నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను. ఎకానమీలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా?
-ఎస్.కిశోర్, కోఠి
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రిలిమ్స్‌లో ఎకానమీ నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. ఉపాధి, పంచవర్ష, వార్షిక ప్రణాళికలు, ద్రవ్యం, బ్యాంకింగ్, వ్యవసాయం, ప్రభుత్వ విత్తం, జ నాభా, పేదరికం, విదేశీ వాణిజ్యం, అవస్థాపనా సౌకర్యాలు వంటివి పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్. ప్రశ్నలు ఈ అంశాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని గమనిస్తే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉన్నాయి. కాబట్టి ఎకానమీకి సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం ఎన్‌సీఈఆర్‌టీ ఆరో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. గతేడాది ప్రిలిమ్స్‌లో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం.
కాబట్టి అభ్యర్థులు ఆర్థిక నివేదికలు, వ్యవసాయం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్, జాతీయాదాయం, యూఎన్‌డీపీ నివేదిక, 12వ పంచవర్ష ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం - బ్యాంకింగ్, సుస్థిర అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. కార్పొరేట్ గవర్నెన్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ - కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు, కరెంట్ అకౌంట్ లోటు వంటివి కూడా ముఖ్యమైనవే. ప్రిపరేషన్‌లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌కు అన్వయించి చదువుకోవాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతిరోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి స్వీయ పరీక్షను నిర్వహించుకోవాలి.
ఇన్‌పుట్స్: తమ్మా కోటిరెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్
జాబ్స్, అడ్మిషన్స్ అలర్‌ట్స
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
పోస్టులు: సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్): 13
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4
హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్): 10
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5
వెబ్‌సైట్: http://itbpolice.nic.in
సీటెట్ - సెప్టెంబరు 2014
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సెప్టెంబరు 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014
పేపర్ - 1 (ఒకటి నుంచి ఐదో తరగతి)
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/ఇంటర్ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి.
పేపర్ - 2 (ఆరు నుంచి ఎనిమిది తరగతులు)
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీఎడ్/ డీఎడ్/ బీఈఎల్‌ఎడ్ ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4
పరీక్ష తేది: సెప్టెంబరు 21, వెబ్‌సైట్: www.ctet.nic.in
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్
అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్)
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్
అర్హతలు: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4
వెబ్‌సైట్: http://www.cdachyd.in/