పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఏది?
విపత్తులు - ప్రాథమిక భావనలు
ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన విపత్తు అవుతుందా/ కాదా అనే విష యాన్ని నిర్ధారించాలంటే విపత్తు నిర్వ హణకు సంబంధించిన కొన్ని ప్రాథమిక భావనల గురించి తెలుసుకోవాలి. అవి..
1. వైపరీత్యం (Hazard)
2. దుర్బలత్వం (Vulnerability)
3. సామర్థ్యం (Capacity)
4. ఆపద (Risk)
వైపరీత్యం
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి నష్టాన్ని కలుగజేసే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలనే వైపరీత్యాలు అంటారు. 'Hasard’ అనే అరబిక్, Az-Zhar అనే ఫ్రెంచి పదాల నుంచి వైపరీత్యం (Haz-ard) అనే పదం వచ్చింది.
పైపరీత్యాలు అనేవి ప్రకృతి, మానవ చర్యల వల్ల లేదా రెండింటి వల్ల సంభ విస్తాయి. వైపరీత్యాలు సంభవించే కారణాల ఆధారంగా విపత్తులను కిందివిధంగా విభజించవచ్చు. అవి..
అ) భౌగోళిక వైపరీత్యాలు: ఇవి భూనిర్మాణం లో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తాయి. ఉదా: భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, భూపాతాలు, ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్నిప్రమాదాలు.
ఆ) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు: భూ వాతావరణంలో సంభవించే మా ర్పుల వల్ల ఏర్పడతాయి.
ఉదా: చక్రవాతాలు, టోర్నడోలు, వరదలు, కరువు, కుంభవృష్టి, భూపాతం, హిమ సంపాతాలు, వేడి, శీతల గాలులు.
ఇ) జీవసంబంధ వైపరీత్యాలు:
ఉదా: అంటు వ్యాధులు, తెగుళ్ల దాడులు, కలుషిత ఆహారం, సామూహిక జనహనన ఆయుధాలు.
ఈ) పర్యావరణ సంబంధిత వైపరీత్యాలు: ఉదా: పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత, ఎడారీకరణ.
ఉ) మానవ నిర్లక్ష్యం వల్ల ఏర్పడే వైపరీత్యాలు: పారిశ్రామిక దుర్ఘటనలు, అగ్ని ప్రమా దాలు, చమురు ప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రోడ్డు/ రైల్వే ప్రమాదాలు, భవ నాలు కూలిపోవడం, తొక్కిసలాటలు.
ఊ) సామాజిక- సహజ విపత్తులు: ఇవి ప్రకృతి పరమైన, మానవ ప్రేరేపిత కారణాలు రెం డింటి వల్ల ఏర్పడతాయి.
ఉదా: వరదలు, దుర్భిక్షం, భూపాతాలు.
వైపరీత్యాలు సంభవించే వేగం, ప్రభావ కాలం ఆధారంగా వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
1) Rapid-Onset Hazards: ఇవి అకస్మి కంగా సంభవిస్తాయి. వీటి ప్రభావం స్వల్పకాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఉదా: భూకంపాలు, సునామీలు,
వరదలు, చక్రవాతం, అగ్నిపర్వత విస్ఫోటనాలు.
2) low - Onset Hazards: ఇవి చాలా నెమ్మదిగా సంభవిస్తాయి. వీటి ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుంది.
ఉదా: పర్యావరణ క్షీణత, తెగుళ్ల దాడి, దుర్భిక్షం.
విపత్తు నిర్వహణపై 1999లో కె.సి. పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘అత్యున్నతాధి కారిక కమిటీ’ (High Powered Com-mittee) దేశంలోని వివిధ ప్రాంతాల్లో 31 రకాల వైపరీత్యాలను గుర్తించి, వాటిని 5 సబ్ గ్రూపులుగా విభజించింది. 2005లో ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ సంస్థ ‘వేడిగాలులను’ వైపరీత్యంగా పేర్కొనలేదు.అన్ని వైపరీత్యాలు విపత్తు రూపాన్ని పొందలేవు. కొన్ని మాత్రమే విపత్తు రూపాన్ని సంతరించుకుంటాయి. ఒక వైపరీత్యాన్ని విపత్తుగా గుర్తించాలంటే ఆ ప్రాంతంలో కింద తెలిపిన నష్టాలు జరిగి ఉండాలి. అవి..
1. ధన, ప్రాణ నష్టం అధికంగా ఉండాలి.
2. {పజల జీవనోపాధి దెబ్బతిని ఉండాలి.
3. ఆ ప్రాంత పర్యావరణ, సాంస్కృతిక వనరులు దెబ్బతిని ఉండాలి.
4. గాయాల బారిన పడినవారి సంఖ్య అధికంగా ఉండాలి.
5. వైపరీత్యం సంభవించిన ప్రాంతంలో జనాభా పరిమాణం, సాంద్రత అధికంగా ఉండాలి.
దుర్బలత్వం (Vulnerability)
ఏదైనా ఒకే భౌగోళిక ప్రాంతంలో సంభవించే వైపరీత్యం వల్ల అక్కడ ఉన్న సమాజంలో నష్ట తీవ్రతను పెంచే కారకాలనే ఆ ప్రాంత దుర్భ లత్వం అంటారు. ఉదా: 2001 గుజరాత్ లోని ‘భుజ్’ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా శివారు ప్రాంతాల్లో నివ సిస్తున్నవారి కంటే ఇరుకైన రోడ్లు, ఎత్తయిన, సురక్షితం కాని భవనాలు, అధిక జనసాంద్రత ఉన్న, నిరుపేదలు నివసిస్తున్న భుజ్ పాత నగరానికి చెందినవారే ఎక్కువ గాయపడ్డారు, మరణించారు. శివారు ప్రాంతాల ప్రజలు విశాలమైన రోడ్లను కలిగి ఉండటమే కాకుండా, జనసాంద్రత తక్కువగా ఉండి, ఒకటి లేదా రెండు అంతస్తుల భవనాలనే కలిగి ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో నష్ట తీవ్రత తక్కువగా ఉంది.
సామర్థ్యం (Capacity)
ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సంభవించే వైపరీత్యం వల్ల జరిగే నష్ట తీవ్రతను తట్టుకొని తిరిగి జీవనోపాధిని పునరుద్ధరించుకునే అవ కాశాలున్న ఒక సమాజం స్థితిని దాని సామర్థ్యంగా పేర్కొనవచ్చు.
ఉదా: రిక్టరు స్కేలుపై 6 తీవ్రత ఉన్న భూకంపం మురికివాడలో సంభవించినప్పుడు ప్రాణనష్టం, గాయాల బారిన పడినవారి సంఖ్య, జీవనోపాధిని పునరుద్ధరించుకోలేని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అక్కడి సమాజానికి దుర్బల పరిస్థితుల నుంచి కోలుకునే సామర్థ్యం తక్కువగా ఉండటమే దీనికి కారణం. అదే బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత ఉన్న భూకంపం సంభవించినా నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది. దీనికి కారణం అక్కడ పేదరికం, బలహీనమైన ఇళ్లు, ఇరుకైన రోడ్లు లాంటి దుర్బల పరిస్థితులు లేకపోవడం. అంటే ఈ ప్రాంతానికి దుర్బలత్వాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంది అని అర్థం.
ఆపద (లేదా) విపత్కర స్థితి (Risk)
వైపరీత్యాలు, దుర్బల పరిస్థితుల మధ్య పరస్ప ర చర్యల కారణంగా ఒక సమాజ ఆర్థిక కార్య కలాపాల్లో అంతరాయం, పర్యావరణ క్షీణతతో పాటు మరణాలు, గాయాలు, ఆస్తి, జీవ నోపాధి దెబ్బతినడం లాంటి పర్యవసానాలు జరిగే సంభావ్యతనే ఆపద అంటారు. దీన్ని కిందవిధంగా వ్యక్తపరచవచ్చు.