General Studies - History
-
విచిత్రనామ రచయిత ఎవరు?
13, 14 శతాబ్దాల్లో భారతదేశం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఈ చాప్టర్ నుంచి 2 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా చెప్పవచ్చు. వీరి రాజకీయ, పరిపాలన, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సాహిత్యంలో సియాసత్ నామా- నిజాముల్క్ తుసీ, ఖజాయిస్ ఉల్ పితుహా - అమీర్‌ఖుస్రూ, ఖైర్ ఇ మాజల్స్ - హమీద్ కలందర్, తారీఖ్ ఇ ముబారక్ - షాయయ్యార్ రచించినవి, అమీర్‌ఖుస్రూ, బరాని రచనలు, శిల్పకళలో సాంకేతిక ఆర్చి, డోం, ఢిల్లీ 3వ, 4వ నగరాలు, ఉద్యానవనాలు, లాల్ దర్వాజా, అలై - ఇ- దర్వాజాలు ఎవరు నిర్మించారు? లాంటి అంశాలను చదవాలి. 2001లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: కిందివాటిలో తప్పుగా జతచేసింది ఏది? ఎ) జాలువారే గోడలు - బాల్బన్ బి) సాంకేతిక పద్ధతిలో వచ్చిన డోం- ఖిల్జీలు సి) డబుల్ డోం పద్ధతిలో సమాధులు- లోఢీలు డి) ఢిల్లీకి మొదటి పట్టణం - ఐబక్ సమాధానం: (ఎ) జాలువారే గోడలు ఘియాజుద్దీన్ తుగ్లక్ తన సమాధిలో ప్రవేశపెట్టాడు. ఆర్థిక విధానంలో.. హకియా-ఇ-షాబ్, కిస్మత్, తకావి, ఉస్లుబ్ అంటే ఏమిటి? పరసియా, మైదాన్, ఉర్దు-ఇ-మౌల్ల లాంటి పారిభాషిక పదాల గురించి తెలుసుకోవాలి. హాజిమౌల్లా తిరుగుబాటు (1320), జఫార్‌ఖాన్ తిరుగుబాటు (1391), తైమూర్ దాడి (1398), అహ్మదాబాద్ రాజ్యస్థాపన(1411) లాంటి అంశాలతో పాటు, పగోడా (విజయనగరం) మహ్మది (గుజరాత్), ముజఫరి (మాళ్వా), సికిందరీ (ఢిల్లీ సుల్తాన్) బంగారు నాణేలు ముఖ్యమైనవి. 15,16 శతాబ్దాల్లో భారతదేశం 15, 16 శతాబ్దాల్లో దక్షిణ భారత విజయనగరం, బహ్మనీ రాజ్యాల సాంస్కృతిక వికాసం, ఢిల్లీ సామ్రాజ్య పతనం, మొగల్ రాజ్య స్థాపనాంశాలు, విజయనగరాన్ని సందర్శించిన యాత్రికులు, బహ్మనీ రాజ్య విచ్ఛిన్నం లాంటివి ప్రధానాంశాలు. ఉదా: షేర్షాకు సంబంధించి అవాస్తవమైన అంశం ఏది? (సివిల్స్ 1996) 1) 1/3 వంతు పన్ను వసూలు 2) రైతులకు కబూఅయత్ పట్టా ఇచ్చాడు 3) 1/4 వంతు భూమిపన్ను ముల్తాన్‌లో వసూలు 4) రూపాయి (వెండి) నాణెం ముద్రించాడు ఎ) 1, 2, 4 మాత్రమే బి) 1, 4, మాత్రమే సి) 1, 3,4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) మొగల్ సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ సామ్రాజ్య స్థాపన, హుమాయూన్ షేర్షాతో చేసిన యుద్ధాలు, హుమాయూన్ శిల్పకళ, షేర్షా సంస్కరణలు, అక్బర్ కాలంనాటి మత విధానం, రాజపుత్ర విధానాలు, దక్కన్, మున్సబ్‌దారీ విధానాలు, జహంగీర్ కాలంలో బ్రిటిషర్ల స్థావరాలు, నూర్జహాన్ పాలన, షాజహాన్ స్వర్ణయుగం, ఔరంగజేబు దక్కన్ విధానాలు, చివరి మొగల్ పాలకులు లాంటి అంశాలు ముఖ్యమైనవి. మొగలుల సాంస్కృతిక, ఆర్థిక విధానాలు, సాహిత్య రంగం, చిత్రకళ, సంగీతం మొదలైన అంశాలు కీలకం. ‘తారీఖ్ ఇ అక్బరీ’- కాందహారీ, ‘తబాకత్ ఇ అక్బరీ’ - నిజాముద్దీన్, ‘ముంతకాబ్ జల్ తవారిక్’-బదాయని, ‘ఇక్బాల్‌నామా’- ముత్మద్ఖాన్ లాంటి గ్రంథాల పేర్లు గుర్తుంచుకోవాలి. మన్సూర్ అలీ పక్షి చిత్రకారుడు, అబ్దుల్సమద్-దస్తక్-ఇ- హమీరంజా, తాన్సేన్, మిత్ర సింహా, తులసీదాస్ లాంటి వారు సంగీత విద్వాంసులు. శివాజీ పరిపాలన, సాహిత్యం, బక్నర్ మరాఠా సాహిత్యం, కాయత్ రాజస్థాన్ సాహిత్యం, బురుంజీ అస్సాం సాహిత్యం లాంటి అంశాలపై పట్టు అవసరం. 2011లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో మొగల్ సాహిత్యానికి సంబంధించి ఎంత లోతైన ప్రశ్న అడిగారో గమనించండి. ప్రశ్న: గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 1) జాఫర్‌నామా - ఔరంగజేబు లేఖలు 2) విచిత్రనామ - హిందూ హీరోల ఆత్మకథలు 3) ‘నక్ష ఇ దిల్ కుష్’ - బీమ్సేన్ 4) ‘తారీఖ్ ఇ షేర్షా’ - అబ్బాస్‌ఖాన్ ఎ) 1, 2 మాత్రమే బి) 1, 2, 3 మాత్రమే సి) 3, 4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) వివరణ: జాఫర్ నామా (ఔరంగజేబు లేఖలు) బహదుర్షా-2 రచించారు. హిందూ హీరోల చరిత్రలను (ఆత్మ కథలు) విచిత్రనామా పేరుతో దారాషికో రచించాడు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ బ్రిటిషర్ల ఆర్థిక, విద్యా విధానాల్లో వచ్చిన సంస్కరణలు, రాజ్యాంగ మార్పులు, పరిపాలనకు చెందిన వివిధ అంశాలు (సివిల్ సర్వీసెస్, పోలీస్, సైనిక, న్యాయవ్యవస్థ) కూలంకషంగా చర్చించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌లు- వారి విధానాలు, బ్రిటిషర్ల నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు చేసిన ఉద్యమాలు చాలా ముఖ్యం. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, బ్రిటిష్ పాలనలో భారతదేశ సాంస్కృతిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులపై అవగాహన అవసరం. శంభుమిత్ర నాటక రంగంలో, రాంకిరణ్ శిల్పకళలో, రవివర్మ చిత్రకళలో, ప్రమతీష్ బౌర చిత్ర రంగంలో ప్రసిద్ధి. రుక్మిణీ దేవి క్లాసికల్ డ్యాన్సులో, అల్లావుద్దీన్ ఖాన్ హిందూస్తానీ రాగంలో పేరు పొందారు. బ్రిటిషర్ల నిర్మాణ రంగంలో విక్టోరియా మహల్, సెంట్రల్ సెక్రటేరియట్ (పార్లమెంట్), గేట్‌వే ఆఫ్ ఇండియా, మద్రాస్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ముస్లింల సామాజిక ఉద్యమాలు వాహాబీ, మహ్మదీయ, అహ్మదీయ మొదలైన వాటిపై దృష్టి సారించాలి. ప్రశ్న: ఎం.జి.రనడే ‘విధవ వివాహ మండలి’ని ఎవరితో కలిసి ప్రారంభించారు? (2002) ఎ) దారోగా పాండురంగ బి) విష్ణుశాస్త్రి సి) కె. నటరాజన్ డి) పండిత రమాబాయి సమాధానం: (బి) వివరణ: మహారాష్ర్టలో వితంతు వివాహాల కోసం రనడే, విష్ణుశాస్త్రి కలిసి దీన్ని ప్రారంభించారు. పుణేలో వితంతు గృహాలను పండిత రమాబాయి ‘శారదాసేవాసదన్’ పేరుతో ప్రారంభించారు. ముల్క్సదన్ అనేది వితంతువుల కోసం ప్రారంభించిన పాఠశాల. కామాక్షి నటరాజన్ ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ (1890)ను ప్రారంభించారు.బిటిషర్లకు వ్యతిరేకంగా వచ్చిన సైనిక తిరుగుబాటును స్వాతంత్య్రోద్యమంలో నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. కున్వర్సింగ్ (బీహార్), అహ్మదుల్లా (ఫైజాబాద్), మంగళ్‌పాండే (బారక్పూర్), జినాత్ మహల్ (ఢిల్లీ)ల తిరుగుబాటును జేమ్స్ ఓరం, నికల్సన్, కాంప్‌బెల్, రోస్‌లు అణచివేయడం లాంటి అంశాలపై దృష్టిసారించాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్ర దీంట్లో మితవాదయుగం (1885-1905), అతివాదయుగం (1905-1920), గాంధీయుగం (1920-1947), విప్లవ వీరుల యుగం (1913-1931) ముఖ్యమైనవి. మితవాదుల ఆలోచనలు, పోరాట పద్ధతులు, వారి విజయాలు, వారి వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేయాలి.ఈస్టిండియా అసోసియేషన్ (లండన్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సంస్థల స్థాపకులు ఎవరు? వాటి ఆశయాలు ఏమిటి? లాంటివి ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన పత్రికల పాత్ర కూడా శ్లాఘనీయం. వీటిలో చెప్పుకోదగినవి.. మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్, హిందూ పెట్రియాట్(1853), అక్బర్-ఓ-సౌదాగర్ (1852), ఇండియన్ మిర్రర్ (1862), స్టేట్స్‌మెన్ (1875), ట్రైబ్యూన్ (1862). కొన్ని సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషించి భారతీయుల్లో రాజకీయ చైతన్యం, జాతీయవాదం, హేతువాదం, సామ్యవాదాన్ని ప్రేరేపించడానికి తోడ్పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని.. బ్రిటిష్ ఇండియా సమాజం (1867) -విలియం ఆడమ్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1839)-మేరి కార్పెంటర్, ఇండియన్ సొసైటీ (1872) - ఆనందమోహన్ బోస్ స్థాపించారు. ఈ కాలంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. అలాంటి వారిలో సరళాదేవి తన ఆత్మకథ- జిబ్నర్ జరా పఠా, లైఫ్ ఫాలెన్ లీవ్స; పండిత రమాబాయి-ఆర్య మహిళా సమాజం, రామేశ్వరి నె్రహూ (బ్రిజ్‌లాల్ నె్రహూ భార్య)- స్త్రీల సమస్యలపై స్త్రీ దర్పణ్ అనే మాస పత్రిక ద్వారా (1909-1924) పోరాడారు. ఈ దశలో ముస్లింల పాత్రకు సంబంధించి సయ్యద్ అహ్మద్- తారీఖ్-ఇ-మహ్మదీయ, మహ్మద్ కాశీమ్ నేనతవిదారుల్-ఉల్-బెరైల్వి దియోబంద్, మిర్జా గులాం-అహ్మద్-బరాహిం, జకాఉలా ్ల-జిల్లి ఉర్దూ రినైసాన్స సంస్థలు జాతీయవాదంలో ప్రముఖ పాత్ర పోషించాయి. బ్రిటిషర్లు పత్రికలపై ఉక్కుపాదం మోపడానికి కింది చట్టాలను చేశారు. * వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 * న్యూస్‌పేపర్ (ఇన్సిట్మెంట్ టు ఆఫెన్స) యాక్ట్ (1905) * ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910 * ఇండియన్ ప్రెస్(ఎమర్జెన్సీ పవర్స్) యాక్ట్ 1931 మరోవైపు సామాజిక సంస్కరణల్లో భాగంగా రనడే-వితంతు గృహాలు (పుణేలో), జ్యోతిబాపూలే-ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స, పండిత రమాబాయి-శారదాసేవా సదన్, డి.కె. కార్వే-బాలికల పాఠశాలలను స్థాపించి తమ వంతు కృషి చేశారు. అతివాదుల కాలంలో వచ్చిన జాతీయోద్యమం, రాజకీయ పండుగ లాంటిదని చెప్పొచ్చు. దీనికి కారకుడు లార్డ కర్జన్. ఇతను రైల్వేలపై (రాబర్‌టసన్), వ్యవసాయంపై (మెక్ డొనాల్డ్), విశ్వవిద్యాలయాలపై (ర్యాలీ) కమిటీలు వేశాడు. చివరకు 1905 అక్టోబరు 16న బెంగాల్ రాష్ర్ట విభజన చేశాడు. ఇతడు తన గ్రంథం ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా’లో భారతదేశంలో ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రను వివరించాడు. బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన పత్రికలు అక్కడి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటిలో కొన్ని.. జీ) న్యూ ఇండియా - బిపిన్ చంద్రపాల్ (అనిబిసెంట్ పత్రిక పేరు కూడా ఇదే) జీజీ) బందేమాతరం - అరబిందో ఘోష్ జీజీజీ) సంధ్య - బ్రహ్మోపాధ్యాయ జీఠి) డాన్ - సతీష్ చంద్ర ముఖర్జీ వీటితో పాటు పంజాబీ- లాలాలజపతిరాయ్, భారత్‌మాత-అజిత్‌సింగ్, కామ్రేడ్-మౌలానా మహ్మద్ ఆలీ, ఆల్ హిలాల్-మౌలానా అబుల్ కలాం ఆజాద్ పత్రికలు కూడా చెప్పుకోదగినవి. ఈ ఉద్యమం ఆంధ్ర రాష్ర్టంపై ప్రభావాన్ని చూపింది. గాంధీజీ రాకతో (1915 జనవరి 9న) స్వాతంత్య్రోద్యమ దశలో నూతన శకం ఆరంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. దక్షిణా ఫ్రికాలో గాంధీజీ చేసిన తొలి సత్యాగ్రహం ఏది? అక్కడ స్థాపించిన గాంధీ, టాల్‌స్టాయ్, ఫ్యూనిక్స్ ఆశ్రమాల ఉద్దేశాలు ఏమిటి? ఆఫ్రికా అధ్యక్షుడు జనరల్ స్మట్స్, గాంధీ, గోఖలే మధ్య 1914లో జరిగిన ఒప్పందంలోని నిర్ణయాలు? ‘అన్ టు ది లాస్ట్’గ్రంథాన్ని గాంధీజీ ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీలోకి అనువదించడంలోని ఉద్దేశం? 1909లో ‘హిందూ స్వరాజ్’ గ్రంథంలో న్యాయవాదులను, డాక్టర్లను, రైల్వేలను ఎందుకు విమర్శించారు? లాంటి ప్రశ్నలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ముఖ్యం. భారత్‌లో గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహాలు 1. చంపారన్ (1917)- నీలిమందు రైతుల కోసం (శాసనోల్లంఘనోద్యమం). 2. ఖేడా (1918)- గుజరాత్‌లోని గిరిజనుల కోసం (సహాయనిరాకరణోద్యమం). 3. అహ్మదాబాద్ (1918)-గుజరాత్‌లోని కార్మికుల కోసం (నిరాహార దీక్ష). 4. రౌలత్ చట్టం (1919) - దేశవ్యాప్తంగా ‘గాంధీజీ జన బాహుళ్య ఉద్యమం చేసి అన్ని విజయాలు సాధించారు. కానీ జాతీయ నాయకుడిగా చేసిన ఉద్యమాల్లో ఎందుకు విఫలం చెందారు? 1928-22 సహాయనిరాకరణోద్యమం: దీంతో గాంధీజీ దేశంలో తిరుగులేని నాయకునిగా నిల్చిపోయారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణాలు? చౌరీచౌరా సంఘటన (1922 ఫిబ్రవరి 5న)తో ఎందుకు నిల్పివేశారు? స్వరాజ్య పార్టీ (1923), అఖిల భారత రాష్ర్ట ప్రజల సంస్థ (1927), కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934), ఫార్వర్డ బ్లాక్ (1939), భారత కమ్యూనిస్ట్ పార్టీ (1925) ఎందుకు ఆవిర్భవించాయి? వాటి ముఖ్యాంశాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి. మాదిరి ప్రశ్నలు 1. ‘మహ్మదరన్ సాహిత్య సమాజం(1863)’ స్థాపకులు ఎవరు? (2001 సివిల్స్) 1) నవాబ్ అబ్దుల్ లతీఫ్ 2) సయ్యద్ అమీన్ ఆలీ 3) షరియతుల్లా 4) డాక్టర్ ముత్కార్ అహ్మద్ అన్సారీ 2. కింది వాటిలో సరైంది? (2002 సివిల్స్) 1) దీనమిత్ర - రామన్ పిళ్లై 2) మార్తాండ వర్మ-ముకుంద్‌రావు పాటిల్ 3) న్యూ ఇండియా- విష్ణు కృష్ణ చిప్లూంకర్ 4) నిబంధన మాల - బిపిన్ చంద్రపాల్ 5) మహానిర్వాణ్ తంత్ర - రాయ్ వివరణ: దీనమిత్ర: నీలిమందు రైతుల గురించి ముకుంద్‌రావు పాటిల్ వివరించాడు. మార్తాండ వర్మ: ట్రావెన్కోర్ రాజు వివరాలు సి.వి.రామన్ పిళ్లై రచించాడు. న్యూ ఇండియా: బిపిన్‌చంద్రపాల్ పత్రిక నిబంధన మాల- విష్ణుకృష్ణ చింప్లూకర్ రచన 3. కింది వాటిలో తీవ్రవాద సంస్థ - వాటి స్థాపకుల్లో సరికానిది? 1) యంగ్ ఇండియా - దామోదర్ సావర్కర్ 2) హిందూస్తాన్ ప్రజా తాంత్రిక్ సంఘ్ - సూర్యసేన్ 3) ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ - భగత్‌సింగ్ 4) భారతమాత - అజిత్‌సింగ్ వివరణ: ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని సచీంద్ర సన్యాల్ స్థాపించారు. భగత్‌సింగ్ ‘నవభారత జవాన్’ను స్థాపించారు. 4. గాంధీజీకి సంబంధించి సరికానిది? 1) తొలి శాసనోల్లంఘన ఉద్యమం - 1930 ఏప్రిల్ 6న 2) తొలి సహాయనిరాకరణోద్యమం - 1918 ఖేడా ఉద్యమం 3) తొలి నిరాహార దీక్ష 1918- గుజరాత్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం 4) తొలి ఆశ్రమం- సత్యాగ్రహ ఆశ్రమం 1915లో స్థాపించారు. వివరణ: తొలి శాసనోల్లంఘన ఉద్యమం గాంధీజీ 1917 చంపారన్ జిల్లా మోతీహారి గ్రామంలో (బీహార్ రాష్ర్టం) చేశారు. సమాధానాలు: 1) 1 2) 5 3) 3 4) 1 -
త్రిభంగ నాట్యం అంటే ఏమిటి?
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్ స్టడీస్ చరిత్ర విభాగంలో మొత్తం 18 టాపిక్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి పాఠ్యాంశం నుంచి ఒక్కో ప్రశ్న వస్తుంది. కాబట్టి చరిత్ర నుంచి మొత్తం 36 మార్కులు అంచనా వేయవచ్చు. ఏయే అంశాలను ఏవిధంగా చదవాలి? టాపిక్స్ వారిగా ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలో చూద్దాం.. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రీ హిస్టోరిక్ కల్చర్‌లో ‘హోమో ఎరక్టస్’ ఆధారాలు ఏ దశలో ఏర్పడ్డాయి, హోమో సెపియన్స దశ ఏర్పడిన కాలం, ప్లిస్టోసిన్, పాతరాతియుగంలో మానవుడు కఠినమైన ‘క్వార్టజైట్’ రాళ్లను వాడటం, ఈ కాలానికి చెందిన ఆధారాలు (పంజాబ్‌లోని ‘సోనార్’ తీరం, మధ్యప్రదేశ్‌లోని బీమ్ బెట్కా, ఉత్తరప్రదేశ్‌లోని ‘బేలం’ లోయ, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, రాజస్థాన్‌లోని దిద్వాన, మద్రాస్‌లోని పల్లవరంలో లభ్య మయ్యాయి) లాంటి అంశాలు ముఖ్యమైనవి. పాతరాతి యుగానికి చెందిన వర్ణచిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మధ్యప్రదేశ్‌లోని రాయఘర్, సింగన్‌పూర్, కైమూర్ ప్రాంతాల్లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ కాలంనాటి స్థావరాలు, వారి శిల్పకళ, ఆర్థిక విధానంపై ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువ. ఉదా: ప్రాచీన కాలంలో ప్రీ-హిస్టోరిక్ కాలానికి చెందిన ‘మెహర్గర్’ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు కనిపెట్టారు. ఇది ఎక్కడ ఉంది? అని 2008లో నిర్వహించిన పరీక్షలో అడిగారు. ఈ ఆధారాలు క్రీ.పూ. 9000 - 1000 మధ్య కాలంలో పశ్చిమ బెలూచీస్తాన్ (పాకిస్థాన్)లో బయల్పడ్డాయి. అందువల్ల అభ్యర్థులు బుర్జహాం (కాశ్మీర్), చిరాండ్ (బీహార్), నాగార్జున కొండ స్థావరాల్లో కుక్క, మనిషి, సమాధులు ఎక్కడ బయల్పడ్డాయి, ఎముకలతో చేసిన పరికాలు ఎక్కడ లభించాయి, ‘హోల్స్టీల్’ అంటే ఏమిటి? ‘పునర్జన్మ’పై ఎప్పుడు విశ్వాసం కలిగింది? అల్ప పరిమాణం ఉన్న రాతి పరికరాలు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. కింది అంశాలను గుర్తుంచుకోండి.. చిరాండ్లో ఎముకలతో రూపొందించిన పనిముట్లు నగర్లో ‘కుండ’ అవశేషాలు అలహాబాద్‌లో వరిసాగుకు సంబంధించిన ఆధారాలు గంగేరియాలో ‘రాగితో’ చేసిన పనిముట్లు(రాగి నాగరికత రాజస్థాన్‌లో ప్రారంభమైంది) గణేశ్వర్‌లో రాగి గనులు నవదోతోలి, యరాన్ నాగ్దాలో మాళ్వా సంస్కృతి నెవాసా, చందోలి, సాన్గాం ప్రాంతాల్లో (జోర్వో సంస్కృతి) ఇనాంగావ్లో దీర్ఘ చతురస్రాకారంలో పెద్ద ఇల్లు, మాతృదేవతా విగ్రహం బయల్పడ్డాయి. దంత శిల్పులు, నేత పనివారికి సంబంధించిన ఆధారాలు - ఇనాం గావ్‌లో చేతివృత్తులకు సంబంధించిన ఆధారాలు - సాన్గావ్లో కాయధాన్యాలు, పప్పులు, ఉలువలు, రాగులు - నవదతోలిలో మొక్కల పెంపకానికి చెందిన ఆధారాలు - సాల్ట్‌లేక్ (రాజస్థాన్) లో లభ్యమయ్యాయి. సింధూ నాగరికత సింధూ నాగరికత కాలంనాటి ముఖ్య పట్టణాలు, పట్టణ ప్రణాళిక, మురుగునీటి వ్యవస్థ, సామాజిక విధానం, నాగరికతా ఆవిర్భావం, పతనం, ఆ కాలంనాటి శాసనాలు, చిత్రకళ, నాట్యం మొదలైన అంశాలు ప్రాధాన్యమైనవి. 2001 సివిల్స్ పరీక్షలో ‘ఈ కింది ఏ పట్టణంలో సింధూ ప్రజల పెయింటింగ్‌స బయల్పడ్డాయి’ అని అడిగారు. దీనికి సమాధానం లోథాల్. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రాంతంలో ఎలాంటి పెయింటింగ్‌స లభ్యమయ్యాయి, వాటిలోని రంగులేవి లాంటి లోతైన అంశాలపై కూడా దృష్టి సారించాలి. 2013లో ‘త్రిభంగ’ నాట్యం అంటే ఏమిటి?’ అని అడిగారు. సాధారణంగా కూచిపూడి, భరతనాట్యంపై అవగాహన ఉంటుందిగానీ త్రిభంగ అంటే చాలామందికి తెలియదు. ఇది ద్రవిడ నాగరికతలోనే ఆవిర్భవించింది. త్రి అంటే మూడు, భంగ అంటే భంగిమ. దీంట్లో 3 భంగిమలు ఉంటాయి. పట్టణాలు ఏ నదీతీరంలో ఉన్నాయి, ఏయే పట్టణాలు ఏయే ఆకారంలో ఉన్నాయి, సింధూ ప్రజలు ఉపయోగించిన లోహాలు, వాటి నైపుణ్యం, సింధూ లిపిని చదివినవారు లాంటి అంశాల గురించి తెలుసుకోవాలి. గర్భం నుంచి చెట్టు మొలచినట్టు ఉన్న ఒక స్త్రీ మూర్తి విగ్రహం, ఉద్యానవన నగరం, గబర్బండ లేదా రిజర్వాయర్లు ఎక్కడ బయల్పడ్డాయి లాంటి నూతన అంశాలపై దృష్టి సారించాలి. ప్రిలిమినరీ అనేది జ్ఞానం గురించి తెలుసుకునే పరీక్ష కాదు, ఇది వడపోత విధానంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. మెయిన్స జ్ఞానం, సబ్జెక్టు గురించి తెలుసుకునే పరీక్ష. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ప్రవర్తన; మానసిక సామర్థ్యం; డిసీషన్ మేకింగ్, ఆప్టిట్యూడ్ స్కిల్స్; అడ్మినిస్ట్రేషన్ మెథడ్స గురించి తెలుసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష చాలా ప్రధానమైంది. దీంట్లో విజయం సాధిస్తే, ఏదో ఒక సర్వీస్‌లో చేరడానికి బీజం పడుతుంది. యూపీఎస్సీ ఏయే అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వవచ్చో ఊహించడం కష్టతరమైన పని. అభ్యర్థులు అభ్యసనం ద్వారానే దీనికి సంబంధించిన అవగాహనను ఏర్పరచుకోవాలి. అభ్యర్థి చదివే అంశాలు, రంగాలు వారికి ప్రాధాన్యం కాకపోవచ్చు. సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య రంగా లు మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యమైనవే. భారతీయ చరిత్ర - సంస్కృతి అనేది ప్రధానమైంది. మనదేశం, మన చరిత్ర, మన సంస్కృతి.. ఇవి ఏయే అంశాలతో ముడిపడి ఉన్నాయి? లాంటివాటిని ముఖ్యాంశాలుగా గుర్తించండి. వేద సమాజం ఇది ముఖ్యమైన పాఠం. ఆర్యుల జన్మస్థలంపై అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. మెక్‌డొనాల్డ్ ఆస్ట్రియా, హంగరి అని, మోర్గాన్ సైబీరియా అని, ఫొకొర్ని వోల్గా అని, పెంకాహెర్ట జర్మనీ అని పేర్కొన్నారు. వేదాలు జ్ఞానమూలాలు. వాటిపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. గతంలో- ‘యుద్ధాలు మానవుల మేధస్సుల్లోంచి ఆవిర్భవిస్తాయి’ అనే మాటలు ఏ వేదం లోనివి? అని అడిగారు. (జ: అధర్వణ వేదం) ‘నేను ఒక కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి పిండిగిర్నిలో పనిచేస్తుంది’? ఈ మాటలు ఏ వేదంలో ఉన్నాయి? (1996) ప్రాచీన వేదం ఏది? తెల్ల/ నల్ల వేదంగా ప్రసిద్ధి చెందింది ఏది? సంగీతానికి మూలం ఏది? లాంటి ప్రశ్నలు వచ్చాయి. వీటి ఆధారంగా ప్రశ్నల సామర్థ్యం, లోతును అంచనా వేసుకోవచ్చు. వేదాలు ఎన్ని? అవి ఏవి? అనేవి కాలం చెల్లిన ప్రశ్నలని గమనించాలి. 5వ వేదం ఏది? అసలు 5వ వేదంగా ఎన్ని గ్రంథాలకు పేర్లున్నాయి? లాంటివాటిపై అవగాహన పెంచుకోవాలి. వేదాలు, వాటితో ముడిపడి ఉన్న బ్రాహ్మణాలు; వేద సంస్కృతి, తత్త్వశాస్త్రాలు; కల్ప, శిక్ష, నిరుక్త పదాలకు అర్థాలు; బృహత్మాలకథ అనే ప్రసిద్ధ రచన ఏ వేదంలో ఉంది? సర్వేజనా సుఖినోభవంతు, తమసోమా జ్యోతిర్గమయ లాంటి సూక్తులు ఎందులో ఉన్నాయి? వేద సమాజం, సాహిత్యం, ఆర్థిక విధానం, వేద, సింధూ నాగరికతల ప్రధాన పోలికలు మొదలైనవాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. మత ఉద్యమాలు జైనం, బౌద్ధం లాంటి నూతన మతాల స్థాపకులతోపాటు చార్వాకం, అజీవకం, ప్రాకృతిక వాదం, మత సిద్ధాంతాలు, వాటి శిల్పకళ, సమావేశాలు, మత గ్రంథాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. బుద్ధుని బోధనలు ‘పాళీ’ భాషలో, మహావీరుని బోధనలు అర్ధమాగధి భాషలో ఉన్నాయి. వారి సిద్ధాంతా లు ప్రతీయ సముత్పాదం (బౌద్ధం), శద్వాదం (జైనం), ప్రాకృతిక వాదం (అజీవకం), లాంటివి ముఖ్యమైనవి. బుద్ధుని దీర్ఘ ఉపన్యాసాలు, హ్రస్వ ఉపన్యాసాలు, సామెతలు ఏ గ్రంథంలో ఉన్నాయి? ‘ఆసియా జ్యోతి’ అనేది ఎవరి రచన? అవలోకితేశ్వర, మంజుశ్రీ, వజ్రపాణి, పద్మపాణి.. వారి చేతిలో ఉన్న గుర్తులు, బౌద్ధ ము ద్రలు - వాటి ప్రాముఖ్యం లాంటివాటి గురించి క్షుణ్ణంగా చదవాలి. 2013లో బౌద్ధ శిల్పకళకు సంబంధించి ‘చైత్యం, విహారం’ మధ్య ఉన్న భేదాలు ఏవి’ అనే ప్రశ్న అడిగారు. చైత్యం అనేది ప్రార్థ్దనాలయం, విహారం అంటే విశ్రాంతి మందిరం. వీటి ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. మౌర్యుల పరిపాలనా విధానం మౌర్యుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు; అశోకుని శాసనాలు, వాటిని వెలుగులోకి తెచ్చినవారు; అశోకుని ధమ్మ విధానం, మెయిన్స్ పరీక్ష కోణంలో ‘అశోకుని ధమ్మ విధానం ప్రస్తుత భారతీయ సమాజానికి అత్యంత విశ్వసనీయత, మానవనీయత గలదని ఏకీభవిస్తావా?’ లాంటి అంశాలు ప్రధానమైనవి. మౌర్యుల శిల్పకళ, ఆర్థిక విధానం, సమాజం గురించి తెలుసుకోవాలి. 1997లో మౌర్యులను క్షత్రీయులుగా ఏ గ్రంథంలో తెలిపారు? (జవాబు: దివ్యవదన. ఇది నేపాల్ బౌద్ధగ్రంథం). 2012లో కౌటిల్యుడికి, విష్ణుశర్మ, చాణక్యుడు అనే ఇతర పేర్లు ఉన్నట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు? అని అడిగారు. (జవాబు: విశాఖదత్తుని ముద్రరాక్షసం) మౌర్యుల అనంతర యుగం చివరి మౌర్యరాజు బృహద్రదుడుని అతడి సేనాని పుష్యమిత్రుడు హత్యచేసి ‘శుంగ’ వంశాన్ని స్థాపించాడు. శుంగుల కాలంలో ‘మాలతీమాదవీయం’ను రచించిన భవభూతి, పాణిని, వ్యాకరణాన్ని రాసిన పతంజలి, ‘పాశుపతశైవం’ను స్థాపించిన లకులీస, ‘వైష్ణవం’ను స్థాపించిన వాసుదేవుడు ప్రసిద్ధి చెందినవారు. దక్షిణ భారతదేశంలో చోళుల కాలంలో ‘పుహార్’, పాండ్యుల కాలంలో ‘కొర్కయ్’, చేర పాలనా కాలంలో ‘తొండై’ ప్రసిద్ధి చెందిన నౌకా కేంద్రాలు. శాతవాహనుల సామాజిక, ఆర్థిక, శిల్పకళా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ కాలంలో భారతదేశ ఉత్తర, వాయువ్య ప్రాంతాలను ఇండో గ్రీకులు, శకులు, పార్దియన్లు, కుషాణులు పరిపాలించారు. స్ట్రాబో, ఫ్లూటార్క, జస్టిన్ గ్రీకు చరిత్రకారులకు సంబంధించి అవగాహన అవసరం. శకుల సంస్కృత శాసనం, పార్దియన్ల కాలంలో వచ్చిన క్రైస్తవ సన్యాసి, కుషాణుల శిల్పకళలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విక్రమశకం (58), శక సంవత్సరం (78), అంధకారయుగంగా పిలిచే 200 బీసీ నుంచి 300 ఏడీ మధ్య కాలానికి సంబంధించిన అంశాలపై అవగాహన అవసరం. గుప్తుల యుగం గుప్తులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారని ‘జయస్వాల్’ పేర్కొన్నారు. తెలుగు ప్రాం తం వారైన ఇక్ష్వాకుల వంశానికి చెందినవారని మజుందార్ భావించాడు. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. సముద్రగుప్తుడిని భారతీయ నెపోలియన్ అంటారు. రెండో చంద్రగుప్తుని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీని స్థాపించాడు. స్కందగుప్తుడు యుద్ధవీరుడు. భానుగుప్తుడు ఎరాన్ శాసన నిర్మాత. గుప్తుల కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందింది. వ్యాపారులను - సెట్టిలు అనేవారు. జాజ్‌మనీ, విష్టి, మొదలైన ఆర్థిక పరిస్థితులు, ఉద్వాంగ, వతభూత లాంటి పన్నులు, సాహిత్యం, శిల్పకళా రంగాలు, సామాజిక పరిస్థితులను క్షుణ్ణం గా అధ్యయనం చేయాలి. 2000 ప్రిలిమ్స్ పరీక్షలో ‘క్షేత్ర, ఖిలా, అనేవి ఏ రకమైన భూములు?’, 2002 పరీక్షలో ‘మనుస్మృతి, యజ్ఞవల్క, బృహస్పతి, దేవల సృ్మతులను క్రమంలో అమర్చండి.’ అనే ప్రశ్నలు అడిగారు. ‘అభినవభారత’ రచన, సంజనఫలకాలు, నాట్యదర్పణి గ్రంథాల రచయితలు ఎవరు? పౌలిస, లఘుజాతక గ్రంథాలలోని గణిత సంబంధిత విషయాలను అధ్యయనం చేయాలి. మధ్యయుగ భారతదేశంలో చోళుల పాలనాంశాలు, ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల సాంస్కృతిక సేవ, బెంగాల్లో సేన వంశం అద్భుత సాగర రచన, జనకుని పృథ్వీరాజ విజయం, భట్టి రావణ సుధ, పద్మగుప్తుని నరశాశాంక చరిత్ర, చక్రపాణి దత్త చికిత్సా సాగరం, రాజామార్తాండ యోగ సూత్రాల వ్యాఖ్యానం, చోళుల గ్రామపాలన, ఆర్థిక విధానం లాంటివి ప్రధానాంశాలు. వీరి శిల్పకళ, కోరంగనాథ్ దేవాలయం(పరాంతక), బృహదీశ్వర (రాజరాజ), ఐరావతారేశ్వరా (రెండో రాజరాజ) లాంటి నిర్మాణాల గురించి తెలుసుకోవాలి. పరమారులు ‘దారా’ చాళుక్యులు ‘అనిల్‌వారా’, సేన ‘విజయపుర’ గహద్వల ‘కనోజ్’ రాజధానులుగా పాలించారు. చోళుల కాలంలో మండలం (రాష్ట్రాలు) నాడు లు (జిల్లాలు), కొట్టం (మండలం), ఉర్ (గ్రామం)గా విభజన చేయడం లాంటి పరిపాలనాంశాలపై దృష్టి అవసరం. తర్వాతి సాంస్కృతిక మార్పులను క్షుణ్ణంగా చదవాలి. 750 నుంచి 1200 వరకు వచ్చిన మార్పు లు గమనించాలి. ఈ విభాగంలో చిస్తి మొహినుద్దీన్ (1191), సౌహార్ది -షియాబుద్దిన్ ఉమర్ (1290), ఖాద్రీ షానియాముల్లా (1430), నక్షబంది బకీబిల్లా (1603) లాంటివారు ముస్లింలలో వచ్చిన భక్తి ఉద్యమకారులు. హిందూ మతంలో, శంకరదేవుడు (అస్సాం), లల్ల (కాశ్మీర్), నర్సింగ్ మెహతా (గుజరాత్) ముఖ్యులు. రాగమార్గం, భక్తిమార్గం, బెడబెద, పుష్టిమార్గం, ప్రాపతి మార్గాలు ఎవరివి?, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత, ద్వైతాద్వైతా, శుద్దా ద్వైతం ఎవరివి? లాంటివాటి గురించి చదవాలి. 2001లో ‘‘కిందివారిలో ఎవరు ‘కీర్తన’లు ప్రవేశపెట్టారు?’’ అని అడిగారు. (జవాబు: చైతన్య) కిందివారిలో వైష్ణవ భక్తి ఉద్యమకారులెవరు? 1) చైతన్య 2) లల్లదేవ 3) నంబిఅండార్ 4) తులసీదాస్ 5) రామానుజ ఎ) 1, 2, 3 బి) 2, 3, 4 సి) 1, 4, 5 డి) 3, 4, 5 జవాబు: సి