six models
-
ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు
కూల్‌ప్యాడ్ ఇండియా సీఈవో తాజుద్దీన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న కూల్‌ప్యాడ్ ఈ ఏడాది మరో ఆరు మోడళ్లను మార్కెట్లోకి తేనుంది. 95 శాతం ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తున్నట్టు కంపెనీ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు. గురువారమిక్కడ నోట్–5 లైట్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 2016లో దేశవ్యాప్తంగా 30 లక్షల ఫోన్లను విక్రయించామంటూ... ఈ ఏడాది 50 లక్షల యూనిట్లను అమ్ముతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌కు చెందిన తయారీ కేంద్రాల్లో కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లు తయారు చేస్తున్నామని, తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలియజేశారు. అమ్మకాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత కంపెనీకి 15 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని మార్కెట్లలో నాలుగు నెలల నుంచి ఆఫ్లైన్లోనూ మోడళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ వాటా 20 శాతంగా ఉంది. -
టాప్–10లో ఆరు మారుతీవే..
బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఆల్టో న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి నెలలో బాగా విక్రయమైన టాప్–10 కార్ల జాబితాలో మారుతీకి చెందిన ఆరు మోడళ్లు స్థానం దక్కించుకున్నాయి. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ⇔ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మారుతీ ఆల్టో నిలిచింది. దీని విక్రయాలు 19,524 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ 14,039 యూనిట్ల విక్రయాలతో మారుతీ డిజైర్ రెండో స్థానంలో ఉంది. ⇔ మారుతీ వేగనార్ మూడో స్థానంలో నిలిచింది. దీని అమ్మకాలు 13,555 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మాత్రం 12,862 యూనిట్ల విక్రయాలతో నాల్గవ స్థానంలో ఉంది. ⇔ 12,328 యూనిట్ల అమ్మకాలతో మారుతీ స్విఫ్ట్ ఐదో స్థానంలో నిలిచింది. ⇔ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఆరో స్థానంలో ఉంది. దీని విక్రయాలు 10,414 యూనిట్లుగా నమోదయ్యాయి. ⇔ మారుతీ విటారా బ్రెజా 10,046 యూనిట్ల అమ్మకాలతో ఏడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ⇔ రెనో క్విడ్ ఎనిమిదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 9,648 యూనిట్లుగా ఉన్నాయి. ⇔ 9,002 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా తొమ్మిదో స్థానంలో ఉంది. ⇔ మారుతీ సెలెరియో విక్రయాలు 8,315 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో ఇది పదో స్థానంలో నిలిచింది. ⇔ గతేడాది ఇదే నెలలో టాప్–10లో నిలిచిన మహీంద్రా బొలెరో, మారుతీ ఓమ్ని మోడళ్లు తాజా జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయాయి. -
మారుతీ మళ్లీ టాప్
న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ (14,057 యూనిట్లు), కాంపాక్ట్ సెడాన్ డిజైర్ (14,042 యూనిట్లు), వేగన్ ఆర్ (12,744 యూనిట్లు) మోడళ్లు సహా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (9,934 యూనిట్లు), ఎలైట్ ఐ20 (9,604 యూనిట్లు), హోండా సిటీ (8,037 యూనిట్లు), మారుతీ బాలెనో (7,698 యూనిట్లు), మారుతీ సెలెరియో (7,141 యూనిట్లు), హ్యుందాయ్ క్రెటా (6,589 యూనిట్లు) ఉన్నాయి.