Trump towers
-
ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్‌లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్‌కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్స్‌లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్‌మెంట్‌ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్‌కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
రణబీర్ కపూర్‌కు కోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌పై పుణె సివిల్ కోర్టులో దావా దాఖలైంది. కల్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్‌లో గల రణబీర్ కపూర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సూర్యవంశీ అనే మహిళ రణబీర్‌పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు. రెంటల్ అగ్రిమెంట్ నియమాలను రణబీర్ ఉల్లంఘించాడంటూ సదరు మహిళ ఈ దావా వేశారు. అగ్రిమెంట్ వ్యవధి కంటే ముందే తనను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నట్టుండి తన కుంటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయించడంతో తీవ్ర ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని వాపోయారు. వివరాలు: 2016 అక్టోబర్‌లో ‘లీవ్ అండ్ లైసెన్స్’ ప్రాతిపదికన రణబీర్ తన అపార్ట్‌మెంట్‌ను సూర్యవంశీకి నెలకు 4 లక్షల రూపాయల చొప్పున 24 నెలల కాలానికి అద్దెకు ఇచ్చారు. కానీ, అనుకోకుండా 11 నెలలు కాగానే ఇల్లు ఖాళీ చేయాలని రణబీర్ పట్టుబట్టాడని ఆమె వెల్లడించారు. చివరికి 2017 అక్టోబర్‌లో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించారని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అపార్ట్మెంట్ ఖాళీ చేయండని రణబీర్ వాళ్లు మాతో అమర్యాదగా ప్రవర్తించారని సూర్యవంశీ కోర్టుకు విన్నవించారు. కాగా, మెయిల్ ద్వారా కోర్టు నోటీసులు అందుకున్న రణబీర్ స్పందిస్తూ.. తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. ఇష్టపూర్వకంగానే సూర్యవంశీ ఇల్లు ఖాళీ చేశారని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. కోర్టులో తన వాదనలు వినిపిస్తానని స్పష్టంచేశారు. -
భారత్‌లో దూసుకుపోతున్న ట్రంప్ టవర్స్
ట్రంప్ టవర్స్ భారత్‌లో దూసుకుపోతుంది. లాంచైనా తొలి రోజే ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ కింద రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా 20 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది. వీటి విలువ రూ.150 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 250 యూనిట్లను విక్రయించి రూ.2500 కోట్లను సేకరించాలని ఎం3ఎం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రియాల్టీ సంస్థలు ఎం3ఎం ఇండియా, ట్రిబెకా డెవలపర్స్ ద్వారా ఉత్తర భారత్‌లో గ్లోబల్ రియాల్టీ బ్రాండు ట్రంప్ టవర్స్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. 'ట్రంప్ టవర్స్ ఢిల్లీ ఎన్సీఆర్' పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను రూ.1200 కోట్లతో ఎం3ఎం ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మార్కెట్ చేయడానికి ట్రిబెకా డెవలపర్స్‌కు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ హక్కులు కలిగి ఉన్నాయి. లాంచ్ అయిన తొలి రోజే గుర్గావ్లోని ఐకానిక్ ట్రంప్ టవర్స్‌లో రూ.150 కోట్ల విక్రయాలు జరిపినట్టు ఎం3ఎం ఇండియా డైరెక్టర్ పంకజ్ బన్సాల్ తెలిపారు. మొత్తం 250 ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్స్‌లను ట్రంప్ టవర్స్ పేరు మీదుగా ఎం3ఎం, ట్రిబెకా అభివృద్ధి చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో ప్రస్తుతం ట్రంప్ టవర్స్‌ను డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నడిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అభివృద్ధి చేస్తున్న లగ్జరీ రెసిడెన్స్‌ల ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్యలో ఉన్నాయి. -
ముంబైలోని ట్రంప్ టవర్స్‌కు జెట్ సర్వీసులు
ముంబై: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ పడుతున్న శత కోటీశ్వరుడు డొనాల్డ్ ట్రంప్ ముంబై నగరంలో ట్రంప్ టవర్స్ పేరిట లగ్జరీ టవర్లను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వీటిలో నివసించేవారికి ప్రైవేట్ జెట్ సర్వీసులను అందజేస్తామని తాజాగా ప్రకటించారు. ప్రైవేట్ జెట్ సర్వీసులు ఇంతవరకు భారత దేశంలోనే లేవు. క్రెకెట్ స్టేడియం, సినిమా థియేటర్, అంపీ థియేటర్, అథ్లెటిక్ ట్రాక్స్, స్పా బాత్‌లు, స్పాలు, స్మిమ్మింగ్ పూల్స్, జలపాతాలు, రిసార్ట్స్ లాంటి సౌకర్యాలతో మొత్తం 17 ఎకరాల్లో 800 అడుగుల ఎత్తై ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు. 75 అంతస్థులుండే ఈ టవర్స్‌లో 400 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ముంబైకి చెందిన లోధా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ టవర్స్ 2018 సంవత్సరం నాటికి పూర్తవుతాయి. మూడు పడక గదుల ఫ్లాట్‌ను 9.10 కోట్లకు, ఐదు పడక గదులు కలిగిన ఫ్లాట్‌ను పదిన్నర కోట్ల రూపాయలకు విక్రయించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. ముంబై నగరంతోపాటు పుణెలో కూడా ట్రంప్ టవర్స్‌ను నిర్మిస్తున్నారు.