బుక్‌ మై షో టాప్‌–10లో కబాలి | kabali moive is in top 10 in book my show | Sakshi
Sakshi News home page

బుక్‌ మై షో టాప్‌–10లో కబాలి

Published Tue, Jan 3 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

బుక్‌ మై షో టాప్‌–10లో కబాలి

బుక్‌ మై షో టాప్‌–10లో కబాలి

బుక్‌ మై షో టాప్‌–10లో నమోదైన చిత్రంగా సూపర్‌స్టార్‌ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్‌ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్‌ మాద్యమాల్లో  బుక్‌ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్‌ మాద్యమం బుక్‌ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్‌ బుక్‌ చేసుకున్న చిత్రాల టాప్‌–10లో రజనీకాంత్‌ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం.

ఇక బాలీవుడ్‌ బాద్‌షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్‌ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్‌ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్‌ పరిక్షిత్‌ దర్‌ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్‌ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement