భారత్‌లో దూసుకుపోతున్న ట్రంప్‌ టవర్స్‌ | Trump Towers sells 20 luxury apartments worth Rs 150 cr  | Sakshi
Sakshi News home page

భారత్‌లో దూసుకుపోతున్న ట్రంప్‌ టవర్స్‌

Published Thu, Jan 11 2018 5:40 PM | Last Updated on Thu, Jan 11 2018 5:40 PM

Trump Towers sells 20 luxury apartments worth Rs 150 cr  - Sakshi

ట్రంప్‌ టవర్స్‌ భారత్‌లో దూసుకుపోతుంది. లాంచైనా తొలి రోజే ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్ట్‌ కింద రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా 20 లగ్జరీ అపార్ట్‌మెంట్లను విక్రయించింది. వీటి విలువ రూ.150 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 250 యూనిట్లను విక్రయించి రూ.2500 కోట్లను సేకరించాలని ఎం3ఎం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రియాల్టీ సంస్థలు ఎం3ఎం ఇండియా, ట్రిబెకా డెవలపర్స్‌ ద్వారా ఉత్తర భారత్‌లో గ్లోబల్‌ రియాల్టీ బ్రాండు ట్రంప్‌ టవర్స్‌ తన కార్యకలాపాలు సాగిస్తోంది. 

'ట్రంప్‌ టవర్స్‌ ఢిల్లీ ఎన్‌సీఆర్‌' పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను రూ.1200 కోట్లతో ఎం3ఎం ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మార్కెట్‌ చేయడానికి ట్రిబెకా డెవలపర్స్‌కు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌ హక్కులు కలిగి ఉన్నాయి. లాంచ్‌ అయిన తొలి రోజే గుర్గావ్‌లోని ఐకానిక్‌ ట్రంప్‌ టవర్స్‌లో రూ.150 కోట్ల విక్రయాలు జరిపినట్టు ఎం3ఎం ఇండియా డైరెక్టర్‌ పంకజ్‌ బన్సాల్‌ తెలిపారు. మొత్తం 250 ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్స్‌లను ట్రంప్‌ టవర్స్‌ పేరు మీదుగా ఎం3ఎం, ట్రిబెకా అభివృద్ధి చేస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కావడంతో ప్రస్తుతం ట్రంప్‌ టవర్స్‌ను డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ నడిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అభివృద్ధి చేస్తున్న లగ్జరీ రెసిడెన్స్‌ల ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్యలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement