న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment