Corruption-free governance
-
Amit Shah: అవినీతిరహితుడు నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై గత పదేళ్లలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఆయన అవినీతిరహితుడు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విధానాలతో దేశ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపారని ప్రశంసించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) భారత్‌ను ‘వెలుగుతున్న తార’ అని కొనియాడిందని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో పీహెచ్డీ చాంబర్ ఆర్ కామర్స్, ఇండస్ట్రీ వార్షిక సదస్సులో అమిత్ షా మాట్లాడారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల చర్యలతో మనదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. కేంద్రంలో 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేర్వేరు రంగాల్లో సంస్కర ణలకు శ్రీకారం చుట్టిందని, వాటి ఫలితా లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని, అనుసంధానం పెరిగిందని, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అందుబాటు లోకి వచ్చిందని, రైల్వే నెట్వర్క్ భారీగా విస్తరించిందని, విద్యుత్ వాహనాలు, సెమి–కండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని వివరించారు. -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
బీజేపీతోనే అవినీతిరహిత పాలన సాధ్యం
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
‘గ్యారంటీలు’ అమలు చేస్తున్నాం
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ రంగంతోపాటు రైతన్నలపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. హామీల గురించి కేవలం మాటలు చెప్పడం లేదని, క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు. శనివారం ఢిల్లీలో 17వ భారత సహకార సదస్సులో మోదీ మాట్లాడారు. సహకార సంఘాలు రాజకీయాలను పక్కనపెట్టి సామాజిక, జాతీయ విధానాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పారదర్శక, అవినీతి రహిత పాలనకు నమూనాగా మారాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని చెప్పారు. వంట నూనెలు, తృణధాన్యాలు, శుద్ధి చేసిన ఆహారం, చేపల దాణాను దిగుమతి చేసుకోవడానికి మనం ఏటా రూ.2.5 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని, ఈ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వంట నూనెల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో నూనె గింజలు, తృణ ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సహకార సంఘాలు కృషి చేయాలని కోరారు. చేసిందే చెబుతున్నాం.. గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ప్రధాని మోదీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో చౌక ధరలకే రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో భారీ మొత్తంలో పంటలను సేకరిస్తున్నామని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు బదిలీ చేస్తున్నామని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు బదిలీ చేశామన్నారు. ప్రజలకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలపై మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ప్రతి రైతుకు ఏటా వివిధ రూపాల్లో రూ.50,000 లబ్ధి చేకూరుతోందని, ఇది నరేంద్ర మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. చేసిందే చెబుతున్నామని పేర్కొన్నారు. ఎంఎస్పీ ద్వారా గత తొమ్మిదేళ్లలో రైతులకు రూ.15 లక్షల కోట్లకుపైగా సొమ్ము అందజేశామని తెలియజేశారు. ఎరువుల రాయితీ కోసం ఏకంగా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంతకంటే పెద్ద గ్యారంటీ ఏముంటుందని ప్రశ్నించారు. మన దేశంలో రైతులకు ఒక్కో ఎరువు బస్తా కేవలం రూ.270కే లభిస్తోందని, అమెరికాలో దీని ధర రూ.3,000 పైగానే ఉందన్నారు. రైతుల జీవితాలను మార్చాలంటే చిన్న ప్రయత్నాలు సరిపోవు, భారీ ప్రయత్నాలు అవసరమని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఐక్యత నిలిచేది కాదు షాదోల్: ప్రతిపక్షాలు ఐక్యంగా ఒక్క తాటిపైకి వస్తాయనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత గొడవలతో పార్టీలన్నీ మునిగిపోయినప్పుడు వారందరూ ఐక్యంగా ఉంటారని భావించలేమన్నారు. కాంగ్రెస్ ఇతర కుటుంబ పార్టీలన్నీ ప్రజలకి తప్పుడు హామీలిస్తున్నాయని ఇవన్నీ వారంతా ఐక్యంగా ఉండలేరనడానికి సంకేతాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ సహా 17 ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడానికి అంగీకారానికొచ్చిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2047 నాటికి దేశం ఎనీమియా (రక్తహీనత)ను పారద్రోలే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఒక మిషన్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలతో ఈ పార్టీలన్నీ తమ కుటుంబాల సంక్షేమమే చూస్తున్నాయే తప్ప ప్రజల సంక్షేమం కాదని అన్నారు. అవినీతి ఆరోపణల్లో చిక్కుకొని బెయిల్‌పై బయటకు వచ్చిన వారు, కుంభకోణాల్లో దోషులుగా తేలి జైల్లో ఉండి వచ్చినవారే ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారని నిందించారు. రాజకీయ పార్టీలిచ్చే హామీల్లో ఏమి అమలు చేయగలిగేవో ప్రజలే గుర్తించాలన్నారు. ఇలాంటి తప్పుడు హామీలిచ్చే వారంతా ఇప్పుడు ఒకే గూటికి వస్తామనడం విడ్డూరమేనని ఆయన ఎద్దేవా చేశారు. -
ఉద్యోగ నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి అంతం
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాల వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సమూల మార్పులతో అవినీతి, బంధుప్రీతికి అవకాశాలు అంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన మంగళవారం 71,000 మందికి నియామక పత్రాలను వర్చువల్ కార్యక్రమంలో అందజేశారు. వీరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు లభించాయి. ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి తుది ఫలితాలు ప్రకటించే దాకా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేశామని వివరించారు. నియామకాల ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా, పక్షపాత రహితంగా మార్చామని అన్నారు. గ్రూప్–సి, గ్రూప్–డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేశామని తెలిపారు. గత తొమ్మిదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకుందని ఉద్ఘాటించారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(మే 16)న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ స్ఫూర్తితో తమ ప్రయాణం ఆనాడే మొదలైందన్నారు. ‘వికసిత్ భారత్’ కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. ఇదే రోజు సిక్కిం రాష్ట్రహోదా పొందిందని వివరించారు. దేశమంతటా కొత్త ఉద్యోగాల సృష్టి మన దేశంలో 2018–19 నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని, ఈపీఎఫ్ఓ గణాంకాలను బట్టి ఈ విషయం నిరూపణ అవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పెరుగుతున్నాయని, మన ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, దేశంలో ప్రతిమూలనా కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోతున్నాయని వెల్లడించారు. ఇకస్టార్టప్ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని అన్నారు. 2014 కంటే ముందు దేశంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని తెలియజేశారు. స్టార్టప్ కంపెనీల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. యువత సంక్షేమం, అభివృద్ధి పట్ల తమ అంకితభావం, చిత్తశుద్ధికి రోజ్‌గార్ మేళాలే నిదర్శనమని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని వివరించారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. దేశంలో ఇప్పుడు యూనివర్సిటీల సంఖ్య 1,100కు, మెడికల్ కాలేజీల సంఖ్య 700కు చేరిందన్నారు. -
ఎంతటివారినైనా ఎదుర్కోండి
న్యూఢిల్లీ: అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే కర్తవ్య దీక్షలో ముందడుగువేసి పోరాడాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్యబోధ చేశారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సీబీఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ కేంద్రప్రభుత్వ స్థాయిలో అవినీతిని ఎదుర్కొనేందుకు రాజకీయ సంకల్పానికి కొదువే లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయస హకారాలు అందుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అవినీతిపై పోరాడండి. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే తగ్గేదేలేదు’ అంటూ సీబీఐ అధికారులను ఆదేశించారు. ‘ ప్రజాస్వామ్యం, న్యాయాలకు అవినీతే అతిపెద్ద అవరోధం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైనే ఉంది. అవినీతిపరులను వదలొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా అవినీతితో లబ్ధిపొందిన నేతలు నేడు ఏకంగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపైనే విమర్శలు చేసే పరిస్థితులు సృష్టించారు. పక్కదోవ పట్టించే వీళ్లను పట్టించుకోకుండా విధి నిర్వహణపై దృష్టిపెట్టండి. మన ప్రయత్నంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఇదే దేశం, దేశ ప్రజలు కోరుకునేది. దేశం, చట్టం, రాజ్యాంగం మీ వెన్నంటే ఉన్నాయి’ అని అధికారులకు భరోసా ఇచ్చారు. ఫోన్‌కాల్‌తో వేలకోట్ల రుణాలు ఇప్పించుకున్నారు ‘స్వాతంత్య్రం వచ్చేనాటికే దేశంలో అవినీతి తిష్టవేసి ఉంది. దీన్ని తొలగించాల్సిన ఆనాటి నేతలు కొందరు దీనిని మరింత పెంచడం దారుణం. ఎవరెంతగా అవినీతి చేయగలరనే పోటీ నడుస్తోందిప్పుడు. దీంతో దేశంలో పలు వ్యవస్థలు ధ్వంసమై ప్రభుత్వ విధానాలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోతోంది. దేశ ఐక్యత, స్నేహభావం, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే అవినీతిని పెకిలించాలి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పారదర్శకమైన విధానాలొచ్చాయిగానీ గతంలో కొందరు ‘శక్తివంతమైన’ నేతలు కేవలం ఫోన్‌కాల్ ద్వారా తమ వారికి వేలకోట్ల రుణాలు దక్కేలా చేశారు. అలా ఆయాచిత లబ్ధిపొందాక దేశం వదిలి పారిపోయారు. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం ద్వారా మేం రూ.20,000 కోట్ల ఆస్తులను జప్తుచేశాం. ఇలాంటి అవినీతిపరులు మరింత తెగించి ప్రభుత్వం ద్వారా నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన రేషన్, ఇళ్లు, స్కాలర్షిప్, పెన్షన్లనూ లూటీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే వాస్తవ లబ్ధిదారునికి చేరుతోందని స్వయంగా గత ప్రధానమంత్రే సెలవిచ్చారు’ అని మోదీ గుర్తుచేశారు. అందరి నోటా సీబీఐ ‘‘ఏదైనా కేసు సంక్షిష్టంగా, సమస్యాత్మకంగా ఉందంటే పరిష్కారం కోసం ప్రజల నోట వినిపించే ఒకే ఒక పేరు సీబీఐ. 60 ఏళ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీబీఐ నిలుస్తోంది. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ముఖ్య నేరాలనూ సీబీఐకి అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవినీతి చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. కొత్తగా ఎన్నో నేరాలకు అంటుకడుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను, చక్కని దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులకు బంగారు పతకాలను ప్రధాని ప్రదానం చేశారు. స్మారక తపాలా బిళ్ల, నాణేలను ఆవిష్కరించారు. -
కర్ణాటకలో ఒక్క ఛాన్సివ్వండి: కేజ్రీవాల్
దావణగెరె: అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటక ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, విద్యుత్తు, ప్రభుత్వ పాఠశాలలు, మంచి ఆరోగ్య వసతులు ప్రజలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని మార్చేందుకు అవకాశమివ్వాలని కోరారు. శనివారం దావణగెరెలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని, పంజాబ్‌లోని తమ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను, ఒక మంత్రిని అవినీతి ఆరోపణలపై జైలుకు పంపించిందని చెప్పారు. రాష్ట్రంలో 40% కమీషన్ ప్రభుత్వం పనిచేస్తోందంటూ బీజేపీ పాలనపై విరుచుకుపడ్డారు. మళ్లీ అధికారమిస్తే అవినీతి లేకుండా చేస్తామంటున్న హోం మంత్రి అమిత్ షా.. తన నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. లోకాయుక్త అధికారులు రెండు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ ఎమ్మెల్యేను, అతడి కుమారుడిని అరెస్ట్ చేయలేదు. కానీ, ఢిల్లీలో మా నేత సిసోడియాను అరెస్ట్ చేశారు’అంటూ బీజేపీ తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారుతో అవినీతి కూడా రెట్టింపయ్యిందని ఎద్దేవా చేశారు. -
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. -
అవినీతి అధికారులకు ఇక హడలే!
సాక్షి, అమరావతి: ‘సాధారణంగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితేనే ఏసీబీ అరెస్టు చేస్తుంది. మధ్యవర్తుల ద్వారానో ఇతర మార్గాల్లోనో లంచం తీసుకుంటే ఏం కాదు’.. ఇదీ దశాబ్దాలుగా రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో నెలకొన్న ధీమా. దాంతో ఏసీబీకి దొరక్కుండా వారు అవినీతికి పాల్పడుతున్నారు. కానీ, అవినీతిపరుల ఈ ధీమాకు ఏసీబీ చెక్ పెడుతోంది. సరికొత్త పంథాతో అవినీతి అధికారులను హడలెత్తిస్తోంది. మూడో కంటికి తెలీకుండా లంచాలు తీసుకున్నా సరే సమగ్ర దర్యాప్తుతో ఆటకట్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరకనప్పటికీ.. సమగ్ర దర్యాప్తుతో ఆధారాలు సేకరించి అక్రమార్కులను ఏసీబీ అరెస్టుచేస్తోంది. బురిడీ కొట్టిస్తున్న అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధానంగా మూడు కేటగిరీల ఆధారంగానే విధులు నిర్వహిస్తోంది. ఎవరైనా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే అరెస్టుచేసి కేసు నమోదు చేస్తోంది.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేస్తుంది.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనధికారిక డబ్బులు దొరికినా.. ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించినా కేసు నమోదు చేస్తుంది. కానీ, ఈ మూడు విధానాల నుంచీ అవినీతి అధికారులు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. తాము నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, రెవెన్యూ తదితర కార్యాలయాల్లో ఇదే విధానం కొనసాగిస్తున్నారు. ఆదాయనికి మించి ఉన్న ఆస్తుల కేసుల్లో కూడా తమ ఆస్తులకు కాకి లెక్కలు చెబుతున్నారు. ఇక ఆకస్మిక తనిఖీల్లో డబ్బులు లభించినా అవి ఎవరివో అన్నది చెప్పలేరు. కాబట్టి ఏసీబీ అధికారులు తాము చేసిన తనిఖీలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి సరిపెట్టుకునేవి. ఇక నుంచి ఒక లెక్క.. కానీ, అవినీతి అధికారుల్లో ధీమా.. మితిమీరిన అవినీతికి చెక్ పెడుతూ ఏసీబీ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. ప్రధానంగా అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏసీబీ ప్రవేశపెట్టిన 14400 మొబైల్ యాప్ దోహదపడుతోంది. గతంలో కేవలం 14400 కాల్ సెంటర్‌కు ఫోన్ ద్వారానే బాధితులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ యాప్ వినూత్న ఫీచర్లతో బాధితులకు అండగా నిలుస్తోంది. అవినీతికి సంబంధించి పత్రాలు, ఆడియో, వీడియో రికార్డింగులు కూడా 14400 యాప్ ద్వారా ఏసీబీ అధికారులకు సమర్పించేందకు అవకాశం ఏర్పడింది. దీంతో ఆధారాల సేకరణకు మార్గం సుగమమైంది. బ్యాంకు ఖాతాలు, కాల్ డేటాలు, ఇతరత్రా ఆధారాలతో అవినీతిని నిరూపించే రీతిలో ఆధారాలు సేకరించి సంబంధిత అధికారులను అరెస్టుచేస్తోంది. ఉదా.. లంచం తీసుకున్న రెండునెలల తర్వాత.. కృష్ణాజిల్లా తోట్లవల్లేరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టుచేశారు. ఈ హత్య కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15లక్షలు, ఎస్సై అర్జున్ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా ఈ వ్యవహారం నడిపారు. శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలిచ్చారు. ఆ మొత్తం నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు లంచం ఇచ్చారు. పోలీసుల పేరుచెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ మొత్తం తీసుకున్నాడని శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. ఆ విషయం ఆయన శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని హత్యచేశారు. ఈ కేసు విచారించిన ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి బండారం కూడా బయటపడింది. కానీ.. సీఐ, ఎస్సై లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. బ్యాంకు లావాదేవీల వ్యవహారాలు, కాల్‌డేటా, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించి బాధితుల వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ, ఎస్సైలను ఏసీబీ అక్టోబర్ 14న అరెస్టుచేసింది. ఆకస్మిక తనిఖీల అనంతరం దర్యాప్తుచేసి మరీ.. అలాగే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆకస్మిక తనిఖీల్లో కర్నూలు కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మధ్యవర్తుల వద్ద రూ.59,300లు జప్తుచేశారు. కానీ, ఆ డబ్బులు ఎవరివన్నది ఆ రోజు నిరూపించలేకపోయారు. ఏసీబీ మాత్రం సమగ్రంగా విచారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారంరోజులపాటు జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. సంబంధిత వ్యక్తులను విచారించారు. మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలు, సబ్ రిజిస్ట్రార్, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు అన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్టుచేశారు. -
AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్ 14400'
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. పటిష్ట చర్యల ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్నారు. 14400 నంబర్‌కు వచ్చే ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక పక్కాగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలందించేందుకు ఎక్కడైనా లంచం మాటెత్తితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఏసీబీ 14400’ డౌన్లోడ్ చేసుకుని పలు ఫీచర్లతో నేరుగా యాప్‌లోనూ ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పౌరులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రెవెన్యూ, ఎక్సైజ్, మునిసిపల్, గనులు, అటవీ – పర్యావరణం, ఎక్సైజ్ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత, నాణ్యమైన సేవలకు సంబంధించి సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబడితో పాటు జవాబుదారీతనం పెరగాలి ఆదాయ ఆర్జనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచాలని కీలక ప్రభుత్వ శాఖలను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలు వివాదాల కారణంగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిరాటంకంగా రాబడి సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు బిల్లులు, పన్ను ఎగవేతలకు తావు లేకుండా ఉత్తమ విధానాలను రూపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అక్రమ మద్యానికి అడ్డుకట్ట అక్రమ మద్యం తయారీ, రవాణాను సమర్ధంగా నిరోధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. దీనిపై గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఎస్‌వోపీలు రూపొందించాలని ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాల నిరోధానికి సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు సేకరించాలని స్పష్టం చేశారు. అక్టోబర్ 2 నాటికి 2 వేల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మరో 650 గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. వీటికి అదనంగా 2 వేల గ్రామాల్లోని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను వచ్చే అక్టోబరు 2 నాటికి సిద్ధం చేస్తామని వివరించారు.రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. పక్కాగా స్టాక్ వెరిఫికేషన్ అటవీ, పర్యావరణ శాఖపై సమీక్ష సందర్భంగా త్వరలోనే ఎర్ర చందనం వేలం వేస్తామని, గ్లోబల్ టెండర్ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రతి నెలా స్టాక్ వివరాలు తనిఖీ చేస్తూ పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.905.57 కోట్లను చెల్లించిందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పన్నుల విభాగంలో డేటా ఎనలిటిక్స్ సెంటర్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె.నారాయణస్వామి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ (ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి.సాయి ప్రసాద్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: అవినీతిపై పిడుగు
ACB 14400 App, సాక్షి, అమరావతి: అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా సరే.. ఎక్కడైనా సరే.. అవినీతికి పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘ఏసీబీ 14400’ని సీఎం జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ‘స్పందన’ సమీక్ష సందర్భంగా ఆవిష్కరించి మాట్లాడారు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏసీబీ డీఐజీలు అశోక్‌కుమార్, పీహెచ్‌డి రామకృష్ణ ఇందులో పాల్గొన్నారు. ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాట ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి చాలా గట్టిగా, స్పష్టంగా, పదేపదే చెబుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్లను ఎలాంటి అవినీతికి తావు లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా జమ చేశామని చెప్పారు. డేటా నేరుగా ఏసీబీకి అవినీతి నిర్మూలనకు మరో విప్లవాత్మక మార్పు తెస్తున్నాం. అది కలెక్టరేట్ అయినా, ఆర్డీవో కార్యాలయమైనా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అయినా.. మండల కార్యాలయం అయినా.. పోలీస్‌స్టేషన్ అయినా.. వలంటీర్లు.. సచివాలయం.. 108.. 104 సర్వీసులు అయినా.. ఎవరైనా సరై .. ఎక్కడైనా లంచం అడిగితే మీరు చేయాల్సింది ఒక్కటే.. మొబైల్లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్లోడ్ చేసుకుని బటన్ నొక్కి వీడియో / ఆడియో సంభాషణ రికార్డు చేయండి. ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుంది. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుంది. అవినీతి నిర్మూలనలో ప్రతి కలెక్టర్, ఎస్పీకి బాధ్యత ఉంది. ఫిర్యాదులపై వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాలి. మన స్థాయిలో తలచుకుంటే 50 శాతం అవినీతి అంతం అవుతుంది. మిగిలిన స్థాయిలో కూడా ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. ఏసీబీ రూపొందించిన యాప్ ఎలా పని చేస్తుందంటే.. ► గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. ► అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్ రిపోర్ట్ ఫీచర్ వినియోగించుకుని అక్కడికక్కడే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ► లాడ్జ్ కంప్లైంట్ ఫీచర్ ద్వారా తమ దగ్గరున్న డాక్యుమెంట్లు, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించవచ్చు. ► ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్ ఫోన్‌కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. ► త్వరలో ఐఓఎస్ వెర్షన్లోనూ యాప్‌ను సిద్ధం చేస్తున్న ఏసీబీ. గూగుల్ ప్లే స్టోర్‌లో 14400 యాప్: డీజీపీ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఫిర్యాదుల కోసం రూపొందించిన 14400 యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఓటీపీ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియోను రికార్డు చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. గతంలో జరిగిన అవినీతిపై సైతం ఫిర్యాదు చేసే విధంగా యాప్‌ను రూపొందించామన్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారి పేరు, శాఖ వివరాలను పొందుపరిచి పంపితే, తక్షణమే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
అవినీతికి తావివ్వద్దు : సీఎం జగన్
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి ఒక నిర్దిష్ట విధానం (ఎస్ఓపీ–స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తీసుకు రావాలి. అవినీతిపై ఫిర్యాదులు చేస్తూ వచ్చే కాల్స్‌పై దృష్టి పెట్టాలి. ఈ ఫిర్యాదుల పట్ల అధికారులు సొంతంగా బాధ్యత తీసుకోవాలి. క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు, కార్య క్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి కలిగేలా చేయడం కలెక్టర్లు, జేసీల బాధ్యత. ఇదే సమ యంలో ప్రభుత్వానికి రావా ల్సిన రెవెన్యూ వసూళ్లపైనా కూడా దృష్టి పెట్టడం ఇంకో బాధ్యత. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం వినూత్న సంస్కరణలు తీసుకురావాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవినీతికి సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కనిపించేలా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్ర ఆదాయ వనరులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖలో వెలుగు చూసిన నకిలీ చలాన్ల వ్యవహారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీబీ దాడులు చేస్తే కానీ ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని, అసలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మీ దృష్టికి ఎందుకు రాలేదు.. ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సరిగా పని చేస్తున్నాయా లేదా.. అన్న విషయం ఎందుకు పరిశీలించడం లేదు.. తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు..’ అంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేశామని వివరించారు. కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని చెల్లింపుల ప్రక్రియను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు స్పందిస్తూ.. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను నిశితంగా గమనించామని, అవినీతికి చోటు లేకుండా పూర్తి స్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ‘మీ సేవ’ల్లో పరిస్థితులను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సహజ మార్గంలో ఆదాయం పెరిగేలా చూడండి ► క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవలి. వారం లేదా పది రోజులకు ఒకసారి ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలి. ప్రతి సమావేశంలో ఒక రంగంపై దృష్టి సారించాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఎలా ఉందన్న విషయం తదుపరి సమావేశంలో పరిశీలించాలి. ► రాష్ట్ర ఆదాయ వనరులను మెరుగు పరుచుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులతో పాటు, రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలి. జీఎస్టీ వసూళ్లు, ఇతరత్రా ఆదాయం పూర్తి స్థాయిలో వచ్చేలా చూడాలి. ► వివిధ శాఖలు సరైన కార్యచరణ ద్వారా సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు చక్కటి సేవలను అందించడంతోపాటు ఆదాయాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మున్సిపల్, విద్యుత్, తదితర శాఖల మధ్య సమన్వయం బావుండాలి. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి ► సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న సంఘటనలు చూస్తున్నాం. దీనిని పూర్తిగా అడ్డుకోవాలి. మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలి. ► మద్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఇలాంటి వ్యవహరాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి. ► ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ పియూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబు, ఎస్ఈబీ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా?
మనలో చాలా మందికి ఒక రూపాయి నోటు, ఐదు, పది, 20,50, 100, 200, 500, 2000 రూపాయి నోటు గురుంచి తెలుసు కానీ, మన దేశంలో వేగంగా విస్తరిస్తున్న "జీరో రూపాయి నోట్" గురుంచి చాలా మందికి తెలియదు. అసలు ఈ నోటుకు ఉన్న శక్తి గురుంచి చాలా మందికి తెలియదు అని చెప్పుకోవాలి. అసలు ఇది ఎక్కడ లభిస్తుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అవినీతి ఇప్పటికీ జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అధికారులను ఎదిరించలేక వారు అడిగిన ఎంతో కొంత మొత్తం ప్రజలు ఇస్తూ వస్తున్నారు. మన దేశంలో లంచం అడగడం, ఇవ్వడం రెండూ కూడా చట్ట ప్రకారం నేరం. అమెరికాలో జాబ్ చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎన్నారై ఆనంద్ మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఏదైనా చేయాలని అనుకున్నాడు. అవినీతిని తొలిగించడానికి ఏమి చేయాలో ఆలోచించిన విజయ్ ఆనంద్ దేశంలో అవినీతిపై పోరాడాలనే ఏకైక ఉద్దేశ్యంతో 2006లో 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. జీరో రూపాయి నోట్ ప్రధాన ఉద్దేశ్యం ప్రజాస్వామ్యం నాలుగు స్తంభాల(శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, పత్రికా)ను దాటి మెరుగైన సమాజం, అవినీతి రహిత పాలనా వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ప్రజల కోసం 5వ పిల్లర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. 2007లో విజయ్ సమాజంలో అవినీతి నిర్మూలించడానికి ది "జీరో రూపాయి నోట్" అనే ఒక కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువచ్చాడు. జీరో రూపాయి నోట్లు సామాన్యులకు సాధికారత కల్పించడానికి ముద్రించబడ్డాయి. అవినీతి చేత ఎక్కువగా బాధపడేవారు, తరచుగా అవినీతి అధికారులచే అణచివేయబడేవారు అధికారంలో ఉన్నవారికి భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పడం, తాము కోల్పోవడానికి ఏమీ లేదని అవినీతి అధికారులకు తెలియజేయడం, వారు పోరాటంలో ఒంటరిగా లేరని చెప్పడం ఈ నోట్ ప్రధాన ఉద్దేశ్యం. 30 లక్షల నోట్ల పంపిణీ 5వ పిల్లర్ వాలంటీర్ల సహాయంతో దీని గురుంచి అవగాహన కలిగించడానికి స్థానిక మార్కెట్ ప్రదేశాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లలో జీరో రూపాయి నోట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. వారు కరపత్రాలతో పాటు నోట్లను పంపిణీ చేస్తూ వివిధ ప్రదేశాలలో సమాచార డెస్క్ లను ఏర్పాటు చేశారు. 5th పిల్లర్ సంస్థ 30 లక్షల నోట్లను 2007 నుంచి 2014 వరకూ ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలోని డొమెస్టిక్ విమానాశ్రయంలో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో తమిళంతో పాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్ చేస్తున్నారు. ఒక్క భారత్ లోనే కాదు ఈ ఫిఫ్త్ పిల్లర్ సంస్థ మెక్సికో, నేపాల్ వంటి దేశాల్లో కూడా జీరో నోట్లను ముద్రించి ఇస్తోంది. 2020లో మన దేశంలో అవినీతి ఏ రేంజ్ లో ఉంది అనే అంశంపై ఈ సంస్థ అధ్యయనం జరిపించగా.. సంవత్సరానికి రూ.490 కోట్ల అవినీతి జరుగుతోందని తేలింది. ఒకవేల మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే జీరో రూపాయి నోట్ చూపించాలని పేర్కొన్నాడు. ఈ నోటు చూపించక కూడా మీతో అతను ప్రతిఘటిస్తే ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్. వీటిని ఇచ్చే ముందు నోట్ వెనుక సూచించిన చిరునామాను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. ఇలా సమాచారం ఇచ్చిన తర్వాత అతని లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్ చెబుతున్నారు. దేశంలోని ప్రతి అణచివేతకు గురైన భారతీయుడు, అవినీతి అధికారికి జీరో రూపాయి నోటు చేరేలా చూడాలని 5వ పిల్లర్ కోరింది. ఇది ఖచ్చితమైన అహింసాత్మక ఆయుధం, అవినీతిపరులను ఆత్మపరిశీలన చేసుకోవడానికి సరైన మార్గం అని ఆనంద్ అన్నారు. ఎవరికైనా ఈ నోట్లు కావాలంటే ఈ సంస్థ వెబ్సైట్ (https://5thpillar.org)లోకి వెళ్లి డౌన్లోడ్చేసుకోవచ్చు. చేయి చేయి కలుపుదాం.. మనదేశంలో అవినీతిని రహిత సమాజాన్ని నిర్మిద్దాం. -
afghanistan Crisis: తాలిబన్లు ఎలా గెలిచారంటే!
ఇరవైఏళ్ల పాటు ఆధునిక పాశ్చాత్య బలగా ల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకు పైగా బలగం.. ఇన్ని ఉన్నా కనీస ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ సేన తాలిబన్లకు తలొగ్గింది. తమ బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు వశం చేసుకోవచ్చన్న అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 10 రోజుల్లో అఫ్గాన్ సైన్యం లొంగిపోయిన తీరు అందరినీ నివ్వెర పరుస్తోంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు ముందుగా వినిపిస్తోన్న సమాధానం.. అవినీతి! ఇరవైఏళ్లుగా అఫ్గాన్ సైన్యంలో అవినీతి తారాపథానికి చేరింది. సామాన్య సైనికుడి నుంచి అత్యున్నత అధికారి వరకు అంతా లంచాలు మరిగారు. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులన్నీ అధికారులు దిగమింగి కూర్చున్నారు. దీంతో కీలక సమయంలో సైన్యమంతా చేతులెత్తేసింది. రెండు దశాబ్దాలు అఫ్గాన్‌లో ఉన్న పాశ్చాత్య సేనలు అఫ్గాన్‌లో అవినీతి చూసి విస్తుపోయారంటే అతిశయోక్తి కాదు. స్వయంగా ఆదేశ ఇనస్పెక్టర్ జనరలే తమ దేశ బలగాలకు లంచమనే కేన్సర్ రోగం పట్టిందని చెప్పినట్లు యూఎస్ కాంగ్రెస్ నివేదిక చెబుతోంది. అఫ్గాన్ సెక్యూరిటీకి దాదాపు 880 కోట్ల డాలర్లను యూఎస్, నాటో దళాలు వెచ్చించాయి. కానీ చివరకు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కీలక సమయంలో సాయం చేస్తుందనుకున్న అఫ్గాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా చేతులెత్తింది. అఫ్గాన్ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలున్నాయి. కానీ వీటిని నడిపేందుకు అవసర సిబ్బంది, వీరిని ప్రేరేపించే నాయకులు లేకుండా పోయారు. అందువల్ల కాబూల్‌లోకి తాలిబన్లు వస్తున్నా ఒక్క యుద్దవిమానం కూడా ఎదిరించలేదు. అవినీతితో పాటు అఫ్గాన్ సేనల్లో పిరికితనం పాలు ఎక్కువైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా తాలిబన్లతో జరిపిన పోరాటాల్లో చాలామంది గాయపడడం, వీరి స్థానంలో సరిపడ కొత్త సైన్యం భర్తీ కాకపోవడం కూడా ఓటమికి మరో కారణంగా చెప్పారు. బయటి మద్దతు కేవలం అఫ్గాన్ సేనల్లో అవినీతి మాత్రమే తాలిబన్ల విజయానికి కారణం కాదన్నది నిపుణుల మాట. ఒకప్పుడు తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించిన స్థానిక తెగల నాయకులు, ప్రజలు ఈ దఫా తాలిబన్లకు సహకారం అందించారు. 2 దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలో పాలన జరగడం చాలా తెగలకు నచ్చలేదు. దీంతో వీరిని తాలిబన్లు తమవైపునకు తిప్పుకున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో తాలిబన్లు గట్టిగా పోరాడకముందే విజయం లభించింది. తాలిబన్లకు పాక్ మద్దతుంది.. వీటికి యూఏఈ, ఖతార్, సౌదీ నుంచి వచ్చిన విరాళాలు, రష్యా, చైనాల పరోక్ష సహకారం, ఓపియం పంటతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం తదితర కారణాలు తాలిబన్లకు గెలుపునందించాయి. పాకిస్తాన్ గతంలోలా పీఓకే గుండా ఉగ్రతండాలను తాలిబన్ సహకారంతో భారత్‌లోకి పంపిస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
చెప్పు..నీకు జీతం వేలల్లో కావాలా,లక్షల్లో కావాలా?!
సాక్షి, అమరావతి:ఎయిడెడ్ కాలేజీల్లో అవసరం లేకపోయినా బోధన, బోధనేతర సిబ్బందిని అన్ ఎయిడెడ్ ప్రాతిపదికన నియమించారు. ఆ సందర్భంలో పెద్దఎత్తున పైరవీలు నడిచాయి. సొమ్ములు కూడా చేతులు మారాయి. తాజాగా ఆ పోస్టులను క్రమబద్ధీకరణ (రెగ్యులర్) చేయిస్తామని.. నెలకు ఇచ్చే రూ.15 వేల నామమాత్రపు వేతనాన్ని రూ.లక్షకు పైగా ఇప్పించేలా చూస్తామంటూ సదరు కళాశాలల యాజమాన్యాలు వసూళ్ల పర్వానికి తెరలేపాయి. కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించైనా ఆ పోస్టులను రెగ్యులర్ చేయిస్తామని నమ్మబలుకుతూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఉన్నత విద్యాశాఖలోని కొందరు కిందిస్థాయి అధికారుల ఆశీస్సులతో రూ.కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నత విద్యా శాఖకు పెద్దఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం జీతాలొస్తాయంటూ.. రాష్ట్రంలో 137 ఎయిడెడ్ కాలేజీలు ఉండగా.. అందులో దేవదాయ శాఖకు చెందినవి 4, మైనార్టీ స్టేటస్‌లో 16 కాలేజీలు ఉన్నాయి. మిగిలినవి వివిధ యాజమాన్యాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఎయిడెడ్ సెక్షన్లలో మొత్తంగా 1,02,234 సీట్లు ఉండగా.. 51,085 మంది విద్యార్థులున్నట్టు యాజమాన్యాలు చూపిస్తున్నాయి. అదే అన్ ఎయిడెడ్ సెక్షన్లలో 1,54,350 సీట్లున్నాయి. ఇక్కడ కూడా సగం మాత్రమే సీట్లు భర్తీ కాగా.. మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ కాలేజీల్లోని ఎయిడెడ్ విభాగాల్లో 1,303 మంది బోధనా సిబ్బంది, 1,422 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. వీటిలో అన్ ఎయిడెడ్ విభాగంలో 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది కలిపి 2,530 మంది పని చేస్తున్నారు. వీరికి ఆయా యాజమాన్యాలు నెలకు రూ.15 వేల వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ పోస్టుల్ని క్రమబద్ధీకరణ చేయిస్తే యూజీసీ నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికీ రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. దీనిని ఆశగా చూపి యాజమాన్యాలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. అన్ ఎయిడెడ్ సిబ్బందిని రెగ్యులర్ చేయించేందుకు పకడ్బందీగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఇలాంటి వారిలో కొందరికి అనుకూలంగా ఉన్నత విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో కోర్టు ఉత్తర్వులు జారీ చేయించి మరీ రెగ్యులర్ చేయించారు. ఆ ఉత్తర్వులను ఆధారం చేసుకుని ఇప్పుడు మొత్తం అందరినీ రెగ్యులర్ చేయిస్తామంటూ తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా.. ఉన్నత విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన యాక్ట్–1994కు వ్యతిరేకంగా ఈ వ్యవహారానలు నడిపిస్తున్నారు. ఆ చట్టం ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్న వారి రెగ్యులరైజేషన్‌కు గతంలో ఒక అవకాశం ఇచ్చారు. 1993 నవంబర్ 25 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే రెగ్యులర్ చేయాలని అప్పటి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వారికి యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, ఎయిడెడ్ పోస్టుల్లో ఖాళీలు ఉంటే రెగ్యులర్ చేయాలని పేర్కొన్నారు. వారినీ తప్ప వేరెవరిని రెగ్యులర్ చేయడానికి వీల్లేదు. అలా చేయడం చట్ట వ్యతిరేకం. కానీ.. కోర్టుల నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి గతంలో కొందరిని రెగ్యులర్ చేయించారు. ఇప్పుడు వాటినే చూపిస్తూ అందరినీ రెగ్యులర్ చేయిస్తామని కొన్ని యాజమాన్యాలు, ఉన్నత విద్యాశాఖలోని కొంతమంది అధికారులు పావులు కదుపుతున్నారు. చదవండి : ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు -
భూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితి!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. వివాద, అవినీతి రహిత పాలన అందించేలా ఈ వ్యవస్థను మలచాలని భావిస్తున్న సర్కారు.. భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమాలు, అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న రెవెన్యూ శాఖను సంస్కరించాలని సీఎం కేసీఆర్ పట్టు్టదలగా ఉన్నారు. కేశంపేట, కీసర, షేక్‌పేట తదితర తహసీల్దార్ల అవినీతి లీలలు, కొన్నాళ్ల కిందట అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవ దహనం çఘటన తో అవాక్కయిన ప్రభుత్వం.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. 20 కీలక నియమాలతో.. ప్రస్తుతం మనుగడలో ఉన్న 144 చట్టాలు/నియమాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడి.. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వారం రోజులుగా కొత్త చట్టం తయారీపై సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగుల సర్దుబాటు, హోదాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై చర్చిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూ వివాదాల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నయా చట్టంలో చేర్చనున్నారు. తహసీల్దార్ స్థాయిలో 45 రోజుల్లో పరిష్కారం కాని అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని, అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదించాలని, అది ఇచ్చే తీర్పు సంతృప్తికరంగా లేదని భావిస్తే.. రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దరఖాస్తు పురోగతి వివరాలు భూ వివాదాలు సకాలంలో పరిష్కరించేందుకు కొత్త విధానం దోహదపడుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుదారు అర్జీ దాఖలు చేసింది మొదలు... దాని పురోగతి (స్టేటస్) ఎలా ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందనే సమాచారాన్ని కూడా ఆన్లైన్లోనే చూసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. -
ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు: సీఎం జగన్
-
జిల్లాకు మరో జేసీ
సాక్షి, అమరావతి: పాలనా వ్యవస్థలో మరింత జవాబుదారీతనం తీసుకురావడానికి.. అవినీతి రహితంగా పాలన సాగించడానికి.. సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమ ఫలాలు అందించడానికి జిల్లా యంత్రాంగంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరేసి జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో జాయింట్ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం సృష్టించనుంది. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కొత్తగా నియమితులు కానున్న జేసీకి అప్పగించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకంగా పనిచేస్తున్న విషయం విదితమే. కొత్తగా జాయింట్ కలెక్టర్ పోస్టు ఏర్పాటుచేస్తుండడంతో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో మొత్తం ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉంటారు. పని విభజన విషయంలో ముగ్గురు జేసీలకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. ఏ జాయింట్ కలెక్టర్ ఏ పథకాలను పర్యవేక్షించాలో, ఏఏ విభాగాలను చూడాలనే విషయంలో ఉన్నతాధికారులు విస్పష్టంగా జాబితా రూపొందించారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలు.. సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా, సజావుగా అందించాలన్నదే ఈ మార్పు లక్ష్యమని సమాచారం. ఈ ముగ్గురు జేసీలు జిల్లా కలెక్టర్‌కు పాలనలో సహకారం అందిస్తారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీనియర్ టైమ్ స్కేలులో ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించే ముందే వారికి క్షేత్రస్థాయిలో పాలన అనుభవం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ సివిల్ సర్వీసు (ఎస్సీఎస్) అధికారులకు, నాన్–ఎస్సీఎస్ అధికారులకూ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో విశేష అనుభవం అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మార్పులు ఇలా.. 1 జాయింట్ కలెక్టర్–1ను ఇక మీదట జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ)గా పునర్యవస్థీకరించనున్నారు. వీరిని జేసీ–ఆర్బీ అండ్ ఆర్గా పిలుస్తారు. వీరు రైతు భరోసా మొదలు వ్యవసాయం, అనుబంధ రంగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇసుక, గనులు, ఎక్సైజ్, శాంతిభద్రతలు తదితర విభాగాలకూ బాధ్యత వహించాలి. రెవెన్యూ విభాగం, సబ్ కలెక్టర్లనూ పర్యవేక్షించాలి. 2 ‘జాయింట్ కలెక్టర్–విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్’ అని కొత్త పోస్టు సృష్టించనున్నారు. వీరిని జేసీ–వీ అండ్ డబ్ల్యూఎస్‌గా పిలుస్తారు. ఈ పోస్టులో సీనియర్ టైమ్ స్కేలు ఉన్న ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. 3 ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్–2ను జాయింట్ కలెక్టర్–హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌గా పునర్యవస్థీకరించనున్నారు. ఇది నాన్–క్యాడర్ పోస్టు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఎస్సీఎస్/నాన్–ఎస్సీఎస్ కేడర్‌ను ఈ పోస్టులో నియమిస్తారు.వీరు జిల్లాలో వైద్య, ఆరోగ్య విభాగం, విద్యా శాఖను పర్యవేక్షిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దిశ చట్టం అమలు బాధ్యతలు చూడనున్నారు. -
అవినీతి అధికారులకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: సస్పెండ్ అయిన, అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులకు పాస్‌పోర్ట్ జారీ చేయరాదని కేంద్రం ఆదేశాలిచ్చింది. అధికారులకు పాస్‌పోర్ట్ జారీ చేసే ముందు సీవీసీ నుంచి క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి సస్పెన్షన్‌లో ఉన్నా, దర్యాప్తు సంస్థలు అతడిపై కోర్టులో చార్జిషీట్ వేసినా పాస్‌పోర్టు జారీని నిలిపివేయవచ్చని తెలిపింది. అతడికి లేదా ఆమెకు పాస్‌పోర్టు జారీ చేయవచ్చని పై అధికారి సూచించినప్పటికీ అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాలను కోరింది. అతడు/ఆమెకు అనుమతి ఇవ్వడం వల్ల భారత్‌కు ఆ దేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, ప్రజోపయోగం కాదని భావించినా, మరే ఇతర కారణంతోనైనా పాస్‌పోర్టును నిరాకరించే అధికారం విజిలెన్స్ కమిషన్‌కు ఉందని తెలిపింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న అధికారికి కోర్టు సమన్లు జారీ చేసినా, అరెస్టు వారెంట్లు ఇచ్చినా, ఆ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నా దేశం వదిలి వెళ్లరాదని ఏదైనా కోర్టు నిషేధం విధించినా కూడా పాస్‌పోర్టు ఇవ్వరాదని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలపై విదేశాంగ శాఖ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)తో సమీక్ష జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది శాఖ తెలిపింది. (ఆ గుడిలో టాయిలెట్ వారికి మాత్రమే..) -
లంచాలు లేకుండా బిల్డింగ్ ప్లాన్లు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి ట్రామ్ (రైలు) తరహా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలి. అందుకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించండి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : అవినీతికి ఆస్కారం లేకుండా, లంచాల ప్రసక్తే లేకుండా బిల్డింగ్ ప్లాన్లు ప్రజలకు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ప్రాధాన్యతాక్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. మంచినీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, డీశాలినేషన్ (సముద్రం జలాల శుద్ధి) చేసిన నీటినే పరిశ్రమలకు వినియోగించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. విశాఖ, కాకినాడ, తిరుపతి సహా వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి గురించి ఆరా తీస్తూ.. పలు సూచనలు చేశారు. అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో లంచాలు తీసుకోకుండా బిల్డింగ్ ప్లాన్లు మంజూరు చేసే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అవసరమైతే ఇందుకు ఏసీబీ సాయం తీసుకోవాలని సూచించారు. మెరుగైన వ్యవస్థను తయారు చేయడానికి అహ్మదాబాద్ ఐఐఎం సేవలను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతిలేని వ్యవస్థను తీసుకు వస్తే అధికారులను సన్మానిస్తామని చెప్పారు. విశాఖ నగరానికి నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం నుంచి భూగర్భ పైప్‌లైన్ ద్వారా తాగునీటిని నేరుగా విశాఖ నగరానికి సరఫరా చేయడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. విశాఖలో దాదాపు 1.50 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీలుగా కమలాపురం, కుప్పం వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, చిత్తూరు జిల్లాలోని కుప్పం పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా, ప్రాధాన్యతా క్రమంలో భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. మురుగు నీటిని తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు వదలాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా> 110 మున్సిపాల్టీల్లో 19,769 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మించడానికి రూ.23,037 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలను అధికారులు సీఎంకు వివరించారు. లక్షకు పైబడ్డ జనాభా ఉన్న 34 మున్సిపాల్టీల్లో భూగర్భ డ్రైనేజీ, మురుగు నీటి శుద్ధి కోసం రూ.11,181 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. డీశాలినేషన్ చేసిన నీటినే పరిశ్రమల అవసరాలకు వాడుతూ.. మంచి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడేందుకు అవసరమైతే చట్టం చేద్దామని సీఎం అన్నారు. ఇందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. స్పెసిఫికేషన్స్ మార్చకుండా రివర్స్ టెండరింగ్ స్పెసిఫికేషన్స్ మార్చకుండా పట్టణ గృహ నిర్మాణ పథకంలో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఫ్లాట్ల నిర్వహణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీల్లానే ఫ్లాట్ల నిర్వహణ కోసమూ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 48,608 హౌసింగ్ యూనిట్ల(ఇళ్ల)కు రివర్స్ టెండరింగ్ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. రూ.2,399 కోట్ల కాంట్రాక్టు విలువ గల పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్ల ద్వారా రూ.303 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. మిగిలిన యూనిట్లకూ త్వరలోనే రివర్స్ టెండరింగ్ పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి, మంగళగిరి, పులివెందులలో అభివృద్ధి చూపించాలి తాడేపల్లి, మంగళగిరి, పులివెందుల మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ మున్సిపాలిటీల్లో కచ్చితంగా ఫలితాలు చూపించాలని స్పష్టం చేశారు. ఈ మున్సిపాల్టీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసి ప్రతిపాదనలతో రావాలన్నారు. ఆ మేరకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) తయారు చేస్తున్నామని అధికారులు వివరించారు. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలలో 10,794 మంది ఇళ్ల పట్టాల లబ్ధిదారులను గుర్తించామని అధికారులు తెలుపగా, మోడల్ కాలనీ కట్టాలని సీఎం ఆదేశించారు. విజయవాడలో ముంపునకు గురికాకుండా కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పనులు వీలైనంత వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. -
బాబు పాలనలో టెండర్ల పేరుతో 46 వేల కోట్లు దుర్వినియోగం
-
గత ఐదేళ్ల పాలనలో అవినీతి పరాకాష్టకు చేరింది
-
దేవుడే అవినీతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్‌ను పంపాడు
-
పబ్లిక్ డేటాఎంట్రీ.. సూపర్ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రవేశ పెట్టిన పబ్లిక్ డేటాఎంట్రీ (పీడీఈ) విధానం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దస్తావేజు లేఖరుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థిరాస్తి విక్రయ దస్తావేజులను ఎవరికి వారే భర్తీచేసి, ఆన్లైన్ ద్వారా పంపించే పీడీఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 6,426 ఆన్లైన్ దరఖాస్తులు నమోదు కావడం గమనార్హం. -
రైతును ‘రెవెన్యూ’తో కలపాలి
ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవదహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన భూములు, దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల వంటి అంశాలు పక్కకు పోయి రెవెన్యూ శాఖపై ప్రజల ఆగ్రహానికి దారి తీయడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఈ వివాదాలన్నిటికీ నిజాం కాలం నాటి సర్వేనే ఇప్పటికీ అమల్లోకి ఉండడం, చట్టాలలో లొసుగులు కారణం. 1936– 42 వరకు తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే జరిగింది. అప్పుడే రికార్డులు అమలు అయినాయి. ఎక్కువ భాగం భూములన్నీ భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమైనందున, సన్న, చిన్నకారు రైతులకు నామ మాత్రంగా భూములుండటంతో భూ వివాదాలు చోటు చేసుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘‘దున్నే వాడికే భూమి’’ అనే నినాదం తెరపైకి రావడంతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కౌలు భూములు పేదలకు ధారాదత్తం అయినాయి. అయితే చాలా చోట్ల సర్వే నంబర్ల హద్దు తొలగించడంతో భూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా రెవెన్యూ చట్టానికి కొన్ని సవరణలు తెచ్చారు. అందులో అసైన్మెంట్ చట్టం, కౌలుదారుల హక్కుల చట్టం, ఇనాం భూముల చట్టం, దేవాదాయ, వక్ఫ్ భూములలాంటివి ఎన్నో. అంతే కాకుండా రికార్డులను సరి చేయడానికి ‘‘రికార్డ్స్ ఆఫ్ రైట్’’ ద్వారా పాసు పుస్తకాలివ్వడంలాంటివి జరిగాయి. పహానిలో విధిగా అనుభవదారు కాలం పెట్టి, ప్రతి సంవత్సరం పంట వివరాలు రాస్తూ, గ్రామసభల ద్వారా తెలియపరచాలి. అప్పుడు రైతు భూమి వివరాలు, రెవెన్యూ శాఖకు సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ చట్టాల మార్పు నకు నడుం బిగించాలి. ప్రజలు కేంద్రంగా ఉండే విధంగా రెవెన్యూ చట్టాలు మార్చాలి. అందుకు కొన్ని సూచనలు 1.గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర భూసర్వే ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అందుకు తగిన రీతిలో ప్రభుత్వం రూపొందించే రెవెన్యూ బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం కల్పించాలి. 2.తక్షణమే శాస్త్రీయ పద్ధతిలో భూ సర్వే చేపట్టాలి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, సాటిలైట్ ఇమేజినరీ టెక్నాలజీ, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ వంటి టెక్నాలజీని వినియోగించాలి. ప్రతి సర్వే నెంబర్ హద్దులను నిర్ణయించి, హద్దురాళ్ళును పాతించి, శాశ్వతంగా వివాదాలను పరిష్కరించాలి. 3.రెవెన్యూ పరిపాలన గ్రామస్థాయి నుండి వేళ్ళూనటానికి, సమస్యలు పరిష్కారం కావడానికి గ్రామస్థాయిలో విధిగా రెవెన్యూ అధికారిని నియమించాలి. 4.వారసత్వం, కుటుంబ భూ పంపకం, క్రయవిక్రయాలు, గిఫ్టు డీడ్, కోర్టు డిక్రి, అసైన్మెంట్ ద్వారా పొందే భూములకు భూమిపై హక్కు కల్పించే క్రమాన్ని పూర్తి చేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారికి నిర్ధిష్టకాల పరిమితి విధించాలి. 5.పెండింగ్‌లో వున్న సాదాబైనామాల క్రయవిక్రయాల దరఖాస్తులను వీలైనంత త్వరగా క్రమబద్దీకరణ చేయడానికి పూనుకోవాలి. 6.రికార్డు ఆఫ్ రైటస్ (ఆర్.వొ.ఆర్) చట్టంలో వున్న లొసుగులను తొలగించాలి. 7.పట్టాదారు పాసుపుస్తకాలలో అవకతవకలను సరిదిద్దాలి. 8.అటవీ శాఖ, రెవెన్యూశాఖల స్వాధీనంలోని భూముల హద్దులను తక్షణమే సరిచేయాలి. 9.పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాలివ్వాలి. 10.కోనేరు రంగారావు కమిటీ చేసిన 104 సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ చట్టాలను సవరించడం సబబుగా ఉంటుంది. 11.రికార్డులను తారుమారు చేసినా, తప్పులతో నమోదు చేసినా కారకులైన సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. 12.రెవెన్యూ శాఖతో రైతుల సంబంధాల పునరుద్ధరణ కొరకు తగు కార్యాచరణ ఉండాలి. 13.హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూములను హెచ్ఎండిఎ తదితర సంస్థలు వేలం వేసే భూముల్లో ప్రభుత్వమే అపార్ట్మెంట్లు కట్టించి అందుబాటు ధరలో కేటాయించాలి. వ్యాసకర్త: చాడ వెంకటరెడ్డి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
అవినీతిపై 14400కు కాల్ చేయండి
సాక్షి, అమరావతి : అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు, కాలవ్యవధి, తదితర విషయాల గురించి కాల్ సెంటర్ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. వ్యవస్థపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణమూర్తి, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవినీతి నిర్మూలనకు పలు చర్యలు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రజలకు నేరుగా సత్వరమే పనులు జరిగేలా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను.. గ్రామాల్లో, పట్టణాల్లో వలంటీర్లను నియమించింది. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తప్పిదాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
కాల్ సెంటర్‌కి ఫోన్ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. పౌరులనుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు 14400 కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత నేరుగా కాల్‌సెంటర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎంత కాలవ్యవధితో పరిష్కరిస్తారన్న విషయాలపై సీఎం స్వయంగా కాల్‌సెంటర్ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలుకూడా చేశారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్ధితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. వ్యవస్ధపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణమూర్తితో పాటు ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోప్యంగా ఫిర్యాదు దారుడి వివరాలు 14400 కాల్ సెంటర్ వారంరోజులూ 24 గంటలపాటు పనిచేస్తుంది. ఫిర్యాదు చేసినవారి వివరాలను, వారితో కాల్‌సెంటర్ ఉద్యోగి చేసిన సంభాషణలను రహస్యంగా ఉంచుతారు. కంప్లైంట్‌ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. సంబంధిత జిల్లాలకు చెందిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఈఫిర్యాదును పంపిస్తారు. అంతేకాక ఎక్కడ ఉన్నా కంప్యూటర్లో లాగిన్ అయి ఏయే ఫిర్యాదులు వచ్చాయో తెలుసుకునే అవకాశం అధికారులకు ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా ఈ వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా ఎప్పటికప్పుడు అవినీతిపై ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు తీరును పరిశీలిస్తారు. -
అవినీతి నిర్మూళనకు సర్కార్ మరో అడుగు
-
22 మంది కళంకిత అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు సహా సీబీఐ వలలో చిక్కిన 22 మంది సీనియర్ అధికారులను కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) అనివార్యంగా పదవీవిరమణ చేయించింది. వేటుకు గురైన అధికారులంతా సూపరింటెండెంట్, ఏఓ స్ధాయి అధికారులు కావడం గమనార్హం. పన్ను చెల్లింపుదారులను వేధింపులకు గురిచేయడం, లంచాలు కోరడం వంటి పన్ను అధికారులపై చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగానికి అనుగుణంగా అవినీతి, అధికార దుర్వినియోగం చేసే కళంకిత అధికారులపై చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల అనుచిత వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పాయి. కాగా ఈ ఏడాది జూన్‌లో సీబీఐసీ అవినీతి మరకలంటిన 27 మంది అత్యున్నత ఐఆర్ఎస్ అధికారులపైనా వేటు వేసిన సంగతి తెలిసిందే. -
అధికారులు–వ్యాపారుల కుమ్మక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన చాలామంది పప్పు శనగ రైతులకు అధికారులు, వ్యాపారుల అవినీతి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోంది. ధరల స్థిరీకరణ నిధి పథకంతో రైతులను ఆదుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్దనే పంటను నిల్వ చేసిన రైతులకు ఈ పథకం కింద సాయం అందడం లేదు. మరోవైపు వ్యాపారులు,అధికారులు కుమ్మక్కై అనర్హులకు సాయం అందిస్తూ కమీషన్లు మింగేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. క్వింటాల్‌కు 1,500 చొప్పున అదనపు సాయం కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు పప్పు శనగను సాగు చేస్తున్నారు. 2016–17లో 4 లక్షల హెక్టార్లలో సాగు కాగా, 2018–19లో సాగు విస్తీర్ణం 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండే పప్పు శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 4,620 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో ఎక్కువ మంది రైతులు పంటను శీతల గిడ్డంగులు, ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసుకున్నారు. నిల్వ ఉంచిన ఈ పంటను హామీగా పెట్టి, కొందరు రైతులు తక్షణ అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల పప్పు శనగ శీతల గిడ్డంగులు, ప్రైవేట్ గోదాముల్లోనూ, రైతుల వద్ద దాదాపు 10 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉన్నట్టు అంచనా. నిల్వలను కొనేందుకు ప్రభుత్వం రూ.333 కోట్లు విడుదల చేసింది. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పప్పు శనగను కొనుగోలు చేయడంతోపాటు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున అదనంగా అందజేస్తోంది. ఒక్కో రైతుకు 30 క్వింటాళ్ల దాకా ఈ సాయం అందిస్తోంది. దీనివల్ల ఒక్కో రైతుకు రూ.45 వేల ప్రయోజనం చేకూరుతోంది. అయితే, ఈ–క్రాపింగ్‌లో పేర్లు నమోదైన వారికే ఈ అదనపు సాయం అందుతోంది. వ్యాపారుల మాయాజాలం అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో పప్పు శనగ రైతుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి రైతులు ధర్నా సైతం చేశారు. కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో పప్పు శనగను కొనుగోలు చేసి, ఏపీలో తమకు తెలిసిన రైతుల పేరిట కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. అధికారులతో కుమ్మక్కై ఆ రైతుల పేర్లను ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసి, ప్రభుత్వం నుంచి అందే అదనపు సాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. గోడౌన్ల కొరత వల్ల ఇంటి వద్ద పంటను నిల్వ చేసుకున్న రైతులకు సాయం అందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం జరిపే కొనుగోళ్లకు అత్యంత పారదర్శకమైన, అవినీతికి తావులేని విధానం అవలంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏయే మార్గదర్శకాలు పెట్టాలో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రూ.కోటి పైబడి ఏ కొనుగోళ్లు జరిపినా ఏపీ వెబ్సైట్లో పెట్టాలని, మన ప్రొక్యూర్మెంట్ విధానం దేశానికి ఆదర్శం కావాలని సీఎం అన్నారు. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో వారి వివరాలను కూడా వెబ్సైట్లో పెట్టాలని, అంతకంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. కుంభకోణాలకు ఏమాత్రం ఆస్కారం ఉండరాదని నొక్కి చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఏదీ స్కామ్‌లకు అనర్హం కాదన్నట్లుగా ప్రతిదానిలో కుంభకోణాలు రాజ్యమేలాయి. ట్రాక్టర్లు, ఆటోలు, కార్ల కొనుగోలు, యూనిఫారాలు, స్కూలు పుస్తకాలు, కోడిగుడ్లు, స్కూలు విద్యార్థులకు పంపిణీ చేసే షూలు.. ఇలా అన్నింటా కుంభకోణాలు సాగాయి. ఈ వ్యవస్థను ఇకనైనా శుద్ధి చేయాల్సిన అవవసరం ఎంతైనా ఉంది. అన్నింటికంటే మన ప్రభుత్వం విభిన్నం అని చూపాలి. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటికి కచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఇందుకు అధికారులు ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపాలి’ అని సూచించారు. టెండర్ల ద్వారానే కొనుగోలు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొక్యూర్మెంట్ (సేకరణ –కొనుగోలు) విధానాన్ని సీఎం వైఎస్ జగన్ సమీక్షిస్తూ.. ఏమి కొనుగోలు చేయాలన్నా టెండర్లు ఆహ్వానించాలని చెప్పారు. ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేశారో వారి పేరును, ధరను వెబ్సైట్లో పెట్టి రివర్స్ టెండరింగ్ కోసం కొంత సమయం ఇవ్వాలన్నారు. నిర్ధిష్ట గడువులోగా ఈ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చి కోట్ చేస్తే వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు. కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం మార్గనిర్దేశం చేశారు. ఇలా చేయడం ద్వారా వ్యవస్థలో స్వచ్ఛత తేవచ్చని చెబుతూ.. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ఈనెల 28వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవినీతిపై పోరులో వెనకడుగు వద్దు
సాక్షి, అమరావతి: అవినీతిపై పోరాటం చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో టెండర్ల ప్రక్రియ మొదలు తీసుకువచ్చిన అప్పుల వరకు పై స్థాయిలో ఏది చూసినా వందలు.. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి లేకుండా ఉండి ఉంటే అవే ఇళ్లు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చేవి కావా అని ప్రశ్నించారు. బుధవారం అర్బన్ హౌసింగ్ (టిడ్కో)పై మంత్రివర్గ ఉప సంఘంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని, అయినా దేనికీ లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా? లేక అవినీతి చేసిన వారిని వదిలేయాలా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతి రహిత పాలనను అందించే ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని కోరారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీని వల్ల మిగిలే ప్రతి పైసా ప్రజలకే చెందుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ధరలు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి పట్టణాల్లో అర్హులైన మిగిలిన 4 లక్షల మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు కట్టించడానికి భూమిని గుర్తించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు తక్కువ ధరలో దీర్ఘకాలం నిలిచే విధంగా ఫ్లాట్లు నిర్మించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మేరకు అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా ఏ పని చేపట్టినా అందులో స్కాం లేకుండా చూసుకోవాలన్నారు. మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి.. అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు. రేట్లు ఖరారు చేసే సమయంలో నిర్మాణ రంగానికి చెందిన నిపుణులతో సంప్రదించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించాలని చెప్పారు. ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్లను ప్రామాణికంగా తీసుకుని అంచనాలు తయారు చేయాల్సిన అవసరం లేదని, వాస్తవ రేట్లను పరిగణనలోకి తీసుకుని రివర్స్ టెండర్లు ఖరారు చేయాలన్నారు. ప్రభుత్వం ఇసుక, స్థలం ఉచితంగా, సబ్సిడీపై సిమెంట్ సరఫరా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రేట్లు తగ్గాలన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ.. ఈనెఖారుకు కొత్త రేట్లు ఖరారు చేస్తామని, వచ్చేనెలాఖరులో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని చెప్పారు. 1.02 లక్షల ఇళ్లకు రివర్స్ టెండరింగ్ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో పునాదుల లోపు 65 వేల ఇళ్లు, బేస్మెంట్ లెవెల్లో 37 వేల ఇళ్లు ఉన్నాయని, వీటిన్నింటికీ రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మరో 1.75 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇవిపోగా మిగిలిన 4 లక్షల ఫ్లాట్ల కోసం భూమిని చూడాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్‌కల్లాం, సలహాదారులు శామ్యూల్, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడి కృష్ణమోహన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అవినీతికి ఫుల్స్టాప్
ఏం జరుగుతుందంటే...? రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయటానికి ముందుగానే సంబంధిత డాక్యుమెంట్‌ను న్యాయ పరిశీలన కోసం హైకోర్టు న్యాయమూర్తికి పంపిస్తారు. న్యాయమూర్తి దీనిపై ప్రజల నుంచి సూచనలు, సలహాల కోసం వారం రోజుల పాటు డాక్యుమెంట్‌ను అందరికీ అందుబాటులో ఉంచుతారు. అనంతరం న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిపుణుల బృందం వీటిని క్షుణ్నంగా పరిశీలించి 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. ప్రజల సలహాల మేరకు తగిన మార్పులు చేర్పులు సూచిస్తుంది. వీటిని కచ్చితంగా అమలు చేస్తూ టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో తొలిసారిగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి, అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా ముందుగా న్యాయపరమైన పరిశీలన తరువాతే పారదర్శకంగా టెండర్లను ఆహ్వానించే చరిత్రాత్మక ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును కూలంకషంగా చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదించింది. ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టెండర్లను పారదర్శకంగా ఖరారు చేసేందుకు న్యాయ పరిశీలనను ఏర్పాటు చేస్తామని అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టెండర్ల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకత, ప్రజాధనం ఆదాకు పెద్దపీట వేస్తూ అక్రమాలు, పక్షపాతం, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్తగా ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల (న్యాయపరమైన ముందస్తు సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019 బిల్లు రూపుదిద్దుకుంది. ఈ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంతో త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. పారదర్శకతకు పెట్టపీట ఈ బిల్లు ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల డాక్యుమెంట్ ముందస్తు పరిశీలన జరుగుతుంది. ప్రజల నుంచి అందిన సూచనల మేరకు, న్యాయమూర్తి పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులతో టెండర్ల ప్రతిపాదనలను ఖరారు చేస్తూ బిడ్డింగ్‌కు వీలుగా బిల్లులో ప్రొవిజన్స్ ప్రతిపాదించారు. అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే లక్ష్యంగా బిల్లుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అందరికీ సమాన అవకాశాలు.. కొత్త విధానంలో ఏదైనా పనిని ప్రతిపాదిస్తున్న ప్రతిశాఖ ఆ పత్రాలను న్యాయమూర్తికి సమర్పించాల్సి ఉంటుంది. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా ప్రభుత్వం చేపట్టే అన్ని ప్రాజెక్టులపైనా జడ్జి పరిశీలన చేయనున్నారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే న్యాయపరిశీలన పరిధిలోకి రావాల్సిందేనని బిల్లులో స్పష్టం చేశారు. న్యాయమూర్తికి సూచనలు, సలహాలు అందిస్తున్న వారికి తగిన రక్షణను ప్రభుత్వమే కల్పించనుంది. జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖలన్నీ పాటించాల్సిందేనని బిల్లులో పేర్కొన్నారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదనలను ఖరారు చేయాలని, ఆ తరువాతే బిడ్డింగ్‌కు వెళ్లాలనే నిబంధన బిల్లులో పొందుపరిచారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ విధానం ఉంటుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకుని ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా న్యాయమూర్తికి వెసులుబాటు కల్పించారు. జడ్జి, జడ్జి వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తారు. ఈ చట్టం ద్వారా తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రతినిధులపై ఎట్టి దావా క్లెయిమ్ లేదా ఇతర న్యాయ ప్రొసీడింగ్స్ ఏవీ వేయకూడదు. బిల్లులోని ఆర్థిక మెమోరాండంలో నెలవారీ వ్యయం కోసం రూ.3 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.ఐదు కోట్లను ప్రాధమికంగా కేటాస్తున్నట్లు పేర్కొన్నారు. బిల్లులో కీలక అంశాలు ఇవీ... 1. ఏ టెండరైనా, ఏ పనైనా విలువ రూ.100 కోట్లు దాటితే టెండర్ పత్రాలను న్యాయమూర్తి పరిశీలనకు పంపుతారు. 2. తరువాత దాన్ని ప్రజా బాహుళ్యం (ఇంటర్నెట్, వెబ్ సైట్)లో 7 రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 3. న్యాయమూర్తికి సాంకేతిక తోడ్పాటు కోసం టెక్నికల్ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జడ్జి కోరితే వేరేవారిని కూడా నియమిస్తుంది. వారికి జీతభత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. 4. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను న్యాయమూర్తి ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం 8 రోజుల పాటు సమీక్షిస్తుంది. సంబంధిత శాఖల అధికారులను పిలిచి అందుకు అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు సూచిస్తుంది. 5. వారం రోజులు ప్రజా బాహుళ్యంలో, 8 రోజుల పాటు న్యాయమూర్తి పరిశీలనలో టెండర్ డాక్యుమెంట్ ఉంటుంది. 6. మొత్తం 15 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. 7. న్యాయమూర్తి సూచించిన మార్పుచేర్పులను తప్పనిసరిగా అమలు చేస్తూ టెండర్లను పిలుస్తారు. ఇదీ ప్రభుత్వ ఉద్దేశం... ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతతో కూడిన వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోంది. సమాన అవకాశాలు, వ్యయం, నాణ్యతా సూత్రాలను పాటిస్తూ సమర్ధవంతమైన రీతిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని ధృఢంగా నిర్ణయించింది. ఈ లక్ష్యాలను సాధించేందుకు యావత్తు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మరీ ముఖ్యంగా రూ.100 కోట్లు అంతకు మించిన విలువ గల ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం సమగ్ర చట్టం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం ఉన్నత న్యాయస్థానానికి చెందిన గౌరవ న్యాయమూర్తి ఆధ్వర్యంలో తగిన యంత్రాంగం ఏర్పాటుకు చట్టం తేవాలని నిర్ణయించింది. గౌరవ న్యాయమూర్తి విధులు నిర్వర్తించడానికి అవసరమైన నిపుణులు, సిబ్బందిని ఆయన కోరిన విధంగా సమకూర్చుతుంది’’ కొత్త చట్టం పరిధిలోకి వచ్చేవి (పీపీపీ ప్రాజెక్టులతో సహా ) 1.రోడ్లు (రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రోడ్లు, ఇతర జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు) వంతెనలు, బైపాస్‌లు 2. ఆరోగ్యం 3. భూమిని తిరిగి తీసుకొనుట 4. కాలువలు, ఆనకట్టలు 5. నీటిని సరఫరా చేయటం, శుభ్రపరచటం, పంపిణీ చేయుటం 6. వ్యర్ధ పదార్థాల నిర్వహణ 7. మురుగు, మురుగుపారుదల 8. పబ్లిక్ మార్కెట్లు 9. వర్తక ప్రదర్శన, సమ్మేళం, వస్తు ప్రదర్శన, సాంస్కృతిక కేంద్రాలు 10. పబ్లిక్ భవనాలు 11. దేశీయ జల రవాణా 12. గ్యాస్, గ్యాస్ పనులు 13. క్రీడలు, విహారాల మౌలిక సదుపాయాలు, పబ్లిక్ ఉద్యానవనములు, పార్కులు 14. రియల్ ఎస్టేట్ 15. ఇ–గవర్నెన్స్ ప్రాజెక్టులు, ఐటీ మౌలిక సదుపాయాలు 16. ప్రైవేట్ రంగ కంపెనీలు, కంపెనీల కన్సార్టియంతో ఉమ్మడి అభివృద్ధి ఒప్పందం, జాయింట్ వెంచర్ ద్వారా పట్టణాభివృద్ధి 17. ఫైబర్ గ్రిడ్, వై–ఫై సర్వీసులతో సహా టెలి కమ్యునికేషన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు 18. పునరుత్పాదక (సౌర–పవన) ఇంధన ప్రాజెక్టులతో సహా విద్యుత్ ఉత్పాదన, ప్రసారం, పంపిణీ 19. హై–వే ప్రాజెక్టులలో ఏకీకృత భాగంగా ఉన్న గృహ నిర్మాణం లేదా ఇతర కార్యకలాపాలతో సహా ఇతర హై–వే ప్రాజెక్టులు 20. ట్రాన్స్పోర్ట్ టెర్మినల్స్, డిపోలు 21. పట్టణ రవాణా ప్రాజెక్టులతో సహా రైల్వే వ్యవస్థ 22. ఓడ రేవులు, అంతర్దేశీయ ఓడరేవులు 23. లాజిస్టిక్ హబ్‌లు స్వేచ్ఛా వాణిజ్య ప్రదేశాలతో సహా పరిమితి లేకుండా వాటికి విమానాశ్రయాలు 24. ఆకర్షణీయ నగర ప్రాజెక్టులతో సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు 25. విద్యా సంస్థలు -
కన్నూరులో కన్నాలెన్నో!
హన్మకొండ చౌరస్తా: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అక్రమార్కులకు వరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై వాహనాలను సైతం అందిస్తోంది. అర్హులైన మత్స్యకారులకు మోపెడ్, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను అందించేందుకు గత ఏడాది వరంగల్ జిల్లాకు రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో నిబంధనలకు నీళ్లొదిలిన మత్స్యశాఖ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని ఓ పెద్ద మనిషితో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు మత్స్యశాఖలోని అవినీతి చేపలను ఏరివేయాలని కోరుతూ గత సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ సభ్యులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందన రాకపోవడంతో నేరుగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి అవినీతి జరిగిన తీరును తెలియజేసినట్లు సభ్యులు చెబుతున్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో అవినీతి జరగకుండా ఉండేందుకు సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు వెళ్లారు. అంతకుముందు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. ఫోర్జరీ సంతకాలతో తీర్మాణం? 8లక్షల రూపాయలకు పైబడిన వాహనాన్ని మంజూరి చేయాలంటే సొసైటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణం చేయాల్సి ఉంటుందని, అయితే తమ సొసైటీ సభ్యుడు నూనె శంకర్ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశాడని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాల తీర్మాణం తో సదరు వ్యక్తి కి వాహనాన్ని మంజూరి చేసిన మత్స్యశాఖ అధికారులు, అందుకు సహకరించిన మత్స్య సహాకార సంఘం పెద్ద మనిషి పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సొసైటీలోని సభ్యులందరికీ ఉపయోగపడాల్సిన వాహనం ఒక్క సభ్యుడికి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.23 కోట్ల నిధులు వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 91 పురుష మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 10,24 మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. 23 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 1,414 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది మత్స్య సమీకృత అభివృద్ధి పథకం ద్వారా చేపల విక్రయాలు, చేపల పట్టేందుకు ఉపయోగపడే పరికరాలను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యుడై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి 75శాతం రాయితీపై వాహనాలను అందించారు. విచారణ చేపడితే మరిన్ని వెలుగులోకి? డ్రైవింగ్ లైసెన్సు ఉండి సొసైటీ సభ్యుడైతే చాలు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి టీవీఎస్ ఎక్సెల్(మోపెడ్) అందజేశారు. లగేజీ ఆటోల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సొసైటీ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందించారు. ఇక భారీ వాహనాలను సైతం ఇదే పద్ధతిలో అందించామని అధికారులు చెబుతుండగా సొసైటీలు మాత్రం ఏకగ్రీవ తీర్మానం ఆధారంగానే మంజూరు చేశారని చెబుతున్నారు. అయితే, మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పెద్దలు కుమ్మక్కై వాహనాల మంజూరులో సిండికేట్‌గా ఏర్పడి అవినీతికి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే నిజాలు వెలుగు చూస్తామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.లక్ష వరకు వసూలు టీవీఎస్ ఎక్సెల్ కోసం వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 1,987 మంది దరఖాస్తు చేసుకోగా 1673 మందికి, లగేజీ ఆటోల కోసం 656 మంది దరఖాస్తు చేసుకోగా 126 మందికి అందజేసినట్లు తెలుస్తోంది. అలాగే, హైజెనిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల కోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది దరకాస్తులు రాగా.. నలుగురు వాహనాలను అందుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మోపెడ్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు, లగేజీ ఆటోలకు రూ.5వేల నుంచి రూ.10వేల రూపాయల వరకు వసూలు చేయగా బొలోరా వాహనాలకు రూ.లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోర్జరీకి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి మా ఊరి సొసైటీ సభ్యులకు తెలియకుండా దొంగతనంగా తీర్మాణంలో మా సంతకాలను ఫోర్జరీ చేసి నూనె శంకర్ బొలోరో వాహ నం తీసుకున్నాడు. దీనికి సహకరించిన మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం పెద్దలపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సార్‌ను కలిస్తే విచారణ జరిపి వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. –నూనె సంపత్, కన్నూర్, కమలాపూర్ ఉద్యోగులకు సభ్యత్వాలు ఇచ్చారు.. మా ఊరి సొసైటీలో ప్రస్తుతం 153 మంది సభ్యులు ఉన్నారు. పాత సభ్యులు 80 మంది కాగా గత ఏడాది కొత్త సభ్యత్వాలను ఇచ్చారు. ఇందులో 18 ఏళ్లు నిండని వ్యక్తులు, ప్రభుత్వం ఉద్యోగులకు సైతం స్థానం కల్పించారు. ఇదేమిటని అడిగితే అధికారులు, సొసైటీ పెద్ద మనుషుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అనర్హులకు వాహనాలను మంజూరు చేసేందుకే అర్హత లేని వారికి సభ్యత్వాలు ఇచ్చారు. కల్పించారు. సభ్యత్వాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. – కిన్నెర మొగిలి, కన్నూర్, కమలాపూర్ ఎఫ్డీఓ భాస్కర్‌కు నోటీసులు ఇచ్చాం కమలాపూర్ మండలం కన్నూర్‌కుచెందిన అంశంపై ఎఫ్డీఓ భాస్కర్‌కు నోటీసులు జారీ చేశాం. ఆ గ్రామ సొసైటీ తీర్మానం చేసిన కాపీని భాస్కర్ నాకు అందించారు. తీర్మానం కాపీలో సొసైటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారన్న విషయం నాకు తెలియదు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓను నివేదిక కోరాను. ఆ నివేదిక ఆధారంగానే నూనె శంకర్‌కు బొలోరో వాహనాన్ని మంజూరు చేశాం. అయితే లబ్ధిదారుల ఎంపికలో సొసైటీల తీర్మాణం తప్పనిసరి అనే అంశం ప్రభుత్వం మాకు సూచించిన నిబంధనలలో ఎక్కడా పొందుపర్చలేదు. ఈ విషయం తెలియక కన్నూర్ సొసైటీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. – డి.సతీష్, అసిస్టెంట్ డైరక్టర్,మత్స్యశాఖ, వరంగల్ అర్బన్ జిల్లా -
అవినీతి రహిత పాలనే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఎటువంటి అవినీతి లేని.. పారదర్శకమైన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో శాఖల వారీగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వెలికి తీయాలని మంత్రులను ఆదేశించారు. ఏ శాఖలో.. ఎక్కడ అవినీతి జరిగినా గుర్తించి ఆ వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపర్చాలని నిర్ణయించారు. మంత్రి పదవికి రెండున్నరేళ్లు అనే గ్యారంటీ ఏమీ లేదని, ఏ మంత్రిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు జరిపిస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆరోపణలు రుజువైతే తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఏ మంత్రికైనా అవినీతి మరక అంటితే వెంటనే మంత్రి మండలి నుంచి దూరమవుతారన్నారు. తమ ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కాదని, వారికి కేటాయించిన శాఖల బాధ్యత పూర్తిగా వారిదేనని స్పష్టం చేశారు. పారదర్శకమైన పాలన అందించే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టామని.. వివిధ పనుల టెండర్ల పరిశీలనకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు నిమిత్తం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విన్నవించామని గుర్తు చేశారు. వివిధ పనులకు సంబంధించిన వివరాలను టెక్నికల్ సపోర్టింగ్ టీమ్ జ్యుడీషియల్ కమిషన్ ముందు పెడుతుందని చెప్పారు. కమిషన్ సిఫార్సులలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి సలహాలు, సూచనలు ఉంటే ఎవరైనా చెప్పవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష విద్యుత్ శాఖలో పేరుకుపోయిన అవినీతిపై మంత్రివర్గం ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు చేసుకున్న అన్ని ఒప్పందాలను పునఃసమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తూ గత ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. నామినేటెడ్ కమిటీలు రద్దు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్నిరకాల నామినేటెడ్ కమిటీలను రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెటింగ్, సహకార సంస్థలు, ఆలయాలకు సంబంధించిన పాలకమండళ్ల పదవులతోపాటు ఇతర నామినేటెడ్ పదవులు సైతం రద్దు కానున్నాయి. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా ఆ ఉద్యోగులకే లబ్ధి చేకూర్చే చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఇసుక విధానం ప్రక్షాళన అవినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లలో ఇసుక విధానం రాజకీయ నేతలకు ఆదాయ వనరుగా మారిందని, దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరారు. ఇసుక విధానం ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విధంగా ఉండాలన్నారు. అదే సందర్భంలో సరసమైన ధరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. -
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరు అవినీతి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి టెండర్ల విధానం ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించారు. టెండర్ల విధానంలో పారదర్శకత తీసుకురావాలని, అవినీతికి తావు లేకుండా సమూల మార్పులు చేయాలని పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ) ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ జరిగిప్పటికీ, అస్మదీయులకే కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చడం, అంచనా వ్యయాలు విపరీతంగా పెంచేసి, కమీషన్లు కొల్లగొట్టడం లాంటి బాగోతాలు ఇప్పటిదాకా యథేచ్ఛగా కొనసాగాయి. ఇకపై ఇలాంటి అక్రమాలకు చరమ గీతం పాడుతూ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేని టెండర్ల విధానం తీసుకురావాలని సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. ఈ అంశంపైనే శుక్రవారం సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టెండర్ల విధానంలో సమూల మార్పులు ప్రస్తుతంఉన్న కమిషనర్ ఆఫ్ టెండర్స్‌కి(సీవోటీ) అధిపతిగా హైకోర్టును సంప్రదించి ఒక న్యాయమూర్తిని నియమించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం టెండర్లను ఆహ్వానించిన తరువాత కాంట్రాక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరుపరాదు. అయితే, అందుకు విరుద్ధంగా గతంలో అస్మదీయుల కోసం సంప్రదింపులు జరపడం, కావాల్సిన వారి కోసం అంచనాలను మార్చడం వంటివి జరిగాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేలా సంస్కరణలతో కూడిన టెండర్ల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకసారి టెండర్లు ఆహ్వానించిన తరువాత ఎల్–1గా ఎవరు వస్తే వారికే కాంట్రాక్టును ఖరారు చేయడం, నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చకపోవడం వంటి సంస్కరణలు జగన్ మదిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీవోటీలో అడ్మినిస్ట్రేటర్‌ను కూడా నియమించి, టెండర్ల ప్రక్రియ నిబంధనల మేరకు సాగిందా లేదా అనేది న్యాయమూర్తికి వివరించేలా చూడాలని ముఖ్యమంత్రి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఆర్థిక, రెవెన్యూ రంగాలపై నేడు సీఎం సమీక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. పోలింగ్ పూర్తయిన తరువాత కూడా గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పని వేళల్లోనే విధులు నిర్వహిస్తే చాలు పరిపాలన వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు కిందస్థాయి నుంచి పైస్థాయి దాకా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచ బ్యాంకు సూచించిన ప్రొక్యూర్మెంట్ చట్టంలోని అంశాలను సైతం అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాంట్రాక్టర్లతో సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికేలాగా టెండర్ల విధానం తీసుకురావాలని, న్యాయమూర్తి సమక్షంలో టెండర్లను ఖరారు చేసిన తరువాత ఎవరైనా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయాలని నిర్ణయానికొచ్చారు. వీటికి త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక రూపం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఉద్యోగులు పని వేళల్లోనే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారులు, ఉద్యోగులు పని చేస్తే సరిపోతుందని, సెలవు రోజుల్లో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదని సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సాయంత్రం 6 గంటల తరువాత అధికార కార్యక్రమాలు ఉండవని కూడా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. -
అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు
-
అవినీతి నిర్మూలనలో తొలి అడుగు
అమరావతి: అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆదేశాలు పంపారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు. జీరో కరప్షన్ మోడ్‌తో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టుల్లో అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు -
సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట
నల్లగొండ : సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించి ఈపాస్ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఇటీవల జిల్లా పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరాలో కూడా ఈపాస్ విధానాన్ని అమలు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. సన్నబియ్యం అక్రమాలకు అడ్డుకట్ట ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటినుంచి10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి విద్యార్థికి 1 నుంచి 5వ తరగతి వారికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల భోజనాన్ని పెడుతున్నారు. అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు రోజూ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 500 గ్రాములు, 6 నుంచి 10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులు హాజరు కాకున్నా వచ్చినట్లుగా లెక్కలు చూపి అక్కడక్కడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడంలేదు. వారు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనాన్నో, ఇంటికి వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. అలాంటి వారిని కూడా మధ్యాహ్న భోజనం చేసినట్లుగా తప్పుడు లెక్కలు రాస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్లలో కూడా అదే పరిస్థితి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినా వాళ్లు హాస్టల్లో ఉన్నట్లుగానే లెక్కలు సృష్టించి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సన్నబియ్యాన్ని డ్రా చేస్తున్నారు. అలా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఈపాస్ ద్వారానే అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రస్తుతం ఎంఈఓలు ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు, తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు ఇండెంట్ పెడితే దాని ఆధారంగా సంబంధిత రేషన్ షాప్‌నకు సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడినుంచి పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. పనిచేయని బయోమెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నా అవి వాడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం బయోమెట్రిక్‌ను కచ్చితంగా అమలు చేయడంతోపాటు బియ్యం సరఫరాలో ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. స్కూల్, హాస్టల్ అధికారుల వేలిముద్రలతో బియ్యం సరఫరా పాఠశాలకు సరఫరా అయ్యే బియ్యం సరఫరాకు సంబంధించి రేషన్‌షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని ఇవ్వనున్నారు. అదే విధంగా హాస్టల్‌కు సంబంధించి వేలిముద్ర ఆధారంగా బియ్యాన్ని ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టల్ వారు ఎన్ని బియ్యం తీసుకున్నారని తేలిపోతుంది. అక్కడ విద్యార్థులకు వండిపెడతారు. అక్కడ ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పాస్ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్టపడి సక్రమంగా పిల్లలకు భోజనం అందే అవకాశం ఉంది. -
దేవగిరి నోట్లో దుమ్ము
బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామం.. ఒకవైపు గలగలా పారే హెచ్చెల్సీ కాలువ.. మరోవైపు పచ్చని పంట పొలాలు.. ఎక్కడ చూసినా పనుల్లో నిమగ్నమైన రైతులు.. రైతు కూలీలు.. ఊరు బయటకు వెళ్తే స్వచ్ఛమైన పైరుగాలి.. కరువుకు నిలయమైన జిల్లాలో నూ అక్కడక్కడా ఇలాంటి పల్లెసీమలు, పల్లె అందాలను, ప్రకృతి సోయగాలు పలకరిస్తాయి. కానీ కొందరు పచ్చనేతలు.. పల్లెపై దుమ్ము చల్లుతున్నారు. నాలుగు రాళ్లకోసం కొండలనే పిండి చేస్తున్నారు. అక్రమంగా క్రషర్లు నడుపుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెVýæబడుతున్నారు. తమ జీవనాధారం పోతోందని రైతులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. పట్టించుకునే వారే లేకుండా పోయారు. బొమ్మనహాళ్ : అక్రమ సంపాదనకు అలవాటు పడిన టీడీపీ నేతలు.. అందివచ్చే ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే సహజ వనరులన్నీ దోచుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు నాలుగు పచ్చనోట్ల కోసం కొండలను పిండిచేసి, పంటలపై దుమ్ము చల్లి రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నించే రైతులను అధికారం అండతో భయపెడుతున్నారు. ఇప్పటికే నేమకల్లులో క్రషర్లు ఏర్పాటు చేసి రైతుల బతుకులతో ఆడుకున్న టీడీపీ నేతలు.. అక్కడ నిలిపివేయడంతో దేవగిరికొండపై కన్నేశారు. లీజు పొందేందుకు ప్రయత్నాలు బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు వద్ద ఉన్న క్వారీలు, క్రషర్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో మానవహక్కుల సంఘం, గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రైతుల పొలాలను స్వయంగా పరిశీంచిన గ్రీన్ ట్రిబ్యునల్.. క్వారీలు, క్రషర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్కడున్న 21, క్వారీలు, 24 క్రషర్ యూనిట్లు మూతపడ్డాయి. ఈ కారణంగా కొన్నేళ్ల నుంచి కొండలు పిండి రూ.కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు దేవగిరి కొండపై కన్నేశారు. కొండలీజు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవగిరి సర్వేనంబర్ 134లో 47.34 ఎకరాల్లో విస్తరించిన కొండను 20 ఏళ్ల లీజు పొందేందుకు టీడీపీ నేత కాంతరావు దరఖాస్తు చేశారు. బళ్లారిలో స్థిరపడిన ఆయన.. అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నారు. అనుమతుల్లేకుండానే.. గనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకపోయినా కాంతారావు మాత్రం దేవగిరి కొండపై క్రషర్లు ఏర్పాటు చేసేశారు. మంత్రి కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని కొండల్లో బాస్లింగ్ చేపడుతున్నారు. దీంతో రైతులంతా కలిసి టీడీపీ నేత కాంతారావు వద్దకు వెళ్లి బ్లాస్టింగ్ ఆపాలని కోరగా.. సదరు నేత వారిపై దాడులు చేయించాడు. అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి క్రషర్ నడుపుతున్నానని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని రైతులను భయపెడుతున్నాడు. పైగా తన అనుచరులను అక్కడ నిత్యం కాపలా ఉంచి స్థానికులను భయపెడుతున్నాడు. అందుకే అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. పంటలు నాశనం.. ఆరోగ్యాలపై ప్రభావం దేవగిరికొండ చుట్టూ కిలోమీటర్ దూరం వరకు సుమారు 50 మంది చిన్న, సన్నకారు రైతులు పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాగే కొండపక్కనే 50 మీటర్ల దూరంలో ఇట్టప్ప స్వామి, ఆంజనేయస్వామి దేవాయాలు ఉన్నాయి. కొండపై బ్లాస్టింగ్ సమయంలో ఎగిరి పడుతున్న పెద్దపెద్ద రాళ్లతో పొలాల్లో పనిచేసుకోవడం ఇబ్బందిగా మారింది. పేలుడు సమయంలో భూమి కంపిస్తుండడంతో చాలా మోటార్లు బోర్లలో ఇరుక్కుపోయాయి. సమీపంలోని దేవాలయాల నిర్మాణాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంకోవైపు బ్లాస్టింగ్, కంక్రర క్రషింగ్ సమయంలో వస్తున్న దుమ్ము పంటపొలాలపై పడుతుండటంతో అవన్నీ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. క్రషర్ వల్ల వస్తున్న దుమ్ము, ధూళికి బండూరు, దేవగిరి గ్రామాల్లోని ఎందరో చిన్నారులు రోగాల పాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు అనుమతులు లేకుండా.. ప్రజాభిప్రాయ సేకరణే జరపకుండా... పరిసర ప్రాంత రైతులతో సంబంధం లేకుండా స్థానిక సర్వేయర్లు, వీఆర్ఓలు, ఆర్ఐలతో సాయంతో టీడీపీ నేత కాంతారావు దేవగిరికొండపై బ్లాస్టింగ్లు చేపట్టారు. అంతేకాకుండా దేవగిరి–బండూరు గ్రామాల మధ్య ఒక పెద్ద క్రషర్, మరొక మొబైల్ క్రషన్ను ఏర్పాటు చేసి నిరంతరాయంగా కొండలను పిండిచేస్తూ రోజుకు 100 నుంచి 150 టిప్పర్లు మేర కంకరను కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. దీంతో దేవగిరి, బండూరు గ్రామాలకు చెందిన రైతులు అనుమతుల్లేకుండా ఏర్పాటైన క్రషర్‌ను మూసివేసేలా చూడాలని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చారు. బొమ్మనహాళ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు కూడా చేశారు. అయినా అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రోజూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు నుంచే టిప్పుర్లు కంకరను వేసుకుని బళ్లారికి వెళ్తున్నా.. పోలీసులూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
పైసా మే పట్వారీ!
ముస్తాబాద్ మండలంలోని పోత్గల్ గ్రామంలో వీఆర్ఓ అవినీతి, అక్రమాల వల్ల 200 మంది రైతులకు చెందిన భూములు కొత్త పట్టా పుస్తకాలలోకి ఎంట్రీ కాలేదు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లనే నమోదు చేశారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, వీఆర్ఓ బాపురెడ్డిని సస్పెండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో మండల కేంద్రంలోని ముస్తాబాద్ వీఆర్ఓ హరికిషోర్ను బదిలీ చేశారు. నామాపూర్, మొర్రాయిపల్లి వీఆర్ఓలను సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సస్పెండ్ చేశారు. ముస్తాబాద్ తహసీల్దార్‌ను కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ చేశారు. బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గుడి రాజిరెడ్డికి లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి కుమారులు. వీరిలో రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి గతంలో మరణించారు. వారి పేరున ఉన్న వ్యవసాయ భూమి వారసులు గుడి మల్లారెడ్డి, గుడి దేవేంద్రల పేరిట విరాసత్ చేయాల్సి ఉంది. దేవేంద్ర కుమారుడు గుడి మనోజ్ తన తాతకు సంబంధించిన భూమి విరాసత్ చేయాలని యల్ఆర్యూపీఎస్లో దరఖాస్తు చేసుకున్నాడు. జనార్దన్ తడగొండ వీఆర్వోగా ఉన్న సమయంలో 30 గుంటల భూమి విరాసత్ చేయకుండా ఆపాడు. దీంతో ఆ యువకుడు 30 గుంటల భూమిని తన తల్లి పేరున ఆన్లైన్ చేయాలని వీఆర్వోను కోరాడు. రూ.5వేలు ఇస్తే ఆన్లైన్ చేస్తానని వీఆర్వో చెప్పగా.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 2018 మే 2న ఏసీబీ అధికారులు దాడి చేసి మనోజ్ నుంచి రూ.ఐదు వేలు తీసుకున్న వీఆర్వో జనార్దన్‌ను పట్టుకున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వీఆర్వోల లీలలు కేవలం ముస్తాబాద్, బోయినపల్లి మండలాలకే పరిమితం కాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అదే పరిస్థితి నెలకొంది. ముస్తాబాద్ మండలంలో వీఆర్ఓల అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వెంకట్రామరెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. కానీ మిగతా జిల్లాల్లో ఏళ్లకేళ్లుగా గ్రామాల్లో రైతులను శాసిస్తూ, పట్టా పాసు పుస్తకాలు, పహానీలకు తామే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వీఆర్వో నాలుగైదు గ్రామాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేరనే అహంతో అవినీతి, అక్రమాలతో కోట్లు వెనుకేసుకుంటున్న వీఆర్ఓలు కూడా కరీంనగర్ పూర్వ జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన వీఆర్వోలకు కాసుల వర్షం కురిపించే కామధేనువుగా మారింది. అదే సమయంలో భూమి హక్కులు గల యజమానులకు అన్యాయం జరిగింది. కాసుల గలగలతో మారిన రాతలు గ్రామాల్లో ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పుకు సర్టిఫై చేసే పని నుంచి ప్రభుత్వ అసైన్డ్ భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన వారికి పట్టా చేసేంత వరకు వీఆర్‌ఓలే కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఒక్కో పనికి ఒక్కో రేటును నిర్ణయించి మరీ లక్షల్లో వసూలు చేసిన సంఘటనలు ఎన్నో. రైతు తన పని కావాలని డబ్బులిస్తే, ఇతర భూములు, సర్కారు భూములను ఆక్రమించుకున్న అక్రమార్కులకు అండగా నిలిచి, వారికి ‘రాసిచ్చినందుకు’ లక్షల్లో పోగేసుకున్నారు. భూములను ఇష్టానుసారంగా విరాసత్ చేయడం, మ్యుటేషన్లతోపాటు సంబంధం లేని సాకులు చూపి పాసుపుస్తకాల్లో పేర్లు ఎంట్రీ చేయకపోవడం వంటి అంశాలన్నీ వీఆర్వోలకు కాసులు కురిపించేవిగానే తయారయ్యాయి. దూరప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ కరీంనగర్లో విలాసవంతమైన జీవితాలు గడిపే వీఆర్ఓలు ఉమ్మడి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. కాగా వీఆర్ఓగా కేవలం ఆదాయం వచ్చే రెవెన్యూ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ అందిన కాడికి దండుకోవడంతోపాటు కొందరు తహసీల్దార్లకు కూడా వాటాలు ఇచ్చే సంస్కృతికి బీజం వేశారు. వీఆర్ఓల మీద ఆరోపణలు వస్తున్నా, తమకు అందుతున్న తాయిలాలతో తహసీల్దార్లు సైతం మిన్నకుండి పోతున్నారు. ఇసుక, ఇటుక, మట్టి... అన్నీ ఆదాయ మార్గాలే! కరీంనగర్ పూర్వ జిల్లాలోని మానేరు వాగులు, గోదావరి, దాని అనుబంధ నదుల్లో లభించే ఇసుకకు రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో జిల్లాల్లో ఉన్న ప్రైవేటు, టీఎస్ఎండీసీ ఆధీనంలోని ఇసుక రీచ్‌లను మూసేశారు. ప్రభుత్వ పనులకైనా, ప్రైవేటు పనులకైనా కాళేశ్వరం నుంచే ఇసుకను తీసుకోవాలనే నిబంధనలు విధించారు. నిర్ధేశించిన మొత్తానికి చలానా చెల్లించి ఇసుకను తెప్పించుకోవడం కష్టమవుతుండడంతో గ్రామాల్లోని ట్రాక్టరు యజమానులకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.2000 నుంచి 2,500 వరకు పలుకుతుండడంతో ట్రాక్టర్ యజమానులు రోజుకు పది ట్రిప్పుల వరకు ఇసుకను తోడేస్తున్నారు. దీనికి సహకరించినందుకు వీఆర్వోలకు రోజు వారీ మొత్తాలను సమర్పిస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. కరీంనగర్ శివార్లలోని ఇరుకుల్ల వాగులో రాత్రి వేళల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తోడేస్తున్నాయి. ఇసుక తవ్వడం కోసం ప్లొక్లెయినర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది రోడ్డున పోయే వారికి కనిపిస్తున్నా, స్థానిక వీఆర్వోలకు కాసులు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఘోరం ఏంటంటే ఇసుకను నింపుకున్న ట్రాక్టర్లు రాజీవ్ రహదారి మీద రాంగ్ రూట్లలో వస్తుండడం. కాగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన ఇటుక బట్టీలకు మట్టిని సమకూర్చే దందాల్లో కూడా వీఆర్వోలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్డగోలు దందాలకు అండగా ఉంటున్నారు. మరికొందరు వీఆర్ఓల లీలలు రామగిరి మండలం బుధవారం పేట(రామయ్య పల్లి)కు చెందిన దండ శ్రీనివాస్‌రెడ్డి, కొండపర్తి రాజమ్మలకు కలిపి ఆదివారంపేట శివారు సర్వే నెంబర్ 178లో 3.35 ఎకరాల భూమి ఉంది. కానీ వీరికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడంలో వీఆర్ఓల కిరికిరితో రైతుబంధు లబ్ధి రావడం లేదు. దీంతో ఆందోళనకు గురైన శ్రీనివాస్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతిచెందారు. ఇప్పటికీ వీఆర్ఓ గానీ, తహసీల్దార్ గానీ కనికరించలేదు. కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామస్తుడు పాలెపు బాలయ్య అనే రైతుకు పెగ్గెర్ల గ్రామ రెవెన్యూ పరిధిలో 4.15 ఎకరాల భూమి ఉంది. పాసుబుక్కుల్లో మాత్రం 1.04 ఎకరాలు అని ఉంది. తన భూమిని కొత్త పాసుబుక్కుల్లో ఎక్కించాలని ఏడాదిగా తిరుగుతున్న పట్టించుకునేవారు లేరని వాపోయారు. గ్రామంలోని అధికారులను అడిగితే సరిగా స్పందించలేదని, మండల కార్యాలయాలకు వెళ్లిన లాభం లేకుండా పోయిందన్నారు. అధికారుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయా. భూమి సమస్యలు ఎప్పుడు పరిష్కారిస్తారో నిరీక్షించాల్సి వస్తుందని వాపోయారు. ఏసీబీకి పట్టుబడిన ఇల్లందకుంట తహసీల్దార్ జమ్మికుంట పట్టణానికి చెందిన కొత్తూరి సమ్మిరెడ్డి ఇల్లందకుంట మండల కేంద్రంలో ఎకరం భూమి కొనుగోలు చేశాడు. సాదాబైనామా చేసేందుకు తహసీల్దార్ రవిరాజాకుమార్రావ్ రూ.2లక్షలు డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 8న వీఆర్ఏ రామకృష్ణతోపాటు తహసీల్దార్‌ను పట్టుకున్నారు. 2015లో ఉమ్మడి జమ్మికుంట అప్పటి తహసీల్దార్ రజిని, వీఆర్ఓ శ్రీనివాస్ దాదాపు 25 మంది రైతుల నుంచి రూ.కోటి పైగా డబ్బులు వసూలు చేశారని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అప్పటి ఏసీబీ సుదర్శన్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. విరాసత్‌లు, పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యూటేషన్లు చేయడానికి కనగర్తి, మాచనపల్లి, జగ్గయ్యపల్లి, గడ్డివానిపల్లితోపాటు పలు గ్రామాలకు చెందిన రైతుల నుంచి వీఆర్ఓ శ్రీనివాస్‌తో కలిసి తహసీల్దార్ రజని డబ్బులు తీసుకున్నారు. 2015 మే 31న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు చేయగా నేరం అంగీకరించారు. రెండేళ్లపాటు శిక్ష అనుభవించడంతోపాటు విధుల నుంచి తొలగించారు. ఏడాదిగా తిరుగుతున్నా.. వేములవాడ రూరల్: నా పాస్‌బుక్‌పై నా ఫొటోకు బదులు మా అన్న ఫొటో వచ్చింది. దీనిని మార్చాలని గత సంవత్సరంగా తిరుగుతున్నా. అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి అధికారులను వేడుకున్నా కనికరించడం లేదు. నాలాంటి వారు ప్రతిరోజు చాలా మంది వస్తున్నారు. – ఎడపెల్లి పర్శరాం, రైతు, గ్రామం: చెక్కపల్లి, మం: వేములవాడ -
గురుకుల నియామకాల్లో ‘ఔట్సోర్సింగ్’ అవినీతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష వరకు వసూలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది. -
నేతల మేత.. నాణ్యతలో కోత
సాక్షి, బొమ్మలసత్రం(నంద్యాల ): టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో నిధులను అడ్డంగా కొల్లగొడుతున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. చివరకు పేదల వైద్యానికి ఉద్దేశించిన వాటినీ వదలడం లేదు. ‘పనులు ఎలాగైనా చేసుకోండి.. మా కమీషన్లు మాకు ఇవ్వాల్సిందే’ అంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఫలితంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ప్రతిరోజూ 1,200 మంది దాకా ఔట్ పేషెంట్లు (ఓపీ) ఉంటారు. ప్రస్తుతం ఓపీ విభాగానికి ప్రత్యేక భవనం లేదు. ఆసుపత్రిలోనే ఓ మూలన కౌంటర్లు ఏర్పాటు చేసి..చీటీలు ఇస్తున్నారు. ప్రజలు ఎండలోను, చెట్ల కింద వేచివుండి ఓపీ చీటీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీ విభాగం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ద్వారా రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు గతేడాది జులైలో శంకుస్థాపన చేశారు. 20 శాతం కమీషన్లు! పేద రోగుల శ్రేయస్సు దృష్ట్యా భవన నిర్మాణాన్ని అత్యంత నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. అయితే..అధికార పార్టీ నేతల కక్కుర్తితో పనులు నాణ్యతగా జరగడం లేదు. ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 20 శాతం మేర కమీషన్లు దండుకున్నట్లు సమాచారం. ఆసుపత్రికి చెందిన ఓ ఇంజినీర్ మధ్యవర్తిగా వ్యవహరించి కాంట్రాక్టర్ నుంచి ముడుపులు ఇప్పించినట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లలో 20 శాతం అంటే రూ.కోటి ముడుపులు ముట్టజెప్పిన సదరు కాంట్రాక్టర్ పనులను ఎలా పూర్తి చేయాలో దిక్కుతోచని స్థితిలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే పాడవుతోంది! నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 2016లో మాతాశిశు వైద్యశాల భవనాలను రూ.15 కోట్లతో నిర్మించారు. అప్పుడు కూడా నేతల కమీషన్లు, అధికారుల స్వార్థం కారణంగా పనుల నాణ్యతకు పాతరేశారు. స్వయాన సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ భవనం మూడేళ్లు కూడా గడవకముందే దెబ్బతింటుండడం గమనార్హం. భవనం చుట్టూ భూమి కుంగిపోయి.. టైల్స్ విరిగిపోతున్నాయి. దాదాపు అడుగు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. బిల్డింగ్ గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకోవడం శోచనీయం. మాతాశిశు వైద్యశాల భవనం నిర్మించి మూడేళ్లు పూర్తి కాక ముందే బీటలు వారింది. ఇది చాలదని ఓపీ బిల్డింగ్ పనుల్లోనూ చేయి పెట్టారు. ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న పనుల నాణ్యతపై ఉన్నతస్థాయి అధికారులు విచారణ చేపట్టాలి. – ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, నంద్యాల నాసిరకంగా నిర్మిస్తున్నారు మాతాశిశు వైద్యశాల నిర్మించి మూడేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే భవనం చుట్టూ మట్టి దిగబడి పోయి టైల్స్ ఊడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. నూతనంగా నిర్మిస్తున్న ఓపీ బిల్డింగ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాసిరకం సిమెంటు , ఇసుక, కంకర వేసి పిల్లర్లు నిర్మిస్తున్నా.. కాంట్రాక్టర్‌ను అధికారులు ప్రశ్నించటంలేదు. – సద్దాం హుస్సేన్, సీపీఎం మండల కార్యదర్శి, నంద్యాల -
అవినీతి కార్పొరేషన్..కమీషన్ ఇస్తేనే బిల్లులకు మోక్షం
సాక్షి, నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్న్లున్నాయి. ఆయా డివిజన్లలో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలుస్తుంది. ఆ నిర్మాణాలను నిబంధనల ప్రకారం, నాణ్యతా ప్రమాణాలతో చేయించాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ విభాగం అధికారులది. సదరు విభాగంలో ఇంజినీరింగ్ సూపరింటెండెంట్, ముగ్గురు ఈఈలు, ఐదుగురు డీఈలు, 12 మంది ఏఈలు, 60 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్లు ముందస్తుగా నిర్ణయించారని ఓ కాంట్రాక్టర్ తెలిపారు. కమీషన్ ఇవ్వకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. వారికి తప్పనిసరి.. కాంట్రాక్టర్ ఏదైనా రోడ్డు, కాలువ నిర్మాణాలు చేపట్టాలంటే అధికారులతోపాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఇన్చార్జి లకు సైతం కమీషన్లు ఇవ్వాల్సిందే. వారి డివిజన్లలో పనులు చేయాలంటే తప్పనిసరిగా ఐదుశాతం ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. కమీషన్ ఇవ్వకపోతే నాణ్యత లేదంటూ కుంటిసాకులు చెబుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఓ వైపు అ«ధికారులు, మరో అధికార పార్టీ నేతలకు కమీషన్లు ఇవ్వడంతో పలువురు నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. కాగా ఇంజినీరింగ్ అధికారుల నుంచి సంతకాలు పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు విషయం అకౌంట్స్ విభాగంలో ఉంటుంది. దీంతో అకౌంట్స్ విభాగంలోని ఓ అధికారికి ఒక శాతం, ఎగ్జామినర్‌కు ఒక శాతం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. ఆ విభాగంలోని ఓ అటెండర్ కూడా కాంట్రాక్టర్ వద్ద నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది. పెట్రోల్, డీజిల్లోనూ.. కార్పొరేషన్ పరిధిలో చెత్తాచెదారాలు తరలించేందుకు వాహనాలు కుక్కలగుంటలోని వెహికల్ షెడ్లో పెట్రోల్, డీజిల్‌ను నింపుకోవాల్సి ఉంది. అయితే స్థానిక ఏఈ ఆంజనేయులరాజు (గురువారం ఏసీబీ దాడిలో పట్టుపడ్డ వ్యక్తి) ట్రిప్పులు ఎక్కువ తిరిగినట్లు లెక్కలు చూపి పెట్రోల్, డీజిల్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిరోజూ 4 లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు తప్పుడు లెక్కలు చూపుతున్నారని సమాచారం. ఏసీబీ దాడిలో ఆంజనేయులు పట్టుపడ్డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల కార్లకు సైతం ఈ షెడ్ నుంచి డీజిల్‌ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. నిబంధనల ప్రకారం అధికారుల వాహనాలకు ఇక్కడ డీజిల్ పట్టకూడదు. లంచం డిమాండ్ నగరపాలక సంస్థ అధికారులు 18 ట్రాక్టర్ల ద్వారా పలు ప్రాంతాల్లోని ప్రజలను తాగునీరు అందిస్తున్నారు. సదరు ట్రాక్టర్లు రోజూ సుమారు 97 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఒక్కో ట్రిప్పునకు రూ.435 చెల్లిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో నాలుగు నుంచి 8 ఎనిమిది ట్రిప్పులు తిరగాలి. అయితే కొందరు ట్రిప్పులు తక్కువ నగదు స్వాహా చేస్తున్నారు. అధికారులు వారి నుంచి నగదు తీసుకుని పట్టించుకోవడంలేదు. కొందరు సక్రమంగా ట్రిప్పులు వేసినా అధికారులు బిల్లులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారు. ఇవిగో అక్రమాలు + నెల్లూరు మైపాడుగేట్ సెంటర్లో రూ.50 లక్షల వర్క్‌కు సంబంధించి రెండు శాతం కమీషన్ చెల్లించాలని ఓ అధికారి కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్ తనకు నష్టం వచ్చిందని చెప్పినా అధికారి పట్టించుకోలేదు. నగదు తీసుకున్నాకే సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. + బారాషహిద్ దర్గాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఈ క్రమంలో ఓ అధికారి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఉన్నతాధికారి పేరు చెప్పి మరో రూ.లక్ష కూడా వసూలు చేసినట్లు ప్రచారంలో ఉంది. + గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై కార్పొరేషన్‌కు వచ్చిన ఓ అధికారి ఒకటో డివిజన్ నుంచి ఐదో డివిజన్ వరకు విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తాను కూడా పనుల్లో భాగం తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ వర్గాల సమాచారం. రూ.10 లక్షల పనిలో ఏఈ కూడా రూ.5 లక్షలు భాగంతో పనులు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. దీంతో ఆయా పనుల్లో నాణ్యతను పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. + ఇంజినీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ఫిట్టర్లకు డివిజన్ కేటాయింపుల్లో చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద రూ.10 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు కొందరు చెబుతున్నారు. నగదు తీసుకుని ఓ ఫిట్టర్‌కు డివిజన్ కేటాయించకపోవడంతో అతను అధికారి వ్యవహారం బట్టబయలు చేశాడు. ఈ విషయం కార్పొరేషన్లో కలకలం రేపింది. అవినీతిపరులకు కీలక బాధ్యతలు మంత్రి నారాయణ అవినీతిపరులైన కొందరికి కార్పొరేషన్లో అధికార ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఓ మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్పై ఏసీబీ దాడి చేసింది. వారు భారీగా అక్రమాస్తులు కుడబెట్టారనే విషయాన్ని గుర్తించింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ ఉత్తర్వులు జారీచేశారు. అలాంటి వారికి మంత్రి నారాయణ కార్పొరేషన్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఓ అధికారిని పారిశుద్ధ్య ం మెరుగుపరిచేందుకు ప్రత్యేకాధికారిగా మౌఖిక ఆదేశాలతో నియమించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు నెల్లూరు కార్పొరేషన్లో బాధ్యతలు ఇవ్వకూడదని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతను మంత్రి ద్వారా మేయర్ పేషీలో కీలక స్థానం సంపాదించాడు. దీంతో కార్పొరేషన్‌లోని ఉద్యోగులు అవినీతిపరులకు ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నగరపాలక సంస్థలో వసూల్ రాజా..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ప్రతి పనికీ ఓ రేటు విధించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో అతిడిని విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లుగా నగరంలోని ఓ లాడ్జీలో ఉంటూ అవినీతి దందాను కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. గతేడాది జూలై 22న, అక్టోబర్ ఒకటిన ¯ðనెల్లూరు నగరం 25వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, ఇందిరమ్మ కొత్తకాలనీ, కనుపర్తిపాడు ఎస్సీ, బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు మూడు వర్క్ఆర్డర్లు సురేంద్రరెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశారు. కాలపరిమితి ముగియడంతో నీటి సరఫరా తాలూకా రూ.2,63,250 బిల్లు అతడికి రావాల్సి ఉంది. దీంతో ఆయన అదే ఏడాది డిసెంబర్లో పలుమార్లు ఎంబుక్‌ల్లో పనులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్సప్లై, రోడ్స్ విభాగం ఏఈ బీఎస్ ఆంజనేయులరాజును కోరారు. ఏఈ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. సురేంద్రరెడ్డి గతేడాది డిసెంబర్ 27న దుబాయిలో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఏఈని వివిధ ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు కుక్కలగుంటలోని కలరా హౌస్‌లోని వెహికల్స్ డిపో విభాగానికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సురేంద్రరెడ్డి దుబాయి నుంచి తిరిగి వచ్చి బిల్లుల విషయమై ఏఈని కలిసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడినుంచి ఏఈని వేరే విభాగానికి మార్చాడని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన బాధితుడు ఏఈని కలిసి బిల్లుల విషయమై మాట్లాడాడు. ఎంబుక్‌లు అతని వద్దనే.. ఏఈ వేరే విభాగానికి మారినా సురేంద్రరెడ్డి పనులకు సంబంధించిన ఎంబుక్స్ అతని వద్దనే ఉన్నాయి. పనులు తాలూకా వివరాలను ఎంబుక్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు ఏఈ పంపాల్సి ఉంది. అందుకు గానూ రూ.30 వేలు ఇవ్వాలని ఏఈ సురేంద్రరెడ్డిని డిమాండ్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నానని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. ఈనెల రెండో తేదీన సురేంద్రరెడ్డి మరోమారు ఏఈని కలిసి ప్రాధేయపడ్డాడు. అయినా అతను కనికరించకపోగా రూ.30 వేలు ఇస్తేనే ఎంబుక్‌లను ఉన్నతాధికారులకు పంపుతానని తేల్చిచెప్పాడు. నాలుగైదురోజుల్లో నగదు ఇస్తానని చెప్పి బాధితుడు అక్కడినుంచి వచ్చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అదేరోజు నెల్లూరు ఏసీబీ డీఎస్సీ సీహెచ్‌డీ శాంతోను కలిసి ఏఈపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు, ఏఈతో మాట్లాడిన ఆడియో సంభాషణలకు సంబంధించిన సీడీలను డీఎస్పీకి అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు రూ.30 వేలు ఇస్తానని ఏఈకి తెలిపారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత గురువారం ఉదయం ఏఈ (కలరా హాస్‌లోని తన కార్యాలయంలో) రూ.30 వేలు సురేంద్రరెడ్డి వద్ద నుంచి లంచం తాలుకా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఏఈకి రసాయన పరీక్షలు నిర్వహించారు. బీరువాలో ఉన్న ఎంబుక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ లంచం తీసుకున్న వైనం ఇదిలా ఉండగా సురేంద్రరెడ్డికి గతంలో రూ.8.40 లక్షలకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎంబుక్‌లో వివరాలు నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపేందుకు ఇదే ఏఈ బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకున్నట్లు ఏబీబీ అధికారులు పేర్కొన్నారు. ఇలా పలువురి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఏఈ ముక్కుపిండి వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎవరి ప్రమేయం ఉంది? అక్రమ వసూళ్లలో తనతోపాటు ఉన్నతాధికారులకు వాటా ఉందని సదరు ఏఈ ఏసీబీ అధికారుల ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధమైయ్యారు. ఓ డీఈ అక్రమ వసూళ్లలో భాగస్తుడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. సదరు డీఈపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తాజాగా పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏఈ అరెస్ట్ అవినీతి ఏఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. మామూళ్ల వెనుక ఉన్నతాధికారుల ప్రమేయంపై అతడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శుక్రవారం ఏఈని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ శాంతో, ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐదున్నరేళ్లుగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బీఎస్ ఆంజనేయులరాజు 2013 జూలైలో నెల్లూరు నగరపాలక సంస్థలో ఏఈగా బాధ్యతల్లో చేరాడు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆయన కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారు. గతంలో వాటర్ సప్లై, రోడ్స్ విభాగంలో పనిచేశారు. ఈక్రమంలోనే పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అతడిపై పలు ఆరోపణలు వినిపించడంతో మూడునెలల క్రితం కలరా హౌస్‌లోని మున్సిపల్ వెహికల్స్ డిపోకు మార్చారు. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్లను బెదిరించి వారి వద్దనుంచి సంతకాలను తీసుకుని డీజిల్ డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఏసీబీ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. కాగా సదరు ఏఈ నగరపాలక సంస్థలో చేరిన నాటినుంచి బృందావనంలోని లాడ్జీలో ఉంటున్నాడు. అనధికార కార్యకలాపాలను లాడ్జీ నుంచే నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు. -
రాజధానికి చేరిన హౌసింగ్ అవినీతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హౌసింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని, కాకినాడలో జరుగుతున్న మోసాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నగరానికి చెందిన ముంత నళినికుమారి అనే మహిళ యత్నించింది. ఇల్లు మంజూరైందని చెప్పి రెండు విడతలుగా రూ.లక్ష కట్టించుకుని తీరా ఇల్లు లేదంటూ చేతులేత్తేశారని చెప్పుకునేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆమెకు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా అడ్డు తగులుతుండటం, ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా కరుణించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవడమే కాకుండా అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కాకినాడ నగరంలో చోటుచేసుకున్న హౌసింగ్ అక్రమాలు రాజధానివేదికగా బట్టబయిలైనట్టయింది.ఒక్క నళినీయే కాదు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఇటువంటి బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తొలి నుంచీ ‘సాక్షి’ చెప్పుకొస్తూనే ఉంది. ఇల్లు మంజూరు చేస్తామని ముడుపులు తీసుకొని, మంజూరైందని చెప్పి రూ.లక్షల్లో కట్టించుకుని, తీరా మంజూరు కొచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో సొంతింటికల నెరవేరుతుందన్న ఆశతో ఏళ్ల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్న పేదలకు నిరాశ ఎదురవ్వడమే కాకుండా ముడుపులు ముట్టజెప్పి మోసపోయిన పరిస్థితి ఏర్పడింది. ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకం కింద జిల్లా కేంద్రం కాకినాడకు సుమారు 4,600 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఎంతో కాలంగా సొంతింటికోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు సొంత గూడు వస్తుందని ఆశ పడ్డారు. అయితే, అధికార పార్టీ నేతలు వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని కాకినాడకు కేటాయించిన ఇళ్లను వాటాలు వేసేసుకున్నారు. ఒక్కొక్కరికీ 50 నుంచి 100 అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు తలో కొన్ని పంచేసుకున్నారు. పంపకాలు జరగడమే తరువాయి తమ కోటా కింద వచ్చిన ఇళ్లను అమ్మకాలకు పెట్టారు. అప్పటికే ఇళ్లు లేదని దరఖాస్తులు చేసుకున్న వారితో బేరసారాలు సాగించారు. ఒక్కో ఇంటికి రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుని ఇళ్లు మంజూరు చేస్తామని మభ్య పెట్టారు. అంతటితో ఆగకుండా లబ్ధిదారుల నుంచి రూ. 25 వేలు చొప్పున తొలి విడతగా, రూ.75 వేలు చొప్పున రెండో విడతగా కట్టించుకున్నారు. అయితే, కాకినాడ కార్పొరేషన్‌కు తొలి విడతగా 1105 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువ...మంజూరైనవి తక్కువ కావడంతో పోటీని చూపించి మళ్లీ ముడుపులకు డిమాండ్ చేశారు. సొంతింటి కల నెరవేరుతుందని నేతలు చెప్పినట్టుగా అడిగినంతా ముట్టజెప్పారు. ఎమ్మెల్యే ఇంటిని అడ్డాగా చేసుకుని రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ ముడుపులు తీసుకొని ఇల్లు మంజూరు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో లబ్ధిదారులు లబోదిబోమన్నారు. పోనీ ముడుపులు తీసుకున్నా అందరికీ ఇళ్లు మంజూరు చేయలేదు. చాలా మంది లక్షలాది రూపాయలు ముట్టజెప్పినా ఇల్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పులు చేసి కట్టిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవకపోయినా సొంతింటి కోసం అక్కడా ఇక్కడా అప్పులు చేశామని, తీరా ఇళ్లు రాలేదని వారంతా ఆవేదన చెందడమే కాకుండా రోడ్డెక్కుతున్నారు. అప్పులు భరించలేక ఏదో ఒకటి చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరు కాకినాడ డెయిరీ ఫారమ్‌కు చెందిన ముంత నళినికుమారి. రాజీవ్ గృహ కల్పలో 175ఎఫ్4లో అద్దెకుంటున్నారు. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నిరుపేదైన నళిని కుమారికి ఎముకలకు సంబంధించిన వ్యాధితోపాటు నరాల బలహీనతతో కుడి చేతి వేళ్లు వంకరపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈమె ప్రభుత్వం ఇస్తుందనుకున్న సొంతింటి కోసం రూ.25 వేలు ఒకసారి, రూ.75 వేలు మరోసారి డీడీ కట్టారు. సీ10/55 సెకండ్ ఫ్లోర్లో ఇల్లు వచ్చిందని కూడా అటు మున్సిపల్ ఆఫీసులోనూ, ఇటు ఎమ్మెల్యే ఆఫీసులోనూ చెప్పారు. కానీ ఇప్పుడు తనకే నెంబర్ ఇల్లు రాలేదని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి కడితే ఇప్పుడు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆందోళనకు లోనయ్యారు. అటు ఎమ్మెల్యే కార్యాలయం, ఇటు మున్సిపల్ అధికారులు ఎంత బతిమిలాడినా స్పందించకపోవడంతో ఏకంగా అమరావతికి వెళ్లి సీఎంను కలిసి తన గోడు చెప్పుకుందామని భావించారు. ఆమేరకు గత మూడు రోజులుగా సీఎం కార్యాలయానికి వెళ్తుండగా అక్కడి అధికారులు అవకాశం ఇవ్వలేదు. శుక్రవారం కూడా ఉదయం 6 గంటల నుంచి సీఎం కార్యాలయం వద్ద నిరీక్షించగా ఏ ఒక్కరూ స్పందించలేదు సరికదా లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఈమె ఎండలో నిరీక్షించి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికుల సాయంతో అసుపత్రికి తరలించారు. దీని ప్రకారం కాకినాడ కార్పొరేషన్లో హౌసింగ్ గోల్మాల్ ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతోంది. నేటికీ కొలిక్కిరాని డీడీల కుంభకోణం... సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో అప్పులు చేసి పుస్తెలమ్మి రూ.25వేలు చొప్పున కార్పొరేషన్‌కు ఇచ్చిన డీడీలు గల్లంతైన వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు. కొంతమంది కార్పొరేషన్ అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతలు కుమ్మక్కై డీడీలను స్వాహా చేసేశారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లతో నిజనిర్ధారణ కమిటీ వేసినప్పటికీ అధికారులు సహకరించలేదు. డీడీలు గల్లంతైనట్టు తేలినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా బుట్టదాఖలు చేశారు. డీడీల తీగ బయటికిలాగితే పచ్చనేతల బాగోతం మరింత బయటపడనుంది. -
నిజాయితీపరులకు చౌకీదార్‌ను: మోదీ
కురుక్షేత్ర: దేశంలో అవినీతిని అంతం చేసేం దుకు తమ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అవినీతిపరులకు తనతో సమస్య ఉందన్న ఆయన.. నిజాయితీపరులు మాత్రం కాపలా దారు (చౌకీదారు)గా తనను నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చ డంలో గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించే కార్యక్రమం ‘స్వచ్ఛ్‌శక్తి–2019’ మంగళవారం కురుక్షేత్రలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. హర్యానాలోని అవినీతిపరులపై ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తులతో కొందరు కలవరం చెందుతున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని కల్తీ కూటమి (మహా మిలావత్)గా అభివ ర్ణించిన ఆయన.. ‘కల్తీ కూటమిలోని నేతలంతా కలిసి కోర్టులను, మోదీని, దర్యాప్తు సంస్థలను దూషించడం, బెదిరించడంలో పోటీలు పడు తున్నారు. కానీ, ఈ చౌకీదారు వారి దూష ణలు, బెదిరింపులకు అదరడు బెదరడు, ఆగ డు, లొంగడని మీకు తెలుసు. దేశానికి పట్టిన అవినీతి మరకలు, బురదను తొలగించే శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. అందుకు మున్ముందు కూడా మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రధాని మోదీ కోరారు. -
మున్సిపాలిటీ సిబ్బంది అవినీతి బాగోతం
సాక్షి, వనపర్తి: ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదని కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై విసుగు చెంది ఏకంగా వీడియో రూపంలో పలు గ్రూపుల్లో బుధవారం పోస్టు చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోటకు చెందిన హన్మంతుకు కృష్ణ, కర్ణ, రాములు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. హన్మంతుకు స్థానిక విద్యానగర్‌లోని భారతీ విద్యామందిర్ పాఠశాల సమీపంలో 14–14, 14–15 అనే నంబర్లపై ఇల్లు ఉంది. ఇటీవల తన ఇంటిని ముగ్గురి కుమారుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు. కుమారుల్లో ఒకరైన రాము 3 నెలల క్రితం ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సమర్పించి ముగ్గురు అన్నదమ్ములపై ఇంటి నంబర్లను మార్చాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పేర్లు మార్చడంతోపాటు మరో కొత్త ఇంటి నంబరు ఇచ్చేందుకు రూ.3 వేలు లంచం ఇవ్వాలంటూ బిల్ కలెక్టర్ భాస్కర్, జూనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ అడిగారని, దీంతో బిల్ కలెక్టర్ భాస్కర్‌కు రూ.వెయ్యి ఇచ్చినా సరిపోలేదని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితుడు రాము ఆరోపించారు. తమ తండ్రిపై ఉన్న సొంత ఇంటిని కుమారుల పేరుపై మార్చుకునేందుకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ రుసుం చెల్లించామని, లంచం ఇచ్చుకోలేమని ఎన్నిమార్లు చెప్పినా వారిద్దరూ వినిపించుకోలేదని రాము వాపోయారు. దీంతో బుధవారం ఏకంగా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వాట్సప్ ద్వారా కోరిన వీడియో కలకలం రేపింది. ఈ విషయమై కొత్తకోట మున్సిపాలిటీ కమిషనర్ కతలప్పను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. సిబ్బంది లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధితుడు రాము -
అప్పుల ఊబి నుంచి రైతుల్ని బయటపడేశాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.24 వేల కోట్ల విలువగల రైతుల రుణాల్ని మాఫీ చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక చర్య ద్వారా రైతులను విజయవంతంగా అప్పుల ఊబి నుంచి బయటపడేసినట్లు గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ చెప్పారు. బుధవారం అసెంబ్లీ హాల్లో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. గత నాలుగున్నరేళ్లలోరుతుపవనాలు అనుకూలంగా లేనప్పటికీ రాష్ట్రంలో ఒక్క రైతూ ఆత్మహత్యకు పాల్పడలేదని తెలిపారు. రుణమాఫీ తుది వాయిదాను రెండు వారాల్లోగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయంలోని కీలకాంశాలపై నిరంతరాయంగా దృష్టి పెట్టడంవల్ల గడచిన నాలుగున్నరేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో స్థూల విలువ జోడింపు దాదాపు(97 శాతం మేరకు జీవీఏ) రెట్టింపు అయ్యిందన్నారు. రాష్ట్రంలోని 62 శాతం జనాభా ఇంకా ప్రాథమిక రంగంపై ఆధారపడుతున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ రంగాలకోసం నాలుగేళ్ల బడ్జెట్లో రూ.81,554 కోట్లను కేటాయించడమేగాక ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి లేని ప్రకృతిసేద్యాన్ని భారీఎత్తున చేపట్టిందన్నారు. 2016–17లో పెట్టుబడి లేని ప్రకృతి సాగు(జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్–జెడ్బీఎన్ఎఫ్)ను 40,656 మంది రైతులకు వర్తింపచేసినట్లు తెలిపారు. 2018–19లో ఇది 5.23 లక్షలుగా ఉందన్నారు. ప్రతి కుటుంబం నెల ఒక్కింటికి రూ.పదివేల ఆదాయాన్ని ఆర్జించేలా చేయడానికి పశుగణ రంగం కింద పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో వృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు... ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న వాగ్దానాలు, కేంద్రం ఇచ్చిన హామీలను నాలుగున్నరేళ్లలో నెరవేర్చలేదని గవర్నర్ చెప్పారు. నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తక్కువ తలసరి ఆదాయంతో ఇబ్బంది పడుతోందన్నారు. భారీ రెవెన్యూలోటును భర్తీ చేయకపోవడం, విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తుల్ని సక్రమంగా పంచకపోవడం, జనాభా ప్రాతిపదికన రుణ బాధ్యతలను పంచడం, 58.32 శాతం జనాభా ఉన్న నూతన రాష్ట్రానికి.. అంచనా వేసిన ఉమ్మడి రాష్ట్ర రాబడుల్లో 46 శాతాన్ని మాత్రమే పంచడం వంటివి ఈ కష్టాలను తీవ్రతరం చేశాయని పేర్కొన్నారు. వినియోగ ధ్రువపత్రాల(యూసీలు) సమర్పణను నీతిఆయోగ్ ధ్రువీకరించినప్పటికీ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల్లో 2017–18 సంవత్సరానికి అభివృద్ధి పనులకోసం రాష్ట్ర ఖజానాకు జమ చేసిన రూ.350 కోట్ల నిధులను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియకు ప్రధాన అవరోధంగా నిలిచిందని చెప్పారు. కేంద్రం నుంచి మద్దతు లేనప్పటికీ గత నాలుగున్నరేళ్లల్లో అన్ని రంగాల్లో సాధించిన సాఫల్యతలు, అన్ని ప్రతికూలతలను రాష్ట్రం అధిగమించి మార్గదర్శిగా నిలిచిన తీరు కొనియాడదగినదేగాక.. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం తోడ్పాటు అందించకపోయినప్పటికీ రాష్ట్ర వృద్ధి తీరు సగటున 10.66 శాతంగా ఉందని చెప్పారు. పరిపాలనలో పారదర్శకత... అవినీతి రహిత పరిపాలన అందించడానికి, జవాబుదారీతనం, పారదర్శకతగల వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు. నూతన ప్రభుత్వ ఆకాంక్షల్ని పేర్కొంటూ గుర్తించిన అంశాలపై శ్వేతపత్రాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న సంతృప్తే పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచిందని తెలిపారు. ప్రస్తుతమున్న రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా ఈబీసీ కోటా కింద కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఇతరులకు 5 శాతం కేటాయించినట్లు చెప్పారు. వెనుకబడిన వర్గాల సంక్షేమంకోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చేనేతకారుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం రూ.1,004 కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ప్రతి డ్వాక్రా సభ్యురాలికి రూ.పదివేలు సాయం.. మహిళా సాధికారత విషయంలో అధిక ఆర్జన జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టేందుకు స్వయం సహాయకబృంద (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు వీలు కల్పిస్తూ, ప్రతి ఎస్‌హెచ్‌జీ సభ్యురాలికి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి పసుపు–కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రూ.8,604 కోట్ల వ్యయంతో ఈ పథకం కింద 86,04,304 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో ఇతర అంశాలివీ.. - ఆంధ్రప్రదేశ్ ర్యాంక్, ప్రదర్శనలో గణనీయమైన మెరుగుదలను జాతీయ సాధన సర్వే నమోదు చేసింది. 10వ తరగతి మేథమేటిక్స్‌లో రాష్ట్రం ప్రదర్శన ప్రథమ స్థానంలోనూ, అన్ని సబ్జెక్టులలో మొత్తంగా ప్రదర్శన తీరు ద్వితీయస్థానంలో ఉంది. మనబడి, బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాల ద్వారా డ్రాపవుట్ రేట్లను తగ్గించాం. - జలవనరుల రంగంలో ఐదేళ్లలో రూ.64,333.62 కోట్లు ఖర్చు చేశాం. స్థిరీకరణతో కలుపుకుని 32.02 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సాగునీటి సదుపాయాలను కల్పించాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యమిచ్చి రూ.15,585.17 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే ఖరీఫ్ సీజన్లో గ్రావిటీద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించాం. 2019 చివరికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించాం. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గడిచిన 4 పంట కాలాల్లో 263 టీఎంసీల గోదావరి జలాల్ని మళ్లించి కృష్ణా డెల్టాలోని పంటను రక్షించాం. - ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం కేంద్రప్రభుత్వం వాగ్దానాన్ని నెరవేర్చనందువల్ల బాధపడి ప్రభుత్వం సొంతంగా కడపలో ఏకీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని నిర్ణయించి భూమిపూజ పూర్తి చేశాం. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రోకెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంద్వారా ఐదు లక్షలమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం శ్రద్ధతో ఉంది. - అమరావతిలో మౌలిక సౌకర్యాల నిర్మాణం కోసం మొత్తం రూ.1.09 లక్షల కోట్లు అవసరం. ఇందులో మొదటి దశలో వ్యయం రూ.51,687 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాం. రూ.39,875 కోట్ల విలువ చేసే వివిధ పనులు జరుగుతున్నాయి. జాతిపితకు నివాళి గవర్నర్ ప్రసంగం అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఉభయ సభల సభ్యులంతా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. -
వైకుంఠపురంలో అవినీతి వరద
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవినీతి పరంపరలో తాజాగా వైకుంఠపురం బ్యారేజీ పనులు చేరాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడటానికి ముందే ఆ బ్యారేజీ పనుల్లో రూ. 550 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి వ్యూహం రచించారు. చంద్రబాబుకు కోట్లాది రూపాయలు కురిపించిన పట్టిసీమ ప్రాజెక్టు టెండర్ల వ్యూహాన్ని కృష్ణానదిపై నిర్మించే వైకుంఠపురం బ్యారేజీలోనూ అవలంబించి మళ్లీ వందల కోట్లు వెనకేసుకోనున్నారు. నిజానికి జీవో 94 ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ (ఎక్సెస్)కు కోట్ చేస్తే టెండర్లు రద్దు చేయాలి. కానీ, ఆ నిబంధనను సడలించి ఐదు శాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూళ్లు కోట్ చేసేలా వైకుంఠపురం బ్యారేజీ పనులకు ఈనెల 21న సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4లోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. 5న టెక్నికల్ బిడ్, 7న ఫైనాన్షియల్ బిడ్ తెరిచి టెండర్ ఖరారు చేయనున్నారు. 24.99 శాతం ఎక్సెస్‌కు నవయుగ షెడ్యూళ్లు దాఖలు చేసేందుకు చంద్రబాబుకు ఆ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. 4.99 శాతం ఎక్సెస్.. రెండేళ్లలో పనులు పూర్తి చేస్తే 20 శాతం ‘బోనస్’ (ఆర్నెల్లకు ఐదు శాతం చొప్పున) ఇచ్చేలా షరతులు పెట్టి కేబినెట్లో ఆమోదముద్ర వేసేలా స్కెచ్ వేశారు. ఆ వెంటనే కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి పట్టిసీమ తరహాలోనే కమీషన్లు వసూలు చేసుకోనున్నారు. ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల 4న ‘వైకుంఠపురంలో పట్టిసీమ వ్యూహం’ శీర్షికన కథనం ప్రచురించింది. మూడుసార్లు టెండర్లు రద్దు రాజధాని నగర నీటి అవసరాల కోసం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించ తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పనులకు రూ. 801.8 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది జూలై 9న ఎల్ఎస్ (లంప్సమ్)–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను నవయుగ సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ముందే నిర్ణయించడంతో.. ఇతరులెవరూ షెడ్యూళ్లు దాఖలు చేయడానికి సాహసించలేదు. అయితే ఆ ధరలు తమకు గిట్టుబాటు కావంటూ నవయుగ కూడా షెడ్యూళ్లు దాఖలు చేయలేదు. కాంట్రాక్టర్ సూచనల మేరకు.. అంచనా వ్యయాన్ని పెంచాలని జలవనరుల శాఖపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా బ్యారేజీ పనులతోపాటు రాజధానికి 10 క్యూమెక్కుల నీటిని తరలించే పథకాన్ని కలిపి ఒకే ప్యాకేజీ కింద రూ.1025.98 కోట్లకు అంతర్గత అంచనా వ్యయం (ఐబీఎం–ఇంటర్నల్ బెంచ్ మార్క్)ను పెంచేసి ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో గతేడాది ఆగస్టు 31న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉన్నందున ఆ అంచనా వ్యయం కూడా గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ తేల్చిచెప్పడంతో ఆ టెండర్లను కూడా రద్దు చేశారు. దాంతో ఐబీఎంను రూ.1075.15 కోట్లకు పెంచి గతేడాది అక్టోబర్ 25న మూడోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. దీనికి కూడా కాంట్రాక్టర్ సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టెండర్లను రద్దు చేశారు. నాలుగో సారి.. పట్టిసీమ వ్యూహం వైకుంఠపురంలో కమీషన్లు భారీగా దండుకోవడానికి చంద్రబాబు ‘పట్టిసీమ’ వ్యూహాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐబీఎంను రూ. 1,459 కోట్లకు పెంచేలా చేశారు. ఈనెల 21న నాలుగో సారి ఈపీసీ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. 24.99 శాతం ఎక్సెస్‌కు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కాంట్రాక్టర్‌కు సూచించారు. ‘ఐదు శాతం కంటే ఎక్సెస్’ నిబంధనలను సడలించారు. పట్టిసీమ ఎత్తిపోతల్లో 21.99 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. 5 శాతం ఎక్సెస్.. ఏడాదిలోగా పూర్తి చేస్తే 16.99 శాతం బోనస్ ఇచ్చేలా షరతు విధించి ఆ టెండర్‌ను కేబినెట్లో ఆమోదించారు. అదే వ్యూహాన్ని వైకుంఠపురం బ్యారేజీ టెండర్లలోనూ అనుసరించారు. నవయుగ మాత్రమే టెండర్ దాఖలు చేస్తే.. నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. అందువల్ల నవయుగతో పాటు మరో కోటరీ సంస్థతో టెండర్ దాఖలు చేయించేందుకు అనుగుణంగా నిబంధనలు మార్చారు. రెండు సంస్థల మధ్య సీఎం చంద్రబాబు కుదిర్చిన ఒప్పందం మేరకు నవయుగ 24.99 శాతం ఎక్సెస్.. కోటరీ సంస్థ 26 శాతం ఎక్సెస్‌కు షెడ్యూళ్లు దాఖలు చేయాలి. దీంతో ఎల్–1గా నిలిచే నవయుగకే పనులు కట్టబెట్టనున్నారు. వ్యయం 8 వందల కోట్ల నుంచి 18 వందల కోట్లకు అంచనా వ్యయాన్ని రూ. 801.88 కోట్ల నుంచి రూ. 1,459 కోట్లకు పెంచేశారు. దీనికి తోడు 24.99 శాతం ఎక్సెస్ అంటే.. మరో రూ. 364.60 కోట్లు పెరుగుతుంది. దీంతో మొత్తం పనుల ఒప్పందం విలువ రూ.1,823.6 కోట్లకు చేరుతుంది. పనుల అంచనా వ్యయం రూ. 1,021 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇందులో రూ. 550 కోట్లకుపైగా కమీషన్ల రూపంలో ముఖ్యమంత్రి వసూలు చేసుకోనున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
లెక్క పెట్టించాల్సినోడు లెక్క పెడుతున్నాడు.
కరీంనగర్‌లీగల్: మేకల విక్రయదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై మర్రిపల్లి రమేష్, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, మరో కానిస్టేబుల్ కోడూరి కనకశ్రీనివాస్కు ఆర్నెళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం తీర్పునిచ్చారు. పీ.పీ వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన జక్కుల సారయ్య, లంక అంజయ్య, మరికొంత మంది మేకల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మేకలను మహేంద్ర, టాటాఏస్ వాహనాల్లో కరీంనగర్, గంగాధర, హుస్నాబాద్ తదిరత ప్రాంతాల్లోని అంగడిబజార్లకు తరలించి విక్రయించేవారు. 2011 మార్చి 26న చొప్పదండి అంగడికి మేకలను తరలించారు. సదరు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఎస్సై మర్రిపల్లి రమేష్ జరిమానా విధించాడు. దీంతో సారయ్య, తదితరులు మరునాడు ఎస్సైని కలిశారు. ఏడాది వరకు రూ.40వేలు మాముళ్లుగా ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పిన బాధితులు పదిహేను రోజులకు మళ్లీ ఎస్సైని కలిశారు. రూ.15 ఇవ్వాలని ఎస్సై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఎస్సై వద్దకు వెళ్లేందుకు గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 డిమాండ్ చేశాడు.దీంతో సారయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2011 ఏప్రిల్ 15న సారయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రూ.15వేలు ఎస్సైకి ఇవ్వబోతుం డగా రైటర్ శ్రీనివాస్‌కు ఇవ్వమని చెప్పాడు. రైటర్ రూ.15వేలు తీసుకున్నాడు. బయటకు రాగానే గన్‌మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 తీసుకున్నాడు. దీంతో ముందస్తు పథకం ప్రకారం వేచి ఉన్న ఏసీబీ అధికారులు స్టేషన్‌లోనికి వెళ్లారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకుని ఎస్సై, గన్‌మెన్, రైటర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా వాగ్మూలంను నమోదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం ఎస్సై మర్రిపల్లి రమేష్(40), కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ (40)లకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా, కోడూరి కనక శ్రీనివాస్(47)కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున 20మంది సాక్షులను ప్రవేశపెట్టగా 13మంది కేసుకు వ్యతిరేకంగా, నిందితులకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో వీరిపై కేసు ఎందుకు నమోదు చేయరాదో డిసెంబర్ 20వ తేదీ వరకు సంజాయిషీని ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇందులో ఫిర్యాదుదారుడు జక్కు సారయ్య, లంక అంజయ్య, ట్రాప్ జరిగినపుడు హాజరైన సాక్ష్యులు డాక్టర్ గుర్రం శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ పూదరి నరేష్, ఏఎస్సై ముచ్చె మధుసూధన్‌రెడ్డితోపాటు మెరుగు జానయ్య, కానిస్టేబుల్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, పులి అంజయ్య, రంగు శ్రీనివాస్, తొర్తి కొమురయ్య, సాగాల రాజయ్య, జెట్టి ప్రభాకర్, బి. మల్లేశంకు నోటీసులు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఎస్సై రమేష్ కరీంనగర్ టాస్క్‌ఫోర్స్‌లో, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ గంగాధర పోలీస్‌స్టేషన్‌లో, కోడూరి కనక శ్రీనివాస్ ముస్తాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. -
పోలీస్‌బాస్..బైపాస్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆయన గారి ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోయింది. వెనువెంటనే పదోన్నతిపై డీఎస్పీ పోస్టింగ్ పట్టేశారు. అంతటితో ఆగడం ఆయనగారికి ఇష్టం లేనట్లు ఉంది. జిల్లా అంతటా తన ‘ముద్ర’ కావాలనుకున్నారు. కీలకమైన నిఘా విభాగానికి బాస్‌గా నియామకం వేయించుకున్నారు. ఇక అక్కడి నుంచి తన ఆపరేషన్ మొదలెట్టారు. ముందుగా జిల్లాపై పట్టుకు నడుం బిగించారు. కీలకమైన స్టేషన్లలో సీఐలు, ఎస్ఐలుగా తనవారు ఉండే విధంగా పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. నిఘా విభాగానికి బాస్ కావడం ఆయనకు బాగా ‘కలిసి’ వచ్చింది. కంచే చేను మేసిన చందాన.. ఎర్రచందనం, ఇసుక, మద్యం, క్వారీ స్మగ్లర్ల నుంచి భారీ స్థాయిలో వెనకేసుకున్నారనే ఆరోపణలు పోలీస్ సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది. ఈ ఏడాది తిరుమలకు బదిలీ చేసినా ఉన్నతస్థాయిలో పైరవీ చేయించుకొని నిలుపుదల చేయించుకున్నారు. దోపిడీ పర్వానికి తెరలేపిన అస్మదీయులు.. నిఘా బాస్ అండదండలు ఉన్న పోలీస్ అధికారులు జిల్లాలో చెలరేగుతున్నారు. స్టేషన్ల వేదికగా దోపిడీ పర్వానికి తెరదీశారు. వసూలు చేసిన మొత్తంలో నెలవారీ బాస్‌కు కప్పం కడుతున్నారు. ఇదే సబ్‌డివిజన్ పరిధిలో మరో కీలకమైన పట్టణానికి చెందిన ఎస్ఐ స్టేషన్ ను అవినీతి నిలయంగా మార్చేశారు. సెటిల్మెంట్లలో రాటుదేలిన ఈ ఎస్ఐగారు గత నాలుగేళ్లుపైగా ఒకే స్టేషన్ లో కొనసాగడానికి నిఘా బాస్ అండదండలే కారణమని సమాచారం. ఇంతకుమునుపు మదనపల్లి తాలూకా సీఐగా పనిచేసిన అధికారి...నిఘా బాస్ అండదండలతో చెలరేగిపోయా రు. ఆయనతో పాటు అదే పట్టణంలో వన్‌టౌన్ ఎస్ఐ కూడా బాస్ కోటరీకి చెందిన వ్యక్తి కావడంతో వసూళ్లకు గేట్లు ఎత్తేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఏకంగా గాంధీపురం ఏరియాలో స్మగ్లర్లను నియమించుకున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లు సొంతంగా బినామీ పేర్లతో కొనుగోలు చేసి ఇసుకను బెంగుళూరుకు తరలించి రూ. కోట్లకు పడగలెత్తారు. ఇటీవలే వీళ్లు ఇద్దరూ బది లీ కావడంతో మదనపల్లి ఊపిరిపీల్చుకుంది. మదనపల్లి సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న నిఘా విభాగం సిబ్బంది సైతం రూ.కోట్లకు పడగలెత్తారు. మదనపల్లి పట్టణంలో హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇంటిస్థలాలను బినామీ పేర్లతో కొనుగోలు చేశారు. నిఘాబాస్ అస్మదీయులు కావడంతోనే విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అధికార పార్టీకి తలలో నాలుక... జిల్లాలో పడమట మండలాల్లో పార్టీని బలోపేతంచేసే బాధ్యతను తలకెత్తుకున్న బాస్ అందుకు తగ్గట్టుగా పోలీస్‌శాఖను వినియోగించుకుంటున్నారు. టీడీపీకి సానూభూతిపరుడైన సీఐని ఏరికోరి పడమర మండలాల్లో కీలకమైన నియోజకవర్గానికి నియమించుకున్నారు. ఈయన సహకారంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులపై కేసులు నమోదుచేసి భయభ్రాంతులకు గురి చేయడం స్కెచ్‌లో భాగం. అందుకు అనుగుణంగానే సదరు సీఐ వ్యవహరిస్తున్నారు. ఇటీవల యువనేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై జులుం ప్రదర్శిం చారు. తిరుపతి పుణ్యక్షేత్రాల పరిధిలో పనిచేస్తున్న అత్యంత వివాదాస్పద ఎస్ఐను ఇటీవలే సత్యవేడు నియోజకవర్గంలోని ఒక మండాలనికి పోస్టింగ్ ఇప్పించారు. ప్రతిపక్ష పార్టీలపై దూకుడు స్వభావం ప్రదర్శించే ఎస్ఐను ఏరికోరి నిఘా బాస్ పొస్టింగ్ వే యించినట్లు సమాచారం. వచ్చీరావడంతోనే ప్రతిపక్షాలపై కన్నెర్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీస్‌శాఖ పట్టుతప్పుతుందనే విమర్శలు ఉన్నాయి. ఒక అధికారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి పోలీసులు ఏర్పరుచుకున్న నమ్మకం సడలుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలోని పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. -
బియ్యం తరుగు..
తొర్రూరు రూరల్(పాలకుర్తి): పేదలకు సరఫరా చేస్తు న్న బియ్యం తరుగు రేషన్ కార్డుదారులకు శాపంగా మారింది. ప్రభుత్వం చౌక ధరల దుకాణం ద్వారా కార్డుదారులకు ప్రతినెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తోందిది. మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచి పంపిణీ బియ్యం బస్తాల్లో తక్కువ బరువు ఉంటోంది. క్వింటాల్‌పై దాదాపు ఐదారు కిలోల తరుగును భరించాల్సి వస్తోంది. ఈ ప్రభావం పరోక్షంగా రేషన్ కార్డుదారులపై పడుతోంది. జిల్లాలోని 553 రేషన్ దుకాణాల ద్వారా మొత్తం 44,726 క్వింటాళ్ల బియ్యాన్ని నెలనెలా పంపిణీ చేస్తున్నారు. 50 కిలోల బస్తాపై రెండు నుంచి మూడు కిలోల తరుగు ఉంటోందని రేషన్ డీలర్లు వాపోతున్నారు. జిల్లా మొత్తం రేషన్‌కార్డులకు సరఫరా చేసే బియ్యం కోటాపై 17.89క్వింటాళ్ల వరకు తరుగు ఉన్నట్లు తెలుస్తోంది. కార్డుదారులకు నష్టం... మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే సరఫరా చేసే బియ్యం సంచుల్లో క్వింటాల్‌పై ఐదు కిలోల వరకు తరుగు ఉంటోందని డీలర్లు వాపోతున్నారు. కార్డుదారులకు అందించే బియ్యంలోనూ తరుగు తీస్తున్నారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిల్వ కేంద్రం నుంచి సరఫరా అయ్యే బియ్యంలో వచ్చే తరుగు ఎలా భరిస్తామంటూ కొందరు డీలర్లు బాహటంగానే గోడు వెల్లబోసుకుంటున్నారు. గోనె సంచితోనే తూకం... రేషన్ దుకాణాల ద్వారా తెలుపు రంగు కార్డుదారులకు సరఫరా చేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసరాల వస్తువుల పంపిణీలో తూకాల్లో మోసం జరుగుతోంది. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల్లో అవకతవకలకు తావు లేకుండా ఎలక్ట్రానిక్ కాంటా లను ఏర్పాటు చేసింది. తూకంలో హెచ్చుతగ్గులు లేకుండావీటిని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచే తరుగుతో వస్తున్న బియ్యాన్ని పంపిణీ చేయడంలో భాగంగా చాలామంది డీలర్లు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాలపై గోనె సంచితో సహా బియ్యం తూకం వేస్తున్నారు. ఒక్కో కార్డుపై 30 కిలోల దాకా బియ్యం ఇస్తారు. అంటే కార్డుదారు దాదాపు కిలో వరకు కోల్పోవాల్సి వస్తోంది. కార్డుదారులు అందరికీ ఇలాగే తూకం వేసి పంపిణీ చేస్తే తరుగు కింద 17.89 క్వింటాళ్ల బియ్యం కోల్పోతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకం ఏది? రేషన్ డిపోల్లో సరుకుల తూకంలో డీలర్లు చేతివాటం ప్రదర్శించకుండా ఈ–పాస్ విధానం ప్రభుత్వం తీసుకువచ్చింది. డిపోల్లో బియ్యం తూకాన్ని పౌర సరఫరాల శాఖ సెంట్రల్ సర్వర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదవుతుంది. దీంతో తూకం ఏ మాత్రం తక్కువ వేయడానికి అవకాశం లేదు. ఇదే విధానం డిపోలకు సరుకులిచ్చే ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉండటం లేదన్నది డీలర్ల ఆవేదన. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కాంటా యంత్రాలతో తూకం కాలయాపనతో కూడుకున్నదని భావిస్తున్నారు. ప్రతి కేంద్రానికి బియ్యం లోడైన వాహనంతో బరువును తూకం వేసే వేబ్రిడ్జి కాటాలను ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ యోచించింది. దానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు మోక్షం లేదు. సాధారణంగా బియ్యం ఎఫ్‌సీఐ గోదాంలలో బియ్యం ఐదారు నెలలు నిల్వ ఉంటుంది. ఈ కారణంగా అవి ఆరిపోయి కొంత తరుగు ఉండే అవకాశం ఉన్నా అది 50 కిలోల బస్తాకు 300 గ్రాములకు మించి ఉండదని అంటున్నారు. కానీ ప్రతి బస్తాకు రెండు కిలోల వరకు సగటున తరుగు ఉండటంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పంపిణీపై పకడ్బందీగా చర్యలు మండల స్థాయి నిల్వ కేంద్రం నుంచే బియ్యం సంచుల్లో తరుగు వస్తున్నట్లు గమనిస్తే డీలర్లు మా దృష్టికి తీసుకురావాలి. అంతేకాకుండా నిత్యావసర సరుకులు తీసుకుని రేషన్ దుకాణం వద్ద బియ్యం తూకంలో తేడా వస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చు. మా దృష్టికి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి తరుగు లేకుండా బియ్యం పంపిణీ అయ్యేలా చూస్తాం. – జి.నర్సింగరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
చంద్రబాబు పాలన అవినీతిమయం
నెల్లూరు /ఓజిలి: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అవినీతిమయంలో కూరుకుపోయి ప్రజలు సమస్యలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. మండలంలోని బట్లకనుపూరులో రావాలి జగన్.. కావాలి జగన్, కార్యక్రమాన్ని పార్టీ మండల కన్వీనర్ జీ రవీంద్రరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ఒక్క హామీని అమలు చేయకుండా తెలుగు ప్రజలను నట్టేట ముంచారన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి ప్రజల బాధలను తీర్చుతామన్నారు. అయితే ఒక్కరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను తీర్చుతామని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరుతో సుజల స్రవంతిని పెట్టారే తప్ప ఒక్కరికి మంచినీటిని ఇవ్వలేదన్నారు. బాబు వస్తే జాబన్నారు.. అయితే ఉన్న జాబులను ఊడబెరుకుతూ పేదల పొట్టగొడుతున్నారని తెలిపారు. ఇలా ఎన్నో హామీలను ఇచ్చి రాష్ట్ర ప్రజలను నయవంచన చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడే చంద్రబాబును ప్రజలు చీదరించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019లో నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రం ఇబ్బందులలో ఉంటే విదేశాల పర్యటనలకు రూ.5 వేల కోట్లను వృథాగా ఖర్చు చేశాడని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో గడిపేందుకే చంద్రబాబు ఇష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితే నవరత్నాలతో ప్రజలు మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జే బాబురెడ్డి, కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, కార్యవర్గసభ్యుడు పాదర్తి హరనాథ్‌రెడ్డి, నాయకులు ముమ్మారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉచ్చూరు హరనాథ్‌రెడ్డి, జీ రఘురామరాజు, బత్తల రవీంద్రర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
లోక్‌పాల్ ఎంపిక కమిటీ నియామకం
న్యూఢిల్లీ: అవినీతి నిరోధం కోసం నియమించనున్న లోక్‌పాల్‌కు చైర్పర్సన్, ఇతర సభ్యులను ఎంపిక చేసేందుకు ఓ కమిటీని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే కేంద్ర ప్రభుత్వం గురువారం నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ లోక్‌పాల్ చైర్పర్సన్, సభ్యులను ఎంపిక చేస్తుంది. భారతీయ స్టేట్ బ్యాంక్ మాజీ చైర్‌వుమన్ అరుంధతీ భట్టాచార్య, ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాశ్, ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్, అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సఖ రామ్ సింగ్ యాదవ్, గుజరాత్ మాజీ డీజీపీ షబ్బీర్ హుస్సేన్ ఖండ్వావాల, రాజస్తాన్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి లలిత్ పన్వార్, మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్‌లు ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా ఉంటారని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘లోక్‌పాల్ చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి లోక్‌పాల్ ఎంపిక జరుగుతోంది’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అయితే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేకుండానే ఈ ఎనిమిది మంది కమిటీని కేంద్రం నియమించింది. -
ఎంసీఐ స్థానంలో ఇక పాలక మండలి
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. -
అవినీతి నిరోధకచట్టం.. పారదర్శకత
సందర్భం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమిలో ఐఏఎస్ ఆఫీసర్ల శిక్షణ రెండు భాగాలుగా జరుగుతుంది. తొమ్మిది నెలల మొదటి భాగం శిక్షణ తరువాత జిల్లాలలో శిక్షణకు వెళ్లి తిరిగి మూడు నెలల రెండో భాగం శిక్షణకు అధికారులు ముస్సోరికి వస్తారు. మా శిక్షణ సమయంలో రెండో భాగం శిక్షణకు వచ్చినప్పుడు అకాడమి పరిపాలనాధికారిగా అప్పు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ చాలా ఉత్సాహపూరితంగా నడిచింది. చిన్న చిన్న గ్రూపులలో చాలా అంశాలు చర్చించేవాళ్ళం. అందులో ఒక అంశం నాకు బాగా గుర్తు. సమర్థవంతమైన అవినీతి అధికారి లేదా అసమర్థుడైన నిజాయితీపరుడైన అధికారులలో ఎవరు మెరుగు అనే అంశం. తర్వాత మెల్లగా తెలిసిన విషయం ఏమిటంటే అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల మూలంగా నిజాయితీపరుడైన సమర్థవంతమైన అధికారిని అవినీతిపరుడిగా చిత్రీకరించే అవకాశాలున్నాయని. నిర్ణయాలు తీసుకోని అధికారులు, అవినీ తిపరులైన, ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని. చాలామంది నిజాయితీపరులు, సమర్థులు అయిన అధికారులకు ఇబ్బంది కలిగించిన సెక్షన్ 13(1)డి(జీజీ)(జీజీజీ). ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగపరిచి ఎవరికైనా మేలు చేకూర్చినా లేక తన చర్యల ద్వారా ఇంకెవరికైనా మేలు కలగజేసినా.. అది ప్రజాహితానికి అనుగుణంగా లేకపోతే దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా అధికార దుర్వినియోగానికి విస్తృత నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకోవటం నుంచి హేతుబద్ధంగా లేని నిర్ణయాల వరకు, అవసరం లేని అంశాలు పరిగణనలోకి తీసుకోవటం, అవసరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకపోవటం అన్నీ అధికార దుర్వినియోగ నిర్వచనం కిందికి తీసుకొని రావడం జరిగింది. కానీ, అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా అధికార దుర్వినియోగంగా చిత్రీకరించి నేరపూరితమైన దుష్ప్రవర్తన కింద చర్య ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి పరిపాలనాపరమైన చర్య ఎవరో ఒకరికి మేలు చేకూరుస్తుంది. ఇక ప్రజాహితం అనేది కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పరిశీలిస్తే మరొకరకంగా గోచరించవచ్చు. ఈ రెండు సెక్షన్ల కనుగుణంగా పరిశోధనా సంస్థలు నిజాయితీపరులైన సమర్థ అధికారులపై చర్యలు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధివిధానాలను సరిగ్గా పాటించలేదు అనే ఒకే నెపం మీద నేరపూరిత చర్యలు వీరిపై మోపారు. ఎటువంటి అవినీతిగానీ, ఆర్థికంగా లాభపడ్డారని గానీ ఆధారాలు లేకపోయినా కేవలం నిర్ణయం తీసుకునేటప్పుడు జరిగిన విధాన లోపాలను నేరపూరిత లోపాలుగా పరిగణించి చర్యలు ప్రారంభించారు. దీనితో అధికారులలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ అంశాలను గుర్తించే ఈనాడు ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో మౌలికమైన మార్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరి చినా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినా నేరపూరితమైన చర్యగా పరిగణిస్తారు. అంతకు ముందు చట్టంలో ఉన్న 13 సెక్షన్ సమూలంగా మార్చడం జరిగింది. అధికారులు తీసుకున్న చర్యల మూలంగా ఎవరికైనా లబ్ధి జరిగితే వారు నేరపూరిత చర్య జరిపినట్టుగా భావించే విధానాన్ని పూర్తిగా తొలగించారు. నిజాయితీగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే అధికారులకు భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించకుండా పనిచేసుకునే అవకాశాన్ని ఈ మార్పులు కల్పిస్తాయి. కానీ పరిశోధనా సంస్థలు ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా విచారణ చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఈ చట్ట సవరణ ద్వారా తప్పనిసరి చేశారు. ఈ మార్పులు పరిశోధనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిబంధకం కావచ్చు. దీనికి బదులు నిరంతరంగా అనుమతినిచ్చే అధికారాన్ని ఒక అధికారుల కమిటీకి అప్పగించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. ఏ అవినీతి నిరోధక చట్టమైనా ఒక్క నిజాయితీపరుడైన అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఫర్వాలేదు. నిజాయితీపరుడైన అధికారి ఇబ్బందికి గురైతే అధికారుల మనోసై్థర్యం దెబ్బతింటుంది. దీనితో నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతారు. దీని దుష్ప్రభావం అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ఉంటుంది. వ్యాసకర్త ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
సీబీఐ విచారణకు ఆదేశించండి
లాటరీ, మట్కా దందాలపై సిద్ధరామయ్యను ప్రశ్నించిన హెచ్.డి.కుమారస్వామి ‘మీట్ ది ప్రెస్’లో ప్రభుత్వంపై విమర్శల వర్షం బెంగళూరు : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలనను ప్రజలకు అందజేస్తోందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే రాష్ట్రంలో నడుస్తున్న లాటరీ, మట్కా దందాలపై సీబీఐ విచారణకు ఆదేశించగలరా? అని జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి ప్రశ్నించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న కుమారస్వామి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. లాటరీ, మట్కా దందాలతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై సీఓడీ విచారణకు ఆదేశించారని, అయితే సీఓడీ స్థానంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా అని కుమారస్వామి సవాల్ విసిరారు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే లాటరీ దందాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను అందజేస్తానని అన్నారు. ఇక ఇదే సందర్భంలో లాటరీ, మట్కాలను నియంత్రించేందుకు గాను ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు దళాలను ప్రభుత్వం రద్దు చేయడం అనేక సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెనక రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ఉన్నారా లేక ఆయన సలహాదారు కెంపయ్య ఉన్నారా అనే విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో దక్కింది ‘అప్పు భాగ్య’ మాత్రమే.... ఇక సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, అయితే ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలకు దక్కింది కేవలం ‘అప్పు భాగ్య’ మాత్రమేనని కుమారస్వామి విమర్శించారు. రెండేళ్ల పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాల్సింది ముఖ్యమంత్రో లేక మంత్రులో కాదని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిని వ్యక్తం చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికీ జేడీఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో శక్తి ఉందని కుమారస్వామి తెలిపారు. -
అవినీతిరహిత పాలనకు కలసిరండి: బాబు
సాక్షి, హైదరాబాద్: అవినీతి రహిత పాలన అందించడానికి కలసిరావాలని సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. దానికి జేఏసీ నేతలు సానుకూలంగా స్పంది ంచారు. అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కత్తి నరసింహారెడ్డి, రఘురామిరెడ్డితో కూడిన జేఏసీ ప్రతి నిధి బృందం శనివారం సీఎంతో భేటీ అయింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వివిధ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఉద్యోగ నేతలకు బాబు సూచించారు. పనిలేని విభాగాల్లో సిబ్బందిని తగ్గించి, ఒత్తిడి ఎక్కువగా ఉన్న శాఖలకు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.ఈ సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని జేఏసీ నేతలు సీఎంకు హామీ ఇచ్చారు. తకు హెల్త్‌కార్డులిచ్చి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు నెలలు మెడికల్ రీయింబర్స్మెంట్ హెల్త్‌కార్డుల పథకం అమల్లో ఉన్నా కార్పొరేట్ వైద్యం సక్రమంగా అందడం లేదని, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను మరికొంత కాలం కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఏప్రిల్ 30 వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. -
జనం డబ్బు కార్యకర్తలకు!
* పారదర్శకతకు బాబు సర్కారు తూట్లు * పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖల్లో రూ. లక్షకు పైబడిన పనుల్లో ఈ-ప్రొక్యూర్మెంట్ తాత్కాలికంగా బంద్ * ఏప్రిల్ 1న గవర్నర్ జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో ఉత్తర్వు * రూ.5 లక్షల లోపు పనులు నామినేషన్ పద్ధతిన అప్పగించే వెసులుబాటు * పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుంగులకే దక్కనున్న పనులు! సాక్షి, హైదరాబాద్: పారదర్శక, అవినీతి రహిత పాలన అంటూ పైకి చెబుతున్న చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. వాస్తవానికి అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుంగులకు ప్రయోజనం కలిగించే చర్యలు చేపడుతోంది. తాజాగా రూ. లక్షకు పైబడిన పనులను టెండర్ల ద్వారా అప్పగించాలని రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవోను తాత్కాలికంగా నిలిపివేయడమే ఇందుకు ఉదాహరణ. పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి శాఖల్లో లక్ష రూపాయలకు పైబడి ఖర్చయ్యే పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు పిలవాలని ఈ ఏడాది ఏప్రిల్ 1న గవర్నర్ జీవో నం 61ను జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ సోమవారం జీవో నం. 124ను విడుదలచేసింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖల్లో రూ.5 లక్షల వరకు పనులు ఈ-ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇష్టమొచ్చిన వారికి అప్పగించవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దమొత్తంలో ప్రయోజనం పొందనున్నారు. పనులను ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ల ద్వారా అప్పగించడంవల్ల కాంట్రాక్టర్లలో పోటీతత్వం పెరగడంతోపాటు తక్కువ ఖర్చులో పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ విధానం ద్వారా అధికారులు తయారుచేసిన అంచనాలకే పనులు అప్పగించాల్సి ఉంటుంది. దీనికితోడు ప్రభుత్వ పనుల అంచనాలు, వాటికి కాంట్రాక్టర్ల ఎంపికలో అధికారంలో ఉన్నవారి మాటే పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పనుల అంచనా వ్యయం పెంచే అవకాశం ఉంటుంది. ఇటీవలే మండల, జెడ్పీ ఎన్నికలు ముగియడంతో, ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్‌లలో కోట్లాది రూపాయల పనులు చేపట్టే అవకాశమేర్పడింది. మండల, జిల్లా పరిషత్ స్థాయిలో రూ. 5 లక్షల విలువ కలిగినవే ఎక్కువ పనులు ఉంటాయి. బాబు సర్కారు తాజాగా జారీ చేసిన జీవోతో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల్లో పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, వారి అనుంగులే చేజిక్కించుకోవడానికి అవకాశమేర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి.