సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ: పారిశ్రామిక(ఇండ్రస్టియల్) ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది.
తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment