
లండన్: ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్‌టీ వెబ్‌సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు.
భారత్‌లోని జార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది. టాప్–10 ఫైనలిస్టుల్లో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment