
చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి
సభ్యులుగా సీఎస్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు
56 రెవెన్యూ గ్రామాలు.. 765.25 చ.కి.మీ. పరిధిలో 12 జోన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేస్తూ బుధ వారం జీఓ విడుదల అయ్యింది. పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అటవీ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, డీటీసీపీ హైదరాబాద్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు.
56 రెవెన్యూ గ్రామాలతో పాటు 765.25 చదరపు కిలోమీటర్ల పరిధిలో 12 జోన్లుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను తొలగించి ఎఫ్‌సీడీఏలో విలీనం చేసింది.
ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఇవే..
ఆమనగల్ మండలంలోని ఖానాపూర్, రామనూతలతో పాటు ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్, పోచారం, రామిరెడ్డిగూడ, తులేకలాన్, తుర్కగూడ, ఎలిమినేడు, ఎర్రకుంట, తడ్లకాల్వ రెవెన్యూ గ్రామాలు.. కడ్తాల్ మండలం చెరికొండపట్టి కల్వకుర్తి, చెరికొండపట్టి పడకల్, ఏక్రాజ్‌గూడ, కడ్తాల్, కర్కల్ పహాడ్, ముద్విన్.. కందుకూరు మండలం దాసర్లపల్లె, అన్నోజిగూడ, దెబ్బగూడ, గూడూరు, గుమ్మడవెళ్లి, కందుకూరు, కొత్తూరు, గపూర్‌నగర్, లేమూర్, మాదాపూర్, మీర్‌ఖాన్‌పేట్, మొహ్మద్‌నగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచలూరు, సర్వార్లపల్లి, తిమ్మాయిపల్లె, తిమ్మాపూర్..
మహేశ్వరం మండలం తుమ్మలూరు, మంచాల మండలంలోని ఆగపల్లే, నోముల, మల్లికార్జునగూడ గ్రామాలను.. యాచారం మండలం చౌదరిపల్లె, గున్‌గల్, కొత్తపల్లె, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కాజ్‌గూడ, మొగుళ్లవంపు, నక్కర్తి, నానక్‌నగర్, నందివనపర్తి, నస్తిక్‌సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తులేకుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి గ్రామాలను ఈ అథారిటీలో కలిపారు. ఇటీవలి వరకు ఎకరం రూ.2 కోట్లు పలికిన భూముల ధరలు ప్రస్తుత నిర్ణయంతో రెట్టింపయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment