సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? | How they asking questions in Civils Prelims ? | Sakshi
Sakshi News home page

సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

Published Tue, Jul 15 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఈ చాప్టర్ నుంచి  ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి.?                                                         
  - వినోద్‌కుమార్‌రెడ్డి, అంబర్‌పేట
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ చాప్టర్ నుంచి కచ్చితంగా మూడు; నాలుగు ప్రశ్నలు  వస్తున్నాయి.  ఎక్కువగా ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ ప్రశ్నలు  అడుగుతున్నారు.  గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ప్రశ్నలన్నీ బహుళ సమాధానాలతో కూడినవి అంటే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయి. ఉదాహరణకు రాజ్యాంగ పరిషత్ నిర్మాణానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?లాంటి ప్రశ్నలు. ప్రాథమిక అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి రాజ్యాంగ రచనను ప్రభావితం చేసిన చారిత్రక సంఘటనలు(చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు), రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యుల సంఖ్య, సమావేశాలు, కమిటీలు, రాజ్యాంగ ఆధారాలు, తీర్మానాలు లాంటి విషయ సంబంధమైన సమాచారంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి.
 
  ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రాథమిక అంశాలను నోట్స్‌గా రాసుకున్న తర్వాత విస్తృత సమాచారం కోసం రిఫరెన్స్ పుస్తకాలను చదవొచ్చు. ఈ చాప్టర్‌లో విషయ సంబంధిత సమాచారమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటే అంకెలతో కూడిన సమాచారాన్ని(భాగాలు, ప్రకరణలు, అంశాలు) సులువుగా గుర్తుంచుకోవచ్చు. స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు పరిపాలన ఏ ప్రాతిపదికన జరిగింది? అంటే 1935 చట్టం ప్రకారం జరిగిందా? లేదా రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక నిబంధనల ప్రకారం జరిగిందా? అనే కోణంలో రాబోయే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయి. గత పరీక్షల్లో అడిగిన కింది ప్రశ్నలను పరిశీలించండి.
 
 -     భారత రాజ్యాంగం గణతంత్రం ఎందుకనగా?(సివిల్స్ 2007)
 సమాధానం: రాష్ర్టపతి, ఇతర ప్రజాప్రతినిధులు నిర్ణీత కాలానికి ఎన్నికవుతారు.
 -     అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశాలు ఏవి?(సివిల్స్ 2010)
 సమాధానం: ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, పిల్-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి మొదలైన అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అలా గ్రహించడానికి కారణాలనూ విశ్లేషించుకోవాలి. అమెరికా ‘హక్కులకు ప్రతీక, హక్కుల రక్షణకు న్యాయవ్యవస్థ అవసరం. ఇలా పోల్చుకుంటూ చదివితే చక్కగా గుర్తుంటుంది. మంచి కోచింగ్ సెంటర్‌లో శిక్షణను తీసుకోవడం ద్వారా విజయావకాశాలు మెరుగవుతాయి. ఏది చదవాలో, ఏది చదవకూడదో అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సమయం చక్కగా సద్వినియోగం అవుతుంది.
 -    ఇన్‌పుట్స్: బి.కృష్ణారెడ్డి,
 సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ,  హైదరాబాద్
 
 బ్యాంక్స్ పరీక్షలు రాసేటప్పుడు రీజనింగ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విభాగంలో ముఖ్యమైన టాపిక్స్ ఏవి? - అనుపమ, అపురూప కాలనీ
 
 బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలే కాకుండా ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పోటీ పరీక్షల్లోనూ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విభాగంలో అభ్యర్థి ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, వేగంగా ఆలోచించడం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతారు. సాధారణంగా బ్యాంక్స్ పరీక్షల్లో క్లర్క్స్ విభాగంలో 40 మార్కులకు, పీఓస్ విభాగంలో 50 మార్కులకు రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు 0.25 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.
 
 అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నను చూసి కంగారుపడకూడదు. ముందుగా ప్రశ్నను అవగాహన చేసుకోవాలి. ప్రతి ప్రశ్నలోనూ హిడెన్ స్టేట్‌మెంట్‌ను గుర్తించగలగాలి. ముందు కష్టమైన ప్రశ్నల కంటే సులువైన వాటికి సమాధానాలు రాయాలి. ఆప్షన్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి గందరగోళానికి గురికాకుండా సరైన ఆప్షన్‌ను గుర్తించాలి. సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష కాబట్టి వీలైనన్ని ఆన్‌లైన్ మాక్‌టెస్టులు సాధన చేయాలి.
 
 రీజనింగ్‌లో ముఖ్యమైన టాపిక్స్: కోడింగ్ - డికోడింగ్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడెడ్ రిలేషన్స్, కంపారిజన్ టెస్ట్, సీటింగ్ అరెంజ్‌మెంట్, సిలాజిస్మ్,  ఎనలిటికల్ రీజనింగ్, డేటా సఫీషియెన్సీ, స్టేట్‌మెంట్స్ - కన్‌క్లూజన్స్, ఇన్‌పుట్-ఔట్‌పుట్ మొదలైనవి.
 
 రిఫరెన్స్ బుక్స్
 గీ మోడ్రన్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్
 గీ ఎనలిటికల్ రీజనింగ్ - ఎం.కె.పాండే
 గీ రీజనింగ్- అరిహంత్ పబ్లికేషన్స్         
 
 ఇన్‌పుట్స్: ఇ.సంతోష్‌రెడ్డి,
 సీనియర్ ఫ్యాకల్టీ, బ్యాంక్స్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement