ముంబైలో భారీ అగ్ని ప్రమాదం | fire accident in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం

Published Sun, Feb 11 2018 11:55 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

fire accident in mumbai

ముంబై : ముంబై నగరంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మన్‌‌ఖుర్ద్‌ ప్రాంతంలోని మాయాహోటల్‌ సమీపంలోని ఓ షాపులో భారీగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి  షాపులో మంటలు చెలరేగి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement