టాప్–10లో ఆరు మారుతీవే..
బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఆల్టో
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్‌లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి నెలలో బాగా విక్రయమైన టాప్–10 కార్ల జాబితాలో మారుతీకి చెందిన ఆరు మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి.
సియామ్ తాజా గణాంకాల ప్రకారం..
⇔ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మారుతీ ఆల్టో నిలిచింది. దీని విక్రయాలు 19,524 యూనిట్లుగా ఉన్నాయి.
⇔ 14,039 యూనిట్ల విక్రయాలతో మారుతీ డిజైర్ రెండో స్థానంలో ఉంది.
⇔ మారుతీ వేగనార్ మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 13,555 యూనిట్లుగా ఉన్నాయి.
⇔ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మాత్రం 12,862 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో ఉంది.
⇔ 12,328 యూనిట్ల అమ్మకాలతో మారుతీ స్విఫ్ట్ ఐదో స్థానంలో నిలిచింది.
⇔ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆరో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,414 యూనిట్లుగా నమోదయ్యాయి.
⇔ మారుతీ విటారా బ్రెజా 10,046 యూనిట్ల అమ్మకాలతో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
⇔ రెనో క్విడ్ ఎనిమిదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 9,648 యూనిట్లుగా ఉన్నాయి.
⇔ 9,002 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా తొమ్మిదో స్థానంలో ఉంది.
⇔ మారుతీ సెలెరియో విక్రయాలు 8,315 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఇది పదో స్థానంలో నిలిచింది.
⇔ గతేడాది ఇదే నెలలో టాప్–10లో నిలిచిన మహీంద్రా బొలెరో, మారుతీ ఓమ్ని మోడళ్లు తాజా జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయాయి.