాద్: నగరంలో పలుచోట్ల, వరంగల్ జిల్లా అంతటా భారీగా వడగళ్ల వానపడింది. హైదరాబాద్లోని  కొండాపూర్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్ నగర్, సికింద్రాబాద్, బోయనపల్లి ప్రాంతాలలో  వడగళ్లు పడ్డాయి. నాంపల్లి, అబిడ్స్, కోఠీ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వరంగల్ జిల్లాలో వడగళ్లతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. జిల్లాలో పలుచోట్ల  భారీ వృక్షాలు, హోర్డింగులు కూలాయి.  వాహనాల రాకపోకలు స్తంభించాయి.

ఇదిలా ఉండగా, క్యుములోనింబస్ మేఘాల వల్ల సీమాంధ్ర, తెలంగాణలలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం  తెలిపింది. వచ్చే 24 గంటలలో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement