
పునరావాస కేంద్రంలో ఆహార పదార్ధాలను పరిశీలిస్తున కలెక్టరు, ఎస్పీ
బందరువానిపేట: సమన్వయంతో సమష్టిగా పనిచేసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, సునామీ వంటి విపత్తులను ఎదుర్కొవచ్చని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. సముద్రతీర ప్రాంతమైన బందరువానిపేటలో బుధవారం ప్రకృతి విపత్తులకు సంబంధించి మాక్‌డ్రిల్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పశు సంపద, ఇతర జంతు సంపదను ఎలా రక్షించాలో...ఇందుకు అధికారులు ఏం చర్యలు తీసుకోవాలో సూచించారు.
ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకునే చర్యలకు సంబంధించి కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఏకకాలంలో పనులన్నీ ఏ విధంగా చేయాలో ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డీవో దయానిధితో పాటు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.