అమరావతి: అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆదేశాలు పంపారు. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన బిల్లుల చెల్లింపునకు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆదేశాలు జారీ చేశారు.
జీరో కరప్షన్ మోడ్‌తో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టుల్లో అవినీతి నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
అవినీతి నిర్మూలనకై వైఎస్ జగన్ తొలి అడుగు
Comments
Please login to add a commentAdd a comment