Civils exam
-
మహేష్ భగవత్ కృషి ఫలించింది
సాక్షి,హైదరాబాద్: తాజాగా విడుదలైన సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ మాధ్యమాల ద్వారా మహేష్‌భగవత్ ఇచ్చిన సూచనలతో సుమారు రెండువందల మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణా నుండి అనన్యారెడ్డి సహా ఎన్పీఎలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరు అయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్షా సమయాల్లో వత్తిడి,సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
UPSC Result 2023: కోచింగ్ నచ్చలేదు.. ఇంటిలోనే.. ఇంటర్నెట్లో శోధిస్తూ..
నారాయణపేట/హుజూర్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమెనే నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె నూకల ఉమాహారతి. హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఉమాహారతి... 2012లో ఇంటర్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సోమవారమే ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరగా ఆ మర్నాడే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కానుండటం విశేషం. సివిల్స్‌లో ర్యాంకు సందర్భంగా ఉమాహారతితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే.. గత సివిల్స్ పేపర్లూ చదివా... సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్‌వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్ సెంటర్లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో స్టడీ మెటీరియల్ సెర్చ్ చేశా. గత సివిల్ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు... ఐపీఎస్ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. -
అకడమిక్ పరీక్షలకు, పోటీ పరీక్షలకు ఎంతో తేడా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ కొలువుల జాతర సాగుతోంది. ప్రభుత్వం దాదాపు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ ఉద్యోగాలపైనే ఉంది. సహజంగా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కసరత్తు ప్రారంభించడం పరిపాటిగా కనిపిస్తుంది. దరఖాస్తు అనంతరం పోటీకి సన్నద్ధమై.. పరీక్ష తేదీ నాటికి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఆమేరకు నియామక సంస్థలు సైతం సమయాన్ని ఇస్తాయి. అయితే ఆ వ్యవధిలో ప్రిపేర్ కావడమంటే అకడమిక్ పరీక్షలకు సిద్ధమైనట్లు కాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.ముక్తేశ్వర్రావు సూచిస్తున్నారు. అకడమిక్ పరీక్షలకు కేవలం విషయాన్ని చదివి రాస్తే సరిపోతుందని, కానీ పోటీ పరీక్షల్లో మాత్రం ప్రతి విషయాన్ని లోతుగా చదివి, ఆకళింపు చేసుకుంటేనే విజయం సాధిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆయన ‘సాక్షి’తో పలు అంశాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే... సివిల్ సర్వెంట్‌కు... సివిల్ సర్వెంట్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నత ఉద్యోగం. ఇక రాష్ట్రస్థాయిలో గ్రూప్–1 ఉద్యోగం ఉత్తమమైంది. వీటికి ఎంతో విశిష్టత ఉంటుంది. అధికారం, చట్టం, నిధులు, స్వీయ నిర్ణయానికి ప్రాధాన్యత ఉండటంతో సమాజానికి మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యవస్థలో మార్పులు తేవాలంటే ఇలాంటి ఉద్యోగాలతో సాధ్యమవుతుంది. అంతటి ఉన్నత ఉద్యోగం పొందాలంటే ఎంతో సాధన అవసరం. స్వీయ దృక్పథం ఉండాలి... ఒక అంశాన్ని చదివినప్పుడు దానిపై స్వీయ దృక్పథం ఉండాలి. మనకంటూ ఒక వ్యూ పాయింట్ ఉంటేనే దానిపై పరిశీలన చేయగలం. అలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అప్పుడే ఆ అంశంపై మనకు పట్టు పెరుగుతుంది. ఇందుకు ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఆ రోజుల్లో నేను రోజుకు కనీసం పది నుంచి పన్నెండు సంపాదకీయాలు చదివే వాడిని. శ్రద్ధతో ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. వ్యక్తీకరణ కీలకం... సివిల్స్, గ్రూప్స్‌లో రాత పరీక్షలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ పరీక్షలకు వ్యక్తీకరణ అనేది కీలకం. ఒక అంశం చదివిన తర్వాత దాన్ని అర్థవంతంగా వ్యక్తీకరించాలి. అందుకు సరైన భాష, పదప్రయోగం వాడాలి. ఏ సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలనే అవగాహన ఉంటేనే వ్యక్తీకరణ సులభమవుతుంది. విషయ పరిజ్ఞానంతోపాటు సమాజం పట్ల అవగాహన ఉండాలి. అందుకోసం సమాజాన్ని చదవాలి. వార్తాపత్రికలతోపాటు సామాజిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి. ప్రతి అంశాన్ని లోతుగా చదవడం నేర్చుకుంటే దానిపై అవగాహన పెరుగుతుంది. వీలుంటే నిపుణులతో ఆయా అంశాలపై చర్చిస్తే మంచి ఫలితం ఉంటుంది. తెలుగు అకాడమీ పుస్తకాలు బాగు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివితే మంచి ఫలితం ఉంటుంది. జాతీయ అంశాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో కూడిన పుస్తకాలున్నాయి. పోటీ పరీక్షల్లో విషయ పరిజ్ఞానం ఎంతో అవసరం. అది మనకు నచి్చన భాషలో సన్నద్ధం కావొచ్చు. మాతృభాషలో అయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ పుస్తకాలు చదవడంతోపాటు సిలబస్ పూర్తిచేసే వీలుంటుంది. ఆ తర్వాత అవసరం ఉన్న భాషలోకి దాన్ని వినియోగించుకోవాలి. బహుముఖకోణం... ఒక అంశాన్ని మనం పరిశీలించే తీరును బట్టి అవగాహనకు వస్తాం. అలా ప్రతి అంశానికి బహుముఖ కోణాలుంటాయి. నేను ఒకసారి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చాయి. అప్పుడు వికారాబాద్ ప్రాంతంలోని ఓ గ్రామానికి వెళ్లాను. అక్కడి మెజార్టీ మహిళలు తాగునీటి సౌకర్యం కలి్పంచాలని కోరగా... ఇతర పనులు చేసుకునే పురుషులు మాత్రం మంచి రోడ్డు వేయాలని అడిగారు. కరువు పరిస్థితుల్లో కూడా ఒక్కోక్కరి డిమాండ్ ఒక్కోలా ఉంది. అంటే మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు కాబట్టి తాగునీరు అడిగితే, పనులు చేసుకునే వారు మెరుగైన రవాణా కోసం రోడ్లు అడిగారు. ఇలా ఒక్కో అంశానికి అనేక కోణాలు ఉంటాయి. అలా మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. -
సివిల్స్‌కు సిద్ధమవుతారా.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు..సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్ సర్వీసెస్–2022 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ, పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్... సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్‌పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. గతేడాది కంటే పెరిగిన పోస్టులు సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్‌ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్‌లు, 2020లో 796 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పది లక్షల వరకు పోటీ సివిల్స్‌కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్‌ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తం మూడు దశలు సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ) ప్రిలిమినరీ ఇలా తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు.. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్.. ఇలా ► సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్. ► ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ► అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ► తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు. ► మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. ► మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించే మార్కులు 275. ► పర్సనాలిటీ టెస్ట్‌లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే సివిల్స్ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి. ► జనరల్ స్టడీస్ పేపర్‌గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ► రెండో పేపర్ సీశాట్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ► అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అనుసంధాన వ్యూహం సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్లపై ప్రత్యేక దృష్టి ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి. పేపర్–2కు ఇలా అర్హత పేపర్‌గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్‌తో అనుసంధానం సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్‌లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్‌ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సిలబస్‌పై అవగాహన ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది. పుస్తకాలు సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్‌లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు ► పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్(సస్టెయినబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్. ► పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్. దీర్ఘకాలిక వ్యూహం సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్‌ను మెయిన్ ఎగ్జామినేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. – శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం ► అర్హత:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in/mainmenu2.php ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in -
కష్టంగానే సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్–2021 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 77 పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది హాజరైనట్లు అంచనా. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 68 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 40 వేలమంది వరకు హాజరయ్యారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ప్రొటోకాల్‌ను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి పేపర్–2 పరీక్ష నిర్వహించారు. జూన్ 29న జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్ కారణంగా అక్టోబర్ 10న నిర్వహించారు. పరీక్షలో ప్రశ్నల తీరు ఎలా ఉందంటే... ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి కరెంటు అఫైర్స్ ప్రశ్నలు విభిన్నమైన రీతిలో అడిగారు. కరోనా నేపథ్యంలో పాండమిక్, ఇండో చైనా సంబంధాలు తదితర అంశాల్లో ప్రశ్నలున్నాయి. ఆధునిక చరిత్ర, కళలు, సంస్కృతికి సంబంధించిన అంశాల నుంచి 20 వరకు ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, ఎకానమీల నుంచి 15 చొప్పున ప్రశ్నలున్నాయి. ఈసారి కొత్తగా స్పోర్ట్స్ ప్రశ్నలు క్రికెట్ టెస్టు సిరీస్ వంటివి అడిగారు. పేపర్–2కు సంబంధించి సీశాట్‌లో వచ్చిన ప్రశ్నలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్సర్ చేయగలిగేలా ఉన్నాయి. మేథ్స్, రీజనింగ్, పాసేజ్ రీడింగ్ వంటి అంశాలు కష్టంగా ఉన్నాయి. ప్రశ్నలు దీర్ఘంగా ఉన్నాయి. లాజికల్, రీజనింగ్, అనలటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. గత ఏడాదికన్నా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయన్నారు. మొత్తంగా మూడొంతుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆధునిక చరిత్ర, ఎకనామీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా పర్యావరణ శాస్త్రం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రలకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ప్రశ్నలున్నాయి. కటాఫ్‌పై అంచనాలు ప్రిలిమ్స్ కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 796 పోస్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 712కు తగ్గింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య తగ్గనుంది. పోస్టుల సంఖ్య తగ్గడంతోపాటు, గత ఏడాదికన్నా ఈసారి ప్రశ్నలు కూడా కష్టంగా ఉన్నందున ఈ ప్రిలిమ్స్ కటాఫ్ 93 నుంచి 95గా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు చెబుతున్నారు. పేపర్–1లోని మార్కుల ఆధారంగానే కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 (సీశాట్)కు కటాఫ్ ఉండదు. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్లో వెలువడవచ్చని భావిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. -
స్పీకర్ కుమార్తె ఐఏఎస్‌గా అడ్డదారిలో ఎంపిక కాలే
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికవడంపై వివాదం ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ విషయం చర్చ కొనసాగుతోంది. అంజలి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని మెయిన్స్ పరీక్ష రాయకుండానే అడ్డదారిలో ఐఏఎస్‌కు ఎంపికైందని పుకార్లు వస్తున్నాయి. ఈ వివాదం రాజకీయ విమర్శలకు కూడా దారి తీస్తోంది. దొడ్డి దారిన తన కుమార్తెను ఐఏఎస్‌గా ఎంపికయ్యేలా స్పీకర్ ఓం బిర్లా చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. కావాల్సి వస్తే యూపీఎస్సీలో పరిశీలించవచ్చని ట్వీట్ చేసింది. ఇటీవల అంజలి బిర్లా ఐఏఎస్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఆమె తండ్రి పదవి ద్వారా ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలపై ఫ్యాక్ట్ చెక్ సంస్థ నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా యూపీఎస్సీ వెబ్సైట్లో అంజలి వివరాలను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. పరీక్ష రాయకుండానే ఐఏఎస్‌గా ఎంపికైందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఏఎఫ్‌పీ కొట్టిపారేసింది. ఈ సందర్భంగా వెబ్సైట్లో అంజలి బిర్లాకు వచ్చిన మార్కులను కూడా షేర్ చేసింది. ఓం బిర్లా కుమార్తె పరీక్షలు రాసి ఇంటర్వ్యూ ఎదుర్కొని నిష్పక్షపాతంగా ఐఏఎస్‌గా ఎంపికైందని ఆ సంస్థ వివరించింది. అయితే ఎంపికైన తొలి రోజు నుంచే ఈ పుకార్లు రావడంతో అంజలి బిర్లా అప్పుడే సోషల్ మీడియా వేదికగా బదులిచ్చింది. ఈ పుకార్లను చూసి తనకు చాలా నవ్వొస్తుందని పేర్కొంది. అత్యంత నిష్పక్షపాతంగా సివిల్స్ పరీక్షలు జరుగుతాయని.. లక్షలాది మంది పరీక్షలు రాస్తే కేవలం 900 మంది ఎంపికవుతారని వివరించింది. అయితే తనను కాకపోయినా యూపీఎస్సీని గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. తాను రెండేళ్ల పాటు కష్టపడ్డానని.. 8 మార్కుల తేడాతో మొదటి జాబితాలో తన పేరు రాలేదని ఈ సందర్భంగా అంజలి తెలిపింది. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్–2 ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పరీక్షలను యథావిధిగా నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తారు. ► దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ► ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. ► అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ► వీటిని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ► అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఈ–అడ్మిట్ కార్డుతో పాటు అధికారికి ఫొటో గుర్తింపుకార్డును చూపించాలి. రెండింటిలోని ఫొటోలు ఒకేమాదిరిగా ఉండాలి. ► పరీక్ష ప్రారంభానికి పది నిముషాల ముందే ప్రవేశద్వారాలను మూసివేస్తారు. ► పరీక్ష కేంద్రాల్లోకి బాల్‌పాయింట్ పెన్నును అనుమతిస్తారు. చేతి గడియారాలు, స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ పరికరాలను నిషేధించారు. ► మాస్కులు లేకుంటే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పారదర్శక సీసాల్లో శానిటైజర్‌ను అనుమతిస్తారు. -
గవర్నర్ కీలుబొమ్మా?
పట్నా: బిహార్‌లో ఆదివారం సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇండియాలో, ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో గవర్నర్ పాత్రను విశ్లేషించండి. గవర్నర్ కీలుబొమ్మా(కఠ్పుత్లీ)?’అన్నది ఆ ప్రశ్న. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విపక్షాలు విమర్శించడం జరిగేదే. అయితే, ఏకంగా ప్రభుత్వ పరీక్షలో, అందులోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రావడంతో విద్యార్థులు విస్తుపోయారు. బిహార్ సర్వీస్ కమిషన్ అధికారులు ఈ తప్పును ప్రశ్నపత్రాన్ని రూపొందించిన అధ్యాపకుడిపైకి నెట్టేశారు. ‘ప్రశ్నలో తప్పేమీ లేదు.అయితే, కఠ్పుత్లీ పదాన్ని తీసేసి ఉంటే బాగుండేది’అని నసిగారు. గతంలో 8వతరగతి పరీక్షలో కశ్మీర్‌ను ఓ దేశంగా పేర్కొంటూ.. ‘చైనా, ఇండియా, నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్ దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు?’ అన్న ప్రశ్న వచ్చింది. 2016లో ఇంటర్మీడియెట్‌లో ర్యాంకు సాధించిన రూబీరాయ్ పొలిటికల్ సైన్స్‌లో ‘వంట చేయడం’ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది. 2015లో పరీక్షరాసే విద్యార్థులకు కాపీలు అందించడం కోసం వారి బంధువులు పరీక్ష గది గోడలు ఎక్కడం తెల్సిందే. -
నేడే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
విజయవాడ/హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్-2019 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతోంది. మొత్తం 72 నగరాల్లో ఈ పరీక్ష కొనసాగుతోంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్.., మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆప్షన్ సబ్జెక్ట్ పరీక్షలు ఉండనున్నాయి. సివిల్ ప్రిలిమినరీ పరీక్ష కోసం హైదరాబాద్‌లో 103 పరీక్షా కేంద్రాలు, విజయవాడలో 22 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో జరుగుతున్న పిలిమినరీ పరీక్ష రాసేందుకు పలువురు దివ్యాంగ అభ్యర్థులు హాజరయ్యారు. విజయవాడలో సివిల్స్ పిలిమినరీ పరీక్ష రాసేందుకు హాజరైన దివ్యాంగ అభ్యర్థులు.. (ఫొటోలు) -
ముప్పుతిప్పలు పెట్టిన ప్రిలిమ్స్ ప్రశ్నలు!
సాక్షి, అమరావతి/ సాక్షి అమరావతి బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పేపర్ 2 నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 నుంచి 13 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 33 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 35 నుంచి 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. విజయవాడలో 12,176 మంది పరీక్ష రాయాల్సి ఉండగా సుమారు 4,800 మంది హాజరయ్యారు. విశాఖపట్నంలో 11,566 మంది, తిరుపతిలో 6,635 మంది, అనంతపురంలో 2,869 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 35 శాతానికి మించి రాలేదు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికం గతంలో కన్నా ఈసారి ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్‌లో నేరుగా సమాధానాలు గుర్తించే ప్రశ్నలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ఇండెక్స్‌ను ఆధారం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జాగ్రఫీలో చాలా తక్కువ ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘మోడ్రన్ ఇండియా’లో ప్రశ్నలు అడిగినా అవి ఒకింత కష్టంగానే ఉన్నాయని తెలిపారు. రెండో పేపర్లో వచ్చిన ప్రశ్నలు మేథమెటిక్స్ సబ్జెక్టు చదువుకున్న వారికి సులభంగా ఉన్నాయని చెప్పారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు గతంలో కన్నా కొంత సులభంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రిలిమ్స్ ప్రశ్నలను గమనిస్తే స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి పరీక్షలకు అభ్యర్థుల హాజరు కూడా తగ్గింది’’ అని సివిల్స్ శిక్షణ సంస్థ బ్రెయిన్‌ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు. ఫ్యాక్చువల్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారని, లోతుగా విశ్లేషించేలా అవి ఉన్నాయని సివిల్స్ సబ్జెక్టు నిపుణురాలు బాలలత తెలిపారు. ‘‘కరెంట్ ఆఫైర్స్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చినా వాటిని నేరుగా అడగలేదు. ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే తప్ప వాటి సమధానాలు గుర్తించలేని విధంగా ప్రశ్నలున్నాయి’’ అని విజన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శశాంక్ వివరించారు. కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు ఈసారి సివిల్స్ ప్రశ్నల తీరుతో కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు 105 కాగా, ఈసారి కటాఫ్ అదే విధంగా ఉండడమో, ఒకటి రెండు మార్కులు తగ్గడమో ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. పోస్టులు సంఖ్య తగ్గుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది 1000 పోస్టులుండగా ఈసారి 200 వరకు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే కటాఫ్ 105 నుంచి 110 మధ్య ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి అక్టోబర్ 1న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తమిళనాడులో సివిల్స్ పరీక్షకు హాజరైన ఐపీఎస్ అధికారి ఒకరు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
కొడుకును చూసుకుంటూనే.. రెండో ర్యాంకు
చండీగఢ్: ఓ వైపు గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరో వైపు ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసు పరీక్షలో ఏకంగా రెండో ర్యాంకుతో సత్తాచాటారు చండీగఢ్‌కు చెందిన అను కుమారి(31). నాలుగేళ్ల కుమారుడిని చూసుకుంటూనే రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదువుతూ రెండో ప్రయత్నంలోనే రెండో ర్యాంకు సాధించారు. ఆమె భర్త వ్యాపారవేత్త. ఆమె దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో బీఎస్సీ పూర్తి చేశారు. నాగ్‌పుర్‌లోని ఐఎంటీ నుంచి ఎంబీఏ చేశారు. 2016లో తొలిసారి ప్రయత్నించారు. కేవలం రెండు నెలలు మాత్రమే చదివి పరీక్ష రాశారు. అయితే ప్రిలిమ్స్‌లో ఒక్క మార్కుతో అర్హత కోల్పోయారు. దీంతో మళ్లీ ప్రయత్నించి ఏకంగా రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తాను సివిల్స్‌కు సన్నద్ధమైన గ్రామంలో పేపర్ కూడా ఉండదని, ఆన్లైన్ సహాయంతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యానని పేర్కొన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే దృఢసంకల్పం అవసరం అని, అలా ఉంటే విజయం సాధించకుండా ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల భద్రతే తన ప్రధాన లక్ష్యమన్నారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టార్ అను కుమారికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అను కుమారి నుంచి హరియాణా అమ్మాయిలు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మొత్తం 990 మంది వివిధ సర్వీసులకు ఎంపిక కాగా, వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. యూపీఎస్సీ టాప్ 25 జాబితాలో 8 మంది మహిళలు ఉన్నారు. -
వరంగల్‌లో సివిల్స్ పరీక్ష
- యూపీఎస్సీ నిర్ణయం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ - ఆగస్టు 7న తొలిసారి పరీక్ష - వరంగల్‌కు అరుదైన గుర్తింపు వరంగల్: విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఇక నుంచి వరంగల్లోనూ జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదలైన సివిల్స్ సర్వీసెస్-2016 పరీక్ష నోటీఫికేషన్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువమంది అభ్యర్థులకు సౌకర్యంగా ఉండనుంది. సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య సైతం పెరగనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2016 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 27న యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 7న ఈ పరీక్ష నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. వరంగల్‌కు మరొకటి.. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ విషయంలో వరంగల్‌కు ఇప్పటికే గుర్తింపు ఉంది. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) వరంగల్‌లో సెంటర్ ఉంది. తాజాగా సివిల్స్ పరీక్ష నిర్వహణ కేంద్రం ఏర్పాటవుతోంది. నిర్వహణతో ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. వరంగల్‌లోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు సివిల్స్ పరీక్షలకు హాజరవుతుంటారు. వరంగల్‌లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రవాణా, వసతి ఖర్చులు తగ్గనున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులకు మేలు జరగనుంది. రైల్వే, రోడ్డు రవాణా పరంగా వరంగల్‌కు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వరంగల్ రవాణా పరంగా అనుసంధానంగా ఉంటుంది. ఈ కారణాలతో సివిల్స్ పరీక్షకు వరంగల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. -
సివిల్స్‌లో తాము తీసిపోమంటున్న అంధవిద్యార్థులు
-
అన్వేషణ ఫలితాలకు అక్షరరూపం
సివిల్స్ పరీక్ష ప్రస్తుత ధోరణిని పరిశీలిస్తే వివిధ పేపర్లలోని ప్రశ్నలు ఎక్కువగా సమకాలీన సవాళ్లు (Contemporary Challenges), వివిధ అంశాలకు సంబంధించిన భావనల ఆధారంగా ఉంటున్నాయి. ఈసారి ఎస్సే పేపర్లో కూడా ఇదే రకమైన ధోరణిని ఆశించవచ్చు. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. గుర్తుంచుకోండి ఎస్సే అనేది అభ్యర్థి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిద్వారా భావాలు, ఆలోచనా ధోరణి, విలువలు, వైఖరి, భావప్రసార సామర్థ్యం వంటివన్నీ బయటపడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సే రాయాలి. ఎస్సేలో సోపానాలు: ప్రారంభం, నేపథ్యం-చారిత్రక అంశాలు, అంశానికి సంబంధించిన ప్రధాన భావనలు, అనుకూలతలు, ప్రతికూలతలు, సమస్యల పరిష్కారానికి సూచనలు, ముగింపు. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు. తొలుత ప్రిపరేషన్లో భాగంగా తొలుత ఎస్సే ప్రశ్నలు ఏ విభాగాల నుంచి వచ్చే అవకాశముందో గుర్తించాలి. సాధారణంగా భారత దేశం- సామాజిక, ఆర్థిక అంశాలు; పర్యావరణం, అంతర్జాతీయ వ్యాపారం, సైన్స్ అండ్ టెక్నాలజీ; అంతర్జాతీయ సంబంధాలు; ముఖ్యమైన తాత్విక భావనలు (Core concepts in Philosophy) విభాగాల నుంచి ప్రశ్నలు తప్పకుండా వస్తున్నాయి. ఠ పైన చెప్పిన విభాగాల్లో ఒక్కో దాన్నుంచి రెండు, మూడు అంశాలను గుర్తించాలి. ఈ అంశాల నుంచి ఏ కోణంలో ప్రశ్న వస్తుందన్నది తెలుసుకోవడం ముఖ్యం. ఈ విషయంలో చాలా మంది అభ్యర్థులు తప్పులు చేస్తున్నారు. ‘స్థూల అంశం నుంచి సూక్ష్మ ప్రశ్న’ అనే విధానంలో ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరైతే ఈ సూక్ష్మ కోణంపై పట్టు సాధిస్తారో వారిదే విజయం అనడంలో సందేహం లేదు. నిపుణుల సలహా ఠ గతంలో మాదిరి ఎస్సేలు నేరుగా రావడం లేదు. అందువల్ల వివిధ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందో తెలుసుకోవడంలో సబ్జెక్టు నిపుణుల సలహా తీసుకోవాలి. మొత్తంమీద కనీసం 10 ఎస్సేలను ప్రాక్టీస్ చేయడం మంచిది. రాసిన ఎస్సేలను నిపుణులతో దిద్దించుకోవాలి. చేసిన పొరపాట్లను గుర్తించి, మరింత సమర్థవంతంగా రాసేందుకు ప్రయత్నించాలి. ప్రాక్టీస్ చేసిన ప్రశ్నల నుంచి కాకుండా, వేరేది వచ్చినప్పటికీ సంపాదించిన అనుభవం ద్వారా ఆ ప్రశ్నకు కూడా ఎస్సే బాగా రాయొచ్చు.వివిధ అంశాలకు సంబంధించిన సమకాలీన సమస్యలు, సవాళ్లు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, సమస్య పరిష్కారానికి అనుసరించే వ్యూహాలపై పట్టు సాధించాలి. వీటికి అభ్యర్థులు ప్రభావవంతమైన, సానుకూల దృక్పథంతో కూడిన సొంత అభిప్రాయాలను జోడిస్తూ నోట్స్ రూపొందించుకోవాలి. ఒక సమస్యపై అవగాహన ఏర్పరుచుకొని, విశ్లేషించి, సరైన పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని అభ్యర్థుల నుంచి ఎగ్జామినర్ ఆశిస్తున్నాడు కాబట్టి ఎస్సే ప్రిపరేషన్ కూడా ఇదే విధంగా ఉండాలి. సరళ పదజాలం ఎంత బాగా చదివినా, వివిధ అంశాలపై ఎంత పరిజ్ఞానం సంపాదించినా రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే ప్రతికూల ఫలితమే ఎదురవుతుంది. గ్రాంథిక భాష కఠిన పదజాలం ఉపయోగిస్తేనే మంచి ఎస్సే అనిపించుకుంటుందనే అపోహ ఉంది. ఓ సంక్లిష్ట సమస్యకు సరళమైన పరిష్కారాలను ఎగ్జామినర్ అభ్యర్థి నుంచి ఆశిస్తాడు. ఇలాంటి పరిస్థితిలో సంక్లిష్టమైన సమస్యను, దాని మూలాలను, పరిష్కార మార్గాలను సరళ పదజాలంతో వివరించగలిగితే మంచి స్కోర్ సాధించడం ఖాయం. ఓ మేధావితో సంభాషిస్తున్నట్లు ఎస్సే ఉండాలి. అలాంటి ఎస్సే ఎగ్జామినర్‌ను కట్టిపడేస్తుంది. ‘ప్రారంభం’లో మెరవాలి ఎంపిక చేసుకున్న ఏదైనా అంశంపై మెరుగైన స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ, ఎలా మొదలుపెట్టాలన్నది తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అందువల్ల ఎస్సేను ప్రారంభించేటప్పుడే సమకాలీన శైలికి ప్రాధాన్యమివ్వాలి. ప్రశ్నకు సంబంధించి ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాన్ని ప్రస్తావిస్తూ ఎస్సేను ప్రారంభించవచ్చు. ఉదాహరణకు భారత అంతరిక్ష విజయాలకు సంబంధించిన ఎస్సే అయితే మంగళ్యాన్, సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్ ప్రయోగాలతో ప్రారంభించొచ్చు. సమయ పాలన ముఖ్యం ఎస్సేకు సంబంధించి అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిన మరో విషయం సమయ పాలన. అందుబాటులో ఉన్న సమయంలో మూడింట ఒక వంతును వ్యాసంలో పొందుపరచాల్సిన అంశాలు ఏమిటి? రూపం ఎలా ఉండాలి? అనే ప్రణాళికను రూపొందించుకునేందుకు కేటాయించాలి. మిగిలిన 2/3 వంతు సమయంలో ఎస్సే పూర్తిచేయాలి. ప్రతి 15 నిమిషాలకు 150-200 పదాలు రాసేలా ప్రణాళిక వేసుకోవాలి. దీనికి తగ్గట్టు ప్రస్తుతం ఎస్సేలను ప్రాక్టీస్ చేయాలి. పశ్నలో ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్యకు మూలాలు ఏమిటి?; పూర్వ, ప్రస్తుత స్థితి; సమస్య పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు-వ్యూహాలు; అవి ఎంత వరకు సఫలీకృతమయ్యాయి? వంటి అంశాలతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ఎస్సేగా వచ్చేందుకు అవకాశమున్న అంశాలు: ఠ పశ్చిమాఫ్రికాలో విజృంభించడం ప్రారంభించి, తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా మహమ్మారికి సంబంధించి ‘ఎబోలాను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమవుతున్న తీరు’పై ప్రశ్న రావొచ్చు. చైనాతో ఆర్థిక సంబంధాల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే కోణంలో ప్రశ్న అడగొచ్చు. టిప్స్: సరైన సమాచారాన్ని పొందుపరిచేందుకు, సమకాలీన ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశముంటుంది.ఠ చాలా ముఖ్య అంశమైతే తప్ప అండర్లైన్ చేయొద్దు. అవసరమైతే పేజీకి ఒక అండర్లైన్ ఉండేలా చూసుకోవాలి.సందర్భానుసారం అవసరమైనంతలో కొటేషన్స్ ఉపయోగించొచ్చు. అంతేగానీ పొంతనలేని కొటేషన్స్ వల్ల లాభం మాట అటుంచి నష్టం ఎక్కువ జరుగుతుంది.స్సేను పేరాగ్రాఫ్‌లుగా విభజించుకొని రాయాలి. ఒక పేరాగ్రాఫ్ ఒకే అంశానికి సంబంధించినదై ఉండాలి. ఒక పేరాకు, తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.ఠ ఎస్సేలో పాయింట్లు ఉండకూడదు.. టేబుల్ వేయకూడదు.. అనేవి అపోహలు మాత్రమే. సందర్భాన్నిబట్టి అవసరమైన చోట సమాచారాన్ని పాయింట్ల రూపంలో రాయొచ్చు. వెన్ డయాగ్రమ్‌ల వంటివీ వేయొచ్చు. రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు. ఎస్సే ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించకూడదు. ఇచ్చే పరిష్కారాలు ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. Some Essay Topics Social im-pact of mobile phones Asian century prospects and problems Does Presidential system suit India more? The importance of creative freedom Children's rights: The real foundation for social progress Indian youth is a gift to the world There is a crying need to revive SAARC Have regional parties delivered? Inter-linking of rivers smart cities; cleanliness as a behavioural challenge. గతంలో అడిగిన ఎస్సేలు Creation of Smaller-States and the consequent administrative, economic and developmental implications. Does Indian Cinema shape our popular culture or merely reflect it? Credit based higher education system status, oppurtunities and challenges En the Indian context, both human intelligence and technical intelligence are crucial in combating terrorism. In the context of Gandhiji's views on the matter, explore, on an evolutionary scale, the terms 'Swadhinata', 'Swaraj' and 'Dharmarjya'. Critically comment on their contemporary relevance to the Indian democracy. Is the criticism that the Public-Private-Partnership (PPP) model for development is more of a bane than boon in the Indian context, justified? Science and Mysticism: Are they compatible? Managing work and home: is the Indian working woman getting a fair deal? Be the change you want to see in others - Gandhiji. Is the Colonial mentality hindering India's success? GDP (Gross Domestic Product) along with GDH (Gross Domestic Happiness) would be the right indices for judging the well - being of a country. Science and Technology is the panacea for the growth and security of the nation. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సివిల్స్ పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్ హాల్‌టికెట్, ఈ-అడ్మిట్ కార్డు తప్పనిసరిగా చూపించాలి సెల్ఫోన్లు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురావద్దు విజయవాడ: అఖిల భారత సివిల్ సర్వీసుల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని అనుమతించవద్దని పరీక్ష కేంద్రాల పరిశీలకుడు, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఆదివారం నగరంలో జరగనున్న సివిల్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను శనివారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం నలంద కళాశాలలో ఇన్విజిలేటర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. పరీక్ష సమయం దాటాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించవద్దన్నారు. కేంద్రాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ముందస్తు ఏర్పాట్లను చేయాల్సిందిగా నిర్వాహకులకు సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఇ-అడ్మిట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలన్నారు. ఇన్విజిలేటర్లు, అభ్యర్థులు కేంద్రాల్లోకి సెల్‌ఫోనులు, బ్లూటూత్, కాలిక్యులేటర్లు తీసుకురాకూడదన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా సివిల్స్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ ఆర్.ఆర్.పురి కూడా పాల్గొన్నారు. -
సివిల్స్ నోట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి మెళకువలు పాటించాలి?
సివిల్స్ నోట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి మెళకువలు పాటించాలి? - మహ్మద్ ఇస్మాయిల్, అఫ్జల్‌గంజ్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్: మారిన సివిల్స్ పరీక్ష విధానంలో ప్రశ్నలన్నీ వర్తమాన వ్యవహారాలు, సమాజంలో, మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. మెయిన్స జనరల్ స్టడీస్‌లోని నాలుగు పేపర్లు, ఎస్సే మొత్తం అదేవిధంగా ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవే. అయితే వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్‌లా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో అప్డేట్ చేసుకుంటుండాలి. వీటిని వీలైనప్పుడు చదువుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా వీటిని పదేపదే చదవాలి. ఇంటర్నెట్పై అతిగా ఆధారపడకూడదు. దీనివల్ల కాలయాపన అవుతుంది. ఇన్పుట్స్: డాక్టర్ బీజేబీ. కృపాదానం, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ ఎస్బీఐ క్లరికల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి? - పి.సృజన, మాసాబ్‌ట్యాంక్ బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనకు అన్వయ సామర్థ్యం అవసరం. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ కావాల్సింది నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అన్నది విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కావా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సన్నద్ధం కావాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు. ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
సివిల్స్ పరీక్షలో ఫిజిక్స్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి? సమీకరణాలు, ఫార్మూలాలపై ప్రశ్నలు వస్తాయా? - మాధవి, రామంతాపూర్ సివిల్స్ ప్రిలిమ్స్‌లో జనరల్ సైన్స్ ఒక భాగం. జనరల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్(భౌతిక, రసాయన శాస్త్రాలు)+ జీవ శాస్త్రం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఫిజిక్స్‌కు సంబంధించి ముఖ్యంగా ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఉష్ణం, యాంత్రిక శక్తి, ద్రవ పదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతిక శాస్త్రం అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రాథమిక అంశాలు (Fundamental Concept), అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఒక్కో ప్రాథమిక అంశంపైన భిన్న కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు మే 2013లో జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలను కింది విధంగా అడిగారు. 1. కాంతి ధర్మాలకు చెందిన ఐదు అనువర్తనాలను ఇచ్చి, వాటిలో కాంతి ధర్మానికి సంబంధించనటువంటిది ఏది? అని అడిగారు.(ఈ ప్రశ్నలను స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు) కాబట్టి రాబోయే పరీక్షలో కూడా ఇలాంటి భిన్నమైన కోణాల్లో ప్రశ్నలు అడిగి అవకాశం లేకపోలేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఫిజిక్స్ నుంచి సమీకరణాలు, లెక్కలు(Problems), ప్రయోగాలు, ఫార్మూలాల గురించిన ఎలాంటి ప్రశ్నలూ అడగరు. ఫిజిక్స్ సబ్జెక్టుపై మంచి అవగాహన ఏర్పరచుకుంటే సివిల్స్ మెయిన్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అడిగే ప్రశ్నలను మరింత ప్రభావపూరితంగా (Most Effective) సమాధానాలు రాయొచ్చు. ఉదాహరణకు డిసెంబర్ 2013లో నిర్వహించిన సివిల్స్ మెయిన్స్ పరీక్షలో త్రి డెమైన్షనల్ ప్రింటింగ్ గురించి, దాని ఉపయోగాల గురించి ప్రశ్న అడిగారు. ఇలాంటి ప్రశ్నలకు కావాల్సిన నిర్వచనాలను ఫిజిక్స్ నుంచి పొందొచ్చు. ఇన్‌ఫుట్స్: సీ.హెచ్.మోహన్, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలపండి? - సుదీప్తి, కంటోన్మెంట్ రీజనల్ రూరల్ బ్యాంకు పరీక్షల్లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు, 50 మార్కుల చొప్పున వస్తాయి. రీజనింగ్ ప్రశ్నలు అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేలా ఉంటాయి. మిగతా విభాగాలతో పోలిస్తే.. రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేగంగానే సమాధానాలను గుర్తించొచ్చు. రీజనింగ్‌లో సిరీస్; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్‌వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలు ఉంటాయి. నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు నిరంతర ప్రాక్టీస్ ఏకైక మార్గం. ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్యాలిక్యులేషన్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. కూడికలు, తీసివేతలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలకు సంబంధించి 15-20 ప్రశ్నలు వస్తాయి. శాతాలు, భిన్నాలు, ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, అనుపాతాలు, లాభనష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను సాధన చేయాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలను పరిశీలించాలి. సూత్రాలు, వాటి ఆధారంగా సమస్యలను సాధించాలి. షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సమస్యల్ని సాధిస్తే సమయం ఆదా అవుతుంది. ఇన్‌ఫుట్స్: కె.వి.జ్ఞానకుమార్, హైదరాబాద్ నేను యూపీఎస్సీ ఎన్డీఏ ఏగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను. ఈ పరీక్షలో మ్యాథమెటిక్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి. - జి.రమేశ్, తిరుమలగిరి త్రివిధ దళాల్లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశం ఎన్డీఏ అండ్ ఎన్ఏ. రాత పరీక్ష సెప్టెంబర్ 28న ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. ఎన్డీఏ అండ్ ఎన్ఏ రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ చాలా కీలకమైంది. 120 ప్రశ్నలు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. సమయం 150 నిమిషాలు ఉంటుంది. మ్యాథమెటిక్స్‌లో ముఖ్యంగా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్, మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, త్రికోణమితి, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్-డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలోని అవగాహన స్థాయిని, ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. కాబట్టి ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే సమస్యలను వేగంగా సాధించే చిట్కాలను నేర్చుకోవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి ప్రాక్టీస్‌లో అన్ని అంశాలపై దృష్టి సారించడం ప్రయోజనకరం. ప్రధానంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ప్రతిసారి ప్రశ్నలు ఇస్తున్నందున ఈ అంశంపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆల్జీబ్రా, జామెట్రీ అంశాలు చక్కని స్కోరింగ్‌కు దోహదం చేస్తాయి. ప్రాక్టీస్‌లో ఈ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పాత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం మంచిది. మ్యాథమెటిక్స్ కోసం ఎన్సీఈఆర్టీ 8-12 తరగతుల పుస్తకాలను అధ్యయనం చేయాలి.