సాక్షి, ముంబై: ముంబై నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని పోర్ట్ ఏరియాలోని పటేల్ ఛాంబర్స్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఈ మంటలకు ఐదు అంతస్తుల భవనం ఓ వైపు కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది 18 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదని సమాచారం. దీంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు.
చీఫ్ ఫైర్ అఫీసర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది గాయపడినట్లు చెప్పారు. 16ఫైర్ ఇంజిన్స్, 11 ట్యాంకర్లతో 150 మంది ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చామన్నారు. బిల్డింగ్ మొత్తాన్ని ఖాళీ చేయించామని ఆయన తెలిపారు.కాగాప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment