Trump business panel
-
ట్రంప్ సంతకం చేసిన షూస్.. ధర ఎంతో తెలుసా..
లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ ఇటీవల జరిగిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన షూస్‌ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన స్నీకర్లను ప్రదర్శించారు. మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఈ ఈవెంట్లో కనిపించి అలరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేడుకలో స్నీకర్కాన్ సంస్థ బంగారంతో తయారుచేసిన ‘నెవర్ సరెండర్ హై-టాప్స్’ షూస్‌పై ట్రంప్ ఆటోగ్రాఫ్ చేశారు. తరువాత వాటిని వేలానికి ఉంచారు. కార్యక్రమంలో పాల్గొన్న లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ వాటిని రూ.7.5లక్షలకు బిడ్ వేసి గెలుపొందినట్లు తెలిసింది. మెరిసే బంగారు హై-టాప్స్ వెనుక భాగంలో అమెరికన్ జెండా, ప్రక్కన ‘T’ (ట్రంప్ కోసం) అనే ఇంగ్లిష్ అక్షరంతో తయారుచేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్ స్నీకర్లలో కేవలం 1,000 మాత్రమే తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అందులో కొన్నింటిపై డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. Donald Trump walking out to the stage at #SneakerCon Has Joe Biden ever received a welcoming like this? Seems like Philadelphia is going to be voting for Trump.#SneakerCon #Trump2024NowMorethanEver pic.twitter.com/0Ohe6ZGkfc — Rob Coates 🇺🇸 (@LuckyHippie926) February 17, 2024 ఇదీ చదవండి: సెమీ కండక్టర్ల కొరత తీరనుందా..? కేంద్రం కీలక నిర్ణయం సోవియట్ యూనియన్‌లో జన్మించిన షార్ఫ్ ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్రే మార్కెట్ వాచ్ డీలర్లలో ఒకరిగా పేరుగాంచిన లగ్జరీ బజార్‌కు సీఈవోగా ఉన్నారు. బ్రాండ్లు తమ ఉత్పత్తులను నేరుగా లగ్జరీ బజార్ ద్వారా విక్రయించడానికి అధికారం పొందనప్పటికీ, అతని కంపెనీ మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది. ఏటా సుమారు రూ.1100 కోట్లు సంపాదిస్తుంది. -
ట్రంప్ కు గుడ్ బై: వ్యాపారవేత్తల సంచలన నిర్ణయం
కర్బన్ ఉద్గారాల విడుదలను నియంత్రించడానికి కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం అమెరికా వైదొలుగుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో, పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశాధినేతలు, బిజినెస్ లీడర్లు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద బిజినెస్ లీడర్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్, డిస్నీ రాబర్ట్ ఇగెర్ లు ట్రంప్ బిజినెస్ అడ్వైజరీ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగితే తాను బిజినెస్ అడ్వయిజరీ ప్యానెల్ కు రాజీనామా చేస్తామని ఎలోన్ మస్క్ ముందుగానే హెచ్చరించారు. ''అధ్యక్షుడి కౌన్సిల్ నుంచి నేను వైదొలుగుతున్నాను. వాతావరణ మార్పు అనేది నిజం. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం ఇటు అమెరికాకు అటు ప్రపంచానికి మంచిదికాదు'' అని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. పారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడంతో తాను కూడా అధ్యక్షుడి కౌన్సిల్ కు రాజీనామా చేస్తున్నట్టు రాబర్ట్ ఇగెర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వలసవాదులు, శరణార్థులపై ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో ఆయన కౌన్సిల్ నుంచి ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఉబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ తప్పుకొన్నారు. తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు, డీస్నీ అధినేతలు కూడా ట్రంప్ కు గుడ్ బై చెప్పారు. నేడు తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణానికి, ప్రపంచంలో ఆధిపత్య స్థానంలో ఉన్న అమెరికాకు భారీ ఎదురుదెబ్బ అని గోల్డ్ మాన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లాయిడ్ బ్లాంక్‌ఫీన్ కూడా అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత గతేడాది బిజినెస్ అడ్వైజరీ గ్రూప్ ను ఆయన ఏర్పాటుచేశారు.