త్రిభంగ నాట్యం అంటే ఏమిటి? | Civils Prelims | Sakshi
Sakshi News home page

త్రిభంగ నాట్యం అంటే ఏమిటి?

Published Mon, Jun 23 2014 3:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

త్రిభంగ నాట్యం అంటే ఏమిటి? - Sakshi

త్రిభంగ నాట్యం అంటే ఏమిటి?

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్ స్టడీస్ చరిత్ర విభాగంలో మొత్తం 18 టాపిక్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి పాఠ్యాంశం నుంచి ఒక్కో ప్రశ్న వస్తుంది. కాబట్టి చరిత్ర నుంచి మొత్తం 36 మార్కులు అంచనా వేయవచ్చు. ఏయే అంశాలను ఏవిధంగా చదవాలి? టాపిక్స్ వారిగా ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలో చూద్దాం..
 
ప్రాచీన భారతదేశ చరిత్ర
ప్రీ హిస్టోరిక్ కల్చర్‌లో ‘హోమో ఎరక్టస్’ ఆధారాలు ఏ దశలో ఏర్పడ్డాయి, హోమో సెపియన్‌‌స దశ ఏర్పడిన కాలం, ప్లిస్టోసిన్, పాతరాతియుగంలో మానవుడు కఠినమైన ‘క్వార్టజైట్’ రాళ్లను వాడటం, ఈ కాలానికి చెందిన ఆధారాలు (పంజాబ్‌లోని ‘సోనార్’ తీరం, మధ్యప్రదేశ్‌లోని బీమ్ బెట్కా, ఉత్తరప్రదేశ్‌లోని ‘బేలం’ లోయ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, రాజస్థాన్‌లోని దిద్వాన, మద్రాస్‌లోని పల్లవరంలో లభ్య మయ్యాయి) లాంటి అంశాలు ముఖ్యమైనవి. పాతరాతి యుగానికి చెందిన వర్ణచిత్రాలను  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మధ్యప్రదేశ్‌లోని రాయఘర్, సింగన్‌పూర్, కైమూర్  ప్రాంతాల్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ కాలంనాటి స్థావరాలు, వారి శిల్పకళ, ఆర్థిక విధానంపై ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువ.
 
ఉదా: ప్రాచీన కాలంలో ప్రీ-హిస్టోరిక్ కాలానికి చెందిన ‘మెహర్‌గర్’ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు కనిపెట్టారు. ఇది ఎక్కడ ఉంది? అని 2008లో నిర్వహించిన పరీక్షలో అడిగారు.  ఈ ఆధారాలు క్రీ.పూ. 9000 - 1000 మధ్య కాలంలో పశ్చిమ బెలూచీస్తాన్ (పాకిస్థాన్)లో బయల్పడ్డాయి. అందువల్ల అభ్యర్థులు బుర్జహాం (కాశ్మీర్), చిరాండ్ (బీహార్), నాగార్జున కొండ స్థావరాల్లో కుక్క, మనిషి, సమాధులు ఎక్కడ బయల్పడ్డాయి, ఎముకలతో చేసిన పరికాలు ఎక్కడ లభించాయి, ‘హోల్‌స్టీల్’ అంటే ఏమిటి? ‘పునర్జన్మ’పై ఎప్పుడు విశ్వాసం కలిగింది? అల్ప పరిమాణం ఉన్న రాతి పరికరాలు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
 కింది అంశాలను గుర్తుంచుకోండి..
 
చిరాండ్‌లో ఎముకలతో రూపొందించిన పనిముట్లు
నగర్‌లో ‘కుండ’ అవశేషాలు అలహాబాద్‌లో వరిసాగుకు సంబంధించిన ఆధారాలు
గంగేరియాలో ‘రాగితో’ చేసిన పనిముట్లు(రాగి నాగరికత రాజస్థాన్‌లో ప్రారంభమైంది)
గణేశ్వర్‌లో రాగి గనులు
నవదోతోలి, యరాన్ నాగ్దాలో మాళ్వా సంస్కృతి
నెవాసా, చందోలి, సాన్‌గాం ప్రాంతాల్లో (జోర్వో సంస్కృతి)
ఇనాంగావ్‌లో దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద ఇల్లు, మాతృదేవతా విగ్రహం బయల్పడ్డాయి.
దంత శిల్పులు, నేత పనివారికి సంబంధించిన ఆధారాలు - ఇనాం గావ్‌లో  
చేతివృత్తులకు సంబంధించిన ఆధారాలు - సాన్‌గావ్‌లో
కాయధాన్యాలు, పప్పులు,  ఉలువలు, రాగులు - నవదతోలిలో
మొక్కల పెంపకానికి చెందిన ఆధారాలు - సాల్ట్‌లేక్ (రాజస్థాన్) లో లభ్యమయ్యాయి.
 
సింధూ నాగరికత
సింధూ నాగరికత కాలంనాటి ముఖ్య పట్టణాలు, పట్టణ ప్రణాళిక, మురుగునీటి వ్యవస్థ, సామాజిక విధానం, నాగరికతా ఆవిర్భావం, పతనం, ఆ కాలంనాటి శాసనాలు, చిత్రకళ, నాట్యం మొదలైన  అంశాలు ప్రాధాన్యమైనవి.
     
2001 సివిల్స్ పరీక్షలో ‘ఈ కింది ఏ పట్టణంలో సింధూ ప్రజల పెయింటింగ్‌‌స బయల్పడ్డాయి’ అని అడిగారు. దీనికి సమాధానం లోథాల్. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రాంతంలో ఎలాంటి పెయింటింగ్‌‌స లభ్యమయ్యాయి, వాటిలోని రంగులేవి లాంటి లోతైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. 2013లో ‘త్రిభంగ’ నాట్యం అంటే ఏమిటి?’ అని అడిగారు. సాధారణంగా కూచిపూడి, భరతనాట్యంపై అవగాహన ఉంటుందిగానీ త్రిభంగ అంటే చాలామందికి తెలియదు. ఇది ద్రవిడ నాగరికతలోనే ఆవిర్భవించింది. త్రి అంటే మూడు, భంగ అంటే భంగిమ. దీంట్లో 3 భంగిమలు ఉంటాయి.
     
పట్టణాలు ఏ నదీతీరంలో ఉన్నాయి,  ఏయే పట్టణాలు ఏయే ఆకారంలో ఉన్నాయి, సింధూ ప్రజలు ఉపయోగించిన లోహాలు, వాటి నైపుణ్యం, సింధూ లిపిని చదివినవారు లాంటి అంశాల గురించి తెలుసుకోవాలి. గర్భం నుంచి చెట్టు మొలచినట్టు ఉన్న ఒక స్త్రీ మూర్తి విగ్రహం, ఉద్యానవన నగరం, గబర్‌బండ లేదా రిజర్వాయర్లు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి నూతన అంశాలపై దృష్టి సారించాలి. ప్రిలిమినరీ అనేది జ్ఞానం గురించి తెలుసుకునే పరీక్ష కాదు, ఇది వడపోత విధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మెయిన్‌‌స జ్ఞానం, సబ్జెక్టు గురించి తెలుసుకునే పరీక్ష. ఇంటర్వ్యూ ద్వారా  అభ్యర్థి ప్రవర్తన; మానసిక సామర్థ్యం; డిసీషన్ మేకింగ్, ఆప్టిట్యూడ్ స్కిల్స్; అడ్మినిస్ట్రేషన్ మెథడ్‌‌స గురించి తెలుసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రధానమైంది. దీంట్లో విజయం సాధిస్తే, ఏదో ఒక సర్వీస్‌లో చేరడానికి బీజం పడుతుంది. యూపీఎస్సీ   ఏయే అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వవచ్చో ఊహించడం కష్టతరమైన పని.  అభ్యర్థులు అభ్యసనం ద్వారానే దీనికి సంబంధించిన అవగాహనను ఏర్పరచుకోవాలి. అభ్యర్థి చదివే అంశాలు, రంగాలు వారికి ప్రాధాన్యం కాకపోవచ్చు. 

సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య రంగా లు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యమైనవే.  భారతీయ చరిత్ర - సంస్కృతి అనేది ప్రధానమైంది. మనదేశం, మన చరిత్ర, మన సంస్కృతి.. ఇవి ఏయే అంశాలతో ముడిపడి ఉన్నాయి? లాంటివాటిని ముఖ్యాంశాలుగా గుర్తించండి.
 
వేద సమాజం
ఇది ముఖ్యమైన పాఠం. ఆర్యుల జన్మస్థలంపై అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. మెక్‌డొనాల్డ్ ఆస్ట్రియా,  హంగరి అని, మోర్గాన్ సైబీరియా అని, ఫొకొర్ని వోల్గా అని, పెంకాహెర్‌‌ట జర్మనీ అని పేర్కొన్నారు. వేదాలు జ్ఞానమూలాలు. వాటిపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. గతంలో- ‘యుద్ధాలు మానవుల మేధస్సుల్లోంచి ఆవిర్భవిస్తాయి’ అనే మాటలు ఏ వేదం లోనివి? అని అడిగారు. (జ: అధర్వణ వేదం)
     
‘నేను ఒక కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి పిండిగిర్నిలో పనిచేస్తుంది’? ఈ మాటలు ఏ వేదంలో ఉన్నాయి? (1996)
ప్రాచీన వేదం ఏది? తెల్ల/ నల్ల వేదంగా ప్రసిద్ధి చెందింది ఏది? సంగీతానికి మూలం ఏది? లాంటి ప్రశ్నలు వచ్చాయి.
 
వీటి ఆధారంగా ప్రశ్నల సామర్థ్యం, లోతును అంచనా వేసుకోవచ్చు. వేదాలు ఎన్ని? అవి ఏవి? అనేవి కాలం చెల్లిన ప్రశ్నలని గమనించాలి. 5వ వేదం ఏది? అసలు 5వ వేదంగా ఎన్ని గ్రంథాలకు పేర్లున్నాయి? లాంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. వేదాలు, వాటితో ముడిపడి ఉన్న బ్రాహ్మణాలు; వేద సంస్కృతి, తత్త్వశాస్త్రాలు; కల్ప, శిక్ష, నిరుక్త పదాలకు అర్థాలు; బృహత్‌మాలకథ అనే ప్రసిద్ధ రచన ఏ వేదంలో ఉంది? సర్వేజనా సుఖినోభవంతు, తమసోమా జ్యోతిర్గమయ లాంటి సూక్తులు ఎందులో ఉన్నాయి? వేద సమాజం, సాహిత్యం, ఆర్థిక విధానం, వేద, సింధూ నాగరికతల ప్రధాన పోలికలు మొదలైనవాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
 
మత ఉద్యమాలు
జైనం, బౌద్ధం లాంటి నూతన మతాల స్థాపకులతోపాటు చార్వాకం, అజీవకం, ప్రాకృతిక వాదం, మత సిద్ధాంతాలు, వాటి శిల్పకళ, సమావేశాలు, మత గ్రంథాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.   బుద్ధుని బోధనలు ‘పాళీ’ భాషలో, మహావీరుని బోధనలు అర్ధమాగధి భాషలో ఉన్నాయి. వారి సిద్ధాంతా లు ప్రతీయ సముత్పాదం (బౌద్ధం), శద్వాదం (జైనం), ప్రాకృతిక వాదం (అజీవకం), లాంటివి ముఖ్యమైనవి.  బుద్ధుని దీర్ఘ ఉపన్యాసాలు, హ్రస్వ ఉపన్యాసాలు, సామెతలు ఏ గ్రంథంలో ఉన్నాయి? ‘ఆసియా జ్యోతి’ అనేది ఎవరి రచన? అవలోకితేశ్వర, మంజుశ్రీ, వజ్రపాణి, పద్మపాణి..  వారి చేతిలో ఉన్న గుర్తులు,  బౌద్ధ ము ద్రలు - వాటి ప్రాముఖ్యం లాంటివాటి గురించి క్షుణ్ణంగా చదవాలి.    2013లో బౌద్ధ శిల్పకళకు సంబంధించి ‘చైత్యం, విహారం’ మధ్య ఉన్న భేదాలు ఏవి’ అనే ప్రశ్న అడిగారు. చైత్యం అనేది ప్రార్థ్దనాలయం, విహారం అంటే విశ్రాంతి మందిరం. వీటి ఆధారంగా  ప్రిపరేషన్ కొనసాగించాలి.
 
మౌర్యుల పరిపాలనా విధానం
మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు; అశోకుని శాసనాలు, వాటిని వెలుగులోకి తెచ్చినవారు; అశోకుని ధమ్మ విధానం, మెయిన్స్ పరీక్ష కోణంలో ‘అశోకుని ధమ్మ విధానం ప్రస్తుత భారతీయ  సమాజానికి అత్యంత విశ్వసనీయత, మానవనీయత గలదని ఏకీభవిస్తావా?’ లాంటి అంశాలు  ప్రధానమైనవి. మౌర్యుల శిల్పకళ, ఆర్థిక విధానం, సమాజం గురించి తెలుసుకోవాలి. 1997లో మౌర్యులను క్షత్రీయులుగా ఏ గ్రంథంలో తెలిపారు? (జవాబు: దివ్యవదన. ఇది నేపాల్ బౌద్ధగ్రంథం). 2012లో కౌటిల్యుడికి, విష్ణుశర్మ, చాణక్యుడు అనే ఇతర పేర్లు ఉన్నట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు? అని అడిగారు. (జవాబు: విశాఖదత్తుని ముద్రరాక్షసం)
 
మౌర్యుల అనంతర యుగం
చివరి మౌర్యరాజు బృహద్రదుడుని అతడి సేనాని పుష్యమిత్రుడు హత్యచేసి ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు. శుంగుల కాలంలో  ‘మాలతీమాదవీయం’ను రచించిన భవభూతి, పాణిని, వ్యాకరణాన్ని రాసిన పతంజలి, ‘పాశుపతశైవం’ను స్థాపించిన లకులీస, ‘వైష్ణవం’ను స్థాపించిన  వాసుదేవుడు ప్రసిద్ధి చెందినవారు. దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో ‘పుహార్’, పాండ్యుల కాలంలో ‘కొర్కయ్’, చేర పాలనా కాలంలో ‘తొండై’ ప్రసిద్ధి చెందిన నౌకా కేంద్రాలు. శాతవాహనుల సామాజిక, ఆర్థిక, శిల్పకళా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ కాలంలో భారతదేశ ఉత్తర, వాయువ్య ప్రాంతాలను ఇండో గ్రీకులు, శకులు, పార్దియన్లు, కుషాణులు  పరిపాలించారు. స్ట్రాబో, ఫ్లూటార్‌‌క, జస్టిన్ గ్రీకు చరిత్రకారులకు సంబంధించి అవగాహన అవసరం. శకుల సంస్కృత శాసనం, పార్దియన్ల కాలంలో వచ్చిన క్రైస్తవ సన్యాసి, కుషాణుల శిల్పకళలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విక్రమశకం (58), శక సంవత్సరం (78), అంధకారయుగంగా పిలిచే 200 బీసీ నుంచి 300 ఏడీ మధ్య కాలానికి సంబంధించిన అంశాలపై అవగాహన అవసరం.
 
గుప్తుల యుగం
గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారని ‘జయస్వాల్’ పేర్కొన్నారు. తెలుగు ప్రాం తం వారైన ఇక్ష్వాకుల వంశానికి చెందినవారని మజుందార్ భావించాడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడు  శ్రీగుప్తుడు. సముద్రగుప్తుడిని భారతీయ నెపోలియన్ అంటారు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీని స్థాపించాడు. స్కందగుప్తుడు యుద్ధవీరుడు. భానుగుప్తుడు ఎరాన్ శాసన నిర్మాత. గుప్తుల కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. వ్యాపారులను - సెట్టిలు అనేవారు. జాజ్‌మనీ, విష్టి, మొదలైన ఆర్థిక పరిస్థితులు, ఉద్వాంగ, వతభూత లాంటి పన్నులు, సాహిత్యం, శిల్పకళా రంగాలు, సామాజిక పరిస్థితులను క్షుణ్ణం గా అధ్యయనం చేయాలి.
 
2000 ప్రిలిమ్స్ పరీక్షలో ‘క్షేత్ర, ఖిలా, అనేవి ఏ రకమైన భూములు?’, 2002 పరీక్షలో ‘మనుస్మృతి, యజ్ఞవల్క, బృహస్పతి, దేవల సృ్మతులను క్రమంలో అమర్చండి.’ అనే ప్రశ్నలు అడిగారు. ‘అభినవభారత’ రచన, సంజనఫలకాలు, నాట్యదర్పణి గ్రంథాల రచయితలు ఎవరు? పౌలిస, లఘుజాతక గ్రంథాలలోని గణిత సంబంధిత విషయాలను అధ్యయనం చేయాలి. మధ్యయుగ భారతదేశంలో చోళుల పాలనాంశాలు, ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల సాంస్కృతిక సేవ, బెంగాల్‌లో సేన వంశం అద్భుత సాగర రచన, జనకుని పృథ్వీరాజ విజయం, భట్టి రావణ సుధ, పద్మగుప్తుని నరశాశాంక చరిత్ర, చక్రపాణి దత్త చికిత్సా సాగరం, రాజామార్తాండ యోగ సూత్రాల వ్యాఖ్యానం, చోళుల గ్రామపాలన, ఆర్థిక విధానం లాంటివి ప్రధానాంశాలు. వీరి శిల్పకళ, కోరంగనాథ్ దేవాలయం(పరాంతక), బృహదీశ్వర (రాజరాజ), ఐరావతారేశ్వరా (రెండో రాజరాజ) లాంటి నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. పరమారులు ‘దారా’ చాళుక్యులు ‘అనిల్‌వారా’, సేన ‘విజయపుర’ గహద్వల ‘కనోజ్’ రాజధానులుగా పాలించారు. చోళుల కాలంలో మండలం (రాష్ట్రాలు) నాడు లు (జిల్లాలు), కొట్టం (మండలం), ఉర్ (గ్రామం)గా విభజన చేయడం లాంటి పరిపాలనాంశాలపై దృష్టి అవసరం. తర్వాతి సాంస్కృతిక మార్పులను క్షుణ్ణంగా చదవాలి.
 
750 నుంచి 1200 వరకు వచ్చిన మార్పు లు గమనించాలి. ఈ విభాగంలో చిస్తి మొహినుద్దీన్ (1191), సౌహార్ది -షియాబుద్దిన్ ఉమర్ (1290), ఖాద్రీ  షానియాముల్లా (1430), నక్షబంది బకీబిల్లా (1603) లాంటివారు   ముస్లింలలో వచ్చిన భక్తి ఉద్యమకారులు. హిందూ మతంలో, శంకరదేవుడు (అస్సాం), లల్ల (కాశ్మీర్), నర్సింగ్ మెహతా (గుజరాత్) ముఖ్యులు. రాగమార్గం, భక్తిమార్గం, బెడబెద, పుష్టిమార్గం, ప్రాపతి మార్గాలు ఎవరివి?, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, ద్వైతాద్వైతా, శుద్దా ద్వైతం ఎవరివి? లాంటివాటి గురించి చదవాలి. 2001లో ‘‘కిందివారిలో ఎవరు ‘కీర్తన’లు ప్రవేశపెట్టారు?’’ అని అడిగారు.
  (జవాబు: చైతన్య)
 
 కిందివారిలో వైష్ణవ భక్తి ఉద్యమకారులెవరు?
     1) చైతన్య    2) లల్లదేవ    
     3) నంబిఅండార్    4) తులసీదాస్
     5) రామానుజ
     ఎ) 1, 2, 3    బి) 2, 3, 4
     సి) 1, 4, 5    డి) 3, 4, 5
     జవాబు: సి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement