పదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గత పదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఆయన అవినీతిరహితుడు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విధానాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారని ప్రశంసించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత్‌ను ‘వెలుగుతున్న తార’ అని కొనియాడిందని గుర్తుచేశారు.
గురువారం ఢిల్లీలో పీహెచ్‌డీ చాంబర్ ఆర్ కామర్స్, ఇండస్ట్రీ వార్షిక సదస్సులో అమిత్ షా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల చర్యలతో మనదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. కేంద్రంలో 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు రంగాల్లో సంస్కర ణలకు శ్రీకారం చుట్టిందని, వాటి ఫలితా లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, అనుసంధానం పెరిగిందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిందని, రైల్వే నెట్‌వర్క్ భారీగా విస్తరించిందని, విద్యుత్ వాహనాలు, సెమి–కండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment