ట్రంప్‌ కలం నుంచి జాలువారిన అక్షరాలు | Donald Trump Authored Several Books Over The Years, Here's The List Of His Notable Works | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కలం నుంచి జాలువారిన అక్షరాలు

Published Sun, Dec 22 2024 1:02 PM | Last Updated on Sun, Dec 22 2024 1:41 PM

Donald Trump authored several books over the years Here are some of his notable works

అమెరికా అధ్యక్షుడు రాసిన పుస్తకాలు

డొనాల్డ్ ట్రంప్ అనగానే వెంటనే గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడిగానే కదా. ఆయన మంచి రచయితని చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి.. అందుకు ఎన్ని మార్గాలున్నాయి.. సమకూరిన డబ్బును ఎలా సమర్థంగా నిర్వహించాలి.. అనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. ప్రముఖ పుస్తకం ‘రిచ్‌డాడ్‌ పూర్‌డాడ్‌’ రచయిత రాబర్ట్‌ టి కియోసాకీ వంటి వారితో కలిసి సహ రచయితగా కూడా ట్రంప్‌ కొన్ని పుస్తకాలు రాశారు. డబ్బుకు సంబంధించి ట్రంప్‌ రాసిన పుస్తకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

1. 1987: ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని టోనీ ష్వార్ట్జ్ తో కలిసి రాశారు.

2. 2004: హౌటు గెట్‌ రిచ్‌

3. 2004: థింక్‌ లైక్‌ బిలియనీర్: ఎవ్రీథింగ్‌ యూ నీడ్‌ టు నో ఎబౌట్‌ సక్సెస్‌, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ లైఫ్‌.

4. 2005: సర్వైవింగ్ ఎట్ ది టాప్

5. 2006: ట్రంప్ 101: ది వే టు సక్సెస్.

6. 2006: వై వి వాంట్ యు టు రిచ్  - రాబర్ట్ టి కియోసాకితో కలిసి రాశారు.

7. 2007: థింక్‌ బిగ్‌ అండ్‌ కిక్‌ ఆస్‌ ఇన్‌ బిజినెస్‌ అండ్‌ లైఫ్‌

8. 2011: ట్రంప్ నెవర్‌ గివప్‌: హౌ ఐ టర్న్‌డ్‌ మై బిగ్గెస్ట్‌ ఛాలెంజెస్‌ ఇన్‌టు సక్సెస్‌.

9. 2012: మిడాస్ టచ్: వై సమ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ గెట్‌ రిచ్‌-అండ్‌ వై మోస్ట్‌ డోన్ట్‌-రాబర్ట్ టి కియోసాకి, మార్క్ బర్నెట్‌లతో కలిసి రాశారు.

10. 2015: క్రిపుల్డ్‌ అమెరికా: హౌ టు మేక్‌ అమెరికా గ్రేట్‌ అగేన్‌

డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా వ్యాపారాను స్థాపించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన దృష్టి సారించిన కొన్ని కీలక వ్యాపారాలు కింది విధంగా ఉన్నాయి.

రియల్ ఎస్టేట్

ట్రంప్‌ తండ్రికి చెందిన ట్రంప్ మేనేజ్‌మెంట్‌ కంపెనీతో రియల్ ఎస్టేట్‌లో తన వ్యాపార కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దానికి ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్, మియామిలోని ట్రంప్ నేషనల్ డోరాల్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోతో సహా అనేక స్థిరాస్తులను అభివృద్ధి చేశారు.

హోటల్స్ అండ్ రిసార్ట్స్

వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, మియామీలోని ట్రంప్ నేషనల్ డోరాల్ సహా పలు హోటళ్లు, రిసార్టులను ట్రంప్ నిర్వహిస్తున్నారు.

కాసినోలు

అట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా, ట్రంప్ తాజ్ మహల్ వంటి ప్రాపర్టీలతో ట్రంప్ క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, వీటిలో కొన్ని వెంచర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.

గోల్ఫ్ కోర్సులు

న్యూజెర్సీలోని బెడ్మినిస్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్, స్కాట్లాంట్‌లోని ట్రంప్ టర్న్‌బెర్రీతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌నకు అనేక గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.

లైసెన్సింగ్, బ్రాండింగ్

ట్రంప్ వోడ్కా, ట్రంప్ స్టీక్స్, ట్రంప్ బ్రాండెడ్ దుస్తులు, ఇతర ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు ట్రంప్ తన పేరుతో లైసెన్స్‌ తీసుకున్నారు.

టీవీ షో

2004-2015 వరకు అమెరికాలో ప్రసారమైన రియాలిటీ టీవీ షో ‘ది అప్రెంటిస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇదీ చదవండి: తులం బంగారం ధర ఎలా ఉందంటే..

ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న నేషనల్‌ బుక్‌ ఫెస్టివల్‌కు నగరంలోని చాలా ప్రాంతాల నుంచి పాఠకులు వస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన గడువు డిసెంబర్‌ 19 నుంచి 29 వరకు ఉందని నిర్వాహకులు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement