
బిహార్ లో 153 కి చేరిన మృతుల సంఖ్య
పాట్నా: ఇటీవల కురిసిన భారీ వర్షాలుకు బిహార్ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల దాటికి ఆ రాష్ట్రం ఇప్పటికీ కోలుకోలేదు. ఈ రోజు తాజాగా నలుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 153 కి చేరిందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 34.69 లక్షల మంది వరద ముంపునకు గురయ్యారని తెలిపింది. గంగా , సోన్ , పున్ పున్ , గండక్ , ఘాఘ్రా , కోసీ నదులు ఉప్పొంగడం వల్ల రాష్ట్రంలోని 74 బ్లాకులు, 565 పంచాయతీలు, 2,037 గ్రామాల్లోని 34,69 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారని వెల్లడించింది. 544 రిలీఫ్ క్యాంపుల్లో 2.66 లక్షల మందికి ఆశ్రయం పొందుతున్నారని వివరించింది. 12 వరద బాధిత జిల్లాల నుంచి ఇప్పటి వరకు 4.97 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించింది.