7 మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లు
Published Mon, Oct 3 2016 7:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హైదరాబాద్: తెలంగాణలోని ఏడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 169 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 101 కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. తాజాగా మరో ఏడు కమిటీలకు పాలక మండళ్లను ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పూడూరి మణెమ్మ, వైస్ ఛైర్మన్‌గా కట్ల శంకర్, మల్యాల మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చింతపంటి లక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా బోయినపల్లి మధుసూధన్‌రావు నియమితులయ్యారు.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా అన్నం బ్రహ్మారెడ్డి, వైస్ ఛైర్మన్‌గా భూక్యా రమేశ్ నాయక్, ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కమిటీ ఛైర్మన్‌గా నర్సింగోజు పద్మ, వైస్ ఛైర్మన్‌గా కంబగేని సతీష్‌గౌడ్‌ను నామినేట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నల్లగంటి వెంకటయ్య, వైస్‌ఛైర్మన్‌గా గంగనమోని కుమరయ్య, నల్గొండ జిల్లా కోదాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా కె.శశిధర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా భూక్యా నాగేశ్వర్‌రావు, వైస్ ఛైర్మన్‌గా తాటి భిక్షంను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement