న్యూఢిల్లీ: ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంలో (డీటీఏఏ) భాగంగా భారత్‌కి అనుకూల దేశంగా ఇచ్చిన హోదా (ఎంఎఫ్‌ఎన్) నిబంధనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ ట్యాక్స్ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదైనా ఓఈసీడీలో (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) చేరినప్పుడు, ఎంఎఫ్‌ఎన్ నిబంధన ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదంటూ నెస్లే కేసులో భారత సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన నేపథ్యంలో స్విస్ ఫైనాన్స్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్‌లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడనుండగా, ఆ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్నుల భారం పడనుంది. తమ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై స్విట్జర్లాండ్ ఇకపై 10 శాతం పన్ను విధించనుంది.
Comments
Please login to add a commentAdd a comment