top-10
-
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1.భారీ వర్షాలు: ప్రమాద ఘటనలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా పలువురు మరణించిన ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతిఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.ఢిల్లీ ఆటగాడి తుపాన్ ఇన్నింగ్స్.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు! ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి6. ప్రమాదం నుంచి పతకం దాకా..పారాలింపిక్స్‌లోపది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7. నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8. TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపుకాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9. మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీసుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10. కల్పన మరణం.. నాసాకొక పాఠంభారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చిక్కుకుపోయారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్‌తోనే ఈసీ సరిగజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2.ఆర్జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. వంద క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడి.. సాయం చేయండి: జెలెన్ స్కీరష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి 4.తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్ ప్లాన్ ఫలిస్తుందాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5,అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీటీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణిఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8.డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండిప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9.సంజయ్ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10.టెర్మినల్ క్యాన్సర్ ఇంత ప్రమాదకరమా?మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. అచ్యుతాపురం ఘటన: చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖఅచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూవిశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నెక్స్ట్ టార్గెట్ ఏంటి?కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.బంగ్లాదేశ్ సంచలనం.. పాక్‌కు ఘోర పరాభవంటెప్ట్ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామ సీరియస్ కామెంట్స్టాలీవుడ్లో మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.నీట్ యూజీ-2024 తొలిరౌండ్ కౌన్సిలింగ్ ఫలితాలు విడుదలనీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి6.నేరస్థులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టం: ప్రధాని మోదీదేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7.లోయలో పడిన బస్సులు.. 44 మంది దుర్మరణంఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8. ఆ స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింకేంటి?కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి,..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9. ట్రంప్ డిబేట్‌కు శిక్షణ ఇచ్చేది ఆమెనే..!చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10. కోల్‌కతా డాక్టర్ కేసు: సందీప్ ఘోష్ ఇళ్లపై సీబీఐ దాడులుకోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి దుర్ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
2023 Roundup: సుప్రీంకోర్టు వెలువరించిన టాప్-10 జడ్జ్మెంట్స్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ ఏడాది కీలక తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు, డిమానిటైజేషన్ వంటి పాలసీ నిర్ణయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు.. మోదీసర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ 10 జడ్జ్మెంట్స్ ఒకసారి చూద్దాం.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దుపై.. 2023 డిసెంబర్ 11న కీలక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వాదనలతో పూర్తిస్థాయిలో ఏకీభవించింది సీజేఐ జస్టిస్ డీవై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాదాపు 23 పిటిషన్లపై 16 రోజులపాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. ఆర్థికశాఖలో చేపట్టిన అతిపెద్ద సంస్కరణ డీమోనిటైజేషన్. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దుచేస్తూ 2016 నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై.. ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. పెద్ద నోట్ల రద్దును సమర్థించింది. ఈ మేరకు 4-1 తేడాతో మెజార్టీ తీర్పు ఇచ్చింది రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ BV నాగరత్న ఒక్కరే ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకించారు. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో.. కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని స్పష్టంచేసింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించగా.. ఎన్నికల కమిషనర్ల అప్పాయింట్మెంట్స్కు సంబంధించిన సవరణ బిల్లును.. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెచ్చింది కేంద్రప్రభుత్వం. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నేతతో కూడిన ప్యానెల్.. సీఈసీ, ఈసీలను ఎంపికే చేసేలా 1991 నాటి చట్టానికి కీలక సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో.. తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు చేపట్టాలనడం సరికాదని వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్ నివేదికతోపాటు ఆధారాలేమైనా ఉన్నాయా అని పిటిషనర్లను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. షార్ట్ సెల్లింగ్ కారణంగా మార్కెట్లు ఇబ్బందులు పడకుండా ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని సెబీకి ఆదేశాలు జారీచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. దీనిని తీవ్రమైన నేరంగా పేర్కొంది.విద్వేష ప్రసంగాల కారణంగా దేశ లౌకికవాదం ప్రభావితం అవుతుందని.. శాంతిభద్రతల సమస్యలు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా..విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలంటూ సంచలనఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. వివాహ వ్యవస్థ, విడాకుల మంజూరుకు సంబంధించి ఈ ఏడాది కీలక ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారం ఉన్న డివోర్స్ కేసుల్లో ఆరు నెలల కంపల్సరీ గడువు అవసరం లేదని పేర్కొంది. ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. 6 నెలల సమయం వద్దని.. విడాకులు వెంటనే జారీచేయాలని సూచించింది సుప్రీంకోర్టు. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. స్వలింగ సంపర్కలు వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై 2023 అక్టోబర్‌లో కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. LGBTQ+ కమ్యూనిటీ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. 21 పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్ DY.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. 3-2 తేడాతో తీర్పు ఇచ్చింది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్‌కే ఉందని స్పష్టం చేసింది. జల్లికట్టు, కంబల. ఎద్దులబండి పందాల వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోవలేమని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు. 2023 మేలో ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబల, మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలను అనుమతిస్తూ.. ఆయా రాష్ట్రప్రభుత్వాలు చేసిన చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్ల దాఖలయ్యాయి. వీటిని విచారించింది సర్వోన్నత న్యాయస్థానం. సంప్రదాయ క్రీడలు మన సంస్కృతిలో భాగమని.. వాటికి అటంకం కలిగించలేమని తేల్చిచెప్పింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన టాప్ జడ్జ్మెంట్స్ ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనని తేల్చిన సుప్రీంకోర్టు డీమోనిటైజేషన్‌పై ఏడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం సీఈసీ, ఈసీల నియామకానికి సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సీజేఐ స్థానంలో కేబినెట్ మంత్రిని చేర్చిన కేంద్రప్రభుత్వం విదేశీ రిపోర్ట్ ఆధారంగా ఓ పెద్ద సంస్థపై చర్యలు సరికాదన్న సుప్రీం విద్వేషపూరిత ప్రసంగాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇరుపక్షాలు ఆసక్తి చూపితే.. వెంటనే విడాకులు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం నిరాకరణ 3-2 తేడాతో తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను అడ్డుకోలేమని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు -
బజాజ్ అలియాంజ్ లైఫ్ సరికొత్త మైలురాయి
ముంబై: బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.లక్ష కోట్ల మైలు రాయిని అధిగమించాయి. దేశంలో టాప్–10 బీమా సంస్థలో వేగంగా వృద్ధిని సాధిస్తున్న కంపెనీల్లో ఒకటని తెలిపింది. 2019–20 నాటికి నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) రూ.56,085 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. కంపెనీ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసానికి తాజా మైలురాయి నిదర్శనమని సంస్థ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ అభివరి్ణంచారు. గడిచిన మూడేళ్లుగా వ్యక్తిగత నూతన వ్యాపార ప్రీమియంలో ఏటా 41 శాతం చొప్పున వృద్ధిని సాధించినట్టు చెప్పారు. జీవిత బీమా పరిశ్రమలో బజాజ్ అలియాంజ్ లైఫ్ మార్కెట్ వాటా 2019–20 నాటికి 2.6 శాతంగా ఉంటే, 2022–23 నాటికి 5 శాతానికి పెరిగినట్టు తెలిపారు. ప్రైవేటు జీవిత బీమా మార్కెట్లో తమ వాటా 4.6 శాతం నుంచి 7.6 శాతానికి చేరుకున్నట్టు చెప్పారు. -
Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే
న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు. ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్ బెగుసరాయ్ (269) భోపాల్ (266) ఖడక్‌పడ (256), దర్శన్ నగర్, చాప్రా (239) ఉన్నాయి. -
‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’
లండన్: ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్–2021’ టాప్–10 ఫైనలిస్టుల జాబితాలో భారత విద్యార్థిని సీమా కుమారి(18)కి చోటు లభించింది. విజేతకు లక్ష డాలర్ల నగదు బహుమతి లభించనుంది. ప్రతిభా పాటవాలతో సమాజంపై ప్రభావం చూపిన వారిని గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్‌తో సత్కరిస్తారు. చెగ్.ఓఆర్టీ వెబ్సైట్ వివిధ దశల్లో వడపోత అనంతరం తుది విజేతను నవంబర్ 10న ప్రకటించనున్నారు. భారత్‌లోని జార్ఖండ్‌కు చెందిన సీమా కుమారి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతోంది. జార్ఖండ్‌లోని ఆమె స్వగ్రామంలో బాల్య వివాహాలు సర్వసాధారణం. తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే తలపెట్టిన వివాహాన్ని ధైర్యంగా ఎదిరించి, చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ‘యువ’ అనే మహిళా సాధికారత సంఘం ప్రోత్సాహం, ఆర్థిక సాయంతో హార్వర్డ్ యూనివర్సిటీలో చేరింది. టాప్–10 ఫైనలిస్టుల్లో తన పేరు ఉండడం పట్ల సీమా కుమారి ఆనందం వ్యక్తం చేసింది. -
నాదల్ మరో ఘనత
పారిస్: పురుషుల టెన్నిస్‌లో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన ప్లేయర్‌గా నాదల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ స్పెయిన్ స్టార్ వరుసగా 790 వారాలపాటు టాప్–10 ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. 2005లో ఏప్రిల్ 25న 18 ఏళ్ల ప్రాయంలో తొలిసారి టాప్–10లోకి వచ్చిన నాదల్ 2020 నవంబర్ 11 వరకు టాప్–10లోనే కొనసాగుతున్నాడు. 789 వారాలతోపాటు ఇప్పటివరకు అమెరికా దిగ్గజ ప్లేయర్ జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును 34 ఏళ్ల నాదల్ బద్దలు కొట్టాడు. కానర్స్ 1973లో ఆగస్టు 23 నుంచి 1988 సెప్టెంబర్ 25 వరకు టాప్–10లో ఉన్నాడు. ఐదు వారాల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 13వసారి సొంతం చేసుకొని అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. టాప్–10లో అత్యధిక వరుస వారాలు నిలిచిన క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ మూడో స్థానంలో (734 వారాలు; 2002 అక్టోబర్ 14 నుంచి 2016 అక్టోబర్ 31 వరకు)... ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్/అమెరికా– 619 వారాలు; 1980 జూలై 7 నుంచి 1992 మే 10 వరకు) నాలుగో స్థానంలో... పీట్ సంప్రాస్ (అమెరికా–565 వారాలు; 1990 సెప్టెంబర్ 10 నుంచి 2001 జూలై 1 వరకు) ఐదో స్థానంలో ఉన్నారు. -
టాప్–10లో ఆరు మారుతీవే..
బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఆల్టో న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి నెలలో బాగా విక్రయమైన టాప్–10 కార్ల జాబితాలో మారుతీకి చెందిన ఆరు మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మారుతీ ఆల్టో నిలిచింది. దీని విక్రయాలు 19,524 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ 14,039 యూనిట్ల విక్రయాలతో మారుతీ డిజైర్ రెండో స్థానంలో ఉంది. ⇔ మారుతీ వేగనార్ మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 13,555 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మాత్రం 12,862 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో ఉంది. ⇔ 12,328 యూనిట్ల అమ్మకాలతో మారుతీ స్విఫ్ట్ ఐదో స్థానంలో నిలిచింది. ⇔ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆరో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,414 యూనిట్లుగా నమోదయ్యాయి. ⇔ మారుతీ విటారా బ్రెజా 10,046 యూనిట్ల అమ్మకాలతో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ⇔ రెనో క్విడ్ ఎనిమిదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 9,648 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ 9,002 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా తొమ్మిదో స్థానంలో ఉంది. ⇔ మారుతీ సెలెరియో విక్రయాలు 8,315 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఇది పదో స్థానంలో నిలిచింది. ⇔ గతేడాది ఇదే నెలలో టాప్–10లో నిలిచిన మహీంద్రా బొలెరో, మారుతీ ఓమ్ని మోడళ్లు తాజా జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయాయి. -
బుక్ మై షో టాప్–10లో కబాలి
బుక్ మై షో టాప్–10లో నమోదైన చిత్రంగా సూపర్‌స్టార్ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్ మాద్యమాల్లో బుక్ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్ మాద్యమం బుక్ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్న చిత్రాల టాప్–10లో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్ పరిక్షిత్ దర్ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. -
ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..
ముంబై : ఇండియన్ సూపర్ లీగ్ - 2015 నిర్వహణ కోసం ఆయా ఫ్రాంచైజీలు భారీ ధరను చెల్లించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం కోటి రూపాయలకు పైగా ధర పలికారు. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీ జట్ల యజమానులు పాల్గొని తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారు. అత్యంత ఖరీదైన 10 మంది ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి... ఆటగాడు క్లబ్(జట్టు) ఫ్రాంచైజీ ధర సునీల్ చైత్రి ముంబై రూ.1.20 కోట్లు యూగెన్సన్ లింగ్డో పూణే రూ.1.05 కోట్లు రినో ఆంటో కోల్‌కతా రూ. 90 లక్షలు తోయ్ సింగ్ చెన్నై రూ. 86 లక్షలు అరాటా ఇజుమి కోల్‌కతా రూ. 68 లక్షలు కరణ్‌జీత్ సింగ్ చెన్నై రూ. 60 లక్షలు సేత్యసేన్ సింగ్ నార్త్ ఈస్ట్ రూ. 56 లక్షలు రాబిన్ సింగ్ ఢిల్లీ రూ. 51 లక్షలు జాకీచంద్ సింగ్ పూణె రూ. 45 లక్షలు అనాస్ ఎడతోడిక ఢిల్లీ రూ. 41 లక్షలు