ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు | Coolpad to beef up off-line sales by expanding distributor network | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు

Published Fri, Mar 24 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

ఈ ఏడాది మరో  ఆరు మోడళ్లు

ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు

కూల్‌ప్యాడ్‌ ఇండియా సీఈవో తాజుద్దీన్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీలో ఉన్న కూల్‌ప్యాడ్‌ ఈ ఏడాది మరో ఆరు మోడళ్లను మార్కెట్లోకి తేనుంది. 95 శాతం ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తున్నట్టు కంపెనీ సీఈవో సయ్యద్‌ తాజుద్దీన్‌ తెలిపారు. గురువారమిక్కడ నోట్‌–5 లైట్‌ మోడల్‌ను హైదరాబాద్‌ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 2016లో దేశవ్యాప్తంగా 30 లక్షల ఫోన్లను విక్రయించామంటూ... ఈ ఏడాది 50 లక్షల యూనిట్లను అమ్ముతామనే ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడియోకాన్‌కు చెందిన తయారీ కేంద్రాల్లో కూల్‌ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తున్నామని, తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలియజేశారు. అమ్మకాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత కంపెనీకి 15 శాతం వాటాతో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని మార్కెట్లలో నాలుగు నెలల నుంచి ఆఫ్‌లైన్‌లోనూ మోడళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ వాటా 20 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement