కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి? | Competitive Counseling for civils Preliminary | Sakshi
Sakshi News home page

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి?

Published Sun, Jun 29 2014 5:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి?

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి?

సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సమీకరణాలు, ఫార్మూలాలపై ప్రశ్నలు వస్తాయా?     - మాధవి, రామంతాపూర్
 సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ ఒక భాగం. జనరల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్(భౌతిక, రసాయన శాస్త్రాలు)+ జీవ శాస్త్రం.  సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఫిజిక్స్‌కు సంబంధించి ముఖ్యంగా ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రిక శక్తి, ద్రవ  పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రం అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలు (Fundamental Concept), అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక్కో ప్రాథమిక అంశంపైన భిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు మే 2013లో జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను కింది విధంగా అడిగారు.
 
 1. కాంతి ధర్మాలకు చెందిన ఐదు అనువర్తనాలను ఇచ్చి, వాటిలో కాంతి ధర్మానికి సంబంధించనటువంటిది ఏది? అని అడిగారు.(ఈ ప్రశ్నలను స్టేట్‌మెంట్ రూపంలో ఇచ్చారు)
 కాబట్టి రాబోయే పరీక్షలో కూడా ఇలాంటి భిన్నమైన కోణాల్లో ప్రశ్నలు అడిగి అవకాశం లేకపోలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఫిజిక్స్ నుంచి సమీకరణాలు, లెక్కలు(Problems), ప్రయోగాలు, ఫార్మూలాల గురించిన ఎలాంటి ప్రశ్నలూ అడగరు. ఫిజిక్స్ సబ్జెక్టుపై మంచి అవగాహన ఏర్పరచుకుంటే సివిల్స్ మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడిగే ప్రశ్నలను మరింత ప్రభావపూరితంగా (Most Effective) సమాధానాలు రాయొచ్చు. ఉదాహరణకు డిసెంబర్ 2013లో నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో త్రి డెమైన్షనల్ ప్రింటింగ్ గురించి, దాని ఉపయోగాల గురించి ప్రశ్న అడిగారు. ఇలాంటి ప్రశ్నలకు కావాల్సిన నిర్వచనాలను ఫిజిక్స్ నుంచి పొందొచ్చు.
 ఇన్‌ఫుట్స్: సీ.హెచ్.మోహన్, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
 రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలకు ఎలా ప్రిపేర్ కావాలో  తెలపండి?
 - సుదీప్తి, కంటోన్మెంట్
 
 రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు, 50 మార్కుల చొప్పున వస్తాయి. రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేలా ఉంటాయి. మిగతా విభాగాలతో పోలిస్తే.. రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేగంగానే సమాధానాలను గుర్తించొచ్చు. రీజనింగ్‌లో సిరీస్; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్‌వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలు ఉంటాయి.
 
  నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు నిరంతర ప్రాక్టీస్ ఏకైక మార్గం. ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్యాలిక్యులేషన్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కూడికలు, తీసివేతలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలకు సంబంధించి 15-20 ప్రశ్నలు వస్తాయి. శాతాలు, భిన్నాలు, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, అనుపాతాలు, లాభనష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సాధన చేయాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలను పరిశీలించాలి. సూత్రాలు, వాటి ఆధారంగా సమస్యలను సాధించాలి. షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సమస్యల్ని సాధిస్తే సమయం ఆదా అవుతుంది.
 ఇన్‌ఫుట్స్: కె.వి.జ్ఞానకుమార్, హైదరాబాద్
 
 నేను యూపీఎస్సీ ఎన్‌డీఏ ఏగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి.
 - జి.రమేశ్, తిరుమలగిరి
 
 త్రివిధ దళాల్లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశం ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ. రాత పరీక్ష సెప్టెంబర్ 28న ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ చాలా కీలకమైంది. 120 ప్రశ్నలు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. సమయం 150 నిమిషాలు ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో ముఖ్యంగా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.
 
 అర్థమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్-డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలోని అవగాహన స్థాయిని, ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. కాబట్టి ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే సమస్యలను వేగంగా సాధించే చిట్కాలను నేర్చుకోవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి ప్రాక్టీస్‌లో అన్ని అంశాలపై దృష్టి సారించడం ప్రయోజనకరం. ప్రధానంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రతిసారి ప్రశ్నలు ఇస్తున్నందున ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆల్జీబ్రా, జామెట్రీ అంశాలు చక్కని స్కోరింగ్‌కు దోహదం చేస్తాయి. ప్రాక్టీస్‌లో ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం మంచిది. మ్యాథమెటిక్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 8-12 తరగతుల పుస్తకాలను అధ్యయనం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement