Civils Prelims
-
అక్టోబర్ 10న సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తదితర అత్యున్నత స్థాయి పోస్టులకు అర్హుల ఎంపికకు సంబంధించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. ఈ పరీక్షను జూలై 27వ తేదీన నిర్వహించాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మూడు నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్ 10న నిర్వహిస్తోంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీశాట్‌గా ఉదయం, మధ్యాహ్నం ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి పట్టణాల్లో 68 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు వివిధ పరిశీలన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేయనున్నారు. బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఇతర వస్తువులు వేటినీ లోపలకు అనుమతించరు. కోవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేకపోతున్న కారణంగా వయోపరిమితి దాటిపోయే అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూపీఎస్సీ వారికి ఈ సారి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 400 మార్కులకు ఉంటుంది. పేపర్, పెన్ను (ఆఫ్‌లైన్ మోడ్)లతో ఈ పరీక్షలు జరుగుతాయి. నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.66 మార్కు కోతపడుతుంది. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆది వారం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ–2020 పరీక్ష జరుగ నుంది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ కేంద్రా లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్ సూపర్వైజర్ శ్వేతా మహంతి తెలిపారు. అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 99 లోకల్ ఇన్స్పెక్షన్ అధికారులు, 34 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. నిబంధనలివీ... మాస్కులు ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తారు. అడ్మిట్ కార్డుతోపాటు గుర్తింపు కార్డు తప్పని సరి. ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. పర్సులు, వాచ్, మొబైల్ ఫోన్స్, పెన్‌డ్రైవ్, కాలుక్యులేటర్లు, ఇతర రికార్డింగ్ పరికరాలు అనుమతించరు. హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు అనుమతి. -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఐడీ ప్రూఫ్‌గా ఆధార్
న్యూఢిల్లీ: వచ్చేనెల 18న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో ఫొటో సరిగ్గా లేనట్లయితే గుర్తింపు కార్డుగా ఆధార్‌ను కూడా తీసుకురావచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఎన్నికల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని గుర్తింపు కార్డుగా తీసుకురావచ్చని తెలిపింది. వీటితో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా తప్పనిసరిగా తీసుకు రావాలని యూపీఎస్సీ పేర్కొంది. -
సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ
సివిల్స్ ప్రిలిమ్స్-2014 పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 9,45,000 మంది దరఖాస్తు చేయగా.. నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 వేల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఎలా ఉంది? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏయే విభాగాల్లో ప్రశ్నలు పెరిగాయి? ఎన్ని మార్కులు సాధించినవారు మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ.. పేపర్-1 (ప్రశ్నల సంఖ్య- 100, మార్కులు- 200) కరెంట్ అఫైర్స్, జీకే.. ప్రశ్నలు సులువే: పేపర్-1లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌ల నుంచి 10 ప్రశ్నలు అడిగారు. జీకే నుంచి 7 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో ప్రశ్నలు ఎక్కువే. గతేడాది ప్రిలిమినరీలో జీకే నుంచి కేవలం నాలుగు ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. వర్తమాన వ్యవహారాల నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ఈ ఏడాది కొన్ని జీకే ప్రశ్నలను నేరుగా అడిగారు. ఉదాహరణకు సత్యమేవ జయతేను ఏ ఉపనిషత్ నుంచి సంగ్రహించారు? (సమాధానం: ముండక ఉపనిషత్). కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ప్రాచీన భాషలుగా ప్రభుత్వం గుర్తించిన భాషలు? (సమాధానం: కన్నడం, తెలుగు). అదేవిధంగా కొన్ని ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంది. ఉదా: ఆర్కిటిక్ కౌన్సిల్‌లోని సభ్యదేశాలు? అగ్ని క్షిపణి, బ్రిక్స్ సదస్సు, ఇటీవల వార్తల్లోకెక్కిన ప్రాంతాలు ఏయే దేశాల్లో ఉన్నాయి? వంటి ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు గుర్తించవచ్చు. జాగ్రఫీ.. ఎకాలజీకి పెరిగిన ప్రాధాన్యత: జాగ్రఫీలో గతేడాది దాదాపు 21 ప్రశ్నలు రాగా.. ఈ ఏడాది 20కు పైగా ప్రశ్నలు ఇచ్చారు. ఈ ఏడాది ఎకాలజీ సంబంధిత ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలను ఎకాలజీ నుంచే అడిగారు. గతేడాది ప్రశ్నలన్నీ కాంటెంపరరీగా ఉండగా.. ఈ ఏడాది ఇచ్చిన ప్రశ్నలు సివిల్ స్థాయికి తగినట్లు లేవు. కాంటెంపరరీ అంశాలపై ప్రశ్నలు తగ్గించారు. అంతగా ప్రాధాన్యం లేని అంశాలు, ప్రస్తుతం వార్తాపత్రికలు, చర్చల్లో లేని అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. ఉదాహరణకు జాతీయ రహదారులు, పర్వత ప్రాంతాలు ఎక్కడున్నాయి అనే ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్స్‌ను పరిశీలిస్తే.. ఆప్షన్స్ మరీ సూక్ష్మంగా ఉన్నాయి. అన్నింటి గురించి తెలిస్తేనే కానీ అభ్యర్థి సమాధానాలు గుర్తించలేడు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థిలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలకు పదునుపెట్టేలా ఉంటే మరికొన్ని ప్రశ్నలు మంచి నాలెడ్జ్ ఉన్న అభ్యర్థి కూడా ఆన్సర్ చేయలేని విధంగా ఉన్నాయి. వర్తమాన అంశాలపై అతి తక్కువ ప్రశ్నలు అడిగారు. ఉదా: పేపర్-1లో చెచెన్యా, డార్ఫర్, స్వాత్ లోయ అనే ప్రాంతాలు.. వాటికి ఎదురుగా రష్యన్ ఫెడరేషన్, మాలి, ఇరాక్లను ఇచ్చి జతపరచమని అడిగారు. దీనికి ఎవరైనా సమాధానం గుర్తించవచ్చు. రీజనింగ్, సమాచారం, విశ్లేషణాత్మక నైఫుణ్యాలను పరిశీలించేలా ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదా: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న నదులేవి? అనే ప్రశ్న. కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి? హిమాలయాల్లో ప్రయాణించేటప్పుడు సహజంగా కనిపించే వృక్షాలు ఏవి? అనే ప్రశ్నలు. వీటికి ఇచ్చిన ఆప్షన్స్‌ను కొంచెం పరిశీలించి ఆలోచిస్తే సమాధానంగా తేలికగా గుర్తించవచ్చు. ఎకానమీ.. గతేడాదితో పోలిస్తే తగ్గిన ప్రశ్నలు: 2013 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో ఎకానమీకి సంబంధించి 19 ప్రశ్నలు ఇవ్వగా.. ఈ ఏడాది 14 ప్రశ్నలు ఇచ్చారు. రెండు ప్రశ్నపత్రాల్లోనూ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, ప్రణాళికలు, పబ్లిక్ ఫైనాన్స్, జనాభా, ద్రవ్యోల్బణం, ద్రవ్యం, జాతీయాదాయం, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. కాగా ఈ ఏడాది ప్లానింగ్, అభివృద్ధి కార్యక్రమాలు, ఐఎంఎఫ్, పబ్లిక్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, విదేశీ వాణిజ్యం ప్రధాన అంశాలుగా ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 14 ప్రశ్నల్లో బ్యాంకింగ్ రంగం నుంచి ఐదు ప్రశ్నలు రాగా.. ప్రణాళికల నుంచి రెండు ప్రశ్నలు, అభివృద్ధి కార్యక్రమాలపై రెండు ప్రశ్నలు, బడ్జెట్, పన్నుల వ్యవస్థ, స్టాక్ మార్కెట్, ఐఎంఎఫ్, విదేశీ వాణిజ్యంలాంటి అంశాలపై ఒక్కొక్క ప్రశ్న వచ్చాయి. బ్యాంకింగ్ రంగంపై కరెంట్ అఫైర్స్‌లో భాగంగా బ్రిక్స్ బ్యాంక్ లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి అంశానికి సంబంధించిన కాన్సెప్ట్స్‌పై పూర్తి అవగాహనతో ఆయా కాన్సెప్ట్‌ల అప్లికేషన్స్‌పై అధ్యయనం చేసిన వారు ఎకానమీలో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. జనరల్ సైన్స్.. పర్యావరణానికి పెరిగిన ప్రాధాన్యత: పేపర్-1లో ముఖ్యంగా పర్యావరణం నుంచి 15 ప్రశ్నలు, జీవ శాస్త్రం నుంచి 10 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నలు అడిగారు. గతేడాదితో పోలిస్తే పర్యావరణం, బయాలజీల నుంచి ప్రశ్నలు పెరిగాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి బాగా తగ్గాయి. పర్యావరణం విభాగంలోని ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ సంరక్షణ కార్యక్రమాలు, చట్టాలు, చట్టాల పరిధికి ఉద్దేశించినవి. మరికొన్ని ప్రశ్నలను సంరక్షణ చర్యల ఆధారంగా అడిగారు. బయోస్ఫియర్ రిజర్వ్, అంతర్జాతీయ కార్యక్రమాలు, ఒప్పందాలు, జీవవైవిధ్య పరిరక్షణ మొదలైనవాటి గురించి ప్రశ్నలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా చిత్తడి నేలలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వులు వంటివాటిపై కూడా 5 - 6 ప్రశ్నలు అడిగారు. విస్తృత సమాచార సేకరణ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. అంతరించిపోతున్న, ప్రమాదం ఎదుర్కొంటున్న జంతు జాతులపై ప్రతిసారీ ప్రశ్నలు వస్తున్నాయి. గత పరీక్షలో రాబందులపై ప్రశ్న ఇచ్చారు. ఈసారి డాల్ఫిన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్న అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అంశాలైన అగ్ని - 4, అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాలు, నానో టెక్నాలజీలపై ప్రశ్నలు వచ్చాయి. చరిత్ర.. ప్రాచీన చరిత్రపై అధిక ప్రశ్నలు: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు పెరిగాయి. గతంలో 13 నుంచి 15 ప్రశ్నలు వరకు వచ్చేవి. అవి కూడా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమం నుంచి ఎక్కువగా ఇచ్చేవారు. ఈ ఏడాది చరిత్ర నుంచి 20 ప్రశ్నలు అడిగారు. ప్రాచీన భారతదేశం నుంచి 10 ప్రశ్నలు, మధ్యయుగం నుంచి 3 ప్రశ్నలు, ఆధునిక యుగం నుంచి 4 ప్రశ్నలు, స్వాతంత్య్రోద్యమం నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. చరిత్ర సిలబస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక దశలు, భారత స్వాతంత్య్రోద్యమం ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ప్రాచీన, మధ్య యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావని, వాటికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదని భావించారు. ఎక్కువగా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమంపైనే దృష్టి సారించారు. అయితే ప్రాచీన చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్న లు వచ్చాయి. మొత్తం మీద చరిత్రలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రశ్నలు లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. పాలిటీ: జనరల్ స్టడీస్‌లో పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధాన అంశాల నుంచి కాకుండా.. అంతగా ఊహించని అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా: అభ్యర్థి సాధారణంగా వివిధ కమిటీలు, చైర్మన్లు వంటి అంశాలను చదువుతారు. అయితే ఏ కమిటీలో ఎక్కువ మంది సభ్యులున్నారు? అనే ప్రశ్న ఇచ్చారు. పాలిటీ నుంచి దాదాపు 8 ప్రశ్నల వరకు వచ్చాయి. గతేడాది కూడా ఇదే సంఖ్యలో ప్రశ్నలు అడిగారు. స్థానిక స్వపరిపాలన సంస్థలపై ఎలాంటి ప్రశ్నలు లేవు. అంతర్జాతీయ సంబంధాలపై బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే ఇచ్చారు. ప్రత్యేకంగా ఒక విభాగంపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు, పార్లమెంట్.. ఇలా వివిధ అంశాలపై ఒక్కొక్క ప్రశ్న అడిగారు. ఈ ఏడాది పేపర్ -1 (200 మార్కులు), పేపర్- 2 (ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌కు కేటాయించిన 15 మార్కులు మినహాయించి మిగిలిన 185 మార్కులు)లు కలిపి మొత్తం 385 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 230 మార్కులు సాధిస్తే.. మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశముందని నిపుణుల అంచనా. ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే కటాఫ్ మరింత తగ్గినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు.పేపర్-1లో బాగా తెలివైన అభ్యర్థి 70 నుంచి 80 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి 150 మార్కులు సాధించొచ్చు.బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి పేపర్- 2లో 185 మార్కులకుగాను 115 నుంచి 120 వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. గతేడాది ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కటాఫ్ - 241. పేపర్-2 (ప్రశ్నలు 74, మార్కులు 185, వ్యవధి: రెండు గంటలు) డెసిషన్ మేకింగ్ నుంచి ప్రశ్నలు లేవు ఇటీవల పేపర్-2 గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. వివాదానికి కారణమైన రెండో పేపర్లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే గతంలో మాదిరిగానే 80 ప్రశ్నలు ఇచ్చారు. సివిల్స్ సిలబస్ ప్రకారం డెసిషన్ మేకింగ్ అనే అంశం నుంచి వచ్చే ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. గతేడాది ఈ అంశం నుంచి ఆరు ప్రశ్నలు (15 మార్కులకు) వచ్చాయి. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క ప్రశ్న కూడా డెసిషన్ మేకింగ్ నుంచి రాలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అంశం నుంచి వచ్చిన ఆరు ప్రశ్నలను యూపీఎస్సీ తొలగించింది. ఈ విషయాన్ని పరీక్షకు ముందే యూపీఎస్సీ తెలిపింది. అంటే రెండో పేపర్లో 80 ప్రశ్నలకుగాను 74 ప్రశ్నలు (185 మార్కులు) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 74 ప్రశ్నల్లో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 26 ప్రశ్నలు, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, బేసిక్ న్యూమరసీ నుంచి 18 ప్రశ్నలు అడిగారు. 74 ప్రశ్నల్లో 48 ప్రశ్నలు చాలా సులువుగానూ, 14 ప్రశ్నలు మధ్యస్తంగానూ, 12 ప్రశ్నలు కఠినంగానూ ఉన్నాయి. ఈ పేపర్లో అంశాలవారీగా వచ్చిన ప్రశ్నల సంఖ్యను ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. బేసిక్ న్యూమరసీ 1. నంబర్స్ 4 2. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ 3 3. రేషియోష్ ప్రొపర్షన్ ఈక్వేషన్స్ 1 4. టైమ్ అండ్ డిస్టెన్స్ 2 5. సింపుల్ ఇంట్రెస్ట్ 1 6. డేటా ఇంటర్‌ప్రిటేషన్ 6 7. మిస్లేనియస్ 1 మొత్తం 18 -
ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌పై యూపీఎస్సీ ప్రకటన సివిల్స్ ప్రిలిమ్స్ 2014కు సర్వం సిద్ధం పరీక్షకు హాజరుకానున్న 60 వేలకుపైగా తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు.. ఇంగ్లిష్ మీడియం ప్రశ్నలపై ఆగ్రహావేశాలు.. వెరసి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలను తదుపరి దశ మెయిన్స్‌కు మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లోని ఈ విభాగం ప్రశ్నలను అసలు అటెంప్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2014కు సర్వం సిద్ధమైంది. మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఇలా: మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చేసిన యూపీఎస్సీ.. మెరిట్ జాబితా విషయంలో నిర్దిష్ట విధానాలను ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ ఒక్కో పేపర్ 200 మార్కులకు చొప్పున రెండు పేపర్లు మొత్తం 400 మార్కులకు జరుగుతుంది. ఇందులో 200 మార్కులకు నిర్వహించే పేపర్-1లో పొందే మార్కులు.. అదే విధంగా మరో 200 మార్కులకు జరిగే పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలకు(ఇంగ్లిష్‌లో మాత్రమే ముద్రితమై ఉంటాయి) కేటాయించిన మార్కులను మినహాయించగా పొందిన మొత్తం మార్కుల సగటు ఆధారంగా మెయిన్స్‌కు అర్హుల జాబితాను రూపొందించనుంది. ఆ మినహాయింపుపై భిన్నాభిప్రాయాలు: పేపర్-2లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి అడిగే ప్రశ్నలను అటెంప్ట్ చేయొద్దని, ఈ విభాగానికి కేటాయించిన మార్కులను మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హిందీయేతర, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. 8 నుంచి 9 ప్రశ్నలతో దాదాపు 22 మార్కులకు అడిగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని అటెంప్ట్ చేయొద్దనే ప్రకటనతో.. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తాము మెరుగైన మార్కులు సాధించే అవకాశం కోల్పోయామని నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, న్యూమరికల్ స్కిల్స్ వంటి మ్యాథమెటిక్స్ విభాగాలను కష్టంగా భావించే అభ్యర్థులు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లోనైనా మార్కులు సాధించొచ్చనే ఉద్దేశంతో ఉంటారని.. తాజా నిర్ణయం వారికి అశనిపాతంగా మారిందని పలువురి అభిప్రాయం. హైదరాబాద్‌లో 38వేల మందికిపైగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 62, 247 మంది తెలుగు అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక పరీక్ష కేంద్రం హైదరాబాద్ నుంచి 38, 098 మంది హాజరు కానుండటం గమనార్హం. గతేడాది 38, 982 మంది హైదరాబాద్‌ను సెంటర్‌గా ఎంపిక చేసుకున్నారు. కొత్తగా ఏపీలో విజయవాడ: గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష కేంద్రాలు ఉండేవి. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో కొత్తగా విజయవాడలోనూ పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిసారే ఈ నగరంలో 31 సెంటర్లలో మొత్తం 14, 640 మంది అభ్యర్థులు హాజరవుతుండటం గమనార్హం. ఇదే సమయంలో విశాఖపట్నం కేంద్రంలో అభ్యర్థుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే తగ్గింది. ఈ నగరంలో మొత్తం 1,710 మంది అభ్యర్థుల కోసం ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం ఈ సంఖ్య 7754. గతంలో విజయవాడ కేంద్రంగా లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా మొదలు గుంటూరు వరకు అభ్యర్థులకు విశాఖపట్నం మాత్రమే అవకాశంగా ఉండేది. తిరుపతి కేంద్రంలో మొత్తం 7,796 మంది అభ్యర్థులు హాజరవనున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని రద్దు చేయడం వల్ల ఆ విభాగంలో మార్కులు సాధించాలనుకునే అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారనడంలో సందేహం లేదు. కానీ.. పరీక్షకు అంతా సిద్ధమైంది. కాబట్టి విద్యార్థులు పరీక్ష హాల్లో సరైన సమయ పాలన పాటించాలి. వాస్తవానికి ఇప్పటి వరకు పేపర్-2లో అభ్యర్థులకు ఒక్కో ప్రశ్నకు సగటున 70 సెకన్ల సమయం అందుబాటులో ఉండేది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ప్రశ్నల రద్దు నేపథ్యంలో ఆ సమయాన్ని ఇతర విభాగాలకు బదిలీ చేసుకుని సరైన సమయ పాలన పాటించాలి. కాసింత పరిశీలన దృక్పథం, తార్కిక విశ్లేషణతో సమాధానాలు రాబట్టగలిగే డెసిషన్ మేకింగ్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కూడా కొద్దిపాటి పరిశీలనతో సులభంగా సమాధానాలు ఇవ్వొచ్చు. అదే విధంగా పేపర్-1 జనరల్ స్టడీస్‌లోనూ సమయ పాలన కీలకం. సగటున ఒక్కో ప్రశ్నను 90 సెకన్లలో సమాధానం ఇచ్చే విధంగా వ్యవహరించాలి. చాలా మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు.. మొదటి పేపర్ తర్వాత తాము సరిగా రాయలేదనో లేదా మరో ఛాన్స్ ఉంది కదా.. అనే ఆలోచనలతో రెండో పేపర్‌కు గైర్హాజరవుతున్నారు. ఇది సరికాదు. ఒక్క పేపర్ రాసినా.. రెండు పేపర్లు రాసినా అందుబాటులోని అటెంప్ట్‌లలో ఒకటి కోల్పోయినట్లే. ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా.. ఆశావాహ దృక్పథంతో పరీక్ష హాల్లో అడుగు పెట్టాలి. ఆర్. సి. రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
ఎవరు తప్పక ఎంచుకోవాలి?
Civils Prelims CSAT - Model Questions Examine the given statements and find out which conclusion/ conclusions are logically valid. 1. Statements: Some chocolates are tasty All tasty are costly People tend to buy costly items. Conclusions: I. Some people tend to buy chocolates II. All costly are tasty a) Only I follows b) Only II follows c) Both follow d) None of these 2. Statements: Buses are generally air conditioned All buses are not comfortable for travelling Conclusions: I. Some buses are air conditioned II. Some air conditioned are buses III. No bus is comfortable for travelling IV. Some buses are not comfortable for travelling a) Only I follows b) Only II follows c) I, II and IV follow d) None of these 3. Statements: A. 'The adventures of TinTin' is a story book B. Many story books are interesting C. A few interesting things are costly D. Not a single costly one is without publicity Conclusions: I. Some story books are interesting II. All story books may be interesting III. 'The adventures of TinTin' could be an interesting story book IV. Some costly are interesting V. All costly ones are with publicity a) I, II, IV and V are valid b) I, II and IV are valid c) All are valid d) None of these 4. Statements: Each of us earns money All (of us) can do productive work Productive work always earn money Conclusions: I. People, by and large, can do productive work II. Only productive work earns money III. If a person does productive work he earns money a) Only I and III are valid b) Only III and IV are valid c) Can't be determined d) All are valid 5. Statements: Some movies are entertaining Some entertaining are costly Some costly are Luxurious Some Luxurious are inaccessible Rajesh purchases all costly things Conclusions: 1. Some inaccessible can be entertaining 2. Some Luxurious can be entertaining 3. Rajesh must be purchasing some of those which are entertaining as well as some which are luxurious. a) Only 1 is valid b) Only 2 is valid c) All are valid d) None follows 6. Statements: All machines consume energy Electricity provides energy Electrically operated machines are cheap to maintain Electrically operated machines do not cause pollution. Which one of the following inferences can be drawn from the above statements? a) All machines are run by electric energy. b) There is no form of energy other than electricity c) Most machines are operated on electric energy. d) Electrically operated machi- nes are preferable to use. 7. Statements: None but the hardworking will be successful Some of those who are successful become rich Some of those who become rich require people to work under them. Which one of the following conclusions can be drawn from the above statements? a) All the hardworking are successful b) Those who are successful become rich c) All the hardworking become rich d) All those who are successful are hardworking 8. Statements: All government employees stationed in the city are salaried employees Some of them have residential quarters All government employees appointed after the state formation have residential quarters are stationed in the city All those who are employed are not government employees Which one of the following conclusions can be drawn from the above statements? a) Only salaried employees are stationed in the city b) Some salaried government employees with residential quarters are stationed in the city c) Employees other than that of government employees cannot have residential quarters d) Most of the government employees appointed are before the state formation. 9. Statements: 1. All children are the manifestation of god 2. Some children are naughty 3. Hyperactive people are prone to become naughty From the above three statements it may be concluded that a) Children are hyperactive b) Some naughty children are the manifestation of god c) All hyperactive persons are naughty d) Some hyperactive persons are the manifestations of god 10. Statements: Only those students who have mathematics in their intermediate are eligible to become engineering graduates Some engineering graduates are software professionals Those who are software professionals can work with multinational companies Which of the following conclusions can be drawn from the above statements? a) All those who have mathematics in their intermediate are engineering graduates b) All engineering graduates have mathematics in their intermediate. c) All those who work with multinational companies are engineering graduates. d) No conclusion can be drawn. 11. Statements: 1. Only good singers can participate in the competition 2. Some participants in the competition are classical singers 3. All classical singers in the competition are invited for orientation programme Which one of the following conclusions can be drawn from the above statements? a) All participants in the competition are invited for orientation programme b) All good singers are invited for orientation programme c) All participants in the competition are good singers. d) None of the statements (a), (b) and (c) given above is correct. Directions (Questions 12-13): Each of the following two items consists of four statements. Of these four statements, two cannot both be true, but both can be false. Study the statements carefully and identify the two that satisfy the above condition. Select the correct answer using the codes given below each set of statements: 12. Examine the following statements: All chairs are plastic Some chairs are not plastic Chairs are not plastic Some chairs are plastic Codes: a) 1 and 3 b) 1 and 2 c) 2 and 3 d) 3 and 4 13. Examine the following statements: 1. All children are motivated by inspiring stories 2. Some children are motivated by inspring stories 3. No child is motivated by inspiring stories 4. Some children are not motivated by inspiring stories Codes: a) 1 and 3 b) 1 and 2 c) 2 and 3 d) 3 and 4 14. Directions: Each of the following two items consists of four statements. Of these four statements, two statements can be true simultaneously. Study the statements carefully and identify the two that satisfy the above condition. Select the correct answer using the codes given below each set of statements: 1. All P's are Q's 2. Some P's are Q's 3. No P is Q 4. Some P's are not Q's Codes: a) 3 and 4 b) 1 and 2 c) 2 and 4 d) All of the above Directions (Q. 15-17): A three member team needs to be formed in a school for the selection of Head Boy and Head Girl. Selection for the team members needs to be made from among three boys, B1, B2 and B3 and three girls viz G1, G2 and G3. Following rules have to be considered: 1. If B3 is selected, G3 must be selected 2. If B1 is selected, B2 cannot be selected 3. If either B3 or G2 is selected then the other one should also be selected 4. The committee should have at least one boy and one girl. 15. If girls are required in majority, who must be selected? a) B3 b) G1 c) G2 d) G3 16. If B1 and G3 are selected, which of the following is true? a) B3 is also selected b) G1 is not selected c) Boys are in majority d) Girls are in majority 17. If four members need to be selected, which of the following is true? a) If B1 is selected, G3 must also be selected b) If B2 is selected, G1 must also be selected c) If B3 is selected, B1 must also be selected d) If G3 is selected, G1 must also be selected 18. Statements: 1. People watch movies regularly whether they are interesting or not. 2. I try to find out which movies are interesting. 3. If Movie is interesting, then i watch it. Conclusions: a) I watched the movie means it is interesting b) The Movie is interesting; hence I watch it c) I did not watch the movie, though it was interesting d) I did not watch the movie implies that it was not interesting. a) b and d b) Only d c) Only b d) Only a 19. Statements: Ice cream parlours are crowded during sunny days. Whenever it is a sunny day, people like ice cream Conclusions: a) It is a sunny day hence people like ice cream b) People did not like ice cream implies it is not a sunny day c) It is a sunny day but people did not like ice cream d) Both a and b 20. Statements: I like both coffee and tea. Both X and Y are my friends. Either X prepares coffee for me or Y offers tea to me. Conclusions: a) X did not prepare coffee means Y will offer tea b) Y did not offer tea hence X prepared coffee c) X is preparing coffee hence Y has offered tea d) Y did not offer tea implies that X did not prepare coffee a) a and b b) Only b c) Only c d) None is correct -
వారికి మరోసారి అవకాశం
ఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) వివాదంపై రాజ్యసభలో ఈరోజు ప్రభుత్వం స్పందించింది. 2011లో పరీక్ష రాసిన విద్యార్థులకు మరోసారి అవకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ అభ్యర్థులు 2015లో మరోసారి పరీక్ష రాయవచ్చని ప్రకటించింది. ఇంగ్లీష్ పరీక్షను అర్హత వరకే పరిగణిస్తామని తెలిపింది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సీశాట్ పేపర్-2ను మార్చాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయసభలో ఈ అంశంపై విపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని గతంలో హామీ ఇచ్చింది. త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. చివరకు వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం ఇస్తామని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్షలో(ప్రిలిమినరీ) భాగంగా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ టెస్ట్(సీశాట్) పేపర్ వల్ల తెలుగు మీడియం, ఇతర ప్రాంతీయ మాధ్యమాల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ప్రిలిమ్స్‌లో 200 మార్కులకు నిర్వహించే సీశాట్ పేపర్లో ఆంగ్లం, గణితం చదివిన అభ్యర్థులే ఉత్తీర్ణులవుతున్నారని, గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమంలో చదివినవారు ఉత్తీర్ణులు కాలేకపోతున్నారని వారు తెలిపారు. -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు ఎలా?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ప్రశ్న: సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి? - ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.ఆర్.నగర్ సివిల్స్ ప్రిలిమ్స్ చరిత్రలో ప్రాచీన భారతదేశం నుంచి మూడు నుంచి ఐదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన పురావస్తు ప్రాంతాలు, బయటపడిన కట్టడాలు, పరికరాలు, సింధూ నాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవలు లాంటి అంశాలపై దృష్టి సారించాలి. మధ్య యుగంలో సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్య్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతర పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు నుంచి నాలుగేళ్ల పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థం అవుతుంది. ఉదాహరణకు 2008 సివిల్స్‌లో అడిగిన కింది ప్రశ్నను గమనించండి. ప్రశ్న: కిందివాటిని జతపర్చండి. LIST - 1 LIST - 2 సూఫీమతం నాయకులు ఎ) చిస్తీ సిల్సిలా 1) షేక్ అహ్మద్ షేర్‌హింద్ బి) నక్షబంది సిల్సిలా 2) షేక్ బహ్రూద్దీన్ జకారియా సి) ఖాద్రీ సిల్సిలా 3) షేక్ హమీదుద్దీన్ డి) సౌహాద్రి సిల్సిలా 4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలానీ 1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-1, బి-4, సి-3, డి-2 3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-1, బి-3, సి-4, డి-2 సమాధానం: 3 1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్న వారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అదేవిధంగా గాంధీయుగం నుంచి గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధాన్యత, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు?, దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్య పుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్‌గా రాసుకోవాలి. అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. సివిల్ సర్వీసెస్; కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/స్లెట్ గత పరీక్షల ప్రశ్నపత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే. ఇన్పుట్స్: డాక్టర్ పి.మురళి, సీనియర్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్, హైదరాబాద్. జనరల్ నాలెడ్‌జ: అంతరిక్ష రంగంలో మైలురాళ్లు - మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం - స్పుత్నిక్ -1 (1957లో రష్యా ప్రయోగించింది) - అంతరిక్షంలోకి పంపిన కుక్కపిల్ల పేరు -లైకా (1957, స్పుత్నిక్-2 నౌక ద్వారా) - అంతరిక్షంలోకి అమెరికా పంపిన మొదటి ఉపగ్రహం-ఎక్స్‌ప్లోరర్ (1958 అమెరికా) - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)ను ఏర్పాటు చేసిన సం॥ - మొదటి అంతరిక్ష యాత్రికుడు-యూరి గగారిన్, రష్యా (1961లో వోస్తోక్-1 అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించాడు) మన జాతీయ పతాకం - తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య (విజయవాడ) రూపొందించిన జాతీయ పతాక నమూనాను ప్రదర్శించారు. - 3:2 (పొడవు: వెడల్పు) నిడివిగల జాతీయ పతాకంలో కాషాయం రంగు- ధైర్యానికి, త్యాగానికి; తెలుపు రంగు - శాంతి, సత్యానికి; ఆకుపచ్చ రంగు - విశ్వాసానికి చిహ్నాలుగా గుర్తించారు. - పతాకం మధ్యలో తెలుపు రంగుపై మొదట మహాత్మాగాంధీ సూచించిన చరఖా ఉండేది. తరువాత దీని స్థానంలో ముదురు నీలిరంగు (నేవీ బ్లూ)లో గల అశోకుని ధర్మచక్రం ఎంచుకున్నారు. దీన్ని సారనాథ్‌లోని అశోక స్తంభం నుంచి గ్రహించారు. ఈ అశోక చక్రం ప్రాచీన సంస్కృతికి చిహ్నం. - జాతీయ పతాకాన్ని 1947, జూలై 22న ఆమోదించారు. - జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగురవేయడానికి వీలుగా జనవరి 26, 2002 నుంచి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా - 2002’ అమల్లోకి వచ్చింది. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) - {పధాన లక్ష్యం: వేగవంతమైన, సుస్థిర, మరింత సమ్మిళిత వృద్ధి. వృద్ధి లక్ష్యాలు - సగటు వార్షిక వృద్ధి: - ఆర్థిక వ్యవస్థ: 8 శాతం - వ్యవసాయ రంగం: 4 శాతం - పారిశ్రామిక రంగం: 9 శాతం - సేవా రంగం: 10 శాతం - ఇతర లక్ష్యాలు/అంచనాలు: స్థూల దేశీయోత్పత్తిలో పెట్టుబడి 37 శాతం, స్థూల దేశీయోత్పత్తిలో పొదుపు 34.2 శాతం. - వనరులు: రూ. 80,50,123 కోట్లు. -
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను. ఎకానమీలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? -ఎస్.కిశోర్, కోఠి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రిలిమ్స్‌లో ఎకానమీ నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. ఉపాధి, పంచవర్ష, వార్షిక ప్రణాళికలు, ద్రవ్యం, బ్యాంకింగ్, వ్యవసాయం, ప్రభుత్వ విత్తం, జ నాభా, పేదరికం, విదేశీ వాణిజ్యం, అవస్థాపనా సౌకర్యాలు వంటివి పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్. ప్రశ్నలు ఈ అంశాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని గమనిస్తే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయి. కాబట్టి ఎకానమీకి సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ ఆరో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. గతేడాది ప్రిలిమ్స్‌లో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. కాబట్టి అభ్యర్థులు ఆర్థిక నివేదికలు, వ్యవసాయం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్, జాతీయాదాయం, యూఎన్డీపీ నివేదిక, 12వ పంచవర్ష ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం - బ్యాంకింగ్, సుస్థిర అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. కార్పొరేట్ గవర్నెన్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ - కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు, కరెంట్ అకౌంట్ లోటు వంటివి కూడా ముఖ్యమైనవే. ప్రిపరేషన్లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌కు అన్వయించి చదువుకోవాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతిరోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి స్వీయ పరీక్షను నిర్వహించుకోవాలి. ఇన్పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్): 13 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4 హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్): 10 ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: http://itbpolice.nic.in సీటెట్ - సెప్టెంబరు 2014 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సెప్టెంబరు 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014 పేపర్ - 1 (ఒకటి నుంచి ఐదో తరగతి) అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/ఇంటర్ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. పేపర్ - 2 (ఆరు నుంచి ఎనిమిది తరగతులు) అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీఎడ్/ డీఎడ్/ బీఈఎల్ఎడ్ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 పరీక్ష తేది: సెప్టెంబరు 21, వెబ్సైట్: www.ctet.nic.in సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్ అర్హతలు: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 వెబ్సైట్: http://www.cdachyd.in/ -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?
భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఈ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి.? - వినోద్‌కుమార్‌రెడ్డి, అంబర్‌పేట కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ చాప్టర్ నుంచి కచ్చితంగా మూడు; నాలుగు ప్రశ్నలు వస్తున్నాయి. ఎక్కువగా ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు అడుగుతున్నారు. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలన్నీ బహుళ సమాధానాలతో కూడినవి అంటే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?లాంటి ప్రశ్నలు. ప్రాథమిక అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి రాజ్యాంగ రచనను ప్రభావితం చేసిన చారిత్రక సంఘటనలు(చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు), రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల సంఖ్య, సమావేశాలు, కమిటీలు, రాజ్యాంగ ఆధారాలు, తీర్మానాలు లాంటి విషయ సంబంధమైన సమాచారంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రాథమిక అంశాలను నోట్స్‌గా రాసుకున్న తర్వాత విస్తృత సమాచారం కోసం రిఫరెన్స్ పుస్తకాలను చదవొచ్చు. ఈ చాప్టర్లో విషయ సంబంధిత సమాచారమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటే అంకెలతో కూడిన సమాచారాన్ని(భాగాలు, ప్రకరణలు, అంశాలు) సులువుగా గుర్తుంచుకోవచ్చు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు పరిపాలన ఏ ప్రాతిపదికన జరిగింది? అంటే 1935 చట్టం ప్రకారం జరిగిందా? లేదా రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక నిబంధనల ప్రకారం జరిగిందా? అనే కోణంలో రాబోయే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయి. గత పరీక్షల్లో అడిగిన కింది ప్రశ్నలను పరిశీలించండి. - భారత రాజ్యాంగం గణతంత్రం ఎందుకనగా?(సివిల్స్ 2007) సమాధానం: రాష్ర్టపతి, ఇతర ప్రజాప్రతినిధులు నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు. - అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశాలు ఏవి?(సివిల్స్ 2010) సమాధానం: ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, పిల్-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి మొదలైన అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అలా గ్రహించడానికి కారణాలనూ విశ్లేషించుకోవాలి. అమెరికా ‘హక్కులకు ప్రతీక, హక్కుల రక్షణకు న్యాయవ్యవస్థ అవసరం. ఇలా పోల్చుకుంటూ చదివితే చక్కగా గుర్తుంటుంది. మంచి కోచింగ్ సెంటర్లో శిక్షణను తీసుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి. ఏది చదవాలో, ఏది చదవకూడదో అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సమయం చక్కగా సద్వినియోగం అవుతుంది. - ఇన్పుట్స్: బి.కృష్ణారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ, హైదరాబాద్ బ్యాంక్స్ పరీక్షలు రాసేటప్పుడు రీజనింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విభాగంలో ముఖ్యమైన టాపిక్స్ ఏవి? - అనుపమ, అపురూప కాలనీ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలే కాకుండా ఆర్ఆర్బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పోటీ పరీక్షల్లోనూ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విభాగంలో అభ్యర్థి ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, వేగంగా ఆలోచించడం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా బ్యాంక్స్ పరీక్షల్లో క్లర్క్స్ విభాగంలో 40 మార్కులకు, పీఓస్ విభాగంలో 50 మార్కులకు రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు 0.25 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నను చూసి కంగారుపడకూడదు. ముందుగా ప్రశ్నను అవగాహన చేసుకోవాలి. ప్రతి ప్రశ్నలోనూ హిడెన్ స్టేట్మెంట్ను గుర్తించగలగాలి. ముందు కష్టమైన ప్రశ్నల కంటే సులువైన వాటికి సమాధానాలు రాయాలి. ఆప్షన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి గందరగోళానికి గురికాకుండా సరైన ఆప్షన్‌ను గుర్తించాలి. సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్లైన్ పరీక్ష కాబట్టి వీలైనన్ని ఆన్లైన్ మాక్‌టెస్టులు సాధన చేయాలి. రీజనింగ్‌లో ముఖ్యమైన టాపిక్స్: కోడింగ్ - డికోడింగ్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ రిలేషన్స్, కంపారిజన్ టెస్ట్, సీటింగ్ అరెంజ్మెంట్, సిలాజిస్మ్, ఎనలిటికల్ రీజనింగ్, డేటా సఫీషియెన్సీ, స్టేట్మెంట్స్ - కన్‌క్లూజన్స్, ఇన్పుట్-ఔట్పుట్ మొదలైనవి. రిఫరెన్స్ బుక్స్ గీ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్ గీ ఎనలిటికల్ రీజనింగ్ - ఎం.కె.పాండే గీ రీజనింగ్- అరిహంత్ పబ్లికేషన్స్ ఇన్పుట్స్: ఇ.సంతోష్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, బ్యాంక్స్ -
పర్వత ప్రాంతాల్లో ఏర్పడే వైపరీత్యం ఏది?
విపత్తులు - ప్రాథమిక భావనలు ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించిన దుర్ఘటన విపత్తు అవుతుందా/ కాదా అనే విష యాన్ని నిర్ధారించాలంటే విపత్తు నిర్వ హణకు సంబంధించిన కొన్ని ప్రాథమిక భావనల గురించి తెలుసుకోవాలి. అవి.. 1. వైపరీత్యం (Hazard) 2. దుర్బలత్వం (Vulnerability) 3. సామర్థ్యం (Capacity) 4. ఆపద (Risk) వైపరీత్యం ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి నష్టాన్ని కలుగజేసే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలనే వైపరీత్యాలు అంటారు. 'Hasard’ అనే అరబిక్, Az-Zhar అనే ఫ్రెంచి పదాల నుంచి వైపరీత్యం (Haz-ard) అనే పదం వచ్చింది. పైపరీత్యాలు అనేవి ప్రకృతి, మానవ చర్యల వల్ల లేదా రెండింటి వల్ల సంభ విస్తాయి. వైపరీత్యాలు సంభవించే కారణాల ఆధారంగా విపత్తులను కిందివిధంగా విభజించవచ్చు. అవి.. అ) భౌగోళిక వైపరీత్యాలు: ఇవి భూనిర్మాణం లో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తాయి. ఉదా: భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, భూపాతాలు, ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్నిప్రమాదాలు. ఆ) నీరు, వాతావరణ సంబంధ వైపరీత్యాలు: భూ వాతావరణంలో సంభవించే మా ర్పుల వల్ల ఏర్పడతాయి. ఉదా: చక్రవాతాలు, టోర్నడోలు, వరదలు, కరువు, కుంభవృష్టి, భూపాతం, హిమ సంపాతాలు, వేడి, శీతల గాలులు. ఇ) జీవసంబంధ వైపరీత్యాలు: ఉదా: అంటు వ్యాధులు, తెగుళ్ల దాడులు, కలుషిత ఆహారం, సామూహిక జనహనన ఆయుధాలు. ఈ) పర్యావరణ సంబంధిత వైపరీత్యాలు: ఉదా: పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత, ఎడారీకరణ. ఉ) మానవ నిర్లక్ష్యం వల్ల ఏర్పడే వైపరీత్యాలు: పారిశ్రామిక దుర్ఘటనలు, అగ్ని ప్రమా దాలు, చమురు ప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రోడ్డు/ రైల్వే ప్రమాదాలు, భవ నాలు కూలిపోవడం, తొక్కిసలాటలు. ఊ) సామాజిక- సహజ విపత్తులు: ఇవి ప్రకృతి పరమైన, మానవ ప్రేరేపిత కారణాలు రెం డింటి వల్ల ఏర్పడతాయి. ఉదా: వరదలు, దుర్భిక్షం, భూపాతాలు. వైపరీత్యాలు సంభవించే వేగం, ప్రభావ కాలం ఆధారంగా వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. 1) Rapid-Onset Hazards: ఇవి అకస్మి కంగా సంభవిస్తాయి. వీటి ప్రభావం స్వల్పకాలం లేదా దీర్ఘకాలం ఉండొచ్చు. ఉదా: భూకంపాలు, సునామీలు, వరదలు, చక్రవాతం, అగ్నిపర్వత విస్ఫోటనాలు. 2) low - Onset Hazards: ఇవి చాలా నెమ్మదిగా సంభవిస్తాయి. వీటి ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుంది. ఉదా: పర్యావరణ క్షీణత, తెగుళ్ల దాడి, దుర్భిక్షం. విపత్తు నిర్వహణపై 1999లో కె.సి. పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘అత్యున్నతాధి కారిక కమిటీ’ (High Powered Com-mittee) దేశంలోని వివిధ ప్రాంతాల్లో 31 రకాల వైపరీత్యాలను గుర్తించి, వాటిని 5 సబ్ గ్రూపులుగా విభజించింది. 2005లో ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహణ సంస్థ ‘వేడిగాలులను’ వైపరీత్యంగా పేర్కొనలేదు.అన్ని వైపరీత్యాలు విపత్తు రూపాన్ని పొందలేవు. కొన్ని మాత్రమే విపత్తు రూపాన్ని సంతరించుకుంటాయి. ఒక వైపరీత్యాన్ని విపత్తుగా గుర్తించాలంటే ఆ ప్రాంతంలో కింద తెలిపిన నష్టాలు జరిగి ఉండాలి. అవి.. 1. ధన, ప్రాణ నష్టం అధికంగా ఉండాలి. 2. {పజల జీవనోపాధి దెబ్బతిని ఉండాలి. 3. ఆ ప్రాంత పర్యావరణ, సాంస్కృతిక వనరులు దెబ్బతిని ఉండాలి. 4. గాయాల బారిన పడినవారి సంఖ్య అధికంగా ఉండాలి. 5. వైపరీత్యం సంభవించిన ప్రాంతంలో జనాభా పరిమాణం, సాంద్రత అధికంగా ఉండాలి. దుర్బలత్వం (Vulnerability) ఏదైనా ఒకే భౌగోళిక ప్రాంతంలో సంభవించే వైపరీత్యం వల్ల అక్కడ ఉన్న సమాజంలో నష్ట తీవ్రతను పెంచే కారకాలనే ఆ ప్రాంత దుర్భ లత్వం అంటారు. ఉదా: 2001 గుజరాత్ లోని ‘భుజ్’ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా శివారు ప్రాంతాల్లో నివ సిస్తున్నవారి కంటే ఇరుకైన రోడ్లు, ఎత్తయిన, సురక్షితం కాని భవనాలు, అధిక జనసాంద్రత ఉన్న, నిరుపేదలు నివసిస్తున్న భుజ్ పాత నగరానికి చెందినవారే ఎక్కువ గాయపడ్డారు, మరణించారు. శివారు ప్రాంతాల ప్రజలు విశాలమైన రోడ్లను కలిగి ఉండటమే కాకుండా, జనసాంద్రత తక్కువగా ఉండి, ఒకటి లేదా రెండు అంతస్తుల భవనాలనే కలిగి ఉండటం వల్ల ఆయా ప్రాంతాల్లో నష్ట తీవ్రత తక్కువగా ఉంది. సామర్థ్యం (Capacity) ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సంభవించే వైపరీత్యం వల్ల జరిగే నష్ట తీవ్రతను తట్టుకొని తిరిగి జీవనోపాధిని పునరుద్ధరించుకునే అవ కాశాలున్న ఒక సమాజం స్థితిని దాని సామర్థ్యంగా పేర్కొనవచ్చు. ఉదా: రిక్టరు స్కేలుపై 6 తీవ్రత ఉన్న భూకంపం మురికివాడలో సంభవించినప్పుడు ప్రాణనష్టం, గాయాల బారిన పడినవారి సంఖ్య, జీవనోపాధిని పునరుద్ధరించుకోలేని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అక్కడి సమాజానికి దుర్బల పరిస్థితుల నుంచి కోలుకునే సామర్థ్యం తక్కువగా ఉండటమే దీనికి కారణం. అదే బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 8 తీవ్రత ఉన్న భూకంపం సంభవించినా నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది. దీనికి కారణం అక్కడ పేదరికం, బలహీనమైన ఇళ్లు, ఇరుకైన రోడ్లు లాంటి దుర్బల పరిస్థితులు లేకపోవడం. అంటే ఈ ప్రాంతానికి దుర్బలత్వాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంది అని అర్థం. ఆపద (లేదా) విపత్కర స్థితి (Risk) వైపరీత్యాలు, దుర్బల పరిస్థితుల మధ్య పరస్ప ర చర్యల కారణంగా ఒక సమాజ ఆర్థిక కార్య కలాపాల్లో అంతరాయం, పర్యావరణ క్షీణతతో పాటు మరణాలు, గాయాలు, ఆస్తి, జీవ నోపాధి దెబ్బతినడం లాంటి పర్యవసానాలు జరిగే సంభావ్యతనే ఆపద అంటారు. దీన్ని కిందవిధంగా వ్యక్తపరచవచ్చు. -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో హిస్టరీకి ఎలా సిద్ధమవ్వాలి?
- అలేఖ్య, అమీర్‌పేట కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో భారతదేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్రోద్యమం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘ సంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం - ముఖ్య ఘట్టాలు, చట్టాలు - ఫలితాలు వంటివాటిపై దృష్టి సారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా.. మారు మూల అంశాల నుంచి కూడా ఇస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి. చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాలు ఇండియన్ హిస్టరీ -వి.కె.అగ్నిహోత్రి ప్రాచీన చరిత్ర - ఆర్. శర్మ, రొమిల్లా థాపర్ మధ్యయుగ చరిత్ర - సతీశ్ చంద్ర మోడ్రన్ ఇండియా - బిపిన్ చంద్ర ఇన్పుట్స్: కరీం, సీనియర్ ఫ్యాకల్టీ ఎస్బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌కు ఎలా సిద్ధమవాలి? - హిమబిందు, హిమాయత్‌నగర్ బ్యాంక్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబులరీపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దిన పత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్స్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తం మీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే. జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం - వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు - కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు - విజేతలు, అవార్డులు - విజేతలు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన రోజులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇన్పుట్స్: కె.వి. జ్ఞానకుమార్ డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్. సివిల్స్-ప్రిలిమ్స్: బయాలజీ బ్యాంక్ ఎగ్జామ్స్: రీజనింగ్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఆమ్ల వర్షానికి కారణమైన వాయువులేవి?
పర్యావరణ రసాయన శాస్త్రం వాయు కాలుష్యం వివిధ జీవరాశుల మనుగడకు అవసరమైన వాతావరణం ఒక్క భూమిపైనే ఉంది. అయితే మానవుని చర్యల వల్ల వాతావరణ సమతౌల్యం దెబ్బతిని జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. సాధారణ వాతావరణంలో ప్రధాన వాయువులైన నైట్రోజన్ 78.32%, ఆక్సిజన్ 20.16%గా ఉంటాయి. కార్బన్ డై ఆక్సైడ్, నీటిఆవిరి, ఆర్గాన్, నియాన్, హీలియం, హైడ్రోజన్, క్రిప్టాన్, ఓజోన్లు స్వల్ప మొత్తంలో ఉండే వాయువులు.సాధారణ శ్వాసక్రియతో ప్రాణికోటి ఆక్సిజన్‌ను తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఈ కార్బన్ డై ఆక్సైడ్‌ను మొక్కలు పీల్చుకుని సూర్యరశ్మి సమక్షంలో నీటిఆవిరితో కలిసి ‘కిరణజన్య సంయోగక్రియ’ ద్వారా పిండి పదార్థాలను తయారుచేసుకుంటూ మనకు కావల్సిన ‘ఆక్సిజన్’ను విడుదల చేస్తాయి. నైట్రోజన్‌ను స్థిరీకరణం చేసే సూక్ష్మజీవులు వాతావరణంలోని నైట్రోజన్‌ను ఉపయోగించుకుంటాయి. పారిశ్రామిక విప్లవంతో మొదలైన పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, వాహనాల కారణంగా వాతావరణంలోకి వివిధ కాలుష్యకర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ వాయు వుల వల్ల గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ల నిష్పత్తికి భంగం కలుగుతోంది. తద్వారా వాతావరణ సమతౌల్యత దెబ్బతింటోంది. వాతావరణం భూమి నుంచి సుమారు 500 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. వాతావరణంలో ప్రధానంగా నాలుగు పొరలు ఉంటాయి. 1. ట్రోపోవరణం (0-11 కి.మీ.) 2. స్ట్రాటోవరణం (11-50 కి.మీ.) 3. మీసోవరణం (50-85 కి.మీ.) 4. థర్మోవరణం (85-500 కి.మీ.) వీటిలో ప్రధానమైంది ట్రోపోవరణం. ఈ పొరలోనే గాలి ఉంటుంది. ఎత్తుకు పోయే కొద్దీ గాలి సాంద్రత పీడనం తగ్గుతుంది. ఈ పొర ఉష్ణ సమతౌల్యతను కాపాడుతుంది. అయితే మానవ చర్యల వల్ల అధిక మోతాదులో వివిధ కాలుష్య కారక వాయువులు చేరి వాతావరణ సమతౌల్యత దెబ్బతింటోంది. అవి ప్రధానంగా.. కార్బన్ డై ఆక్సైడ్: కార్బన్ మోనాక్సైడ్ ), కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు: నైట్రస్ ఆక్సైడ్ , నైట్రిక్ ఆక్సైడ్ , నైట్రోజన్ డై ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్ అయిన సల్ఫర్ డై ఆక్సైడ్ హైడ్రో కార్బన్లు: మీథేన్, ఈథేన్, ఎసిటలీన్, బ్యూటేన్ మొదలైనవి. లోహాలు: లెడ్, మెర్క్యురీ మొదలైనవి. ఫియాన్లు (క్లోరో ఫ్లోరో కార్బన్లు) కాంతి రసాయన స్మాగ్ (పొగమంచు) ఓజోన్లు ధూళి కణాలు అమ్మోనియా వీటివల్ల కలిగే ప్రధాన అనర్థాలు మూడు. 1. భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) లేదా హరిత గృహ ప్రభావం (గ్రీన్హౌస్ ప్రభావం) 2. ఆమ్ల వర్షాలు 3. ఓజోన్ పొర తరుగుదల ఈ కాలుష్య కారక వాయువులు వాతావరణంలో వివిధ రకాలుగా కలుస్తున్నాయి. థర్మల్ ప్లాంట్లలో, వివిధ పరిశ్రమల్లో బొగ్గును మండించడం, వంటచెరకు మండించడం, వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ను మండించడం వల్ల కార్బన్ ఆక్సైడ్లు వాతావరణంలోకి చేరుతున్నాయి. ఆయిల్ రిఫైనరీలు, థర్మల్ ప్లాంట్లలో బొగ్గును మండించడం, అగ్నిపర్వతాలు, రసాయన పరిశ్రమల ద్వారా సల్ఫర్ డై ఆక్సైడ్ చేరుతోంది. శీతలీకరణ పరిశ్రమ ద్వారా ఫ్రియాన్లు, శిలాజ ఇంధనాల దహనం వల్ల నైట్రిక్ ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్లు; సూపర్సోనిక్ జెట్ విమానాల ద్వారా నైట్రిక్ ఆైక్సైడ్, ఉరుములు మెరుపుల ద్వారా నైట్రస్ ఆక్సైడ్లు వాతావరణంలో చేరుతాయి. పెట్రోల్ దహనం, నెయిల్‌పాలిష్, పెయింట్ల ద్వారా లెడ్ వాతావరణంలోకి చేరుతోంది. హరిత గృహ ప్రభావం లేదా భూగోళం వేడెక్కడం: సాధారణంగా సూర్యరశ్మి ద్వారా భూ ఉపరితలాన్ని చేరే కిరణాల శక్తి, భూమి తిరిగి అంతరాళంలోకి వికిరణం చెందించే ఉష్ణ శక్తుల మధ్య సమతౌల్యత ద్వారా భూమి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అయితే గ్రీన్హౌస్ వాయువులుగా పిలిచే కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, మీథేన్ నీటిఆవిరి, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ల ఫ్రియాన్ పరిమాణం పెరిగితే ఇవి సూర్యరశ్మిలోని ఉష్ణ వికిరణాలైన పరారుణ (ఐఖ) వికిరణాలను పట్టి బంధించి అంతరాళంలోకి పోనియ్యవు. అందువల్ల భూమి వేడెక్కుతుంది. అంటే తలుపులు మూసివేసిన కారు గాజు పలకల్లా, లేదా నర్సరీల్లో ‘గ్రీన్హౌస్’కు గాజు పలకల్లా పని చేస్తాయి. ఈ ప్రక్రియనే హరిత గృహ ప్రభావం (గ్రీన్హౌస్ ప్రభావం) లేదా భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) అని అంటారు. దీనికి ప్రధాన కారణమైన కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలో 50 శాతం పెరుగుదల భూగోళ ఉష్ణోగ్రతను సుమారు 3నిఇ వరకు పెంచుతుంది. భూగోళం వేడెక్కడం కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర నీటిమట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు మునగడం, జలాశయాల్లో నీటి బాష్పీభవన రేటు పెరిగి నీటికొరత ఏర్పడటం, అకాల వర్షాలు మొదలైన దుష్ర్పభావాలు కలుగుతాయి. ఆమ్ల వర్షాలు: నైట్రిక్ ఆక్సైడ్లు, నైట్రోజన్ డై ఆక్సైడ్లు, సల్ఫర్ డై ఆక్సైడ్లు ప్రధానంగా ఆమ్ల వర్షానికి కారణాలు. ఆమ్ల వర్షాల వల్ల నేల సహజ ఆమ్లత్వం లేదా ఞఏ మారిపోయి భూసారం దెబ్బ తింటుంది. చలువరాతితో కట్టిన పురాతన కట్టడాలు దెబ్బతింటాయి. చర్మ వ్యాధులు కూడా రావచ్చు. ఓజోన్ పొర క్షీణించడం: స్ట్రాటోవరణంలో భూమి చుట్టూ ఉండేదే ఓజోన్ పొర. ఇది సూర్యుని నుంచి భూమిని చేరే అతినీలలోహిత (్ఖగ) కిరణాలను వడపోసి భూమిని చేరకుండా కాపాడుతుంది (ఈ ఓజోన్ గాలిలో ఉన్నప్పుడు గ్రీన్హౌస్ ఎఫెక్ట్‌ను కలుగజేస్తుంది). అయితే క్లోరోఫ్లోరో కార్బన్లు (ఇఊఇ), నైట్రిక్ ఆక్సైడ్, క్లోరిన్‌లు ఈ ఓజోన్ పొరకు చిల్లులు పడేట్లు చేసి దాన్ని క్షీణింపచేస్తున్నాయి. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొరకు ఎక్కువ నష్టం కలుగుతోంది. ఓజోన్ పొరకు చిల్లులు పడటం వల్ల హానికారక ్ఖగ కిరణాలు భూమిని చేరి చర్మ వ్యాధులను కలుగజేస్తాయి. స్ట్రాటోవరణంలో మేఘాలు, ఫ్రియాన్ల అంతర ప్రవాహం వల్ల చర్మ క్యాన్సర్ వ్యాధులు, కంటి శుక్లాలు పెరుగుతాయి. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం విపరీతంగా తగ్గిపోతుంది. -
వ్యయ నియంత్రణపై చర్యలు అవసరం
ప్రణాళికలు - వనరుల సమీకరణ ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో వనరుల సమీకరణ, వినియోగం ప్రధానమైనవి. ప్రతి దేశంలో సహజ వనరుల లేదా మానవ వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. వనరుల కొరత కారణంగా ఉత్పత్తి, పంపిణీ, వినియోగం లాంటి వివిధ ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రోడాన్ అభిప్రాయంలో... ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంగా వృద్ధి స్తంభించిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్‌పుష్’ను కల్పించాల్సిన అవసరం ఉంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయంలో ఇదే విధమైన బిగ్‌పుష్ ఆవశ్యకత ఏర్పడింది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక ప్రణాళిక ప్రాము ఖ్యాన్ని గుర్తించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. భారత్‌లో ప్రస్తుత సంస్థాపరమైన ఏర్పాటును దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికలోని ముఖ్యాంశాలను కింది విధంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం స్వదేశీ వనరులు, విదేశాల నుంచి వనరులు సమీకరించడం ద్వారా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది. తద్వారా ప్రైవేట్ రంగంలో ఉత్పాదక కార్యకలాపాలు మెరుగవుతాయి. రైల్వేలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ఆయా ప్రాజెక్టులపై ప్రభుత్వ రంగం అధిక పెట్టుబడులను చేస్తుంది. అధిక పెట్టుబడి, అధిక ఫలన కాలంతో కూడుకున్న భారీ పరిశ్రమల ఏర్పాటులోనూ ప్రభుత్వ రంగం ప్రత్యక్షంగా పాల్గొంటుంది. ప్రైవేట్ ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం అనేక ఆర్థిక విధానాలను అవలంభిస్తుంది. పన్నులు, పారిశ్రామిక లెసైన్సింగ్, టారిఫ్ (దిగుమతులపై పన్ను), వేతనాలు, ధరలు, వడ్డీరేటుకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. 1990 తర్వాత కాలంలో సరళీకరణ విధానాల్లో భాగంగా భౌతిక నియంత్రణలను తొలగించి ప్రైవేట్ రంగానికి తగిన ప్రోత్సాహం అందించారు. ప్రభుత్వరంగ ప్రణాళికలకు ఆర్థిక సాయం: పంచవర్ష ప్రణాళికల అమల్లో భాగంగా విత్త వనరుల యాజమాన్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన వనరులను రెండు మార్గాల ద్వారా సమీకరిస్తున్నారు. వాటిని స్వదేశీ, బహిర్గత ఆధారాలుగా వర్గీకరించవచ్చు. స్వదేశీ ఆధారాల్లో భాగంగా బడ్జెటరీ మిగులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు, మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు ముఖ్యాంశాలుగా ఉంటాయి. విదేశీ సహా యాన్ని అంతర్జాతీయ విత్త సంస్థలు, విదేశాల నుంచి సమీకరిస్తారు. సమీకరించిన మొత్తం, వ్యయం మధ్య తేడా ఏర్పడినప్పుడు లోటు బడ్జెట్ (Deficit Financing) ప్రాధా న్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ ప్రణాళికకు అవసరమైన వనరులను మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మూడు ఆధారాల ద్వారా సమీకరించారు. వాటిని అంతర్గత వనరులు, లోటు బడ్జెట్, విదేశీ సహాయంగా వర్గీకరించొచ్చు. a) అంతర్గత వనరులు: అంతర్గత వనరుల్లో కరెంట్ రాబడి నుంచి మిగులు, మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు లాంటి అంశాలు ఇమిడి ఉంటాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి ప్రస్తుత, ప్రణాళికేతర వ్యయం కంటే రాబడి అధికంగా ఉన్నప్పుడు పొదుపు ఏర్పడుతుంది. ఈ మొత్తాన్ని కరెంట్ రాబడి నుంచి మిగులుగా భావిస్తాం. కరెంటు రాబడి నుంచి మిగులు పన్ను రాబడిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ రంగం వనరుల సమీకరణలో పన్ను రాబడికి ప్రాధాన్యం ఉంది. భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థల్లో ‘స్వచ్ఛంద పొదుపు’నకు ఉన్న అవకాశం తక్కువైనందువల్ల అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన నిధులను ఈ మార్గం ద్వారా సమకూర్చలేం. ఒకవైపు పేదరికం మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం పెరుగుదల మూలధన సంచయనం పెంపునకు అవరోధంగా ఉంది. అభివృద్ధి ప్రణాళికల్లో మార్కెట్ రుణాలు కూడా వనరుల సమీకరణలో ప్రాధాన్యం పొందాయి. ప్రణాళికల ప్రారంభం నుంచే వనరుల సమీకరణలో మార్కెట్ రుణాల ఆవశ్యకతను ప్రణాళికా సంఘం గుర్తించింది. ప్రభుత్వం మార్కెట్ రుణాలపై ఆధారపడటమనేది బ్యాంకింగ్ రంగంలో వాణిజ్య బ్యాంకులు నిర్వహించే ఔఖను బట్టి ఉంటుంది. దీని ఆధారంగా వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలపై పెట్టుబడులు పెడతాయి. లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా ప్రభుత్వం రుణాలు సమీకరిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక శాతం ప్రజల పొదుపు సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలకు ప్రైవేట్ వ్యాపారాల్లో పెట్టుబడి అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ సెక్యూరిటీలపై తమ పొదుపును పెట్టుబడులుగా మరలించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజల పొదుపును ప్రభుత్వ రంగానికి సంబంధించిన విత్త సంస్థ ద్వారా ప్రభుత్వం సమీకరించలేకపోయినప్పుడు అభివృద్ధి ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ ప్రణాళికకు ఆర్థిక సహాయంలో భాగంగా చిన్న మొత్తాల పొదుపు ఆవశ్యకతను ఆర్థిక ప్రణాళికల అమలు ప్రారంభంలోనే ప్రభుత్వం గుర్తించింది. తద్వారా వివిధ ప్రణాళికల్లో అంతర్గత వనరుల సమీకరణలో చిన్న మొత్తాల పొదుపు వాటా క్రమంగా పెరిగింది. మొదటి ప్రణాళిక ప్రారంభంలో భారత్‌లో ప్రభుత్వం రంగం చాలా చిన్నది. దేశంలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు * 29 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహించేవి. మొదటి, రెండు పంచవర్ష ప్రణాళికల కాలంలో మరో 43 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. 1991 నాటికి భారత్‌లో 244 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు కాగా ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 268కి చేరుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల మిగులును ప్రభుత్వ రంగ ప్రణాళికకు ఆర్థిక సహాయంగా ఉపయోగిస్తారు. ఛ) విదేశీ సహాయం: ఆర్థిక ప్రణాళికల మొదటి నాలుగు దశాబ్దాల్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం అధిక విదేశీ సహాయం పొందిన దేశాల్లో భారత్ ఒకటి. 1989-90 వరకు భారత్ * 83,729 కోట్ల విదేశీ సహాయాన్ని పొందగా ఈ మొత్తంలో * 54059 కోట్లను వినియోగిం చుకుంది. ఈ మొత్తంలో 85 శాతం రుణం రూపంలో ఉండగా, 10 శాతం గ్రాంట్ల రూపంలో, మిగిలిన 5 శాతం ్కఔ 480/665 కింద ఉంది. ప్రభుత్వ రంగ పెట్టుబడిలో భాగంగా విదేశీ సహాయం వాటా మొదటి మూడు ప్రణాళికల్లో క్రమంగా పెరగగా నాలుగో ప్రణాళిక నుంచి తగ్గింది. నాలుగో ప్రణాళికలో స్థిరత్వంతో కూడిన వృద్ధి లక్ష్య సాధనలో భాగంగా విదేశీ సహాయాన్ని ప్రభుత్వ రంగ పెట్టుబడిలో తగ్గించారు. ఆర్థిక ప్రణాళికల అమలు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ రుణ భారం పెరిగింది. ప్రణాళికల అమలు కాలంలో అనేక సంవత్సరాల్లో రుణ సర్వీసింగ్ చార్జీల మొత్తం లభించిన విదేశీ సహాయంలో 50 శాతంగా ఉండటాన్ని బట్టి అధిక రుణ భారాన్ని అంచనా వేయొచ్చు. ఛి) లోటు బడ్జెట్: ఆర్థిక ప్రణాళికల అమలు నేపథ్యంలో వనరుల సమీకరణలో భాగంగా పన్నుల రాబడి, మార్కెట్ రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు, విదేశీ సహాయం ద్వారా తగిన మొత్తాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో లోటు బడ్జెట్ విధానంపై ప్రభుత్వం ఆధారపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల అమ్మకం ద్వారా, రాష్ర్ట ప్రభుత్వాలు వేస్ అండ్ మీన్స అడ్వాన్సులు, రిజర్వ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం ద్వారా తమ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధానం వల్ల దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ధరల పెరుగుదల స్థిర ఆదాయ వర్గాల ప్రజలపైనే కాకుండా వివిధ ప్రాజెక్టుల వ్యయ అంచనాలపై రుణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. మొదటి ప్రణాళికలో లోటు బడ్జెట్ *333 కోట్లుగా నమోదు కాగా, ఏడో ప్రణాళికలో *34,669 కోట్లకు, ఇటీవల ప్రణాళికల్లో సుమారు *60,000 కోట్లకు పైగా పెరిగింది. వనరుల సమీకరణ-చర్యలు ఎ) పన్నుల ద్వారా ఆదాయం పెంపు: ప్రణాళికా సంఘం అభిప్రాయంలో భారత విత్త వ్యవస్థ రిసోర్స్ బేస్ సరిపోయినంతగా లేనందువల్ల లోటు బడ్జెట్ విధానాన్ని నివారించడం క్లిష్టంగా ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్నుల ద్వారా అదనపు వనరులు సమీకరించే ప్రయత్నం జరగలేదు. అదనపు వనరులు సమీకరించే నేపథ్యంలో పన్ను ఎగవేతను అరికట్టడంపై దృష్టి సారించారు. మొత్తం వ్యవసాయ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం పన్ను వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యవసాయ విధానం వ్యవసాయ ఆదాయాల పెంపునకు దారి తీసింది. ముఖ్యంగా ధనిక రైతుల ఆదాయాల్లో పెరుగుదల ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగం నుంచి అదనపు వనరుల పెంపుపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వ్యవసాయ పన్నులకు సంబంధించి పురోగామి పన్నుల విధానాన్ని అవలంబించాలి. పరోక్ష పన్నులకు సంబంధించి సేవలపై పన్నును 1994-95లో ప్రవేశపెట్టారు. మొదటగా టెలిఫోన్ సర్వీసులు, సాధారణ బీమా, షేర్ బ్రోకింగ్‌లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. 1994-95లో ఈ పన్ను ద్వారా రాబడి రూ.410 కోట్లు కాగా, 2012-13లో రూ.1,32,518 కోట్లకు చేరుకుంది. 1994లో కేవలం మూడు సేవలపై ఈ పన్నును విధించగా 2012 నాటికి దీని పరిధిలోకి వచ్చే సేవల సంఖ్య 119కి పెరిగింది. ప్రణాళికల్లో ప్రభుత్వరంగ పెట్టుబడుల్లో భాగంగా పన్నుల రాబడికి సంబంధించి సేవలపై పన్ను పరిధిని పెంచడం ద్వారా అధిక వనరుల సమీకరణకు ప్రయత్నించాలి. బి) ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు: ప్రభుత్వ రంగం సంస్థలు సరిపోయినంతగా మిగులు సాధించడంలో విఫలం చెందుతున్న దృష్ట్యా భారత విత్త వ్యవస్థ రిసోర్స్ బేస్ పెంపునకు అవరోధం ఏర్పడింది. సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోకపోవడం, అసమర్థ యాజమాన్యం, జవాబుదారీతనం లోపించడం, ప్రపంచీకరణ వల్ల పెరిగిన పోటీ వాతావరణం నేపథ్యంలో లాభాలను ఆర్జించే సామర్థ్యం తగ్గుతున్న కారణంగా ప్రభుత్వరంగ సంస్థలు ఆర్జించే మిగులు తగ్గింది. ఇన్వెంటరీల తగ్గింపు, అభిలషణీయ ధరల విధానం అవస్థాపిత సామర్థ్యం పెంపు, వృత్తిపరమైన యాజమాన్యం మెరుగుపర్చుకోవడం లాంటి చర్యల ద్వారా మిగులు ఆర్జించడంపై ప్రభుత్వ రంగ సంస్థలు దృష్టి సారించాలి. కానీ ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విధానం వల్ల ప్రణాళికా పెట్టుబడులకు అవసరమైన వనరులను ఆయా సంస్థల నుంచి సమీకరించడం సాధ్యం కావడం లేదు. సి) యూజర్ చార్జీల విధింపు: పబ్లిక్ సర్వీసులపై యూజర్ చార్జీల విధింపు ద్వారా ప్రణాళిలకు అవసరమైన పెట్టుబడిని సమీకరించాలి. ముఖ్యమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకుంటున్నప్పటికీ ప్రతిఫలంగా ఏవిధమైన ఎకనామిక్ చార్జీలు చెల్లించడం లేదు. తద్వారా పబ్లిక్ సర్వీసుల నుంచి రాబడి తగ్గినప్పుడు ప్రణాళికలకు అవసరమైన వనరుల సమీకరణలో సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్య సేవలు అయిన విద్యుత్, నీటి సరఫరా, నీటి పారుదల, రవాణా విషయంలో ప్రభుత్వం యూజర్ చార్జీలు విధించడం ద్వారా వనరులను సమీకరించుకోవాలి. డి) ప్రభుత్వ రంగంలో ఉపాధి: కొంత మంది ఆర్థికవేత్తల అభిప్రాయంలో ప్రభుత్వ రంగంలో మిగులు సిబ్బందిని గుర్తించడం ద్వారా రీడిప్లాయ్మెంట్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. ప్రభుత్వరంగంలో ఉపాధిని రెండుశాతం తగ్గించాలని ప్రణాళికా సంఘం అప్రోచ్ పేపర్లో సూచించారు. తద్వారా ప్రభుత్వ వ్యయం తగ్గి రెవెన్యూ మిగులుకు అవకాశం ఏర్పడుతుంది. ఇ) వ్యయ నియంత్రణ: దీంట్లో భాగంగా పదో ప్రణాళిక అప్రోచ్ పేపర్ రెండు అంశాలపై దృష్టి సారించాలని వెల్లడించింది. జీడీపీలో భా గంగా, పెరుగుతున్న సబ్సిడీలను తగ్గించడం తో పాటు కరెంటు వ్యయం పెరుగుదలలో భా గంగా ప్రభుత్వ పింఛన్ చెల్లింపులను పేర్కొంది. ఈ రెండు అంశాలకు సంబంధించి వ్యయ నియంత్రణపై ప్రభుత్వ చర్యలు అవసరం. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సమీకరణాలు, ఫార్మూలాలపై ప్రశ్నలు వస్తాయా? - మాధవి, రామంతాపూర్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ ఒక భాగం. జనరల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్(భౌతిక, రసాయన శాస్త్రాలు)+ జీవ శాస్త్రం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఫిజిక్స్‌కు సంబంధించి ముఖ్యంగా ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రిక శక్తి, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రం అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలు (Fundamental Concept), అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక్కో ప్రాథమిక అంశంపైన భిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు మే 2013లో జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను కింది విధంగా అడిగారు. 1. కాంతి ధర్మాలకు చెందిన ఐదు అనువర్తనాలను ఇచ్చి, వాటిలో కాంతి ధర్మానికి సంబంధించనటువంటిది ఏది? అని అడిగారు.(ఈ ప్రశ్నలను స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు) కాబట్టి రాబోయే పరీక్షలో కూడా ఇలాంటి భిన్నమైన కోణాల్లో ప్రశ్నలు అడిగి అవకాశం లేకపోలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఫిజిక్స్ నుంచి సమీకరణాలు, లెక్కలు(Problems), ప్రయోగాలు, ఫార్మూలాల గురించిన ఎలాంటి ప్రశ్నలూ అడగరు. ఫిజిక్స్ సబ్జెక్టుపై మంచి అవగాహన ఏర్పరచుకుంటే సివిల్స్ మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడిగే ప్రశ్నలను మరింత ప్రభావపూరితంగా (Most Effective) సమాధానాలు రాయొచ్చు. ఉదాహరణకు డిసెంబర్ 2013లో నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో త్రి డెమైన్షనల్ ప్రింటింగ్ గురించి, దాని ఉపయోగాల గురించి ప్రశ్న అడిగారు. ఇలాంటి ప్రశ్నలకు కావాల్సిన నిర్వచనాలను ఫిజిక్స్ నుంచి పొందొచ్చు. ఇన్‌ఫుట్స్: సీ.హెచ్.మోహన్, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - సుదీప్తి, కంటోన్మెంట్ రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు, 50 మార్కుల చొప్పున వస్తాయి. రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేలా ఉంటాయి. మిగతా విభాగాలతో పోలిస్తే.. రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేగంగానే సమాధానాలను గుర్తించొచ్చు. రీజనింగ్‌లో సిరీస్; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్‌వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలు ఉంటాయి. నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు నిరంతర ప్రాక్టీస్ ఏకైక మార్గం. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్యాలిక్యులేషన్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కూడికలు, తీసివేతలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలకు సంబంధించి 15-20 ప్రశ్నలు వస్తాయి. శాతాలు, భిన్నాలు, ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, అనుపాతాలు, లాభనష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సాధన చేయాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలను పరిశీలించాలి. సూత్రాలు, వాటి ఆధారంగా సమస్యలను సాధించాలి. షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సమస్యల్ని సాధిస్తే సమయం ఆదా అవుతుంది. ఇన్‌ఫుట్స్: కె.వి.జ్ఞానకుమార్, హైదరాబాద్ నేను యూపీఎస్సీ ఎన్డీఏ ఏగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి. - జి.రమేశ్, తిరుమలగిరి త్రివిధ దళాల్లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశం ఎన్డీఏ అండ్ ఎన్ఏ. రాత పరీక్ష సెప్టెంబర్ 28న ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. ఎన్డీఏ అండ్ ఎన్ఏ రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ చాలా కీలకమైంది. 120 ప్రశ్నలు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. సమయం 150 నిమిషాలు ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో ముఖ్యంగా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్-డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలోని అవగాహన స్థాయిని, ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. కాబట్టి ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే సమస్యలను వేగంగా సాధించే చిట్కాలను నేర్చుకోవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి ప్రాక్టీస్‌లో అన్ని అంశాలపై దృష్టి సారించడం ప్రయోజనకరం. ప్రధానంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రతిసారి ప్రశ్నలు ఇస్తున్నందున ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆల్జీబ్రా, జామెట్రీ అంశాలు చక్కని స్కోరింగ్‌కు దోహదం చేస్తాయి. ప్రాక్టీస్‌లో ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం మంచిది. మ్యాథమెటిక్స్ కోసం ఎన్సీఈఆర్టీ 8-12 తరగతుల పుస్తకాలను అధ్యయనం చేయాలి. -
త్రిభంగ నాట్యం అంటే ఏమిటి?
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్ స్టడీస్ చరిత్ర విభాగంలో మొత్తం 18 టాపిక్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి పాఠ్యాంశం నుంచి ఒక్కో ప్రశ్న వస్తుంది. కాబట్టి చరిత్ర నుంచి మొత్తం 36 మార్కులు అంచనా వేయవచ్చు. ఏయే అంశాలను ఏవిధంగా చదవాలి? టాపిక్స్ వారిగా ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలో చూద్దాం.. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రీ హిస్టోరిక్ కల్చర్‌లో ‘హోమో ఎరక్టస్’ ఆధారాలు ఏ దశలో ఏర్పడ్డాయి, హోమో సెపియన్స దశ ఏర్పడిన కాలం, ప్లిస్టోసిన్, పాతరాతియుగంలో మానవుడు కఠినమైన ‘క్వార్టజైట్’ రాళ్లను వాడటం, ఈ కాలానికి చెందిన ఆధారాలు (పంజాబ్‌లోని ‘సోనార్’ తీరం, మధ్యప్రదేశ్‌లోని బీమ్ బెట్కా, ఉత్తరప్రదేశ్‌లోని ‘బేలం’ లోయ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, రాజస్థాన్‌లోని దిద్వాన, మద్రాస్‌లోని పల్లవరంలో లభ్య మయ్యాయి) లాంటి అంశాలు ముఖ్యమైనవి. పాతరాతి యుగానికి చెందిన వర్ణచిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మధ్యప్రదేశ్‌లోని రాయఘర్, సింగన్‌పూర్, కైమూర్ ప్రాంతాల్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ కాలంనాటి స్థావరాలు, వారి శిల్పకళ, ఆర్థిక విధానంపై ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువ. ఉదా: ప్రాచీన కాలంలో ప్రీ-హిస్టోరిక్ కాలానికి చెందిన ‘మెహర్గర్’ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు కనిపెట్టారు. ఇది ఎక్కడ ఉంది? అని 2008లో నిర్వహించిన పరీక్షలో అడిగారు. ఈ ఆధారాలు క్రీ.పూ. 9000 - 1000 మధ్య కాలంలో పశ్చిమ బెలూచీస్తాన్ (పాకిస్థాన్)లో బయల్పడ్డాయి. అందువల్ల అభ్యర్థులు బుర్జహాం (కాశ్మీర్), చిరాండ్ (బీహార్), నాగార్జున కొండ స్థావరాల్లో కుక్క, మనిషి, సమాధులు ఎక్కడ బయల్పడ్డాయి, ఎముకలతో చేసిన పరికాలు ఎక్కడ లభించాయి, ‘హోల్స్టీల్’ అంటే ఏమిటి? ‘పునర్జన్మ’పై ఎప్పుడు విశ్వాసం కలిగింది? అల్ప పరిమాణం ఉన్న రాతి పరికరాలు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. కింది అంశాలను గుర్తుంచుకోండి.. చిరాండ్లో ఎముకలతో రూపొందించిన పనిముట్లు నగర్లో ‘కుండ’ అవశేషాలు అలహాబాద్‌లో వరిసాగుకు సంబంధించిన ఆధారాలు గంగేరియాలో ‘రాగితో’ చేసిన పనిముట్లు(రాగి నాగరికత రాజస్థాన్‌లో ప్రారంభమైంది) గణేశ్వర్‌లో రాగి గనులు నవదోతోలి, యరాన్ నాగ్దాలో మాళ్వా సంస్కృతి నెవాసా, చందోలి, సాన్గాం ప్రాంతాల్లో (జోర్వో సంస్కృతి) ఇనాంగావ్లో దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద ఇల్లు, మాతృదేవతా విగ్రహం బయల్పడ్డాయి. దంత శిల్పులు, నేత పనివారికి సంబంధించిన ఆధారాలు - ఇనాం గావ్‌లో చేతివృత్తులకు సంబంధించిన ఆధారాలు - సాన్గావ్లో కాయధాన్యాలు, పప్పులు, ఉలువలు, రాగులు - నవదతోలిలో మొక్కల పెంపకానికి చెందిన ఆధారాలు - సాల్ట్‌లేక్ (రాజస్థాన్) లో లభ్యమయ్యాయి. సింధూ నాగరికత సింధూ నాగరికత కాలంనాటి ముఖ్య పట్టణాలు, పట్టణ ప్రణాళిక, మురుగునీటి వ్యవస్థ, సామాజిక విధానం, నాగరికతా ఆవిర్భావం, పతనం, ఆ కాలంనాటి శాసనాలు, చిత్రకళ, నాట్యం మొదలైన అంశాలు ప్రాధాన్యమైనవి. 2001 సివిల్స్ పరీక్షలో ‘ఈ కింది ఏ పట్టణంలో సింధూ ప్రజల పెయింటింగ్‌స బయల్పడ్డాయి’ అని అడిగారు. దీనికి సమాధానం లోథాల్. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రాంతంలో ఎలాంటి పెయింటింగ్‌స లభ్యమయ్యాయి, వాటిలోని రంగులేవి లాంటి లోతైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. 2013లో ‘త్రిభంగ’ నాట్యం అంటే ఏమిటి?’ అని అడిగారు. సాధారణంగా కూచిపూడి, భరతనాట్యంపై అవగాహన ఉంటుందిగానీ త్రిభంగ అంటే చాలామందికి తెలియదు. ఇది ద్రవిడ నాగరికతలోనే ఆవిర్భవించింది. త్రి అంటే మూడు, భంగ అంటే భంగిమ. దీంట్లో 3 భంగిమలు ఉంటాయి. పట్టణాలు ఏ నదీతీరంలో ఉన్నాయి, ఏయే పట్టణాలు ఏయే ఆకారంలో ఉన్నాయి, సింధూ ప్రజలు ఉపయోగించిన లోహాలు, వాటి నైపుణ్యం, సింధూ లిపిని చదివినవారు లాంటి అంశాల గురించి తెలుసుకోవాలి. గర్భం నుంచి చెట్టు మొలచినట్టు ఉన్న ఒక స్త్రీ మూర్తి విగ్రహం, ఉద్యానవన నగరం, గబర్బండ లేదా రిజర్వాయర్లు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి నూతన అంశాలపై దృష్టి సారించాలి. ప్రిలిమినరీ అనేది జ్ఞానం గురించి తెలుసుకునే పరీక్ష కాదు, ఇది వడపోత విధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మెయిన్స జ్ఞానం, సబ్జెక్టు గురించి తెలుసుకునే పరీక్ష. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ప్రవర్తన; మానసిక సామర్థ్యం; డిసీషన్ మేకింగ్, ఆప్టిట్యూడ్ స్కిల్స్; అడ్మినిస్ట్రేషన్ మెథడ్స గురించి తెలుసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రధానమైంది. దీంట్లో విజయం సాధిస్తే, ఏదో ఒక సర్వీస్‌లో చేరడానికి బీజం పడుతుంది. యూపీఎస్సీ ఏయే అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వవచ్చో ఊహించడం కష్టతరమైన పని. అభ్యర్థులు అభ్యసనం ద్వారానే దీనికి సంబంధించిన అవగాహనను ఏర్పరచుకోవాలి. అభ్యర్థి చదివే అంశాలు, రంగాలు వారికి ప్రాధాన్యం కాకపోవచ్చు. సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య రంగా లు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యమైనవే. భారతీయ చరిత్ర - సంస్కృతి అనేది ప్రధానమైంది. మనదేశం, మన చరిత్ర, మన సంస్కృతి.. ఇవి ఏయే అంశాలతో ముడిపడి ఉన్నాయి? లాంటివాటిని ముఖ్యాంశాలుగా గుర్తించండి. వేద సమాజం ఇది ముఖ్యమైన పాఠం. ఆర్యుల జన్మస్థలంపై అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. మెక్‌డొనాల్డ్ ఆస్ట్రియా, హంగరి అని, మోర్గాన్ సైబీరియా అని, ఫొకొర్ని వోల్గా అని, పెంకాహెర్ట జర్మనీ అని పేర్కొన్నారు. వేదాలు జ్ఞానమూలాలు. వాటిపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. గతంలో- ‘యుద్ధాలు మానవుల మేధస్సుల్లోంచి ఆవిర్భవిస్తాయి’ అనే మాటలు ఏ వేదం లోనివి? అని అడిగారు. (జ: అధర్వణ వేదం) ‘నేను ఒక కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి పిండిగిర్నిలో పనిచేస్తుంది’? ఈ మాటలు ఏ వేదంలో ఉన్నాయి? (1996) ప్రాచీన వేదం ఏది? తెల్ల/ నల్ల వేదంగా ప్రసిద్ధి చెందింది ఏది? సంగీతానికి మూలం ఏది? లాంటి ప్రశ్నలు వచ్చాయి. వీటి ఆధారంగా ప్రశ్నల సామర్థ్యం, లోతును అంచనా వేసుకోవచ్చు. వేదాలు ఎన్ని? అవి ఏవి? అనేవి కాలం చెల్లిన ప్రశ్నలని గమనించాలి. 5వ వేదం ఏది? అసలు 5వ వేదంగా ఎన్ని గ్రంథాలకు పేర్లున్నాయి? లాంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. వేదాలు, వాటితో ముడిపడి ఉన్న బ్రాహ్మణాలు; వేద సంస్కృతి, తత్త్వశాస్త్రాలు; కల్ప, శిక్ష, నిరుక్త పదాలకు అర్థాలు; బృహత్మాలకథ అనే ప్రసిద్ధ రచన ఏ వేదంలో ఉంది? సర్వేజనా సుఖినోభవంతు, తమసోమా జ్యోతిర్గమయ లాంటి సూక్తులు ఎందులో ఉన్నాయి? వేద సమాజం, సాహిత్యం, ఆర్థిక విధానం, వేద, సింధూ నాగరికతల ప్రధాన పోలికలు మొదలైనవాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. మత ఉద్యమాలు జైనం, బౌద్ధం లాంటి నూతన మతాల స్థాపకులతోపాటు చార్వాకం, అజీవకం, ప్రాకృతిక వాదం, మత సిద్ధాంతాలు, వాటి శిల్పకళ, సమావేశాలు, మత గ్రంథాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. బుద్ధుని బోధనలు ‘పాళీ’ భాషలో, మహావీరుని బోధనలు అర్ధమాగధి భాషలో ఉన్నాయి. వారి సిద్ధాంతా లు ప్రతీయ సముత్పాదం (బౌద్ధం), శద్వాదం (జైనం), ప్రాకృతిక వాదం (అజీవకం), లాంటివి ముఖ్యమైనవి. బుద్ధుని దీర్ఘ ఉపన్యాసాలు, హ్రస్వ ఉపన్యాసాలు, సామెతలు ఏ గ్రంథంలో ఉన్నాయి? ‘ఆసియా జ్యోతి’ అనేది ఎవరి రచన? అవలోకితేశ్వర, మంజుశ్రీ, వజ్రపాణి, పద్మపాణి.. వారి చేతిలో ఉన్న గుర్తులు, బౌద్ధ ము ద్రలు - వాటి ప్రాముఖ్యం లాంటివాటి గురించి క్షుణ్ణంగా చదవాలి. 2013లో బౌద్ధ శిల్పకళకు సంబంధించి ‘చైత్యం, విహారం’ మధ్య ఉన్న భేదాలు ఏవి’ అనే ప్రశ్న అడిగారు. చైత్యం అనేది ప్రార్థ్దనాలయం, విహారం అంటే విశ్రాంతి మందిరం. వీటి ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. మౌర్యుల పరిపాలనా విధానం మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు; అశోకుని శాసనాలు, వాటిని వెలుగులోకి తెచ్చినవారు; అశోకుని ధమ్మ విధానం, మెయిన్స్ పరీక్ష కోణంలో ‘అశోకుని ధమ్మ విధానం ప్రస్తుత భారతీయ సమాజానికి అత్యంత విశ్వసనీయత, మానవనీయత గలదని ఏకీభవిస్తావా?’ లాంటి అంశాలు ప్రధానమైనవి. మౌర్యుల శిల్పకళ, ఆర్థిక విధానం, సమాజం గురించి తెలుసుకోవాలి. 1997లో మౌర్యులను క్షత్రీయులుగా ఏ గ్రంథంలో తెలిపారు? (జవాబు: దివ్యవదన. ఇది నేపాల్ బౌద్ధగ్రంథం). 2012లో కౌటిల్యుడికి, విష్ణుశర్మ, చాణక్యుడు అనే ఇతర పేర్లు ఉన్నట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు? అని అడిగారు. (జవాబు: విశాఖదత్తుని ముద్రరాక్షసం) మౌర్యుల అనంతర యుగం చివరి మౌర్యరాజు బృహద్రదుడుని అతడి సేనాని పుష్యమిత్రుడు హత్యచేసి ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు. శుంగుల కాలంలో ‘మాలతీమాదవీయం’ను రచించిన భవభూతి, పాణిని, వ్యాకరణాన్ని రాసిన పతంజలి, ‘పాశుపతశైవం’ను స్థాపించిన లకులీస, ‘వైష్ణవం’ను స్థాపించిన వాసుదేవుడు ప్రసిద్ధి చెందినవారు. దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో ‘పుహార్’, పాండ్యుల కాలంలో ‘కొర్కయ్’, చేర పాలనా కాలంలో ‘తొండై’ ప్రసిద్ధి చెందిన నౌకా కేంద్రాలు. శాతవాహనుల సామాజిక, ఆర్థిక, శిల్పకళా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ కాలంలో భారతదేశ ఉత్తర, వాయువ్య ప్రాంతాలను ఇండో గ్రీకులు, శకులు, పార్దియన్లు, కుషాణులు పరిపాలించారు. స్ట్రాబో, ఫ్లూటార్క, జస్టిన్ గ్రీకు చరిత్రకారులకు సంబంధించి అవగాహన అవసరం. శకుల సంస్కృత శాసనం, పార్దియన్ల కాలంలో వచ్చిన క్రైస్తవ సన్యాసి, కుషాణుల శిల్పకళలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విక్రమశకం (58), శక సంవత్సరం (78), అంధకారయుగంగా పిలిచే 200 బీసీ నుంచి 300 ఏడీ మధ్య కాలానికి సంబంధించిన అంశాలపై అవగాహన అవసరం. గుప్తుల యుగం గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారని ‘జయస్వాల్’ పేర్కొన్నారు. తెలుగు ప్రాం తం వారైన ఇక్ష్వాకుల వంశానికి చెందినవారని మజుందార్ భావించాడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. సముద్రగుప్తుడిని భారతీయ నెపోలియన్ అంటారు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీని స్థాపించాడు. స్కందగుప్తుడు యుద్ధవీరుడు. భానుగుప్తుడు ఎరాన్ శాసన నిర్మాత. గుప్తుల కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. వ్యాపారులను - సెట్టిలు అనేవారు. జాజ్‌మనీ, విష్టి, మొదలైన ఆర్థిక పరిస్థితులు, ఉద్వాంగ, వతభూత లాంటి పన్నులు, సాహిత్యం, శిల్పకళా రంగాలు, సామాజిక పరిస్థితులను క్షుణ్ణం గా అధ్యయనం చేయాలి. 2000 ప్రిలిమ్స్ పరీక్షలో ‘క్షేత్ర, ఖిలా, అనేవి ఏ రకమైన భూములు?’, 2002 పరీక్షలో ‘మనుస్మృతి, యజ్ఞవల్క, బృహస్పతి, దేవల సృ్మతులను క్రమంలో అమర్చండి.’ అనే ప్రశ్నలు అడిగారు. ‘అభినవభారత’ రచన, సంజనఫలకాలు, నాట్యదర్పణి గ్రంథాల రచయితలు ఎవరు? పౌలిస, లఘుజాతక గ్రంథాలలోని గణిత సంబంధిత విషయాలను అధ్యయనం చేయాలి. మధ్యయుగ భారతదేశంలో చోళుల పాలనాంశాలు, ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల సాంస్కృతిక సేవ, బెంగాల్లో సేన వంశం అద్భుత సాగర రచన, జనకుని పృథ్వీరాజ విజయం, భట్టి రావణ సుధ, పద్మగుప్తుని నరశాశాంక చరిత్ర, చక్రపాణి దత్త చికిత్సా సాగరం, రాజామార్తాండ యోగ సూత్రాల వ్యాఖ్యానం, చోళుల గ్రామపాలన, ఆర్థిక విధానం లాంటివి ప్రధానాంశాలు. వీరి శిల్పకళ, కోరంగనాథ్ దేవాలయం(పరాంతక), బృహదీశ్వర (రాజరాజ), ఐరావతారేశ్వరా (రెండో రాజరాజ) లాంటి నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. పరమారులు ‘దారా’ చాళుక్యులు ‘అనిల్‌వారా’, సేన ‘విజయపుర’ గహద్వల ‘కనోజ్’ రాజధానులుగా పాలించారు. చోళుల కాలంలో మండలం (రాష్ట్రాలు) నాడు లు (జిల్లాలు), కొట్టం (మండలం), ఉర్ (గ్రామం)గా విభజన చేయడం లాంటి పరిపాలనాంశాలపై దృష్టి అవసరం. తర్వాతి సాంస్కృతిక మార్పులను క్షుణ్ణంగా చదవాలి. 750 నుంచి 1200 వరకు వచ్చిన మార్పు లు గమనించాలి. ఈ విభాగంలో చిస్తి మొహినుద్దీన్ (1191), సౌహార్ది -షియాబుద్దిన్ ఉమర్ (1290), ఖాద్రీ షానియాముల్లా (1430), నక్షబంది బకీబిల్లా (1603) లాంటివారు ముస్లింలలో వచ్చిన భక్తి ఉద్యమకారులు. హిందూ మతంలో, శంకరదేవుడు (అస్సాం), లల్ల (కాశ్మీర్), నర్సింగ్ మెహతా (గుజరాత్) ముఖ్యులు. రాగమార్గం, భక్తిమార్గం, బెడబెద, పుష్టిమార్గం, ప్రాపతి మార్గాలు ఎవరివి?, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, ద్వైతాద్వైతా, శుద్దా ద్వైతం ఎవరివి? లాంటివాటి గురించి చదవాలి. 2001లో ‘‘కిందివారిలో ఎవరు ‘కీర్తన’లు ప్రవేశపెట్టారు?’’ అని అడిగారు. (జవాబు: చైతన్య) కిందివారిలో వైష్ణవ భక్తి ఉద్యమకారులెవరు? 1) చైతన్య 2) లల్లదేవ 3) నంబిఅండార్ 4) తులసీదాస్ 5) రామానుజ ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 1, 4, 5 డి) 3, 4, 5 జవాబు: సి -
What is his new rank from the end?
Civils Prelims Paper - II Model Questions 1. Read the following statements and answer the four items that follow: Five cities P, Q, R, S and T are connected by different modes of transport as follows. P and Q are connected by boat as well as rail. S and R are connected by bus and boat. Q and T are connected by air only. P and T are connected by boat only. T and R are connected by rail and bus. i) Which mode of transport would help one to reach R starting from Q, but without changing the mode of transport? a) Boat b) Rail c) Bus d) Air ii) If a Person visits each of the places starting from 'P' and gets back to 'P'. Which of the follo-wing places must he visit twice? a) Q b) R c) S d) T iii) Which of the following pairs of cities is connected by any of the routes directly without going to any other city? a) P and T b) T and S c) Q and R d) None of these iv) Between which two cities among the pairs of cities given below are there maximum travel options available? a) Q and S b) P and R c) P and T d) Q and R Sol: i) One can travel from Q to P by boat and from P to R also by boat. Answer: a ii) 'S' is connected only to 'R' and no other city. Therefore in order to visit all cities one must visit 'R' twice. Because he has to reach 'S' via 'R' and again gets back to 'R' Answer: b iii) Among the given options, no two cities are directly connected. Answer: d iv) Between Q and S, there are 8 different options available to travel. And no other pair has so many options. Answer: a 2. In a class of 45 students, a boy is ranked 20th. When two boys joined, his rank was dropped by one. What is his new rank from the end? a) 25 b) 26 c) 27 d) 28 Sol: It is given that, among 47 stude-nts the boy ranks 21st from top. \ his rank from the end = 47 – 21 + 1 = 27 Answer: c 3. A thief running at 8 km/hr is ch-ased by a policeman whose speed is 10 km/hr. If the thief is 100mt ahead of the policeman, then the time required for the policeman to catch the thief will be? a) 2 min b) 3 min c) 4 min d) 6 min Sol: Relative velocity between thief and policeman = 10 – 8 = 2 km/hr. Therefore police would get an advantage of 2 km or 2000 mt in 1 hour or 60 min. \ To get an advantage of 100 mt, the time required Answer: b 4. A train travels at a certain aver-age speed for a distance of 63 km and then travels a distance or 72 km at an average speed of 6 km/ hr more than its original speed. If it takes 3 hours to complete the total journey, what is the original speed of the train in km/hr? a) 24 b) 33 c) 42 d) 66 Sol: From the given data, the average speed during the whole journey = Total distance / Total time This average speed shall lie in between the original average speed and the increased (by 6 km/hr) average speed. The only possibility among the given 4 options is 42 km/hr. Because 45 lies in between 42 and 42 + 6 = 48. Answer: c 5. Consider the following matrix What is the number at 'X' in the above matrix a) 5 b) 8 c) 9 d) 11 Sol: From the numbers in the given matrix 33 + 73 = 27 + 343 = 370 23 + 63 = 8 + 216 = 224 Similarly 13 + x3 = 730 Þ x3 = 729 Þ x = 9 Answer: c 6. Examine the following three figures in which the numbers follow a specific pattern. The missing number in the third figure above is a) 7 b) 16 c) 21 d) 28 Sol: First figure: Second figure: Third figure: Answer: b 7. A cube has six numbers marked 1, 2, 3, 4, 5 and 6 on its faces. Three views of the cube are shown below. What possible numbers can exist on the two faces marked A and B, respectively on the cube? a) 2 and 3 b) 6 and 1 c) 1 and 4 d) 3 and 1 Sol: This problem can be solved by using a simple technique. From the first and second views of the cube it is clear that 6, 4, 2 and 3 are adjacent to 1. Therefore the two numbers 1 and 5 are on the opposite faces of the cube. Therefore 1 cannot be on the adjacent face of 5. So we can rule out the three options (b), (c) and (d). Answer: a 8. A gardener has 1000 plants. He wants to plant them in such a way that the number of rows and the number of columns remain the same. What is the minimum number of plants that he needs more for this purpose? a) 14 b) 24 c) 32 d) 34 Sol: By observation, 30 ´ 30 = 900 31 ´ 31 = 961 32 ´ 32 = 1024 \He needs a minimum of 24 plants Answer: b 9. A person can walk a certain dis-tance and drive back in 6 hours. He can also walk both ways in 10 hours. How much time will he take to drive both ways? a) 2 Hours b) 2.5 Hours c) 5.5 Hours d) 4 Hours Sol: It is given that walk + drive = 6 hours walk + walk = 10 hours Þ twice walk + twice drive = 12 hours – twice walk = 10 hours Þ twice drive = 2 hours Answer: a 10. The tank full petrol in Arun's motorcycle lasts for 10 days. If he starts using 25% more every day, how many days will the tank full petrol last? a) 5 b) 6 c) 7 d) 8 Sol: If consumption is increased by 25%, in 4 days, the petrol suffici-ent for 5 days will be consumed. Therefore in 8 days, the petrol sufficient for 10 days will be consumed. Answer: d 11. In a garrison, there was food for 1000 soldiers for one month. Aft-er 10 days, 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to car-ry on with the remaining food? a) 25 days b) 20 days c) 15 days d) 10 days Sol: Let one packed of food is suf-ficient for a soldier per one day. Then the no. of food packets = 1000 ´ 30 = 30,000 In 10 days, no.of food packets consumed = 10,000. The remaining food packets = 20,000 For 2000 soldiers, these last for Answer: d