ట్రంప్ సంతకం చేసిన షూస్‌.. ధర ఎంతో తెలుసా.. | Russian CEO Wins Donald Trump Autographed The Golden Shoes In Auction For Whopping Price, Details Inside - Sakshi
Sakshi News home page

Trump Autographed Sneakers: ట్రంప్ సంతకం చేసిన షూస్‌.. ధర ఎంతో తెలుసా..

Published Mon, Feb 19 2024 8:57 PM | Last Updated on Tue, Feb 20 2024 8:36 AM

Trump Autographed The Golden Shoes Auctioned Off - Sakshi

లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ ఇటీవల జరిగిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసిన షూస్‌ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన స్నీకర్లను ప్రదర్శించారు. మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఈ ఈవెంట్‌లో కనిపించి అలరించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ వేడుకలో స్నీకర్‌కాన్‌ సంస్థ​ బంగారంతో తయారుచేసిన ‘నెవర్ సరెండర్ హై-టాప్స్’ షూస్‌పై ట్రంప్‌ ఆటోగ్రాఫ్ చేశారు. తరువాత వాటిని వేలానికి ఉంచారు. కార్యక్రమంలో పాల్గొన్న లగ్జరీ బజార్ సీఈఓ రోమన్ షార్ఫ్ వాటిని రూ.7.5లక్షలకు బిడ్‌ వేసి గెలుపొందినట్లు తెలిసింది.

మెరిసే బంగారు హై-టాప్స్ వెనుక భాగంలో అమెరికన్ జెండా, ప్రక్కన ‘T’ (ట్రంప్ కోసం) అనే ఇంగ్లిష్‌ అక్షరంతో తయారుచేశారు. ఈ ప్రత్యేక ఎడిషన్ స్నీకర్లలో కేవలం 1,000 మాత్రమే తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అందులో కొన్నింటిపై డొనాల్డ్ ట్రంప్ ఆటోగ్రాఫ్ ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

ఇదీ చదవండి: సెమీ కండక్టర్ల కొరత తీరనుందా..? కేంద్రం కీలక నిర్ణయం

సోవియట్ యూనియన్‌లో జన్మించిన షార్ఫ్ ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్రే మార్కెట్ వాచ్ డీలర్‌లలో ఒకరిగా పేరుగాంచిన లగ్జరీ బజార్‌కు సీఈవోగా ఉన్నారు. బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను నేరుగా లగ్జరీ బజార్‌ ద్వారా విక్రయించడానికి అధికారం పొందనప్పటికీ, అతని కంపెనీ మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది. ఏటా సుమారు రూ.1100 కోట్లు సంపాదిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement