Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే | Air Quality Index: Among 10 most polluted cities in Asia, 8 are from India | Sakshi
Sakshi News home page

Air Quality Index: ఆసియాలోని కాలుష్య నగరాల్లో 8 భారత్‌వే

Published Mon, Oct 24 2022 5:55 AM | Last Updated on Mon, Oct 24 2022 7:46 AM

Air Quality Index: Among 10 most polluted cities in Asia, 8 are from India - Sakshi

న్యూఢిల్లీ: ఆసియాలోని అత్యంత కాలుష్యమైన టాప్‌–10 నగరాల్లో ఎనిమిది భారత్‌లోనే ఉన్నాయి. చలికాలం వస్తూ ఉండడంతో  వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గణాంకాల ప్రకారం హరియాణాలోని గురుగ్రామ్‌ మొదటి స్థానంలో ఉంటే బీహార్‌లోని ధారుహెరా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజధాని ఢిల్లీ లేదు.

ఇక గాలిలో నాణ్యతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్న నగరాల్లో ఆసియా మొత్తంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఒక్కటే నిలవడం విశేషం. గురుగ్రామ్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) ఆదివారం ఉదయం 679 ఉంటే ధరుహెరలో 543గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లక్నో (298), ఆనందపూర్‌ బెగుసరాయ్‌ (269) భోపాల్‌ (266) ఖడక్‌పడ (256), దర్శన్‌ నగర్, చాప్రా (239) ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement