విపత్తుల తాకిడున్న నెల్లూరుపై ప్రత్యేక దృష్టి
-
విపత్తుల నిర్వహణ కమిషనర్ శేషగిరిబాబు
మైపాడు(ఇందుకూరుపేట):
విపత్తుల తాకిడి అధికంగా ఉండే నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు పేర్కొన్నారు. మండలంలోని మైపాడు, కొరుటూరుపాలెంలో నూతనంగా నిర్మించిన తుపాను రక్షిత భవనాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. రాష్ట్రంలో 138 తుపాను రక్షిత భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఒక్కొక్క భవనాన్ని రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. సెర్ఫ్‌ద్వారా గ్రామ సంఘాలకు నిధుల అందజేసి తుపాను షెల్టర్ల నిర్వాహణ చేపట్టేలా చూస్తున్నామన్నారు. నిర్వహణకు ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఏవిధంగా చేయాలి తదితర అంశాలపై స్థానికుల అభిప్రాయాలు తెలసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు సీవీ నారాయణమ్మ, పంచాయతీ రాజ్ ఈఈ దామోదర్‌రెడ్డి, డీఈ విజయ్‌కుమార్, ఏఈ వెంకటపతి, ఏపీఎం శ్రీధర్, రెడ్‌క్రాస్ ఎంసీలు భాస్కర్‌రావు, పోలయ్య, డీఎఫ్‌ఓ సుందరరాజు, మత్స్యకార నాయకులు పోలయ్య, మురళీ, క్రిష్ణమ్మ, సర్పంచ్ పుట్టా చార్ముడయ్య పాల్గొన్నారు.