మారుతీ మళ్లీ టాప్
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్‌లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (14,057 యూనిట్లు), కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (14,042 యూనిట్లు), వేగన్ ఆర్ (12,744 యూనిట్లు) మోడళ్లు సహా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,934 యూనిట్లు), ఎలైట్ ఐ20 (9,604 యూనిట్లు), హోండా సిటీ (8,037 యూనిట్లు), మారుతీ బాలెనో (7,698 యూనిట్లు), మారుతీ సెలెరియో (7,141 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (6,589 యూనిట్లు) ఉన్నాయి.