Syed Tajuddin
-
ఈ ఏడాది మరో ఆరు మోడళ్లు
కూల్‌ప్యాడ్ ఇండియా సీఈవో తాజుద్దీన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీలో ఉన్న కూల్‌ప్యాడ్ ఈ ఏడాది మరో ఆరు మోడళ్లను మార్కెట్లోకి తేనుంది. 95 శాతం ఫోన్లు భారత్‌లోనే తయారు చేస్తున్నట్టు కంపెనీ సీఈవో సయ్యద్ తాజుద్దీన్ తెలిపారు. గురువారమిక్కడ నోట్–5 లైట్ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. 2016లో దేశవ్యాప్తంగా 30 లక్షల ఫోన్లను విక్రయించామంటూ... ఈ ఏడాది 50 లక్షల యూనిట్లను అమ్ముతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియోకాన్‌కు చెందిన తయారీ కేంద్రాల్లో కూల్‌ప్యాడ్ స్మార్ట్ఫోన్లు తయారు చేస్తున్నామని, తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలియజేశారు. అమ్మకాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత కంపెనీకి 15 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా కొన్ని మార్కెట్లలో నాలుగు నెలల నుంచి ఆఫ్లైన్లోనూ మోడళ్లను విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్ వాటా 20 శాతంగా ఉంది. -
21 సెకన్లలో 30 వేల ఫోన్ల సేల్
న్యూఢిల్లీ: ఆన్ లైన్ లో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సెకన్లలో వేల ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ విక్రయానికి పెట్టిన నోట్ 3 లైట్ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. అమెజాన్ లో 21 సెకన్లలో 30 వేల ఫోన్లు అమ్ముడయ్యాయని కూల్ ప్యాడ్ తెలిపింది. 'ఫస్ట్ ఫ్లాస్ సేల్ లో కూల్ ప్యాడ్ నోట్ 3కి అద్భుత స్పందన లభించింది. 21 సెకన్లలో 30 వేల ఫోన్లు విక్రయించాం. టెక్నాలజీ అందరికీ చేరువ చేయాలన్న మా ప్రయత్నానికి మద్దతు లభించింద'ని కూల్ ప్యాడ్ ఇండియా సీఈవో సయిద్ తజూద్దీన్ అన్నారు. ఫిబ్రవరి 4న మరోసారి ఫ్లాస్ సేల్ పెడతామని తెలిపారు. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ధర రూ.6.999, 360 డిగ్రీల పింగర్ రోటేషన్, 4జీ ఎల్ టీఈను సపోర్ట్ చేస్తుంది. కూల్ ప్యాడ్ నోట్ 3 లైట్ ఫీచర్లు 3 జీబీ ర్యామ్ 5.0 హైడెఫినేషన్ డిస్ ప్లే 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ 13 ఎంపీ కెమెరా 2,500 ఏఎంపీ బ్యాటరీ