harward university
-
చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఆమె ప్రసగించడం పలువురి ప్రశంసలందుకుంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు నీతా ముఖ్యంగా తాను చిన్నపుడు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు కోవాలని భావించడం, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కోరిక నెరవేరకపోవడం, ఇపుడు అక్కడి కీలకోపన్యాసం చేయడంతో తన తల్లి ఎంతో సంబర పడిపోయిన వైనాన్ని షేర్ చేశారు. తాజాగా తన చిన్నకోడలు రాధిక అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి చెప్పుకొచ్చారు. అనంత్ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటాడు, ఊబకాయంతో ఫైట్ చేస్తున్న తీరు ,రాధికతో ప్రేమను గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో, అతనికి రాధిక లాంటి భార్య దొరకడం సంతోషం అన్నట్టు నీతా మాట్లాడారు. అనంత్ మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటాడు. జీవితాంతం ఊబకాయంతో పోరాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉంటాడు. అలాగే తన జీవిత భాగస్వామి రాధికను కలవడం ద్వారా మరింత ఉత్సాహంగా మారాడు. వాళ్లిద్దరినీ అలా జంటగా చూడముచ్చటగా, అద్భుతంగా మ్యాజిక్‌లా ఉంటారంటూ చిన్న కోడల్ని కొనియాడారు.At the Harvard India Conference, Mrs. Nita Ambani speaks from the heart about her youngest son Anant - his journey through challenges, his positivity and spirituality, and finding his soulmate in Radhika! pic.twitter.com/yQNeMMFyZJ— Reliance Industries Limited (@RIL_Updates) February 18, 2025కాగా గత ఏడాది జూలై 12న అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ నివాసం, యాంటిలియా, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం ఆరు రోజుల పాటు ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్, అనంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అనంత్ రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగా రాధిక న్యూయార్క్‌లో చదువుకుంది. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటున్న ఒక ఫోటో వైరల్ కావడంతో వీరి ప్రేమ వ్యవహారం బైటపడింది. ఆ తరువాత అనంత్ సోదరి ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో కూడా రాధిక కనిపించారు.అయితే రాధిక తనకు దొరకడం అంటే 100 శాతం అదృష్టవంతుడిని అంటూ అనంత్ అంబానీ గతంలో తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పటికీ రాధికను కొత్తగా కనిసినట్టు అనిపిస్తుంది రాధికను చూసినప్పుడు తన హృదయంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలొస్తాయంటూ చాలా భావోద్వేగంతో అనంత్ చెప్పిన సంగతి తెలిసిందే. -
మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌ను గుర్తు చేసుకుని భావోద్వాగానికి లోనయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది. 'మదర్స్ ప్రైడ్' అని క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో నీతా అంబానీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న 50 సెకన్ల వీడియో కూడా ఉంది.బోస్టన్‌లో జరిగిన సమావేశంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. తన ప్రసంగానికి ముందు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం తనకు లభించడం పట్ల తన 90 ఏళ్ల తల్లి ఎంత గర్వ పడిందో, ఎంతగా చలించిపోయిందో వివరించారు. చిన్నతనంలో హార్వర్డ్‌లో చదవాలని నీతా అంబానీకా చాలా కోరికగా ఉండేదట. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు అదే హార్వర్డ్ వేదికపై ఆమె ప్రసంగించే అవకాశం దక్కడంతో నీతా తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఇదే విషయాన్ని తన కోడళ్లు శ్లోకా మెహతా, రాధిక మర్చంట్లను ఫోన్ చేసి మరీ ఈ విషయాన్ని చెప్పి ఎంతో సంతోషడిపోయింది, చాలా భావోద్వేగానికి గురైంది అంటూ నీతా అంబానీ చెప్పారు. తనను ఆహ్వానించి తల్లిని సంతోషపెట్టినందుకు హార్వర్డ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు నీతా. Mother's Pride: in an inspiring and heart-warming moment, Reliance Foundation Founder & Chairperson,Mrs. Nita Ambani shares how her mother felt proud that the same Harvard they aspired for but could not send young Nita because of financial constraints, has today invited her to… pic.twitter.com/R7as81bX9E— Reliance Foundation (@ril_foundation) February 17, 2025 అలాగే నీతా అంబానీ రాపిడ్ ఫైర్ అనే మరో విభాగంలో నీతా అంబానీ చాలాచక్కగా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె భర్త రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం హాజరైన వారిని ఆకట్టుకుంది, ప్రేక్షకుల నుండి హర్షధ్వానాలు వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ జీ దేశానికి గొప్పవారైతే, తన భర్త ముఖేష్ నా ఇంటికి మంచివారు అంటూ సమాధానమిచ్చారు. ఘఇదీ చదవండి: ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి? -
హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం
భారతీయ వ్యాపారం, విధానాలు, సంస్కృతిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రిలయన్స్(Reliance) ఫౌండేషన్ గౌరవ ఛైర్పర్సన్ నీతా అంబానీ(Nita Ambani) కీలకోపన్యాసం చేయనున్నారు. 2025 ఫిబ్రవరి 15 నుంచి 16 వరకు జరిగే వార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆమె ప్రసంగిస్తారు. ఈ సదస్సుకు విధానకర్తలు, వ్యాపారవేత్తలు, మేధావులతో సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు హాజరువుతున్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా నీతా అంబానీ ప్రముఖ విద్యావేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మాజీ డీన్ నితిన్ నోహ్రియాతో భారతదేశ కళలు, సంస్కృతి, ఆధునిక ప్రపంచంలో భారతదేశం పాత్ర వంటి అంశాలపై చర్చిస్తారు. ప్రపంచ వేదికలపై దేశం తరఫున వివిధ అంశాలపై మాట్లాడే ప్రభావవంతమైన వ్యక్తుల్లో నీతా అంబానీ ఒకరిగా నిలిచారు. కళలు, హస్తకళలు, క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమె ఎంతో సేవలందిస్తున్నారు.ఇదీ చదవండి: నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి వృద్ధివార్షిక ఇండియా కాన్ఫరెన్స్‌కు సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ‘ఫ్రమ్ ఇండియా టు ది వరల్డ్’గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సు కోసం భారతీయ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో, దేశంలో అనుసరిస్తున్న విధానాలు, వాటి రూపకల్పన వంటి వాటిపై ఈ కాన్ఫరెన్స్‌లో చర్చ జరగనుంది. 22 సంవత్సరాలకు పైగా హార్వర్డ్ విద్యార్థులు వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, విద్య, సంస్కృతి వంటి విభిన్న విభాగాలకు చెందిన నిపుణులు ఈ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు ఆతిథ్యం ఇస్తున్నారు. -
‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’
లండన్: ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్టీ వెబ్సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు. భారత్‌లోని జార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది. టాప్–10 ఫైనలిస్టుల్లో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది. -
మీ రెజ్యూమ్ ఎందుకు సెలక్ట్ కావట్లేదో తెలుసా?
Automated Hiring Software: చాలామంది ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లను.. నౌకరీలాంటి జాబ్ పోర్టల్స్‌లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఫ్రొఫైల్ ఎంత ఘనంగా ఉన్నా.. ఉద్యోగాలకు పిలుపు మాత్రం అందదు. అదే టైంలో తమ కన్నా తక్కువ ప్రదర్శన ఉన్న వాళ్లకు మంచి మంచి కంపెనీలలో, మంచి హైక్‌లతో జాబ్‌లు వస్తుండడంతో తెగ ఫీలైపోతుంటారు. మరి సమస్య ఎక్కడ ఉంటోంది?.. ఈ సమస్య ఎక్కడో కాదు.. కంపెనీలు ఎంపిక చేసే విధానంలోనే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ కోసం కంపెనీలు హైరింగ్ డిపార్ట్మెంట్స్(లేదంటే హెచ్ఆర్ వ్యవస్థ)ను ఏర్పాటు చేసుకుంటాయి కంపెనీలు. అయితే కరోనా ముందు వరకు ఈ విభాగాల్లో ఎక్కువ మంది పని చేసేవాళ్లు. ఆ తర్వాత నుంచి తీసివేతల కారణంగా.. ఆ విభాగాల్లోనూ ఉద్యోగులు తగ్గిపోయారు. దీంతో మిగిలిన ఉద్యోగులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో ‘ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్’ను ఉపయోగించుకుంటున్నాయి చాలా కంపెనీలు. అవును.. ఈ సాఫ్ట్వేర్లు జాబ్ పోర్టల్స్ నుంచి తమ కంపెనీలకు కావాల్సిన ప్రొఫైల్స్‌ను స్కాన్ చేసి ఉద్యోగులను ఎంపిక చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. అర్హతలు ఉన్నా లక్షల మంది ఉద్యోగుల రెజ్యూమ్‌లు ఎంపిక కావడం లేదు. లెక్కగట్టి.. సీవీ(రెజ్యూమ్) స్కానింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉద్యోగుల సెలక్షన్ ప్రాసెస్‌లో తప్పనిసరిగా మారింది. అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ పేరుతో అమెరికాలో 75 శాతం కంపెనీలు, భారత్‌లో సుమారు 65 శాతం కంపెనీలు(ఎక్కువగా ఎంఎన్‌సీలు) ఈ రకమైన పద్దతిని ఉపయోగిస్తున్నాయి. కొన్నిసార్లు మధ్యవర్తి కంపెనీలు(హైరింగ్ ప్రాసెస్ నిర్వహించే థర్డ్ పార్టీలు) కూడా ఇలాంటి సాఫ్ట్వేర్లను ఆశ్రయిస్తున్నాయి. ఇవి తమ పరిధిలోని ప్యాకేజీకి తగ్గట్లు ఉద్యోగుల్ని ఎంపిక చేస్తున్నాయి. ఈ ప్రాసెస్‌లోనే ప్యాకేజీకి తగ్గట్లు ప్రొఫైల్ లేకపోవడం, లేదంటే స్కానింగ్ పొరపాట్లు జరగడం వల్ల రెజ్యూమ్ తిరస్కరణకు గురవుతోంది. ఇలా అర్హత ఉన్నా.. మంచి ప్రొఫైల్ ఉన్నవాళ్లు ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. ఇదీ జరుగుతున్న అసలు కథ. కిందటి ఏడాదితో పోలిస్తే.. ఇది ఈ ఏడాదిలో మరింతగా పెరిగిందట. లక్షల మంది ఈ టెక్నికల్ ప్రాసెస్ వల్ల మంచి ప్యాకేజీలకు దూరం అవుతుండడం గమనార్హం. హర్వార్డ్ బిజినెస్ లా నిర్వహించిన స్టడీలో పై సమాచారం వెల్లడైంది. ‘హిడెన్ వర్కర్స్: అన్టాప్డ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన స్టడీలో పాజిటివ్ కోణంలో ఉపయోగించాలనుకుంటున్న ఇలాంటి సాఫ్ట్వేర్లు.. ఉద్యోగుల పాలిట ఎలా శత్రువులుగా మారుతున్నాయో వివరంగా తెలియజేశారు. చదవండి: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా చేయొద్దు -
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న జిల్లా వాసి
సాక్షి, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ వీరనేని జగదీశ్వర్‌రావు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ జిల్లాకు పేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు. నార్కెట్‌పల్లి మండలం షేర్బావిగూడెం గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మల్టిమీడియా రీసెర్చ్ సెంటర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా, చైనా, సింగపూర్, హాంకాంగ్, మకావ్, థాయ్‌లాండ్ దేశాల్లో పర్యటించి దూరవిద్య విధానానికి సంబంధించిన పీజీ స్థాయిలో కోర్సు రైటర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయం కోసం తెలంగాణ అనే ఇతివృత్తంతో డాక్యుమెంటరీ ఫిలిమ్‌ను ఆంగ్లం, తెలుగు భాషల్లో రూపొందించారు. ప్రస్తుతం ఏడుగురు విద్యార్థులకు రీసెర్చ్ గైడెన్స్ ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఎంఏ సోషియాలజీని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1989లో పొందారు. అదే సమయంలో ఆర్ట్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తించి విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ ఎంబటీ విశ్వవిద్యాలయంలో అకడమిక్ డిసిప్టెన్స్ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రాచీన కాలం నుంచి నేటి వరకు విద్యావిధానంలో వస్తున్న మార్పులు చేర్పులు అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్చించి, 50 దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రసంగించి మన్ననలు పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన లీడర్షిప్ కోర్సులో పాల్గొనేందుకు ఆయనకు యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులైన వారికి లీడర్షిప్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 ఏళ్లకు పైగా సంబంధిత రంగంలో అనుభవం ఆధారంగా కోర్సులో పాల్గొనడానికి ఎంపిక చేస్తారు. ఈ లీడర్షిప్ కోర్సులో పాల్గొనడానికి ఎంపికైన వీరనేని జగదీశ్వర్‌రావు ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ నెల 21న హార్వర్డ్ యూనివర్సిటీ లీడర్షిప్ కోర్సులో ఆయన పాల్గొననున్నారు. -
తేలికపాటి వ్యాయామం చేసినా..
లండన్ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్ అథ్యయనం పేర్కొంది. రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ ఆంథోని పేర్కొన్నారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్, అమరీందర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్‌బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు దొరికడంతో..
-
ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నారు
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం పెద్ద కుమార్తె మాలియా(19)ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్చినప్పుడు తాను తీవ్ర భావోద్వేగానికి లోనై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మాలియాను వర్సిటీలో వదిలి వస్తుంటే తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతున్నంత బాధ కలిగిందన్నారు. డెలావర్‌లోని బ్యూ బిడెన్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ విందు కార్యక్రమంలో ఒబామా మాట్లాడారు. మాలియాను హార్వర్డ్‌లో వదిలి వస్తున్న సమయంలో తనకు విపరీతంగా ఏడుపు వచ్చినప్పటికీ ఆమె ముందు ఏడ్వలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జో బిడెన్(మాజీ ఉపాధ్యక్షుడు) దంపతుల్ని ఉద్దేశించి ఒబామా అన్నారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు సరదాగా వ్యాఖ్యానించారు. తిరుగుప్రయాణంలో ముక్కు తుడుచుకుంటూ తాను చేసిన శబ్దాలు సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి వినిపించినప్పటికీ వారు విననట్లే నటించారని చమత్కరించారు. జీవితంలో మనం ఎంత సాధించినా, చివరికి మనకు సంతోషాన్నిచ్చేది మాత్రం పిల్లలేనన్నారు. మళ్లీ అదే స్థాయి ఆనందం మనవళ్లు, మనవరాళ్ల వల్లే దక్కుతుందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాలియా ఐవీ లీగ్ స్కూల్లో చేరారు. -
తీవ్ర భావోద్వేగానికి లోనైన ఒబామా
వాషింగ్టన్ : తన కూతురును కాలేజీ చదువు నిమిత్తం ఇంటినుంచి పంపిస్తున్నప్పుడు తనకు డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్లుగా అనిపించిందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బ్యూ బిడెన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పెద్ద కూతురు మలియా ఒబామాను ఇటీవల ఉన్నతచదువుల నిమిత్తం హార్వర్డ్‌కు పంపాను. యూనివర్సిటీలో తనను చేర్పించి తిరిగొచ్చే సమయంలో తనకు బై చెబుతుంటే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారన్న ఫీలింగ్ కలిగింది. తండ్రులు అందరికీ అలాగే ఉంటుదని భావిస్తున్నాను. మలియాకు తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. ఆ సమయంలో కూతురి ముందు కన్నీరు పెట్టుకోలేదు. నా కూతుళ్లు మలియా, సాశా నాకు మంచి స్నేహితులు. వారిలో ఒకరు నానుంచి కాస్త దూరంగా వెళ్లిపోతున్నారు. కానీ నాకు ఎందుకో చాలా దిగులుగా ఉంది. అయితే కొంతకాలం తర్వాత మా జీవితంలో వారే సంతోషం నింపుతారన్న నమ్మకం ఉందని' ఒబామా పేర్కొన్నారు. గతంలో చికాగోలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. మీకు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ మలియా, సాశాలనుద్దేశించి చెప్పారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఒబామా ఓ సాధారణ తండ్రిగా వ్యవహరించి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు -
ఆనందానికి అర్థం ప్రేమేనా....!
ఆనందం అంటే ఏమిటి? ఆనందంగా జీవించడం ఎలా? మనిషి జీవనశైలికి, ఆనందానికి సంబంధం ఉందా? డబ్బులుంటే ఆనందం ఉంటుందా? సమాజంలో హోదాను బట్టి ఆనందం పెరుగుతుందా? ఆనందానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? ఆనందంగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారా? ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారా? చివరకు ఆనందమయ జీవితం వెనకనుండే అసలు రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక మానవ బృందంపై ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 79 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ మహా అధ్యయనానికి దశాబ్దాల పాటు కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి ఇప్పటికి తేల్చిందేమంటే.. ఆనందమయ జీవితానికి అర్థం ప్రేమట. ప్రేమంటేనే జీవితాలు ఆనందంగా ఉంటాయట. ఈ ప్రేమ భార్యాభర్తల అనుబంధాల మధ్యనే కాదు, తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాల మధ్య కూడా ప్రేముండటమే అనుబంధమట. స్నేహితుల మధ్య అనుబంధానికి కూడా ప్రేమే కారణమట. ప్రేమతోనే ఆనందం వస్తుందని, అదే జీవన పరమార్థమని, ఆనందానికి డబ్బులు, హోదాలు ప్రాతిపదిక కావని చెబుతున్నారు. ఈ అధ్యయనం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంతటితో ఈ అధ్యయనాన్ని ఆపేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ విమర్శలను, సూచనలు దృష్టిలో పెట్టుకొనేమో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ ఏడాది అధ్యయన కేటాయింపుల్లో పది శాతం కోత విధించింది. రానున్న సంవత్సరాల్లో మరింత కోత విధించే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెల్లవారిపైనే, అందులోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ కుటుంబం లాంటి జీవితాలను అధ్యయనం చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ జాతులకు చెందిన ప్రజల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి గానీ, ఇదేమి అధ్యయనం అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. 1938లో నుంచి తాము చేస్తున్న అధ్యయనంలో మొదటితరానికి చెందిన వారిలో కొందరు మరణించారని, రెండో తరం, మూడో తరంపై కూడా తమ అధ్యయనాలు కొనసాగుతున్నాయని అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న రాబర్ట్ వాల్డింగర్ తెలిపారు. తరాలను బట్టి ఆనందానికి అర్థం మారుతుందని, అలాంటి మార్పును అధ్యయనం చేయడానికి, భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి తమ అధ్యయనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అమెరికా వర్సిటీలో ప్రసంగించనున్న కమల్
చెన్నై: నటుడిగా విశ్వనటుడు కమలహాసన్‌ది ఎల్లలు దాటిన ఖ్యాతి అని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయనకు అమెరికా నుంచి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికాలోని బాస్టన్ నగరంలో గల ప్రఖ్యాత హార్వర్డు వర్సిటీలో కమల్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6,7 తేదీల్లో ఈ యూనివర్శిటీలో జరిగే సదస్సులో భారతదేశ అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి అంశాలపై కమల్ ప్రసంగించనున్నారు. ఇలాంటి సదస్సులో పాల్గొననున్న తొలి దక్షిణాది నటుడు కమలహాసన్ కావడం విశేషం.