సాక్షి, ముంబై: బహుళ అంతస్తుల భవనాలకు అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నియంత్రించడానికి ఉపయోగపడే ‘సిస్టం ఆఫ్ అపరేటింగ్ ప్రాజెక్టు’ (ఎస్‌ఓపీ) ముంబై అగ్నిమాపక విభాగం వద్ద లేదన్న ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బందికి అందజేసే బూట్లు, దుస్తులు, ఆక్సిజన్ సరఫరా పరికరాలు కూడా నాణ్యమైనవి అందజేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అగ్నిప్రమాదాల నియంత్రణకు ఎస్‌ఓపీ, నాణ్యమైన పరి కరాలు అనివార్యమని నిపుణులు చెబుతున్నారు.
దుర్ఘటనలు సంభవించినప్పుడు ఏయే విభాగాలు/శాఖలు ఏయే పనులు నిర్వర్తించాలో, ఎలాంటి పరికరాలు ఉపయోగించాలో ఎన్‌ఓపీ వివరిస్తుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొన్నిసార్లు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్నారు. అంతేగాక మంటలను ఆదుపులోకి తెచ్చేందుకు అక్కడి పరిస్థితులను బట్టి ప్రయత్నా లు చేస్తున్నారు. ఆక్సిజన్ అందజేసే పరికరాలు, దుస్తులు, బూట్లు నాసిరకమైనవి వాడడం వల్ల కొన్నిసార్లు వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోం ది. ముంబైలో 2008 నవంబరు 26న (26/11) ఉగ్రవాదులు దాడులు జరిపిన తరువాత నగర పోలీసుశాఖ ఎస్‌ఓపీని సమకూర్చుకుంది.
విపత్తు ల నిభాయింపు విభాగం (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) కూడా ఎస్‌ఓపీ సిద్ధం చేసుకుంది. అత్యంత కీలకమైన అగ్నిమాపక శాఖ వద్ద మాత్రం ఎస్‌ఓపీ లేదు. నగరంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య మరిం త పెరగనుంది. ముఖ్యంగా వాణిజ్య, కార్పొరేట్ కార్యాలయాలకు ఉపయోగపడే విధంగా నిర్మిస్తున్న ఈ భవనాల్లో గోడలకు బదులుగా ‘సన్ ప్రొటెక్షన్ గ్లాసెస్’ అమర్చడం పరిపాటిగా మారింది. ఈ అద్దాల మేడలు ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా కొంప ముంచుతాయని యజమానులు తెలుసుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం మహానగర పాలక సంస్థ (బీఎంసీ) వద్ద 68 మీటర్ల ఎత్తున్న (22 అంతస్తుల వరకు చేరుకునే) నిచ్చెనతో కూడిన ఫైరింజన్ ఒకటే ఉంది. అది కూడా కేవలం అగ్నిమాపక ప్రధా న కేంద్రమైన బైకల్లా కార్యాలయంలో ఉంటుంది. నగరంలో ఎక్కడ బహుళ అంతస్తుల భవనానికి అగ్నిప్రమాదం జరిగినా, బైకల్లా కార్యాలయం నుంచి ఈ ఫైరింజన్ వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లో ఈ భారీ ఫైరింజన్ దారి వెతుక్కుంటూ ఘటనాస్థలానికి చేరుకునే సరికి జరగాల్సిన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిపోతుంది. అంధేరీలో శుక్రవారం 22 అంతస్తుల లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఇదే పరిస్థితి ఎదురయింది.
బైకల్లా ముంబైకి ఒకవైపు ఉంటే అంధేరీ శివారు ప్రాంతం కాబట్టి మరోవైపునకు ఉంటుంది. సకాలంలో అగ్నిమాపక శకటం రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ సమయంలో ముంబై అగ్నిమాపక శాఖ వద్ద ఎస్‌ఓపీ లేకపోవడం తో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ చీఫ్ ఎ.ఎన్.వర్మ అన్నారు. ముఖ్యంగా ఇలాంటి అద్దాల మేడలకు అగ్నిప్రమాదాలు జరి గితే బయట నుంచి మంటలను ఆర్పివేయాల్సి
ఉంటుంది. సన్ ప్రొటెక్షన్ గ్లాసుల వల్ల విషపూరితమైన వాయువులు లోపలికి ప్రవేశిస్తాయి. దీంతో జవాన్లు భవనం లోపలికెళ్లి మంటలను ఆర్పివేయడమంటే ప్రా ణాలతో చెలగాటం ఆడటమేనని శర్మ అభిప్రాయపడ్డా రు. లోటస్ బిజినెస్ పార్క్ భవనంలో నితిన్ యెవ్లేకర్ అనే జవాను ఊపిరాడక మరణించడడానికి కార ణం ఈ విషవాయువులేనని అనుమానాలు వ్యక్తం చేశారు.
బూట్లు కూడా కరువే
ప్రాణాలను లెక్కచేయకుండా మంటలను ఆర్పేయడానికి ప్రయత్నించే అగ్నిమాపకశాఖ కానిస్టేబుళ్లకు అత్యవసర ప్రాణ రక్షక పరికరాలను సైతం అందజేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విధినిర్వహణలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని నితిన్ తరచూ చెప్పేవాడని నితిన్ భార్య శుభాంగి అన్నారు. ‘ఏదైనా పెద్ద అగ్నిప్రమాదం జరిగిందని ఆయనకు ఫోన్ వస్తే నాకు చాలా భయం కలిగేది. తమ బూట్లు కూడా నాణ్యమైనవి అందజేయడం లేదని, ఆక్సీజన్ అందజేసే పరికరాలు కడా సక్రమంగా లేదని చెప్పేవారు’ అని ఆమె వివరించారు.
అన్నీ అరకొరే!
Published Sun, Jul 20 2014 11:21 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM
Advertisement