
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్‌బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.