గుంటూరు: రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 16 మండలంలో తీవ్ర వడగాల్పు అలాగే 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11):
మన్యం జిల్లాలో 2 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 8మండలాలు, విజయనగరం వేపాడ మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(134):
శ్రీకాకుళం జిల్లా 17 మండలాలు, విజయనగరం జిల్లాలో -25, పార్వతీపురంమన్యం-11, అల్లూరిసీతారామరాజు-10, విశాఖపట్నం-3, అనకాపల్లి- 16, కాకినాడ- 10, కోనసీమ- 9, తూర్పుగోదావరి- 19, పశ్చిమగోదావరి- 4, ఏలూరు- 7, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో-2, పల్నాడు అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైనలస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment